Todays Horoscope: నేటి దిన ఫలాలు: శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః 12వ తేదీ శనివారం సెప్టెంబర్ నెల 2026 నాటి దినఫలాలు.
మేషరాశి: మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు అలాగే షష్ట స్థానంలో ఉన్నటువంటి బుధ చంద్రులు బాగున్నారు లాభస్థానంలో రాహువు బాగున్నారు వెరసి నాలుగు గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది. లాభాల బాటలో ఉన్నారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మనోబలాన్ని పెంచుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంది అలాగే స్థిర చరాస్తుల వృద్ధి జరగడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మాలవ్య యోగం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అయితే భార్య భర్తల మధ్య అనుకూలతని మీరు ప్రతికూలం చేసుకోకుండా ఉన్నట్లయితే అది బాగుంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ప్రవర్తించండి. ఆరోగ్య విషయంలో అనారోగ్యం తగ్గిపోతుంది.
వృషభ రాశి: వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు చాలా బాగున్నారు తప్ప మిగతా గ్రహాల అనుకూలతలు ఏవి కనబడబోవడం లేదు. మాటని చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది అలాగే ఏదైనా అవమానాలు అపనిందలు మీ మీద వస్తున్నట్టయితే ఆరోపణలు కొద్దిగా ఓర్పుతో ఉండడం అనేది మంచిది. మీ ప్రతిస్పందన కూడా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దేనికి స్పందించవద్దు ఓర్పు కలిగి ఉండండి. మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోండి.
భార్యా భర్తల అన్యోన్యత కూడా అంత బాగా లేదు కానీ భార్య గారికి గాని భర్త గారికి గాని ఒకరికి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నవగ్రహ హోమం చేసుకోవలసిందిగా మరి మరి సూచన చేస్తూ ఉన్నాను..
మిధున రాశి: మిధున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు తృతీయంలో ఉన్నటువంటి రవి కేతువు బాగున్నారు చతుర్థంలో బుధుడు బాగున్నారు పంచ పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలే చాలా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎంత కష్టపడుతున్నారో అంతకంతకీ విజయ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో చాలా వరకు మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రేమ వివాహాలు బాగున్నాయి అని చెప్పవచ్చు. ధన ఆదాయం బాగుంది కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. మీకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చదువుకున్నట్టయితే చాలా వరకు అనుకూలమైన ఇంకా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అంటే రాశిలో ఉన్నటువంటి గురువుగారు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుండగా తృతీయ స్థానంలో బుధుడు చంద్రుడు బాగున్నారు చతుర్ధంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి నాలుగు గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా గృహము కానీ స్థలాలు కానీ పొలాలు కానీ ఏదైనా భూములు కొనడానికి అవకాశం కనిపిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. మానసికంగా, శారీరకంగా, సౌలభ్యాలు, సౌకర్యాలు పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువుగారు రాశిలో ఉన్నారు కాబట్టి మీ మాటకి చాలా పరపతి పెరుగుతుంది. అలాగే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒక మాట మాట్లాడితేనే చాలా గొప్ప విలువ ఉంటుంది.
సింహరాశి: సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు రాశిని చూస్తున్న రాహువు అలాగే అష్టమ స్థానంలో శని గారు తృతీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఇవి ఏవి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇచ్చే గ్రహ స్థితులు కాదు. కుటుంబ జీవితం బాగుంది వాక్కు బాగుంది. ద్వితీయంలో బుధుడు ఉన్నారు కదా అనుకుంటే శని గారి దృష్టి ఉన్నది ఔషధ సేవ అవసరంవుతుంది. మానసిక రుగ్మతలు శారీరక రుగ్మతలు పొడచూపడానికి అవకాశం ఉంటుంది. లాభస్థానంలో కుజుని వల్ల వాహన సౌకర్యాలు అలాగే వాహనాల వల్ల లాభాలు అమ్మకాలు కొనుగోలు వల్ల లాభాలు. భార్యా భర్తల అన్యోన్యత రీత్యా ప్రేమ వ్యవహారాల రీత్యా గాని దూరప్రాంత ప్రయాణాల రీత్యా గాని ఏదీ కూడా అనుకూలించబోవడం లేదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి.
కన్యారాశి: కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అంటే రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. ద్వితీయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్టంలో రాహువు బాగున్నారు ఏకాదశంలో గురువుగారు బాగున్నారు నాలుగు గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలను మీకు ఇస్తూ ఉండగా ఇక్కడ రెండు రకాలైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి భావాలన్నమాట రాశిలో ఉన్నటువంటి బుధ చంద్రులు కాస్త అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటారు. అలాగే శని గారి దృష్టి ఉంది కాబట్టి ఔషధ సేవ అవసరంవుతుంది ఇది చెప్పదగ్గ సూచన పబ్లిక్ రిలేషన్స్ జాగ్రత్తగా ఉండాలి మృష్టాన్న భోజనాలు ఉంటాయి. విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి శుభకార్యాల నిర్వహణ ఉంటుంది శుభకార్యాలలో మీరు పాల్గొంటారు. లాభస్థానాధిపతే రాశిలో ఉండడము లాభంలో గురువుగారు ఉండడము మాతృవర్గ రీత్యా బాగుంటుంది స్థిర చరాస్తుల రీత్యా బాగుంటుంది.
తులా రాశి: తులా రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు అద్భుతంగా ఉన్నారు. షష్ట స్థానంలో శని గారు చాలా బాగున్నారు. ఏకాదశంలో రవి బాగున్నారు కేతువు బాగున్నారు. ఎప్పుడైతే నాలుగు గ్రహాల ఉనికి మీకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందో మీ జీవితాశయం నెరవేరుతుంది. ఒక్క ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి మిగతా అన్నిటి పట్ల కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీ మనసు ఏదైతే సంకల్పించుకుందో ఇన్నాళ్ళు ఆ మానసిక సంకల్పం అనేది ఇప్పుడు నెరవేరిపోయేటటువంటి పరిస్థితి. శత్రువుల భారం ఏదైతే శత్రువులు మిమ్మల్ని చాలా బాధిస్తూ ఉన్నారో ఆ బాధ అనేది
తగ్గిపోతుంది. ఎటువంటి ధన నష్టము లేకుండా ఉన్నది.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు. దశమంలో రవి గారు బాగున్నారు. ఏకాదశంలో బుధ చంద్రులు బాగున్నారు. ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు వెరసి ఐదు గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా ఉబ్బి తబ్బిబ్బింప చేస్తోంది. మానసిక శాంతి పెరుగుతోంది ఉద్యోగ జీవితంలో చక్కటి ఒకటి ఉన్నతి పెరుగుతోంది మీ యొక్క పనితనము మీ పై అధికారులకు నచ్చి ప్రశంసలు ఇస్తున్నారు. మాతృమూర్తి గారికి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి మరింత అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి.
ధనస్సు రాశి: ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటు వంటి రాహువు గారి సంచారం గాని ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం గాన చాలా బాగుంది. అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది అయితే ఈ రెండు గ్రహాలే బాగున్నాయి కదా మిగతా ఏడు గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి కదా అనుకుంటే నిజంగానే ఏడు గ్రహాలు అననుకూలంగా ఉన్నా పరిస్థితులు అననుకూలంగానే ఉంటాయి.
గురువుగారికి మీరు చేసేటటువంటి పూజ పునస్కారము స్తోత్రము దానము జపము ఏది చేయండి. ఇక్కడ కూడా అదే పరిస్థితి ధనస్సు రాశి వాళ్ళకి మీకు ఏవైనా ఆటంకాలు ఏర్పడుతుంటే కాస్త ఓర్పు కలిగి ఉండండి. అయితే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మీకు ఉద్యోగ జీవితంలో కాస్త మనశశాంతిని వెసులుబాటుని ఇస్తుంది.
మకర రాశి: మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శని గారు చాలా బాగున్నారు. షష్టంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు. సప్తమంలో గురువు బాగున్నారు అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు ఎప్పుడైతే నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఉద్యోగ జీవితం బాగుంటుంది. ముఖ్యంగా బంగారము వెండి పట్టు వస్త్రాలు ముత్యాలు సెంటు పరిమళము అత్తరు అలాగే కళాఖండాలు ఇలాంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి చాలా అద్భుతమైనటువంటి ఉన్నతి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ధన ఆదాయం ఉంటుంది. అయితే కుటుంబంలో మటుకు కొంచెం శాంతి తక్కువగా ఉందా అనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. గురువుగారు ఉచ్చలో ఉంటున్న కారణం చేత విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి విదేశీ ప్రయాణాలు సానుకూల పడతాయి.
కుంభరాశి: కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము ఇంకా ఇంకా కొనసాగుతూ ఉన్నది గ్రహాల యొక్క స్థితిగతులు యొక్క నవమస్థానంలో శుక్రాచార్యులు వారు మాత్రమే యోగిస్తున్నారు. తప్ప మిగతా గ్రహాలు ఏవి కూడా యోగించబడడం లేదు అయితే దిగులు పడకుండా మనోబలాన్ని పెంచుకుంటూ ఉల్లాసాన్ని పెంచుకుంటూ ఉత్సాహాన్ని పెంచుకుంటూ నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఇంటి ఇలవేల్పుని పూజించుతూ అలాగే ఒక్కసారి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భార్యా భర్తల మధ్య అన్యోన్యత చెడిపోకుండా చూసుకోండి. అపనిందలు ఉండడానికి అవకాశం ఉంది సంతానం ఉన్నవారికి సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి మీకే మీకే అర్థమైపోతుంది.
మీనరాశి: మీనరాశి వారికి రవి గారి యొక్క స్థితి కానీ కేతువు యొక్క స్థితి కానీ షష్ట స్థానంలో ఉండడం చేతను అలాగే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము పంచమంలో గురువుగారి సంచారము వెరసి చాలా అద్భుతమైనటువంటి ఐదు గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు తొలుగుతాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సంతోషంగా ఉన్నట్టుగా కాలం గడుస్తూ ఉంటుంది. ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత చాలా చాలా బాగుంది అయితే ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి గురువుగారి గారి యొక్క పంచమ స్థాన స్థితి చేత గాని నవమ దృష్టి చేత గాని ఈ దోష ఫలితాలు చాలా వరకు తగ్గుతూ ఉన్నాయి.
సర్వేజనా సుఖిన భవంతు




