MARKET UPDATE

SENSEX: 73,067.81, change ▲ +685.34 (+0.95%). Source Yahoo Finance, as of 06 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,776.10, change ▲ +220.35 (+0.98%). Source NSE, as of 06 Oct 2026 3:30 PM IST. GOLD 24K / 999: ₹1,48,473 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,36,001 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. SILVER 999: ₹2,22,820 / kg. Source IBJA, as of 06 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

Skip to content
వార్తలు

Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ చరిత్ర: 1980 నుంచి చంద్రబాబు, వైఎస్సార్, జగన్ వరకు ఎవరి పాత్ర ఎంత?

Image accompanying: Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ చరిత్ర: 1980 నుంచి చంద్రబాబు, వైఎస్సార్, జగన్ వరకు ఎవరి పాత్ర ఎంత?

Polavaram Project: పోలవరం పాజెక్ట్ చరిత్ర: 1980 లో బీజం పడితే మాది అంటే మాది అనే క్రెడిట్ చోరీ తెలుగుదేశం మధ్య, వై.సి.పి. మధ్య ఎందుకు జరుగుతున్నది. అసలు ఈ ప్రాజెక్ట్ లో బాబు పాత్ర ఏమిటి?రాజశేఖర రెడ్డి పాత్ర ఏమిటి? 46 సంవత్సారాల సుధీర్గ చరిత్ర ఉన్న ఈ ప్రాజెక్ట్ లో జగన్ పాత్ర ఎంత?

ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ గురించి అంతటా ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో చర్చ నడుస్తొంది. గతం లో పోలవరం ను వ్యతిరేకించవారు, అసలు పోలవరం నాట్ పాజిబుల్ అన్నవారు. ఎంతో మంది ఉన్నారు. అసలు పోలవరం ఒక జోక్ అయిపోయింది. ఇప్పుడు క్రెడిట్ చోరీ కి దారి తీసి మీంస్ ట్రోల్ అవుతున్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు. ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గర నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ వరకు ఈ ప్రాజెక్ట్ ను విమర్శించిన వారే. అయితే అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎవరు శంకుస్థాపన చేసారు, ఎవరు భూమి పూజ చేసారు. అసలు ఈ క్రెడిట్ తెలుగుదేశం పార్టీ దా లేక కాంగ్రెస్ పార్టీ దా లేక అసలు డిజైన్ నాకే అర్ధం కాలేదు ఇక మీకేం చెప్పను అన్న వై.సి.పి. క్రెడిటా…అనేది చూద్దాం.

Polavaram Project కు తొలిసారిగా 1980లో ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య శంకుస్థాపన చేశారు తరువాత 2004: ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో భూమిపూజ జరిగింది.2014: ఎన్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు. పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల లోకి కూడా విస్తరించి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా , పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం పూర్తయిన తర్వాత విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాక, విశాఖ మహానగరం తాగునీటి అవసరాలు, విశాఖపట్నం చుట్టుపక్కలనున్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు తీరుస్తుందని అంచనా. అంతేగాకుండా, విద్యుదుత్పత్తి, జలరవాణాలోని ఇబ్బందులను అధిగమించడానికి, చేపల పెంపకానికి ఉపయోగపడుతుంది.

