Skip to content
లైఫ్ స్టైల్

Dry Fruits: డ్రై ఫ్రూట్స్ మంచివో కావో ఎలా కనిపెట్టాలి?

Dry Fruits: నకిలీ కి లేదు అనర్హం….ఎదైనా డొప్లికేట్ చేస్తున్నారు కల్తీ గాళ్ళు. అసలు ఇలా కల్తీ చేసి అమ్మేవాళ్ళకు అవే వాళ్ళ కుటుంబానికి పెట్టే శిక్ష ను మన రాజ్యాంగం లో రాయాలి. ఇప్పుడు మన ఆహార అలవాట్లు మారాయి. అన్నీ బయటే కొంటున్నాం. అదివరకు లాగా మనకు ఓపికలు లేవు. పైగా సమయం లేదు. మొబైల్ లో రీల్స్ చూడటానికే సమయం సరిపోవటం లేదు. ఇక ఇంట్లో చేసుకోవడం ఎలా కుదురుతుంది. దీన్నే ఆసరా గా చేసుకుని కల్తీ గాళ్ళు అన్నీ కల్తీ చేస్తున్నారు. అవి తిని మనం ఆస్పత్రి పాలవుతున్నాం…ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ బాగా పెరిగింది అందరికి. ఇప్పుదు డ్రై ఫ్రూట్స్ తెగ తింటున్నారు. ఇంకేం…దీన్ని కూడా కల్తీ చేస్తున్నారు కల్తీ గాళ్ళు. డ్రైఫ్రూట్స్ లో బాగా రుచికరమైనది జీడి పప్పు దీన్ని కూడా కల్తీ చేస్తున్నారు. వందలు వందలు పోసి కొని అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నాం…ఇటీవల మార్కెట్ లో కెమికల్స్ తో ప్రాసెస్ చేసిన నకిలీ జీడి పప్పు విక్రయం పెరిగి పోయింది. సహజం గా జీడి పప్పు ఎంత తెల్లగా ఉంటే అంత మంచిదని భావిస్తారు. కాని అసాలైన జీడి పప్పు లేత పసుపు రంగులో లేక క్రీం కలర్ లో ఉంటుంది. ఇక్కడే మనం కనిపెట్టవచ్చు. జీడి పప్పు తెల్లగా మెరుస్తూ ఉంటె దానికి బ్లీచింగ్ లేక కెమికల్స్ వాడారని అర్ధం. జీడి పప్పు జీడి గింజ ఆకారం లో ఒంపు తిరిగి ఉంటుంది. ప్రతి పప్పు మెరుస్తూ, ఒకే సైజు లో ఉంటే అవి పిండితో ప్రాసెస్ చేసినవి గా గుర్తించాలి.

AI:60 సెకన్లలో 60 ఆరోగ్య పరీక్షలు.. మంగళగిరిలో వైద్య సేవలు

మరొక పద్దతి ఒక గ్లాసు నీటిలో 4 నుంచి 5 జీడి పప్పులు వేయండి. అసలైనవి అయితే అవి నీటి అడుగు భాగానికి మునుగుతాయి. ఒకవేళ అవి తేలితే అవి రసాయనాలు కలిపిన పప్పు అని గ్రహించాలి. మనం పప్పు నోట్లో వేసుకుంటె నూనె వాసన వస్తుంటే అది కల్తేనే…జీడిపప్పును వేళ్ల మధ్య ఉంచి గట్టిగా రుద్దండి.వాటికి మినరల్ ఆయిల్ పూసి ఉన్నట్లైతే, మీ చేతులకు జిడ్డుగా, విపరీతమైన నూనె అంటుకుంటుంది. సహజమైన జీడిపప్పును ఒత్తితే కొద్దిగా మాత్రమే సహజ నూనె తగులుతుంది.

గమనిక..ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే వచ్చే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *