kalalo bhojanam kanipiste?
kalalo bhojanam kanipiste? మనకు నిద్రలో ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. కాని అవి ఎక్కువ గా గుర్తు ఉండవు, సహజంగా వేకువ ఝామున వచ్చే కలలు వాటి ఫలితాలు త్వరగా నెరవేరతాయి అని అంటారు. అందులో భోజనం చేయడం, భోజనం కనిపించడం, ఇతరులకు భోజనం పెట్టడం వంటి కలలు కూడా సాధారణమే. అయితే కలలో భోజనం కనిపిస్తే దాని అర్థం ఏమిటి? అనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది.
మనం ఇతరులకు భోజనం వడ్డిస్తున్నట్లు కనిపిస్తే మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది అని అలాగే వాయిదా పడుతున్న పనులు పూర్తి అవుతాయి అని అర్ధం. అయితే కలల అర్థాలు వ్యక్తి పరిస్థితులు, ఆలోచనలు, అనుభవాలను బట్టి మారే అవకాశం ఉన్నది.
పూర్వికులతో కలిసి భోజనం చ్శ్తున్నట్లు కనపడితే వారి ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్ధం. అలా కాకుండా వారు తినకుండా ఎదురు చూస్తున్నట్లు కల వస్తే, వారు ఎక్కడో అసంత్రుప్తి గా ఉన్నారని అర్ధం. అలాంటప్పుడు నిద్ర లేచిన వెంటనే తల స్నానం చేసి వారి దగ్గర దీపారాధన చేసి, కనీసం అగరబత్తి అన్నా వెలిగించి వారిని క్షమాపణ కోరుకుంటే ఆ చెడు ఫలితాలు దూరం అవుతాయి.
కలలో రుచికరమైన లేదా ఇష్టమైన భోజనం కనిపించడం శుభ సూచకంగా కొందరు భావిస్తారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడటం, మంచి వార్త వినడం లేదా కోరుకున్న విషయం నెరవేరే అవకాశం ఉందని సంప్రదాయ విశ్వాసం.
కలలో ప్రశాంతంగా భోజనం చేస్తున్నట్లు కనిపిస్తే మనసుకు సంతృప్తి, ఆనందం లభించడానికి సంకేతంగా భావిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది మనలో ఉన్న కోరికలు లేదా అవసరాలను కూడా ప్రతిబింబించవచ్చు.
కలలో ఇతరులకు భోజనం పెడితే?
ఇతరులకు భోజనం పెడుతున్నట్లు కల రావడం దానం, సేవ, మంచితనం వంటి భావాలకు ప్రతీకగా సంప్రదాయంగా భావిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు లేదా సంతోషకరమైన సందర్భాలకు సంకేతంగా కూడా కొందరు చెబుతారు.
కలలో అన్నం కనిపిస్తే?
భారతీయ సంప్రదాయంలో అన్నానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అందువల్ల కలలో అన్నం కనిపించడం సమృద్ధి, ఆహార భద్రత, కుటుంబ సంతోషంకు సంకేతంగా భావించే నమ్మకాలు ఉన్నాయి. కలలో తీపి పదార్ధాలు కనక వస్తే మనకు త్వరలో ధనలాభం ఉన్నది అని అర్ధం.
ఒక విషయం గుర్తుంచుకోవాలి
కలలకు ఖచ్చితమైన భవిష్యవాణి అర్థం ఉందని శాస్త్రీయంగా నిరూపించబడలేదు. మన రోజువారీ ఆలోచనలు, ఆహారం, ఒత్తిడి, భావోద్వేగాలు, అనుభవాలు కూడా కలలపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి కలలను సంప్రదాయ నమ్మకాల కోణంలో మాత్రమే చూడటం మంచిది.
also read: స్టూడియో వన్ నెట్వర్క్ ఛానల్స్
మీకు కలలో భోజనం కనిపించిందా? అయితే అది ఎలాంటి భోజనం, మీరు తిన్నారా లేదా ఇతరులకు పెట్టారా అనే విషయాన్ని బట్టి సంప్రదాయంగా చెప్పే అర్థం కూడా మారుతుంది.