ఈ పథకంలో భాగంగా 80 టి.ఎం.సీల గోదావరి నీళ్లని కృష్ణా నదిలోకి మళ్ళిస్తారు. మిగులు జలాలు అధికంగా ఉన్న నదుల నుండి నీటి కొరత ఉండే నదులకి నీటిని మళ్ళించే బృహత్ పథకం “గంగా – కావేరి నదుల అనుసంధానం” లో పోలవరం పథకం ఒక భాగం. ఇక్కడ గోదావరి మిగులు జలాలు ఉన్న నది. కృష్ణానది నీటి కొరత ఉన్న నది. పశ్చిమగోదావరి జిల్లాలోని రామాలపేట గ్రామం వద్ద, (రాజమండ్రి – కొవ్వూరు రోడ్డు నుండి 34 కి.మీ ల దూరం, ధవళేశ్వరం లోని కాటన్ ఆనకట్టకి 42 కి.మీ ఎగువన) నిర్మిస్తున్న ఈ పథకం అంచనా విలువ రూ. 16716 కోట్లు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ ప్రధానంగా వ్యవసాయాధారితమైంది. భారతదేశంలోని సగటు సాగుభూమి శాతం (22.2%), ఉత్తర ప్రదేశ్ సాగుభూమి శాతం (22%), పంజాబ్ సాగుభూమి శాతం (35%) తో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ సాగుభూమి శాతం (14%) చాలా తక్కువ. కాలువలద్వారా నీటిలభ్యత ఉన్న కృష్ణా-గోదావరి డెల్టాలలో 22 లక్షల ఎకరాలలోనూ, నాగార్జునసాగర్ ద్వారా నీటి లభ్యత ఉన్న నల్లగొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని 20 లక్షలలో మాత్రమే సాగు జరుగుతుంది. గోదావరికి ఎడమవైపునున్న తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలలోని మెట్టప్రాంతాలు, కుడివైపునున్న పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు గోదావరి తప్ప మరో నమ్మకమైన నీటివనరు లేదు. వర్షాలు సరిగా కురవని సమయాలలో కరువుకి గురవుతూ ఉన్నాయి. ఈ ప్రాంతాలలో ప్రవహించే ఏర్లు, నదులు పూర్తిగా వర్షాధారాలు అయినందున ఆధారపడదగినవి కావు. అందువలన ఈ ప్రాంతాలలో సాగుని ఆధారపడదగిన నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా పరిరక్షించాల్సి ఉంది. పోలవరం పథకం వలన మాత్రమే ఈ అనిశ్చిత పరిస్థితులు, ఈ ప్రాంతాల వెనుకబాటుతనం పోగలవు. పోలవరం అంధ్రప్రదేశ్ జీవనాధారంగా పిలువ బడ్తుంది. సర్ ఆర్థర్ కాటన్ భారతదేశపు నదుల అనుసంధానం గురించి ప్రాథమిక సూచనలు చేసినప్పటికీ, 1930-40 ల వరకూ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. 1941 లో, మద్రాసు రాష్ట్ర ప్రధాన ఇంజనీరు, దివాన్ బహుద్దూర్ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్, గోదావరి నది పైన పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించాడు. 1946-47లో ప్రఖ్యాత ఇంజనీరు కె.ఎల్ . రావు ఇచ్చిన నివేదికలో భద్రాద్రి రాముని పేరున “రామపాద సాగరం”గా పిలిచిన ప్రాజెక్టు వివరాలు ఇవి, 130.0 మీ ల గరిష్ఠ ఎత్తు ఉన్న ఆనకట్ట ఎడమ వైపు, విశాఖపట్నం ఓడరేవు వఱకూ, 209 కి.మీల పొడవైన కాలువ. కుడి వైపు, కృష్ణా నది వఱకూ 200 కి.మీ ల పొడవైన కాలువ. అటుపైన, గుండ్లకమ్మ నది వరకూ మరో 143 కి.మీ పొడవైన కాలువ. 150 మెగా వాట్ల సామర్థ్యం గల విద్యుతుత్పత్తి కేంద్రం.

పోలవరం ప్రాజెక్టులో భాగంగా, నదీ ప్రవాహానికి కుడివైపున ఒక స్పిల్ వే నిర్మిస్తారు. ఈ స్పిల్ వేకు అడ్డంగా 48 గేట్లతో ఒక బ్యారేజీని నిర్మిస్తారు. నది ప్రధాన ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మించి, ప్రవాహాన్ని కుడివైపున ఉన్న ఈ స్పిల్ వే లోకి మళ్ళిస్తారు. నది నుండి స్పిల్ వే వరకు అప్రోచ్ చానల్‌ను నిర్మిస్తారు. ఈ ఆనకట్టకు గేట్లుండవు. దీన్ని రాక్‌ఫిల్ డ్యామ్‌ అంటారు. ఈ నిర్మాణాలు పూర్తైన తరువాత నది పూర్తిగా ఈ స్పిల్ వే గుండానే ప్రవహిస్తుంది. ఈ నిర్మాణాల వివరాలివి స్పిల్ వే: 1,118.4 మీటర్ల పొడవుండే ఈ స్పిల్ వేకు 48 రేడియల్ గేట్లుంటాయి. వీటికి గరిష్ఠంగా 50 లక్షల క్యూసెక్కుల (49,96,934 క్యూసెక్కులు) నీటిని విడుదల చేసే సామర్థ్యం ఉంటుంది. నదీ ప్రవాహం అప్రోచ్ ఛానల్ ద్వారా, స్పిల్ వే గుండా ప్రవహించి, స్పిల్ చానల్ ద్వారా ప్రవహించి పైలట్ చానల్ ద్వారా తిరిగి నదిలో కలుస్తుంది. రాక్‌ఫిల్ డ్యామ్‌: 2454 మీటర్ల పొడవైన ఈ ఆనకట్ట గ్యాప్-1, గ్యాప్-2, గ్యాప్-3 అనే మూడు భాగాలుగా ఉంటుంది. గ్యాప్-1 భాగంలో ఆనకట్ట 25 మీటర్ల ఎత్తున, 584 మీటర్ల పొడవున ఉంటుంది. ఇంత కధ ఉన్నది కాబట్టే నీటి పారుదలా శాఖా మంత్రి అంబటి రాం బాబు కు అర్ధం కాలేదు.

