Skip to content
వార్తలు

YSRCP: తెలుగు దేశం లో చేరిన బొత్సా మేనల్లుడు చిన్న శ్రీను

YSRCP కు ఉత్తరాంధ్రలో బిగ్‌షాక్‌ తగిలింది.. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, బొత్సా కు కుడి భుజం విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Chandrababu Naidu: IT Man to Water Man:

స్థానిక ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో వైకాపా కు ఈ షాక్‌ కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satya Narayana) మేనల్లుడు, విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు జగన్‌కు పంపారు. విజయనగరం జడ్పీ ఛైర్మన్, భీమిలి వైకాపా ఇన్‌ఛార్జ్‌గానూ చిన్న శ్రీను పనిచేస్తున్నారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి, భీమిలి ఇన్‌ఛార్జ్‌ పదవికీ ఆయన రాజీనామా చేశారు.

కొన్నాళ్లుగా బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీను మధ్య కోల్డ్‌ వార్‌ జరుగుతోంది. పార్టీలో మేనల్లుడి ప్రాధాన్యం తగ్గించేలా బొత్స ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిన్న శ్రీను వైకాపాకు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

DSC: పై లోకేష్ వీడియో వైరల్

YSRCP కు రాజీనామా చేసిన అనంతరం చిన్న శ్రీను తెదేపాలో చేరారు. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో అనుచరులతో కలిసి పసుపు కండువా కప్పుకొన్నారు. శ్రీను కుమార్తె సిరి సహస్ర, ఆమె అనుచరులు కూడా తెదేపాలో చేరారు. పార్టీలో చిన్న శ్రీను చేరిక కార్యక్రమానికి మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, కొండ్రు మురళి, కోళ్ల లలితకుమారి తదితరులు హాజరయ్యారు.

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *