MARKET UPDATE

SENSEX: 73,067.81, change ▲ +685.34 (+0.95%). Source Yahoo Finance, as of 06 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,776.10, change ▲ +220.35 (+0.98%). Source NSE, as of 06 Oct 2026 3:30 PM IST. GOLD 24K / 999: ₹1,48,473 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,36,001 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. SILVER 999: ₹2,22,820 / kg. Source IBJA, as of 06 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

Skip to content
వార్తలు

AP Drought 2026: ఎల్‌నినో ఎఫెక్ట్‌ కాదు.. ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్‌: వైఎస్‌ జగన్‌

Image accompanying: AP Drought 2026: ఎల్‌నినో ఎఫెక్ట్‌ కాదు.. ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్‌: వైఎస్‌ జగన్‌

AP Drought 2026: 50.7% వర్షపాతం లోటు!

కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని వైఎస్ జగన్ డిమాండ్.


రాష్ట్రంలో సగానికి పైగా వర్షపాతం లోటు

జూన్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఏపీలో సాధారణంగా 496.1 మి.మీ. వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, 244.7 మి.మీ. మాత్రమే నమోదైంది.

లోటు: 50.7%


ఈ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రం

అన్నమయ్య జిల్లాలో 74.7%, శ్రీ సత్యసాయిలో 65.7%, ప్రకాశంలో 65% వర్షపాతం లోటు నమోదైంది. చిత్తూరు, కడప, నంద్యాల, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ 50 శాతానికి మించి లోటు ఉంది.


రాష్ట్రంలోని 688 మండలాల్లో దాదాపు 628 మండలాలు వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నాయని, వాటిలో 332 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని జగన్ పేర్కొన్నారు.


20 లక్షల ఎకరాల్లో విత్తనం పడలేదని వెల్లడి

సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా, 56.4 లక్షల ఎకరాలకే సాగు పరిమితమైందని జగన్ తెలిపారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదని ఆయన పేర్కొన్నారు.


రైతులకు ఎకరాకు పరిహారం ఇవ్వాలి

Banana Papaya Combinationఅరటి–బొప్పాయి కలిపి తింటే ప్రమాదమా
Banana Papaya Combination: అరటి–బొప్పాయి కలిపి తినకూడదా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాదనలో నిజమెంత?

విత్తనం వేయలేకపోయిన రైతులకు
ఎకరాకు రూ.15 వేలు

పంట వేసి నష్టపోయిన రైతులకు
ఎకరాకు రూ.25 వేలు

ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు.


రూ.6 వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ డిమాండ్

రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడంతో పాటు.. రుణాల రీషెడ్యూల్, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పథకాలను అమలు చేయాలని జగన్ కోరారు.


నీరు.. పశుగ్రాసం.. ఉపాధిపై చర్యలు

కరువు ప్రాంతాల్లో తాగునీరు అందించాలని, పశుగ్రాసం పంపిణీ చేయాలని, వ్యవసాయ కూలీలకు అదనపు ఉపాధి పనులు కల్పించాలని జగన్ కోరారు.


Slide 9

కరువు ప్రాంతాల్లో పర్యటిస్తానన్న జగన్

పరిస్థితి తీవ్రతను బట్టి కరువు ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటిస్తానని జగన్ ప్రకటించారు.

British Airways Emergency Landing
British Airways Emergency Landing: 37 వేల అడుగుల నుంచి 9 వేల అడుగులకు దిగిన విమానం.. అసలేం జరిగింది?

రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ నేతలకు సూచించారు.


వర్షపాతం లోటు అధికారికం..

సెప్టెంబర్ 16 నాటికి రాష్ట్రంలో 50.7% వర్షపాతం లోటు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

అయితే 628 మండలాలు, 332 తీవ్ర వర్షాభావ మండలాలు అన్నవి జగన్ వెల్లడించిన గణాంకాలు. కరువు మండలాలపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు కీలకం.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా మొన్న వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ లు ప్రారంభించింది. అప్పట్లో మీ మంత్రులకి పోలవరం అంటే అర్ధం కాలేదు. టి.ఎం.సి.లకు క్యూసెక్ లకు తేడా తెలియలేదు అని తెలుగుదేశం కార్యకర్తలు మండి పడుతున్నారు.

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.