Banana Papaya Combinationఅరటి–బొప్పాయి కలిపి తింటే ప్రమాదమా
Banana Papaya Combination: అరటి–బొప్పాయి కలిపి తినకూడదా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాదనలో నిజమెంత?

దీని నిర్మాణం 2025 ఏప్రిల్‌లో మొదలైంది. గ్యాప్-2 పొడవు 1400 మీటర్లు కాగా గ్యాప్-3 పొడవు 154 మీటర్లు ఉంటుంది. రాక్‌ఫిల్ డ్యాము నిర్మాణం కోసం నదీ ప్రవాహాన్ని తాత్కాలికంగా మళ్ళించేందుకు గాను ఎగువన ఒకటి, దిగువన ఒకటీ రెండు కాఫర్ డ్యాములను నిర్మిస్తారు. ఇవి తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే. రాక్‌ఫిల్ డ్యాముకు పునాదిగా నిలిచేందుకు ఈ డయాఫ్రం వాల్‌ను నిర్మిస్తారు. నది ప్రవాహానికి ఎడమ వైపున రాక్‌ఫిల్ డ్యాము పక్కనే విద్యుదుత్కేంద్రాన్ని నిర్మిస్తారు.

2004 లో ప్రారంభించబడి, 2015లో జాతీయ ప్రాజెక్టుగా చేయబడింది. 2017 జూన్ నాటికి పురోగతి క్రింది విధంగా ఉంది. రిజర్వాయర్ లో మట్టిపని 68%, కరకట్ట 9%, కుడికాలవ పనిలో మట్టిపని 100%, లైనింగ్ 81%, ఎడమకాలవ పనిలో మట్టిపని 87%, లైనింగ్ 62% పూర్తయ్యాయి. 2021 మే నెల నాటికి 42.5 మీటర్ల ఎత్తులో కాపర్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని ఇంజనీరింగ్‌ అధికారులు పూర్తి చేశారు, స్పిల్‌వే నుంచి 14 గేట్ల ద్వారా నీటి తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా నిధుల్లో గతంలో కోత పెట్టిన తాగునీటి విభాగం నిధులు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి శాఖ అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఎత్తిపోతల పథకాలు

పోలవరం పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది, కావున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్రం ప్రభుత్వం సొంత నిధులతో పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు (లిఫ్ట్ ఇరిగేషన్) చేపట్టింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరం మండలంలోని పట్టిసం వద్ద పోలవరం కుడికాలవకు నీరు తరలించడానికి నిర్మించారు. 2015లో దీని నిర్మాణం రూ. 1299 కోట్లు ఖర్చుతో పూర్తయింది. రూ.1,638 కోట్ల అంచనా వ్యయంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం 2017 ఆగస్టులో తొలి విడత పూర్తి అయింది. దీని ద్వారా ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి తరలిస్తారు.

