Skip to content
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss10: బిగ్‌బాస్‌ 10: రెండో రోజు హౌస్‌లో హీట్.. రోహిత్‌పై వర్షిణి ఫైర్!

రెండో రోజే రచ్చ రచ్చ!

Bigg Boss10: బిగ్‌బాస్‌ 10 రెండో రోజు ఆట రసవత్తరంగా సాగింది. ‘మహాపరీక్ష’లో భాగంగా ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యంగా రోహిత్‌పై వర్షిణి చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో హీట్‌ పెంచాయి.

రామ్‌ప్రసాద్‌, రోహిత్‌లను లీడర్లుగా ఎంచుకున్న తర్వాత.. మిగిలిన 12 మంది సభ్యులను తమ టీమ్‌లోకి తీసుకునేందుకు బిగ్‌బాస్‌ ‘బ్యాగ్‌ టాస్క్‌’ ఇచ్చాడు. బ్యాగ్‌లలోని బ్యాడ్జ్‌ల ఆధారంగా సైనికులను ఎంపిక చేసుకున్నారు.

Auto రామ్‌ప్రసాద్‌ టీమ్‌లో త్రిగుణ్‌, ముఖేష్‌, సుధీర్‌, నరేష్‌, దేబ్జాని, చరణ్‌, వర్షిణి, చైత్ర చేరారు. రోహిత్‌ టీమ్‌లో వంశీ, శాలిని, సృష్టి, ఝాన్సీ, కృష్ణుడు తదితరులు చోటు దక్కించుకున్నారు.

Bigg Boss 10: జబర్దస్త్ నరేష్ బిగ్ బాస్ 10 లో కి ఎలా అడుగు పెట్టాడు?

Bigg Boss10: వర్షిణిని రామ్‌ప్రసాద్‌ మొదట తన టీమ్‌లోకి తీసుకోలేదు. అయితే రోహిత్‌ తనకున్న ఆప్షన్‌తో ఆమెను రామ్‌ప్రసాద్‌ టీమ్‌లోకి పంపాడు. దీంతో వర్షిణి అలిగి.. “నన్నెందుకు పిక్‌ చేసుకోలేదు?” అంటూ రామ్‌ప్రసాద్‌ను నిలదీసింది.

వర్షిణి, ఆర్జే చరణ్‌ మధ్య ‘గ్రూప్‌ గేమ్‌’పై చర్చ జరిగింది. గ్రూప్‌ అని పిలవడం తనకు నచ్చలేదని చరణ్‌ చెప్పగా.. “గ్రూప్‌గా ఆడుతున్నప్పుడు గ్రూప్‌ గేమ్‌ అనకపోతే ఏమంటాం?” అంటూ వర్షిణి కౌంటర్‌ ఇచ్చింది.

బ్లూ టీమ్‌ సభ్యుల్లో అనర్హుడిగా రోహిత్‌ పేరును వర్షిణి చెప్పింది. హౌస్‌లోకి వచ్చిన తర్వాత అతని యాటిట్యూడ్‌ మారిపోయిందని విమర్శించింది. తనను తాను పెద్ద తోపులా ఫీల్‌ అవుతున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

రోహిత్‌కు రియాలిటీ తెలియాలని.. అతన్ని కిందకు దింపాలని వర్షిణి వ్యాఖ్యానించింది. అగ్నిపరీక్ష తర్వాత హౌస్‌లోకి వచ్చేలోపే అతనికి సుపీరియారిటీ పెరిగిపోయిందని ఆమె అభిప్రాయపడింది.

నామినేషన్‌ బాధ్యత రోహిత్‌కు దక్కింది. కృష్ణుడు, రామ్‌ప్రసాద్‌, వర్షిణి, త్రిగుణ్‌, దేబ్జానిలను అనర్హులుగా ప్రకటించడంతో కృష్ణుడు తీవ్రంగా స్పందించాడు. “సుపీరియారిటీ కాంప్లెక్స్‌” అంటూ రోహిత్‌పై మండిపడ్డాడు.

OTT: Releases This Week: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ‘పంచనామా’ వరకు.. ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, సిరీస్‌లు ఇవే!

కృష్ణుడు ఎంత ఘాటుగా మాట్లాడినా రోహిత్‌ మాత్రం నవ్వుతూ నిలబడిపోయాడు. మరోవైపు రామ్‌ప్రసాద్‌, వర్షిణి కూడా రోహిత్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

నామినేట్‌ అయిన పది మంది సభ్యులకు బిగ్‌బాస్‌ ‘ప్రొటెక్టివ్‌ బాస్‌’ టాస్క్‌ ఇచ్చాడు. డిఫెండర్లను కిల్‌ చేస్తూ బాస్‌ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. తొలి రౌండ్‌లో బ్లూ టీమ్‌ అటాకర్స్‌గా, రెడ్‌ టీమ్‌ డిఫెండర్స్‌గా బరిలోకి దిగారు. టాస్క్‌లో త్రిగుణ్‌ ఫౌల్‌ గేమ్‌ ఆడాడని రోహిత్‌ ఆరోపించాడు. దీంతో మరోసారి ఇరు టీమ్స్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

బిగ్‌బాస్‌ 10 రెండో రోజు ఎపిసోడ్‌లో టాస్క్‌ల కంటే మాటల యుద్ధమే హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా రోహిత్‌పై వర్షిణి చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. కృష్ణుడు కూడా ఊహించని విధంగా ఫైర్‌ అయ్యాడు. అయితే టాస్క్‌లు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Studio One Plus

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *