Bigg Boss 10: “స్కూల్లో చాలామంది …. రేయ్ పొట్టి… వీడు ఇంతే ఉంటాడురా… వయసు పెరుగుతుంది కానీ మనిషి మాత్రం పెరగడురా… అని అనేవాళ్లు.” ఒకప్పుడు తన ఎత్తు గురించి ఇలాంటి మాటలు విన్న వ్యక్తి… ఇప్పుడు కోట్ల మంది చూసే బిగ్ బాస్ వేదిక మీద నిలబడ్డాడు. తనను చూసి నవ్విన వాళ్ల ముందే… తన కామెడీతో లక్షల మందిని నవ్వించాడు. తన శారీరక ఎదుగుదలను బలహీనతగా చూడకుండా… అదే తన ప్రత్యేకతగా మార్చుకున్నాడు. అతనే జబర్దస్త్ నరేష్.
Jabardasth స్టేజ్ మీద ఐదు నిమిషాల స్కిట్లో పంచ్ వేయడం వేరు. కానీ బిగ్ బాస్ హౌస్‌లో 24 గంటల పాటు కెమెరాల మధ్య… మన అసలు వ్యక్తిత్వంతో ప్రేక్షకులను మెప్పించడం పూర్తిగా వేరు. మరి జబర్దస్త్‌లో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న నరేష్… బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఎంతవరకు రాణించగలడు? అసలు నరేష్ జీవితంలో ఇన్ని కష్టాలను దాటుకుని ఈ స్థాయికి ఎలా వచ్చాడు? అతని జీవితంలో చాలామందికి తెలియని కష్టాలేంటి? జబర్దస్త్ అవకాశం ఎలా వచ్చింది? ఇప్పుడు బిగ్ బాస్ అతని కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందా?
నరేష్ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే… ముందుగా మనం అతని చిన్ననాటి దగ్గరకు వెళ్లాలి. తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో పుట్టాడు నరేశ్. ఈ జిల్లాలోని అనంతపురం అనే గ్రామంలో 2000 జూలై 17న జన్మించిన నరేష్ చిన్నప్పటి నుంచే మిగతా పిల్లలతో పోలిస్తే శారీరకంగా భిన్నంగా కనిపించేవాడు. అతని శారీరక ఎదుగుదల సాధారణంగా లేకపోవడంతో చిన్న వయసు నుంచే కుటుంబం ఎన్నో ఆందోళనలు ఎదుర్కొన్నట్లు నరేష్ గతంలో చెప్పిన విషయాల ఆధారంగా తెలుస్తోంది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ నరేష్‌కు అసలు పరీక్ష ఇంట్లో కాదు… బయట మొదలైంది. స్కూల్లో తోటి విద్యార్థులు అతని ఎత్తును చూసి కామెంట్స్ చేయడం వెక్కిరించడం… “పొట్టి” అంటూ పిలవడం… ఇవన్నీ అతని జీవితంలో భాగమయ్యాయి. సాధారణంగా చిన్న వయసులో ఇలాంటి మాటలు ఒక మనిషిలో తీవ్రమైన ఆత్మన్యూనతను పెంచుతాయి. కానీ నరేష్ విషయంలో మాత్రం అదే పరిస్థితి మరోలా మారింది. ఎవరైనా తనపై కౌంటర్ వేస్తే… వెంటనే తిరిగి కౌంటర్ ఇవ్వడం. ఎవరైనా తనను ఆటపట్టిస్తే… దాన్ని సీరియస్‌గా తీసుకునే బదులు హాస్యంగా మార్చడం. ఈ లక్షణమే తర్వాత అతని కెరీర్‌కు అతిపెద్ద బలంగా మారింది. తనను బాధపెట్టిన మాటలనే… తర్వాత తన కామెడీకి ఆయుధాలుగా మార్చుకున్నాడు. జోడుప్పల్ లోని కాకతీయ స్కూల్ లో 5వ తరగతి వరకు చదివిన నరేశ్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితే చిన్నప్పటి డ్యాన్స్ అంటే ఇష్టమున్న నరేశ్ మొదట ఢీ జూనియర్స్ ప్రొగ్రాంలో ఎంట్రీ ఇచ్చాడు. చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో కుటుంబానికి ఏదైనా విధంగా సహాయపడాలని నిర్ణయించుకున్నాడని కూడా సమాచారం ఉంది. కానీ నరేష్‌లో అప్పటికే మరో టాలెంట్ బయటపడుతోంది. అది డాన్స్. ఊర్లో జరిగే వేడుకలు కావచ్చు… కుటుంబ కార్యక్రమాలు కావచ్చు… చిన్న చిన్న ఈవెంట్స్ కావచ్చు… అవకాశం దొరికితే నరేష్ డాన్స్ చేసేవాడు. అతని ఎనర్జీ చూసిన వాళ్లు… “నువ్వు టీవీలో ప్రయత్నిస్తే బాగుంటుంది” అని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. అక్కడే ఒక చిన్న ఆలోచన నరేష్ జీవితాన్ని మార్చింది.
“మనలో ఉన్న లోపాన్ని ఎందుకు దాచుకోవాలి? అదే మన గుర్తింపుగా ఎందుకు మార్చుకోకూడదు?” అక్కడి నుంచి నరేష్ కుటుంబం కూడా అతనికి అవకాశాలు వెతకడం ప్రారంభించింది. టీవీ ప్రోగ్రామ్స్… డాన్స్ షోలు… ఆడిషన్స్…అవకాశం ఎక్కడ కనిపించినా ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. కానీ మొదటి ప్రయత్నంలోనే విజయం రాలేదు. డాన్స్ షో కోసం ప్రయత్నించినప్పుడు సెలక్షన్ జరగలేదు. చాలామందికి కథ అక్కడితో ముగిసిపోయేది. కానీ నరేష్‌కు మాత్రం అదే మరో తలుపు తెరిచింది. డాన్స్ ఆడిషన్ సమయంలో నరేష్‌లో ఉన్న చురుకుదనం, టైమింగ్‌ను గమనించిన కొందరు… జబర్దస్త్ ఆడిషన్స్ ప్రయత్నించమని సూచించినట్లు అతని ప్రయాణంపై వచ్చిన కథనాలు చెబుతున్నాయి.
అక్కడి నుంచి నరేష్ జబర్దస్త్ వైపు అడుగులు వేశాడు. కానీ అక్కడ కూడా అతనికి రెడ్ కార్పెట్ వేయలేదు. చాలా టీమ్స్ అప్పటికే సెట్ అయ్యి ఉన్నాయి. టీమ్ లీడర్లు తమ స్కిట్స్‌తో బిజీగా ఉన్నారు. కొత్తగా వచ్చిన నరేష్‌ను వెంటనే ఎవరూ ప్రధాన పాత్రలోకి తీసుకునే పరిస్థితి లేదు.
చిన్న చిన్న అవకాశాలు. కొన్ని నిమిషాల పాత్రలు. అంతే. కానీ నరేష్‌కు కావాల్సింది కూడా అదే. ఒక్క అవకాశం. ఎంత చిన్న పాత్ర ఇచ్చినా… ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా చేయాలి. అది నరేష్‌కు బాగా తెలిసింది. ఒక చిన్న పాత్రలో కనిపించినా తన బాడీ లాంగ్వేజ్, టైమింగ్, డైలాగ్ డెలివరీతో నవ్వించడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఒక్కో టీమ్‌లో అవకాశాలు పెరిగాయి. జబర్దస్త్‌లో నరేష్‌కు బాగా ఉపయోగపడిన అంశం అతని కామెడీ టైమింగ్. నరేష్‌తో స్కిట్ చేసిన చాలా మంది కామెడీయన్స్ గమనించిన విషయం ఒక్కటే. అతనికి పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం కంటే… పరిస్థితిని అర్థం చేసుకుని అప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వడం బాగా వస్తుంది. అదే టెలివిజన్ కామెడీలో చాలా పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే స్క్రిప్ట్‌లో ఉన్న పంచ్ ప్రేక్షకుడిని నవ్వించవచ్చు. కానీ స్టేజ్ మీద అనుకోకుండా వచ్చిన పరిస్థితిని పంచ్‌గా మార్చగలిగితే… అదే ఒక కమెడియన్ ప్రత్యేకత. నరేష్ అక్కడే తన మార్క్ చూపించాడు. బుల్లెట్ భాస్కర్, గాలిపటాల సుధాకర్‌తో పాటు పలువురు జబర్దస్త్ టీమ్ లీడర్ల స్కిట్స్‌లో కనిపిస్తూ… క్రమంగా తెలుగు టీవీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఒక దశలో స్కిట్లో నరేష్ కనిపిస్తే… అతని మీద తప్పకుండా ఒక పంచ్ ఉంటుందని ప్రేక్షకులు ఎదురుచూసే స్థాయికి చేరుకున్నాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మొదట్లో సమాజం అతని రూపాన్ని చూసి నవ్వింది. తర్వాత అదే రూపాన్ని… అదే టైమింగ్‌ను… అదే వ్యక్తిత్వాన్ని నరేష్ entertainment గా మార్చాడు. Difference ఏంటంటే… మొదట అతనిపై వాళ్లు నవ్వారు. తర్వాత అతనితో కలిసి నవ్వారు. అదే అతని విజయం. జబర్దస్త్‌తో వచ్చిన గుర్తింపు నరేష్‌కు మరిన్ని అవకాశాలు తెచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టెలివిజన్ కార్యక్రమాలు… స్టేజ్ షోలు… ప్రైవేట్ ఈవెంట్స్…అలా అతని పని