అయితే ఈ పోలవరానికి కొన్ని లింక్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వాటిల్లో ఒకటి పోలవరం-బనక చర్లా ప్రాజెక్ట్ గోదావరి నదిలో వృధాగా సముద్రంలోకి పోయే వరద జలాలను రాయలసీమకు, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకూ తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టు, గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు. పోలవరం వద్ద గోదావరి నుండి వరద జలాలను ముందు కృష్ణానది లోకి, అక్కడి నుండి పలనాడు జిల్లా లోని బొల్లాపల్లి జలాశయానికీ, ఆ తరువాత అక్కడి నుండి బనకచర్ల జలాశయానికీ చేర్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. రూ 81,900 కోట్ల వ్యయంతో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును చేపట్టాలని 2025 లో ఆంధ్రప్రదేశ్ ప్రత్రిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా నదీ జలాలను గోదావరి బేసిన్ నుండి పెన్నా బేసిన్‌కు తరలిస్తారు. గోదావరిలో సగటున ఏటా 2 వేల టిఎంసిల నీళ్లు సముద్రం పాలైపోతున్నాయనీ, ఇందులో 200 టిఎంసిలను వరద సమయంలో మళ్లించేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనికి అభ్యంతరం చెప్పింది. 2025 జూన్ 30 న కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ ప్రాజెక్టును మొదటగా 2014 లో నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించాడు. 2024 లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక, అతను ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకుపోవాలని 2024 డిసెంబరులో ఆదేశాలు ఇచ్చాడు.
ఈ ప్రాజెక్టు మూడు విభాగాలుగా ఉంటుంది. పోలవరం వద్ద గోదావరి నుండి కృష్ణానదికి నీటిని తరలించడం మొదటి విభాగం. దీనికోసం పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుండి 38,000 క్యూసెక్కులకు పెంచుతారు. అలానే తాడిపూడి ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 1,400 క్యూసెక్కుల నుండి పది వేల క్యూసెక్కులకు పెంచుతారు. పోలవరం కుడి కాలువకు సమాంతరంగా 25 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కొత్తగా ఒక వరద కాలువను నిర్మిస్తారు. ఈ రెండు కాలువల ద్వారా గోదావరి వరద జలాలను వైకుంఠపురానికి మళ్లిస్తారు. ఈ విభాగానికి రూ.13,511 కోట్లు ఖర్చవుతుంది. ఈ విభాగంలో నిడివి సుమారు 175 కిలోమీటర్లు ఉంటుంది. ఈ విభాగంలో నీరు పూర్తిగా గ్రావిటీ ద్వారా ప్రవహిస్తుంది.

రెండవ విభాగంలో కృష్ణానది నుండి బొల్లాపల్లి జలాశయానికి నీళ్లు తరలించడం ఉంటుంది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది నుండి నీటిని తరలించి, నాగార్జున సాగర్‌ కుడి కాలువలో, దాని 80 వ కిలోమీటరు వద్ద కలుపుతారు. అక్కడి నుండి కాలువ 96.5 వ కిలోమీటరు వరకు ఈ కాలువ సామర్థ్యాన్ని పెంచి నీటిని తరలిస్తారు. కాలువ 96.5 కిలోమీటరు వద్ద ఈ నీటిని ఎత్తి పోసి, పల్నాడు జిల్లా బొల్లాపల్లి వద్ద నిర్మించే జలాశయం లోకి తరలిస్తారు. ఈ జలాశయాన్ని 150 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తారు. ఈ విభాగంలో నీటిని సుమారు 152 కిలోమీటర్ల వరకు తరలిస్తారు. దీనికి రూ.28,560 కోట్లు ఖర్చవుతుంది. ఈ విభాగంలో 6 చోట్ల లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోస్తారు.

మూడవ విభాగంలో బొల్లాపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటరుకు నీటిని తరలిస్తారు. బొల్లాపల్లి జలాశయం నుంచి నల్లమల అడవి గుండా సొరంగాల ద్వారా నీటిని బనకచర్ల రెగ్యులేటరుకు తరలిస్తారు. ఈ విభాగంలో ఓపెన్ కాలువలతో పాటు 20.50 కిలోమీటర్ల సొరంగం నిర్మిస్తారు. మరో 6.60 కిలోమీటర్ల దూరం జంట సొరంగరాలు నిర్మిస్తారు. ఆ తర్వాత 17 కిలోమీటర్ల దూరం పాటు పైప్ లైన్లు వేస్తారు. ఈ విభాగంలో నీటిని సుమారు 135 కిలోమీటర్లు తరలిస్తారు. ఈ విభాగానికి రూ.38.041 కోట్లు ఖర్చవుతుంది. ఈ విభాగంలో 3 చోట్ల లిఫ్టులు నిర్మించి, నీటిని ఎత్తిపోస్తారు.

