Skip to content
ఆటోమొబైల్స్

FM రేడియోకు ఏమైంది? స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ ఫీచర్ ఎందుకు మాయమైంది?

FM రేడియోకు ఏమైంది? స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ ఫీచర్ ఎందుకు మాయమైంది? స్మార్ట్‌ఫోన్లలో FM రేడియో ఎందుకు కనుమరుగైంది? 4G, 5G, లు రేడియో ను మళ్ళీ చంపేస్తున్నాయా?, కారణాలేంటో తెలుసుకోండి. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ అంటే కాల్స్, మెసేజ్‌లతో పాటు ఎఫ్‌ఎం రేడియో కూడా గుర్తొచ్చేది. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఇంటర్నెట్, డేటా లేకుండానే పాటలు, వార్తలు వినేవాళ్లం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే చాలా ఫోన్లలో ఎఫ్‌ఎం రేడియో కనిపించడం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కొన్ని ఫోన్లలో రేడియో ట్యూనర్ ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించే అవకాశం ఉండదు. మరి అసలు ఈ ఫీచర్‌కు ఏమైంది? 2013లో ఎమిస్ కమ్యూనికేషన్స్ నేతృత్వంలోని సంస్థలు నెక్స్ట్‌రేడియో యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్లలో ఎఫ్‌ఎం రేడియోను అందించేందుకు ప్రయత్నించాయి. స్ప్రింట్ కూడా తన ఫోన్లలో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అయితే మొబైల్ వినియోగదారుల నుంచి ఎఫ్‌ఎం రేడియోకు తగినంత డిమాండ్ లేదని నెట్‌వర్క్ సంస్థల ప్రతినిధి సీటీఐఏ పేర్కొంది. దీంతో ఈ ప్రయత్నాలకు క్రమంగా ఆదరణ తగ్గింది. 4జీ, 5జీ నెట్‌వర్క్‌లు వేగంగా విస్తరించడంతో పాటలు, వార్తలు, పాడ్‌కాస్ట్‌లు నేరుగా స్ట్రీమింగ్ యాప్‌లలో వినడం సులభమైంది. యూట్యూబ్, మ్యూజిక్ యాప్‌లు అందుబాటులోకి రావడంతో ఎఫ్‌ఎం రేడియో అవసరం చాలామందికి తగ్గిపోయింది. దీంతో ఫోన్ కంపెనీలు కూడా వేగవంతమైన నెట్‌వర్క్, స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఎఫ్‌ఎం రేడియో పనిచేయడానికి సాధారణంగా వైర్డ్ హెడ్‌ఫోన్స్ యాంటెన్నాలా పనిచేయాలి. కానీ ఇప్పుడు చాలా ఫోన్లలో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉండటం లేదు. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వాడకం పెరగడంతో ఎఫ్‌ఎం రేడియోను ఉపయోగించడం మరింత కష్టంగా మారింది. కొన్ని స్మార్ట్‌ఫోన్లలో ఎఫ్‌ఎం ట్యూనర్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ, సాఫ్ట్‌వేర్ ద్వారా దాన్ని డిసేబుల్ చేసి ఉండొచ్చు. శాంసంగ్ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎఫ్‌ఎం రేడియోను అందిస్తోంది. అంటే ఒకే ఫోన్ మోడల్‌లోనూ దేశాన్ని బట్టి ఈ ఫీచర్ అందుబాటులో ఉండొచ్చు లేదా లేకపోవచ్చు. ఫోన్‌లో స్పేస్, కరెంట్ వాడకం, తయారీ ఖర్చు వంటి అంశాలు కూడా కంపెనీలకు ముఖ్యమే. 5జీ, కెమెరాలు, పెద్ద బ్యాటరీలు, ఏఐ ఫీచర్లకు ప్రాధాన్యం పెరగడంతో ఎఫ్‌ఎం ట్యూనర్‌ను కొనసాగించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. అయినప్పటికీ ఇంటర్నెట్ లేకుండానే వార్తలు, సంగీతం వినే అవకాశం ఉండటం ఎఫ్‌ఎం ప్రత్యేకత. అందుకే కొన్ని మార్కెట్లలో ఈ ఫీచర్ ఇప్పటికీ కొనసాగుతోంది.

Simple Wave EV: రూ.1.10 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 243 కి.మీ రేంజ్‌!

Redmi 17 5G India Launch: సెప్టెంబర్ 3న లాంచ్.. 7,900mAh బ్యాటరీతో కొత్త ఫోన్
Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *