Union Cabinet Expansion: తెలుగు రాష్ట్రాలకు పెరగనున్న ప్రాధాన్యం.. జనసేన నుంచి బాలశౌరి పేరు? కేంద్ర మంత్రి వర్గ విస్తరణపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ మళ్లీ ఊపందుకుంది. 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త ముఖాలకు అవకాశం కల్పించేలా ప్రధాని Narendra Modi నేతృత్వంలోని ప్రభుత్వం కేబినెట్‌లో మార్పులు చేపట్టవచ్చన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా యువతతో అనుసంధానం, ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక ప్రాతినిధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి….
Ram Pothineni: హీరోగా ఎన్నో విభిన్న పాత్రల్లో అలరించిన Ram Pothineni ఇప్పుడు మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి సినిమా ప్రస్తుతం #RAPO23 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో రామ్ హీరోగా నటించడంతో పాటు కథ, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. RAPO23 టైటిల్ ఏంటి? ఈ సినిమాకు అధికారిక టైటిల్ ఇంకా ప్రకటించలేదు. అయితే…
FM రేడియోకు ఏమైంది? స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ ఫీచర్ ఎందుకు మాయమైంది? స్మార్ట్‌ఫోన్లలో FM రేడియో ఎందుకు కనుమరుగైంది? 4G, 5G, లు రేడియో ను మళ్ళీ చంపేస్తున్నాయా?, కారణాలేంటో తెలుసుకోండి. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ అంటే కాల్స్, మెసేజ్‌లతో పాటు ఎఫ్‌ఎం రేడియో కూడా గుర్తొచ్చేది. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఇంటర్నెట్, డేటా లేకుండానే పాటలు, వార్తలు వినేవాళ్లం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే చాలా ఫోన్లలో ఎఫ్‌ఎం రేడియో కనిపించడం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కొన్ని…
Amavasya: అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే నమ్మకం వెనుక నిజం ఏంటి? మనం తరచూ వాహన ప్రమాదాల గురించి వార్తల్లో చూస్తుంటాం. ముఖ్యంగా ఉదయం లేవగానే ఏదో ఒక బస్సు ప్రమాదం, రోడ్డు ప్రమాదం లేదా ఇతర ప్రమాదాల వార్తలు వినిపిస్తుంటాయి. కొన్నిసార్లు పెళ్లి బస్సులు, యాత్రికులతో వెళ్తున్న బస్సులు ప్రమాదాలకు గురవుతుంటాయి. దీంతో అమావాస్య, పౌర్ణమి రోజులకు ప్రమాదాలకు ఏమైనా సంబంధం ఉందా? వేకువజామునే ప్రమాదాలు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి? అనే సందేహాలు…
Nepal floods: నేపాల్(Nepal) లోని రసువా జిల్లాలో భోటే కోశీ నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో భారీ నష్టం సంభవించింది. చైనా సరిహద్దుకు సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై నేపాల్ అధికారులు వరదలకు అసలు కారణాలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎగువన ఉన్న టిబెట్‌లో భారీ వర్షాలు కురిసినట్లు శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైందన్న కథనాలు తెరపైకి రావడంతో.. ముందస్తు సమాచారం, హెచ్చరికల విషయంలో చైనాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రసువా జిల్లాలో ఒక్కసారిగా వరద భోటే కోశీ…
మీ బొడ్డు (Navel) ప్రకారం మీ లక్షణాలు ఏమిటి?: జ్యోతిష్య శాస్త్రం లో అనేక అంగాలు ఉంటాయి, జాతక చక్రం వేసి జ్యోతిష్యం చెప్పేది, పుట్టిన తేదీన బట్టి జ్యోతిష్యం చెపుతారు, అలాగే చేతి రేఖలు చూసి హస్త సాముద్రికం చెపుతారు, అలానే ముఖ కవళికలను చూసి జ్యోతిష్యం చెప్పటం ఇలానే బొడ్డు ను చూసి చెప్పే జ్యోతిష్యం ను నాభి జ్యోతిష్యం అని అంటారు. అయితే ఈ నాభి జ్యోతిష్యం సాముద్రిక శాస్త్రం లో ఒక…
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ (Kodada) లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు….
Toxic Movie Review Telugu: కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకున్న యష్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘Toxic: A Fairy Tale for Grown-Ups’ ఒక విభిన్నమైన, చీకటి నేపథ్యంతో కూడిన ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేసింది. సాంకేతికంగా భారీ స్థాయిలో కనిపించినప్పటికీ, కథనం, పాత్రల పరిచయం, సన్నివేశాల అనుసంధానం, సంభాషణలు,…
ఒకప్పుడు తెలుగు తెరపై యాక్షన్ హీరో అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో సుమన్ (hero suman) ఒకరు. కరాటే బ్యాక్‌గ్రౌండ్, స్టైలిష్ లుక్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో 1980, 1990 దశకాల్లో స్టార్ హీరోగా వెలుగొందారు. తెలుగు మాత్రమే కాదు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, తుళు భాషల్లో కలిపి 700కు పైగా సినిమాల్లో నటించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. అయితే ఇన్ని సినిమాలు చేసిన సుమన్‌కు పెద్ద అవార్డులు ఎందుకు…
Jogi meghana pressmeet: తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబానికి సంబంధించిన వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు ఆరోపణలు, ప్రత్యారోపణలు తెరపైకి రాగా.. తాజాగా జోగి రమేశ్ కోడలు మేఘన మీడియా సమావేశం నిర్వహించి తన వాదనను వెల్లడించారు. జోగి రమేశ్ తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్తమామలను సొంత తల్లిదండ్రులుగా భావించా.. జోగి రమేశ్, ఆయన భార్యను తాను…