British Airways Emergency Landing
British Airways Emergency Landing: 37 వేల అడుగుల నుంచి 9 వేల అడుగులకు దిగిన విమానం.. అసలేం జరిగింది?

ఇక మరొక లింక్ ప్రాజెక్ట్ పట్టిసీమ

పట్టిసీమ ఎత్తిపోతల పధకం గోదావరి, కృష్ణ నదులని అనుసంధానిస్తూ నిర్మించిన ఎత్తిపోతల పధకం. దేశ చరిత్రలో మొదటిసారిగా తలపెట్టిన వ్యయంలో ఎటువంటి పెంపు లేకుండా అనుకున్న సమయానికి పూర్తియి లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం పొందింది. పోలవరం రిజర్వాయరు ప్రాజెక్టుకు ఎక్కువ సమయం పట్టుతున్నందున రాష్ట్రప్రభుత్వం ఎత్తిపోతల పథకం ద్వారా త్వరగా నీరు అందించటానికి దీన్ని చేపట్టింది.

24 పంపులతో 7,476 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పంపింగ్ వ్యవస్థలు కలిగిన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఈ ప్రాజెక్టు గరిష్ట తరలింపు సామర్ధ్యం 240 చుమెచ్స్(క్యూబిక్ మీటర్ /సెకండ్). ఈ 24 పంపుల ద్వారా గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వలోకి ఎత్తిపోసి కృష్ణ డెల్టా రైతులకి లబ్ది చేకూర్చాలి అనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. బచావత్ ట్రిబ్యునల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కుదిరిన అంతరాష్ట్ర ఒప్పందం ప్రకారం 80 టంఛ్ ల గోదావరి నీటిని కృష్ణ నదిలోకి తరలించవచ్చు. ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు తొలి నాళ్ళలో ఎన్నో అవాంతరాలను ఎదురుకుంది. నీటి నిల్వ సామర్ధ్యం లేదు అంటూ ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం వై.సి.పి. దానిని తీవ్రంగా వ్యతిరేకించింది.

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, పురుషోత్తపట్నం గ్రామం వద్ద నిర్మించిన నీటి పారుదల ప్రాజెక్టు. ఇది గోదావరి నది నుండి పది పంపుల ద్వారా 3,500 క్యూసెక్కుల నీరును పోలవరం ఎడమ కాలువకు ఎత్తిపోస్తుంది.

పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర భూముల్లోకి పారేందుకు మార్గం సుగమమైంది. పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్ ఆన్ చేసి, పుడమి తల్లిని తడిపే గోదావరి తరంగాలకు ‘జల హారతి’ ఇచ్చి ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇంజనీరింగ్ అద్భుతంగా రూపొందిన ఈ కాలువ ద్వారా ఉగ్రరూప మెత్తే గోదావరి ప్రవాహం ఇకపై ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి దాహాన్ని తీర్చబోతోంది. తూర్పు కనుమల విసిరిన క్లిష్టమైన భౌగోళిక సవాళ్లను దాటుకుంటూ, రూ.4,192 కోట్ల భారీ వ్యయంతో 213 కిలోమీటర్ల మేర పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం పూర్తయింది. ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి అనేక నదులు, వాగులను దాటుకుంటూ ఈ కాలువ సాగుతుంది. ఇంజనీరింగ్ అద్భుతాలకు ప్రతీకగా కొన్ని చోట్ల నదీ ప్రవాహానికి ఎగువ నుంచి అక్విడెక్టులు, మరికొన్ని చోట్ల దిగువ నుంచి సైఫన్లు నిర్మించారు. ముఖ్యంగా పంపా నదిపై 30 మీటర్ల లోతులో 312 పైల్స్‌తో అక్విడెక్ట్, తాండవ నదిపై 10,634 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా 447 మీటర్ల పొడవున భారీ నిర్మాణాలు పూర్తి చేశారు. సోమవారం పోలవరం అనే నినాదాన్ని ప్రతి క్షణం తలుస్తూ వచ్చే సంవత్సరం కల్ల ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని చంద్ర బాబు సంకల్పించారు. సో చూసారు గా ఆలోచన వేరు అమలు చేయటం వేరు. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆలోచనలు చేసారు. కాని చంద్ర బాబు మాత్రమే అమలు చేస్తున్నారు.

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.