పరిధి పెరుగుతూ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులను చూసిన నరేష్… తన కెరీర్‌తో కుటుంబాన్ని స్థిరపరిచే స్థాయికి చేరుకున్నాడు. ఇల్లు, కారు, కుటుంబ బాధ్యతలు… తనకు వచ్చిన ఆదాయాన్ని కుటుంబం కోసం ఉపయోగించుకున్నట్లు అతని గురించి వచ్చిన పలు కథనాలు చెబుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న నరేష్ మొత్తం ఆస్తుల విలువ, ఒక్కో ఈవెంట్‌కు తీసుకునే పారితోషికం వంటి సంఖ్యలకు అధికారిక నిర్ధారణ లేదు. అందుకే వాటిని ఖచ్చితమైన సంఖ్యలుగా చెప్పడం కంటే… ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఒకప్పుడు అవకాశాల కోసం ఆడిషన్ గేట్ల దగ్గర ఎదురుచూసిన నరేష్… ఇప్పుడు తెలుగు టెలివిజన్‌లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు అతని కెరీర్లో అసలు కొత్త పరీక్ష మొదలైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10. సెప్టెంబర్ 6న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు పదో సీజన్లో నరేష్ 11వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌ను ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఎంట్రీ సమయంలోనే నరేష్ కాన్ఫిడెన్స్ కనిపించింది. బిగ్ బాస్ కప్పు కొడతాననే ధీమాతోనే హౌస్‌లోకి వెళ్లాడు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. జబర్దస్త్‌లో నరేష్‌కు తన బలం ఏంటో తెలుసు. కామెడీ. టైమింగ్. పంచెస్. కానీ బిగ్ బాస్‌లో కేవలం కామెడీతోనే ముందుకు వెళ్లడం సాధ్యం కాదు. ఇక్కడ relationships handle చేయాలి. Nominations ఎదుర్కోవాలి. Tasks ఆడాలి. Arguments వస్తాయి. చాలా ఒత్తిడి ఉంటుంది. 24 గంటల పాటు కెమెరాలు ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా… ప్రేక్షకులకు ఒక janyoon parsanaaliTi కనిపించాలి. నరేష్‌కు బిగ్ బాస్ లో ఒక advaanTEj ఉంది. అతను చాలా సంవత్సరాలుగా aaDiyans naaDi ఎలా ఉంటుందో చూసిన vyakti. ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు sailenT gaa ఉండాలి? ఒక సంఘటన ని కామెడీ గా ఎలా మార్చాలి? ఇవన్నీ అతనికి అనుభవంతో వచ్చిన స్కిల్ల్స్. అయితే అదే సమయంలో ఒక సవాలు కూడా ఉంది. జబర్దస్త్‌లో సెటైర్ లేదా కౌంటర్ వేస్తే… అక్కడున్న వాళ్లు అది కామెడీ ఫార్మేట్ అని తెలుసుకుని స్పందిస్తారు అవుతారు. కానీ బిగ్ బాస్ హౌస్ లో situation completely different.
అక్కడ ఒక చిన్న జోక్ కూడా personal argumentగా మారవచ్చు. ఒక counter ఈగో క్లాష్ గా మారవచ్చు. ఒక నొమినతిఒన్ పెర్మనెంత్ రివల్ర్య్ని చ్రేతె చేయవచ్చు. అందుకే నరేష్‌కు kaameDee Taiming ఎంత ముఖ్యమో ఎమొతిఒనల్ చొంత్రొల్ కూడా అంతే ముఖ్యం. ఇక ఫ్య్సిచల్ తస్క్స్ విషయంలో కూడా ప్రేక్షకుల్లో సహజంగానే ఆత్రుత ఉంటుంది.
నరేష్ తన శారీరక పరిస్థితికి తగ్గట్టు టాస్క్ లను ఎలా హాండిల్ చేస్తాడు? స్ట్రాటజీ ని ఉపయోగిస్తాడా? టీం సపోర్ట్ తీసుకుంటాడా? ఇవి రాబోయే ఎపిసోడ్స్ లో చూడాల్సిన ఆసక్తికరమైన అంశాలు. కానీ బిగ్ బాస్ చరిత్ర చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ప్రతి టాస్క్ లో స్త్రాంగ్ పర్సన్ నే ఆడియన్స్ గెలిపించరు.
