Skip to content
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss 10: Day5 బిగ్‌బాస్ 10: చైత్ర షాకింగ్ ఎలిమినేషన్.. అసలేంటి ట్విస్టులు?

నాలుగు రోజుల్లోనే రెండు ఎలిమినేషన్లు!

Bigg Boss 10: Day5 లో ఊహించని ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఐదో రోజుకే చరణ్ తర్వాత మరో కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగింది? టాస్క్ కోసం కొత్త రిస్క్! బిగ్‌బాస్ ఏడుగురిని సింపుల్ టాస్క్‌కు, ఇద్దరిని టఫ్ టాస్క్‌కు ఎంపిక చేయాలని చెప్పాడు. త్రిగుణ్, ముఖేశ్, కృష్ణుడు టఫ్ టాస్క్‌కు సిద్ధమయ్యారు. అయితే హై రిస్క్‌లో ఉన్న చైత్రను మాత్రం బిగ్‌బాస్ ఆడొద్దని ఆదేశించాడు. చివరకు సుధీర్, వర్షిణి టఫ్ టాస్క్‌కు ఎంపికయ్యారు. కేక్ స్మాష్ టాస్క్‌లో ఒకరు చేసిన పనిని మరొకరు చేశారని మిగతా కంటెస్టెంట్లను నమ్మించాలి. అయితే గేమ్‌లో జరిగిన విషయం బయటకు రావడంతో ఇద్దరూ హై రిస్క్‌లోకి వెళ్లారు.

రోహిత్, సృష్టి, షాలిని మధ్య ఏంటి కథ?

రోహిత్ తనతో మాట్లాడటం లేదని సృష్టి అమన్‌తో చెప్పింది. ఈ విషయం రోహిత్‌కి తెలియడంతో అతడు సృష్టితో మాట్లాడాడు. మరోవైపు షాలిని తన వల్లే వీరిద్దరి మధ్య దూరం పెరుగుతోందేమోనని బాధపడింది. దీంతో హౌస్‌లో ఈ ముగ్గురి వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

రాంప్రసాద్‌కు టాస్క్‌లో విజయం

కర్చీఫ్ వేసి పరుగెత్తి వచ్చి కూర్చునే సింపుల్ టాస్క్‌లో రాంప్రసాద్ విజేతగా నిలిచాడు. గెలుపు తర్వాత ఒక కంటెస్టెంట్‌ను హై రిస్క్‌లో పెట్టే అవకాశం అతడికి దక్కింది. రాంప్రసాద్ అమన్ పేరును సూచించాడు.

Bigg Boss 10: జబర్దస్త్ నరేష్ బిగ్ బాస్ 10 లో కి ఎలా అడుగు పెట్టాడు?

చైత్రకు మూడు ఓట్లు

హై రిస్క్‌లో చైత్ర, వర్షిణి, సుధీర్, అమన్ ఉన్నారు. వీరిలో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు కంటెస్టెంట్లకు ఓటింగ్ నిర్వహించారు. వర్షిణి, అమన్, సుధీర్.. ముగ్గురూ చైత్ర పేరే చెప్పారు.

చైత్ర షాకింగ్ ఎలిమినేషన్!

మూడు ఓట్లు రావడంతో చైత్ర బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. చైత్ర కూడా సుధీర్‌ను ఎలిమినేట్ చేయాలని ఓటు వేసింది. వారం కూడా పూర్తికాకముందే ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్లడంతో హౌస్‌లో షాక్ నెలకొంది.

వీకెండ్‌లో ఇంకెన్ని ట్విస్టులు?

చరణ్ తర్వాత చైత్ర కూడా ఎలిమినేట్ కావడంతో బిగ్‌బాస్ 10 ప్రారంభంలోనే ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇక వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు? ఇంకా ఎలాంటి ట్విస్టులు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.

OTT: Releases This Week: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ‘పంచనామా’ వరకు.. ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, సిరీస్‌లు ఇవే!

Studio One Plus

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *