Skip to content
వార్తలు

Andhra Pradesh Reddy Chief Ministers: ను పాలించిన 11 మంది రెడ్డి ముఖ్యమంత్రులు, విజయ సాయి రెడ్ది మాదే ఒరిజినల్ రెడ్ల పార్టీ అని ఎందుకు అన్నారు…

చివరిగా నవీకరించబడింది:

Andhra Pradesh: ఆంధ్రా స్టేట్ తొలి ముఖ్యమంత్రులు ఎవరు?
ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన రెడ్డి ముఖ్యమంత్రులు ఎవరు?
నీలం సంజీవరెడ్డి నుంచి వైఎస్ జగన్ వరకు
ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మారిన ఏపీ రాజకీయాలు
‘ఒరిజినల్ రెడ్లు’ అంటూ విజయసాయి రెడ్డి ఏం అన్నారు?
కొత్త పార్టీపై విజయసాయి రెడ్డి ప్రకటన
కుల రాజకీయాలపై ఏపీలో మొదలైన కొత్త చర్చ

Andhra Pradesh ను పాలించిన 11 మంది రెడ్డి ముఖ్యమంత్రులు, విజయ సాయి రెడ్ది మాదే ఒరిజినల్ రెడ్ల పార్టీ అని ఎందుకు అన్నారు…

Andhra స్టేట్ నుంచి ఉమ్మడి Andhra Pradesh, విభజిత Andhra Pradesh ముఖ్యమంత్రులు గా అనేక మంది చేసారు. వీరిలో దాదాపు 11 మంది రెడ్లు ఆంధ్రా ప్రాంతాన్ని పరిపాలించారు.

Andhra Pradesh మొదట గా బ్రాహ్మణ కులానికి చెందిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1 అక్టోబర్ 1953 నుంచి 15 నవంబర్ 1954 వరకు ముఖ్యమంత్రి గా ఉన్నారు.

Rocket Launch Water రాకెట్ లాంచ్‌కు 17 లక్షల లీటర్ల నీళ్లు! ఎందుకో తెలుసా?
Rocket Launch Water: రాకెట్ లాంచ్ సమయంలో లక్షల లీటర్ల నీళ్లు ఎందుకు పోస్తారు?

ఆ తరువాత నుంచి రెడ్డి ముఖ్యమంత్రుల హవా కొనసాగింది. 1955 నుంచి 1956 వరకు

1.బెజవాడ గోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు గా చేసారు. ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత

2.నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి గా చేసారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి 1956-1960, 1962 నుంచి 1964 వరకు పరిపాలించారు. ఆ తరువాత 1960 నుంచి 1962 వరకు కాంగ్రెస్ పార్టీ కి చెందిన దామోదరం సంజీవయ్య గారు దళిత మాల ముఖ్యమంత్రి గా చేసారు. ఆ తరువాత

3.కాసు బ్రహ్మానందరెడ్డి 1964–1971 వరకు కాంగ్రెస్ తరుపున రెడ్డి సామాజిక నేపధ్యం కలిగిన వ్యక్తి గా సేవలందించారు. ఇక ఆ తరువాత బ్రాహ్మణ కులానికి చెందిన పి.వి. నరసింహారావు 1971–1973 వరకు కాంగ్రెస్ నుంచి పరిపాలన చేసారు. తర్వాత భారత ప్రధానమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇక 1973-1978 వరకు జలగం వెంగళరావు వెలమ సామాజిక వర్గం నుంచి వచ్చారు దాదాపు నాలుగేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తరువాత

Gandhi Before Indian Currency Notes
Gandhi Before Indian Currency Notes: గాంధీకి ముందు నోట్లపై ఎవరి బొమ్మ?తెలియని కరెన్సీ చరిత్ర ఇదే!

4.మర్రి చెన్నారెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రి గా పని చేసారు. 1978-1980 వరకు 1989–1990 వరకు కాంగ్రెస్ తరుపునుంచి ముఖ్య్ మంత్రి గా కొనసాగారు. టంగుటూరి అంజయ్య గారు 1980-1982 మధ్య కాలంలో ముఖ్యమంత్రి గా చేసారు. అంజయ్య సామాజిక నేపథ్యంపై అందుకే నిర్ధారణ లేని కులపేరును ఇక్కడ పేర్కొనడం లేదు. 1982 నుంచి 1983 వరకు 5.భవనం వెంకట్రామిరెడ్డి. ఆ తరువాత 6.కోట్ల విజయభాస్కరరెడ్డి 1982-83 అలాగే 1992-1994 వరకు మరొక సారి ముఖ్యమంత్రి గా చేసారు. ఇక ఆ తరువాత రాష్ట్ర రాజకీయాలను మార్చి తెలుగు ఖ్యాతిని నలు దిశలా వ్యాపింపచేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగు దేశం పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గా అనేక సంక్షేమ పధకాలకు పెద్ద పీట వేసిన వ్యక్తిగా 1983–1984,1984–1989,1994–1995 వరకు ముఖ్యమంత్రి గా కొన్స సాగారు. నాదెండ్ల భాస్కరరావు గారు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గా ఒక నెల రోజుల పాటు అంటె ఆగస్టు 16 1984 నుంచి 1984 సెప్టెంబర్ 16 వరకు కొనసాగారు. 1990ల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు 7.నేదురుమల్లి జనార్దనరెడ్డి 1990-1992, కోట్ల విజయభాస్కరరెడ్డి 1992-1994. ఇక అక్కడ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యధిక కాలం ప్రభావం చూపిన ముఖ్యమంత్రుల్లో ఒకరు. 1995–2004, 2014–2019, 2024 నుంచి విభజిత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నారు. ఇక మరోక రెడ్డి కులానికి చెందిన 8.వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 – 2009 వరకు పరిపాలన చేసారు. 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణానంతరం కొణిజేటి రోశయ్య 2009–2010 వరకు వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గా ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత 9.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2010–2014 ఉమ్మడి Andhra Pradesh కు చివరి ముఖ్యమంత్రి. గా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత తెలంగాణా రాష్ట్రం ఏర్పడటం Telangana కు వెల్మ కులానికి చెందిన కె.సి.ఆర్ ముఖ్యమంత్రి గా రావడం ఆయన ఓ దశాబ్ద కాలం పరిపాలించడం ఆ తరువాత 10.రేవంత్ రెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రి గా అయ్యారు. ఇక Andhra Pradesh నుంచి 11.వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రి గా కొనసాగారు. అయితే వై.ఎస్.జగన్ కు కొంత కాలం కుడి భుజంగా ఉన్న విజయసాయి రెడ్డి మాదే ఒరిజినల్ రెడ్ల పార్టీ అని కామెంట్ చేసారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దాదాపు 14644 రోజులు పరిపాలించింది. ఇందులో ఉన్నది 90 శాతం రెడ్లే, ఇక తెలుగుదేశం పార్టీ 8607 రోజులు పాలించింది. ఇక వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ 1839 రోజులు పాలించింది. మరి విజయ సాయి రెడ్డి ఎవరిని ఉద్దేశించి అన్నారో అందరికి తెలిసిందే….ఇది ఏదో కులాన్ని విమర్శించడం కాదు. ఏ కులం అయినా ఏ ప్రాంతం అయినా రాష్ట్రం లో అన్ని కులాల వారు వోట్లు వేస్తే నే ముఖ్యమంత్రి అయ్యేది. ఇంకా పార్టీ నే పెట్టలేదు అప్పుడే కులాల ప్రస్తావన తీసుకు వచ్చారు. మన విజయ సాయి రెడ్డి గారు….

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.