ఎవరు నిజాయితీగా ఉంటున్నారు? ఎవరు తమ స్టాండ్ తీసుకుంటున్నారు? ఎవరు ఒత్తిడిలో కూడా పర్సనాలిటిని ని కోల్పోవడం లేదు? చివరకు వోటింగ్ లో ఇవే చాలా ప్రభావం చూపిస్తాయి. అక్కడ నరేష్‌కు మంచి అవకాశం ఉంది. మరో ఇంట్రస్టింగ్ ఫాక్టర్ అతనికి ఇప్పటికే ఉన్న ఫామిలీ ఆడియన్స్. జబర్దస్త్ ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు నరేష్‌కు మంచి గుర్తింపు ఉంది. ఈ సీజన్ లో కూడా అతను సెలబ్రిటి కంటెస్టెంట్ గా అఫిషియల్ గా హౌస్ లోకి ప్రవేశించాడు. అందుకే మొదటి నుంచి అతనిపై ఆడియన్స్ అటెంక్షన్ ఉండటం సహజం. హౌస్ లో ఎక్కువ రోజులు ఉండాలంటే… ప్రతి వారం కొత్తగా ఆడి చూపించాల్సిందే. కేవలం పాత ఫేం మీద ప్రయాణం సాగదు. ఇక్కడ నరేష్ కధ లో నాకు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించే విషయం ఒకటుంది. మనం సాధారణంగా success storiesలో final result మాత్రమే చూస్తాం. TVలో కనిపిస్తున్నాడు. ప్రేక్షకులు గుర్తుపడుతున్నారు. పాపులారిటీ వచ్చింది. బిగ్ బాస్ అవకాశం వచ్చింది. కానీ ఆ విజయం వెనుక… స్కూల్లో ఎదుర్కొన్న వెక్కిరింపులు ఉన్నాయి. ఆడిషన్స్‌లో rejection ఉంది. అవకాశాల కోసం ఎదురు చూడటం ఉంది. చిన్న పాత్రతో మొదలుపెట్టడం ఉంది. అందుకే నరేష్ కథను కేవలం ఒక కమీడియన్ కధ గా చూస్తే పూర్తి పిక్చర్ కనిపించదు. తనకు డిస్ ఎడ్వాంటేజ్ గా కనిపించిన విషయాన్నే తన గుర్తింపు గా మార్చుకున్న వ్యక్తి స్టోరీ ఇది. ఒకప్పుడు…“వయసు పెరుగుతుంది కానీ మనిషి పెరగడు” అని కామెంట్ చేసిన వాళ్లు ఉండొచ్చు. కానీ ఈరోజు నరేష్ హైట్ గురించి కాదు…అతను తన కెరీర్ లో ఎంత ఎత్తుకు ఎదిగాడనే విషయం గురించి మాట్లాడే స్థాయికి వచ్చాడు.
జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ వరకు వచ్చిన ఈ ప్రయాణం ఇప్పుడు మరో కీలక దశలోకి వచ్చింది. ఇక అసలు గేమ్ అతని చేతుల్లోనే ఉంది. కామెడీ తో entertain చేస్తాడా? Strong stand తీసుకుని ప్రేక్షకులను మెప్పిస్తాడా? Physical tasksను strategyతో overcome చేస్తాడా? లేక Bigg Boss pressure అతని gameను మార్చేస్తుందా? అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. ఆడిషన్లో ఒక్క అవకాశం కోసం ఎదురుచూసిన నరేష్… ఇప్పుడు తెలుగు టెలివిజన్‌లోనే అతిపెద్ద రియాలిటి షో హౌస్ లో నిలబడ్డాడు. అక్కడివరకు రావడమే అతని జర్నీ లో ఒక పెద్ద చాప్టర్. ఇక బిగ్ బాస్ ట్రోఫీ వరకు వెళ్తాడా లేదా అన్నదే చూడాలి.
మీ అభిప్రాయం ఏంటి? జబర్దస్త్ నరేష్ బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు లో టాప్ 5 వరకు వెళ్తాడని మీరు అనుకుంటున్నారా? లేక హౌస్ ప్రెస్జర్ లో త్వరగా గా ఎలిమేంట్ అయ్యే అవకాశం ఉందా? మీ ప్రిడిక్షన్ ని కామెంట్ రూపం లో చెప్పండి.




