Skip to content
వార్తలు

Asha Worker Vacancies: 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం.. జిల్లాల వారిగా పోస్టులు..

Asha Worker Vacancies: గతం లో చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రైతు బజార్ లు, అంగన్వాడి లు, ఆశా వర్కర్ లను ప్రజా సేవ లో భాగం గా తీసుకు వచ్చారు. ఆశా వర్కర్ లు అయితే ప్రతి రోజూ ఇంటింటింకి తిరిగి వైద్య సేవలో మిళితం అయ్యారనే చెప్పాలి. అయితే గత కొన్ని సంవత్సరాలు గా అనేక పోస్ట్ లు ఖాళీ గా ఉన్నాయి. ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదెశ్ మహిళలకు శుభవార్త.. 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం.. జిల్లాల వారిగా పోస్టులు.. అర్హతలివే..

Asha Worker Vacancies : ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలు వెల్లడించారు. 913 పోస్టుల్లో 673 గ్రామీణ, 64 గిరిజన, 176 పట్టణ ప్రాంతాల్లో భర్తీ చేయనున్నట్లు చెప్పారు. దీంతో ఆశా వర్కర్స్ లో ఆశ మొదలైంది. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. పోస్టులకు దరఖాస్తు చేసుకొనే మహిళలు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక మహిళలకు ప్రాధాన్యం ఇవ్వంటం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకొనేవారి వయస్సు 25 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. ఒక్కో ఆశా కార్యకర్తకు నెలకు రూ.10వేల వేతనాన్ని ప్రభుత్వం అందించనుంది. నిబంధనలకు అనుగుణంగా ఈనెల 30వ తేదీ నాటికి నియామకాల జాబితాను పంపించాలని జిల్లా యంత్రాంగాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.

DSC: పై లోకేష్ వీడియో వైరల్

జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఇచ్చారంటే…

అనకాపల్లి జిల్లాలో 77, అనంతపురం జిల్లాలో 26, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 43, తూర్పుగోదావరి జిల్లాలో 44, పశ్చిమగోదావరి జిల్లాలో 42, కర్నూలు జిల్లాలో 65, ప్రకాశం జిల్లాలో 38, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో 38, అన్నమయ్య జిల్లాలో 41, చిత్తూరు జిల్లాలో 32, శ్రీ సత్యసాయి జిల్లాలో 22, నంద్యాల జిల్లాలో 21, తిరుపతి జిల్లాల్లో 21 ఆశా కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాల్లో 43, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో 32, పోలవరం జిల్లాలో 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా.. కృష్ణా జిల్లాలో 37, గుంటూరు జిల్లాలో 21, ఎన్టీఆర్‌ జిల్లాలో 15, బాపట్లలో 7, విశాఖపట్నం జిల్లాలో 33, పల్నాడు, జిల్లాలో 31, విజయనగరం జిల్లాల్లో 31, కాకినాడ జిల్లాలో 29, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో 29, ఏలూరు జిల్లాలో 27, మార్కాపురం జిల్లాలో 25, శ్రీకాకుళం జిల్లాల్లో 22 చొప్పున ఖాళీలు భర్తీ చేయనున్నారు.

Botsa: మళ్ళీ ఏడ్చిన బొత్స సత్యనారాయణ

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *