సహజం గా స్త్రీలు నాలుగున్నర అడుగుల నుంచి ఐదున్నర ఉంటారు. కాని ఈ భామ ఏకంగా ఆరున్నర అడుగుల పొడుగు ఉన్నది….విషయానికి వస్తే అమరావతి చాంపియన్ షిప్ తిరుపతి లో జరుగుతున్న సంగతి తెలిసిందే….ఈ చాంపియన్షిప్ కు ఓ ఆరున్నర అడుగుల యువతి పాల్గొని అందరూ తల ఎత్తి చూసేలా చేసింది. కోనసీమ జిల్లాకు చెందిన ఈ యువతి ఇంటర్మీడియట్ చదువుతున్నది, అయితే ఈమె బాస్కెట్ బాల్ అండర్ 17 లో ఆడేందుకు తిరుపతి వచ్చింది. ఈమె తల్లి తండ్రుల పేర్లు భూమిక, శ్రీనివాస్ లు. ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతున్న పూజిత ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో ఆరు సార్లు జాతీయ స్థాయిలో ఓ ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించింది. ఈ అమరావతి చాంపియన్షిప్ లో కూడా నెగ్గుతాను అని ధీమా వ్యక్తం చేసింది. ఏది ఏమైనా ఈ అమ్మాయిని చూసి కెమేరాలు అన్ని క్లిక్ మన్నాయి.
తిరుపతి లో ప్రత్యక్షం అయిన పొడుగు కాళ్ళ సుందరి…

Studio One News
Follow our WhatsApp Channel for Latest News



