ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన గురించి రెండు తెలుగు రాష్ట్రాల లో హాట్ టాపిక్ అయింది. ఇదంతా రేవంత్ మాస్టర్ ప్లానా? అనుమతి ఇవ్వరు అని తెలిసి పొలిటికల్ మైలేజ్ కు తెరలేపారా? లేక కేంద్రం తెలంగాణా ను, ముఖ్యమంత్రిని చిన్న చూపు చూస్తుందా? లేక పోతే అడ్డుకున్నట్లు నటిస్తూ రేవంత్ ను పొలిటికల్ హీరో ను చేస్తున్నదా? కేంద్రం రూల్స్ అంటే, కాంగ్రెస్ రివేంజ్ అంటున్నది. అసలు అమెరికా పర్యటన అనంతరం రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దం….ఆ తరువాత అసలు కారణం ఏమిటో చూద్దాం…….అమెరికా పర్యటనకు గుజరాత్ ముఖ్యమంత్రి కి అనుమతిచ్చి.. తెలంగాణ ముఖ్యమంత్రికి నిరాకరించడమంటే..ఇది రేవంత్‌రెడ్డికి కాదు.. నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలకు జరిగిన అవమానం. రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర అన్యాయం’’ అని ముఖ్యమంత్రి రేవంథ్ రెడ్డి మండిపడ్డారు. సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ గుజరాతీగానే తప్ప.. భారత ప్రధానిగా వ్యవహరించడం లేదు. తెలంగాణ అంటే ఆయనకు చిన్న చూపు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు గుజరాతీ నాయకత్వం చేస్తున్న కుట్ర ఇది. మేమంతా కేంద్రం వైఖరిని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. దీన్ని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజమంతా ఖండించాలి. నా పర్యటనను అడ్డుకోవచ్చు కానీ.. నా లక్ష్యాన్ని అడ్డుకోలేరు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్రం వైఖరిపై ధ్వజమెత్తారు. మరో పక్క పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం చీటికి మాటికి విదేశీ పర్యటనలు చేస్తుంటారు, చివరకు చిన బాబు లోకేష్ కూడా విదేశాలకు వెళ్ళి వస్తుంటాడు. అలాంటిది రేవంథ్ ను అడ్డుకోవటం వెనక ఏముంది….
ఆగస్టు 17-28 వరకు అమెరికా, కెనడా పర్యటనకు గుజరాత్ ముఖ్యమంత్రికి అనుమతించారు. ‘వైబ్రెంట్ గుజరాత్’ అని పెట్టుబడుల కోసం ఆ రాష్ట్ర సీఎంకు ఎందుకు పచ్చజెండా ఊపారు? నా విదేశీ పర్యటనలో విషయం లేదనుకుంటే.. ఇంగ్లాండ్‌కు ఎందుకు అనుమతిచ్చారు? నేను తెలంగాణ సీఎంను.. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కావడమే కారణమా? ఈ విషయంలో కేంద్రం వైఖరిని అందరూ తప్పు పట్టారు. నా పర్యటనను తిరస్కరించడమే కాకుండా.. వ్యక్తి గతం గా కూడా భా.జా.పా నాయకులు విమర్శిస్తున్నారు. అని రేవంత్ రెడ్డి మండి పడ్డారు.
మహాత్మా గాంధీ, అంబేడ్కర్ ఇంగ్లాండ్‌లో చదువుకుని దేశానికి దార్శనికులుగా మారారు. ఆర్థికంగా వెనకబడిన వారు విదేశాల్లో చదువుకోలేరు. అందుకే విదేశీ చదువులు, క్రీడలను ఇక్కడికి తీసుకురావాలని మేం ప్రయత్నిస్తున్నాం. ఇందుకు విదేశీ పర్యటనలు ఉపయోగపడతాయని భావించాం. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ నినాదంతో ‘తెలంగాణ గ్లోబల్ సమిట్ 2026’ను డిసెంబరు 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నాం. విద్య, క్రీడల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తాం. గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే నా పర్యటనను కేంద్రం అడ్డుకుంది. ముఖ్యమంత్రి సరైన వివరాలు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. ఇది చాటుమాటుగా జరిగే వ్యవహారం కాదు. అధికారిక పర్యటన. మా కార్యక్రమాల వివరాలన్నీ విదేశీ వ్యవహారాలశాఖకు అందించాం. వారి పర్యవేక్షణలోనే పర్యటన జరుగుతుంది. కేంద్రం వైఖరితో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోతాయన్నదే మా ఆవేదన.
మోదీ పాక్ వెళ్లి అక్కడ ఆయన మిత్రుడిని ఆలింగనం చేసుకొని.. బిర్యానీ తిని రాలేదా? మేం మాత్రం పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లకూడదా? కేటీఆర్, హరీశ్‌రావు, కవిత పిల్లల విదేశాల్లో చదువుకుంటున్నారు. వారి అమెరికా పర్యటనలకు మాత్రం అనుమతులు వస్తున్నాయి. నేనూ హార్వర్డ్ వర్సిటీలో చదివా. ఒప్పందాలకు సంబంధించిన నాకు అమెరికా వర్సిటీల నుంచి ఆహ్వానం ఉంది’’ అని సీఎం పేర్కొన్నారు.
ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎందుకు కేంద్రం సడెన్ గా అనుమతి ని రద్దుచేసింది? బి.జె.పి. వాదన ఏమిటంటే ముఖ్యమంత్రి అధికారక సమావేశాల్లో, పార్టీ సమావేశాలు ఏమిటి? అని వాదిస్తున్నది. ఇది రూల్స్ కు విరుద్ధం అని కేంద్రం చెపుతున్నది. మరో పక్క తెలంగాణాలో బి.ఆర్.ఎస్. పుంజుకోవటం, అటు కాంగ్రెస్ లో ఒక వర్గం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం లాంటి పరిణామాల నేపధ్యం లో డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ తెరలేపారు అనేది ఒక వాదన….అసలు రేవంత్ అమెరికా పర్యటన లో పెట్టుబడుల కోసం అయితే ఒకే…కాని మజ్లిస్ ఎం.ఎల్.ఏ. అక్బరుద్దిన్ కూతురు వివాహానికి హాజరవడం పై బి.జె.పి. కి మండింది అని అంటారు. అయితే గతం లో కూడా మమతా బెనర్జీ, కేజ్రివాల్ పర్యటనలు కేంద్రం అడ్డుకున్నది. దీని వలన కేంద్రం రాష్ట్రాల పై పెత్తనం చేస్తున్నది అనటం లో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా రేవంత్ కు మంచి పొలిటికల్ మైలేజ్ వచ్చింది అనటం లో ఎలాంటి సందేహం లేదు….రేపు వచ్చే ఎన్నికలలో రేవంత్ సడేన్ గా పార్టీ మారి రాష్ట్రానికి పెట్టుబడుల కోసమే నేను బి.జె.పి.లోకి వెళుతున్నా అని బి.జె.పి. తరుపున సిం.ఎం.కాండిడేట్ గా పోటీ చేసినా ఆశ్చర్య పోనవసరం లేదు……




