Skip to content
లైఫ్ స్టైల్

మనకు Rs. 13 కు దొరికేది Rs.1300 కు కొంటున్నామా?

గరికపాటి గారు చెప్పినట్లు, చిన చేపను పెద చేప, పెద చేపను తిమింగళం తింటున్నట్లు, మనం చిల్లర కొట్టుకు వెళితే వాడికి అప్పు పెట్టి సరుకులు తీసుకుంటాం, అదే రిలయన్స్, డి, మార్ట్ కు వెళితే క్రెడిట్ కార్డు వాడి అప్పటికప్పుడు వాడికి డబ్బులు పేచేసి కాని బయటకు రాము. ఎందుకంటే సెక్యూరిటి వాడు మనల్ని పోనివ్వడు. మన ఇంటి ముందుకు వచ్చిన తాజా కూరగాయలు, ఆకు కూరలు, పళ్ళు కొనము చివరకు చీపుర్లు తో సహా…..మన ఇంటి ముందుకు వచ్చే తాజా కూరగాయలు ధర చాలా తక్కువ. మన ఇంటిముందుకు వచ్చే తాజా తోటకూర కట్ట 5 రూపాయలు ఉంటే డి.మార్ట్ లో ఫ్రిజ్ లో పెట్టిన తోటకూర కట్ట 7 రూపాయలు ప్లస్ జి.ఎస్.టి. కలుపుకుని 10 రూపాయలు దాదాపు అవుతుంది. మనకు అదే ఇష్టం. పూర్వం మన ఇంట్లో దానిమ్మ, జామ, మామిడి లాంటి చెట్లు ఉండేవి. కాని ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ లో ఇవేవి ఉండటం లేదు. సరే ఇప్పుడు దానిమ్మ కాయలను బయట 13 రూపాయలకు కొంటున్నాం…..ఆ తొక్కను బయట పాడేస్తున్నాం. అదే తొక్కను అమేజాన్ వాడు 130 రూపాయలకు అమ్మితే ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టి మరీ మొహానికి రాసుకుంటున్నాం….ఇక్కడ ఒక్క 5 నిముషాల శ్రమ మాత్రమే….కాని మనం చెల్లిస్తున్నది 130 రూపాయలు. మన సంపద పెరగాలి, పెరగాలి అంటే ఎలా పెరుగుతుంది. చిన్న ఉదాహరణ చెపుతా….మన ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నాయి అనుకోండి దానికి అమేజాన్ లాంటి యాప్స్ లో ఆర్డర్ పెట్టి కొంటాం. మన చేతిలో ఉన్న చిట్కా ని మాత్రం ఉపయోగించం…

AI:60 సెకన్లలో 60 ఆరోగ్య పరీక్షలు.. మంగళగిరిలో వైద్య సేవలు

దానిమ్మ కాయలు కిలో 130 రూపాయలు అనుకుంటే దానిమ్మ తొక్కల పొడి 1300 రూపాయలు. అమేజాన్ లో 150 గ్రాముల పాకెట్ 188 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే కిలో 1300. అసలు దానిమ్మ తొక్కల వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటంటే దానిమ్మ తొక్కలను నీరెండ లో ఎండి పోయే దాకా ఉంచి దానిని పొడి చేసుకోండి. ఒక టీ స్పూన్ దానిమ్మ తొక్కల పొడి తీసుకోండి, దానికి సమానంగా జౌ గింజల పిండి దానికి సమానంగా బియ్యపు పిండి, ఎర్ర పప్పు పొడి, శనగ పిండి వేయండి. దీనికి కొంచెం అలోవీరా జెల్. ఇప్పుడు చాలా మంది అలోవీర చెట్లు పెంచుతున్నారు. ఇవి నరఘోష కు కూదా ఉపయోగ పడతాయి ఇవి పెంచటం వలన, ఈ మిశ్రమానికి రోజ్ వాటర్ ను కలిపి బాగా మిక్స్ చేయండి మెత్తని పేస్ట్ లా గా చేయండి. కుదిరితే పాల మీగడ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ పేస్ట్ ని ముఖానికి రాసుకుని సుమారు 15 నుంచి 20 నిముషాలు ఉంచి, అది పూర్తి గా ఎండి పోక ముందే సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోండి. ఇలా చేయడం వలన ముఖం మీద ఉండే మచ్చలు, పిగ్మెంటేషన్ వలన్ వచ్చే మచ్చలు అన్నీ తొలిగి పోతాయి. అలాగే ముడతలు పోతాయి, చర్మం కాంతి వంతంగా మెరుస్తుంది. అంతే కాకుండా తామర, గజ్జి లాంటి చర్మ సంబంధమైన రుగ్మతలు కూడా తగ్గిస్తుంది. ఇది ఒక్క సారి ట్రై చేయండి. ఒక వేళ ఫలితం రాక పోతే ఇంకో సారి చేయండి. ఖచ్చితంగా మీరు ఆ మార్పు ను చూస్తారు. మార్కెట్ లో లభించే క్రీం లలో కూడా ఇవే ఉంటాయి కాక పోతే మనకు అంత సమయం లేదు బ్రో అంటే ఆ క్రీం లు నిలవ ఉండటానికి వాడె కెమికల్స్ వలన కాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. వారం లో ఒక 10 నిముషాలు కేటాయిస్తారో లేక కాన్సర్ ను కొని తెచ్చుకుంటారో మీ ఇష్టం….

Dry Fruits: డ్రై ఫ్రూట్స్ మంచివో కావో ఎలా కనిపెట్టాలి?
Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *