Balakrishna vs Nagarjuna: ఈ సారి ఎవరిది గెలుపు…
గతం లో చిరంజీవి, బాలకృష్ణ అలగే నాగార్జున వెంకటేష్ మధ్య గట్టి పోటీ ఉండేది. పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యేవి. పోటీ ఎంత తీవ్రంగా ఉండేదంటే సైకిల్ స్టాండ్ లు తగలపెట్టుకునేటంత. ఒకళ్ళ తలలు మరొకరు పగల కొట్టుకునే అంత. అయితె నాగార్జున, వెంకటేష్ ఫాన్స్ వాళ్ళ లాగే కూల్ గా ఉండేవారు కాని మరీ చిరంజీవి బాలయ్య ఫాన్స్ మధ్య మాత్రం రచ్చ రచ్చ గా ఉండేది. ఇప్పుడు బాలయ్య సినిమాకు నాగ్ సినిమాకు మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
దాదాపు 22 ఏళ్ల క్రితం క్రిస్మస్ సీజన్లో పోటీ పడిన బాలకృష్ణ, నాగార్జున.. ఇప్పుడు మరోసారి అదే పండగ సీజన్లో తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో 2004 బాక్సాఫీస్ లెక్కలు 2026లోనూ రిపీట్ అవుతాయా? అనే చర్చ మొదలైంది. 2004 క్రిస్మస్ సీజన్లో బాలకృష్ణ ‘విజయేంద్ర వర్మ’ అనే సినిమా విడుదల అయింది. నాగార్జున నటించిన ‘మాస్’ సినిమా కూడా అప్పుడే విడుదల అయింది. ఆ ఆరోగ్యకరమైన పోటీ లో నాగార్జున నటించిన ‘మాస్’ విన్నర్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ 22 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు సీనియర్ హీరోలు క్రిస్మస్ బరిలోకి దిగుతుండటంతో అప్పటి రిజల్ట్ మరోసారి గుర్తుకొస్తోంది.
బాలకృష్ణ ‘దాదా’ అనే మాస్ టైటిల్‌తో డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు ఉన్న మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. అయితే ఇప్పటికే వీరి కాంబినేషన్లో ‘వీరసింహారెడ్డి’ వంటి మాస్ సినిమా రావడంతో.. మరోసారి అదే జోన్లో బాలయ్యను చూడటానికి అభిమానులు ఎంతవరకు కనెక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు నాగార్జున తన కెరీర్లో 100వ సినిమాగా ‘కింగ్ 100’తో బరిలోకి దిగుతున్నారు. డిసెంబర్ 24నే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ నాగార్జునకు ప్రత్యేకంగా మారింది. కెరీర్లో ఒక మైలురాయిగా నిలవాల్సిన సినిమా కావడంతో అంచనాలతో పాటు ఒత్తిడి కూడా ఉంది. ఇలా వొత్తిడి ఉన్నప్పుడె చాలా మంది హీరోల 25వ,50వ,100వ చిత్రాలు ప్లాప్ అయ్యాయి.
బాలయ్యకు బలమైన మాస్ ఫ్యాన్ బేస్ ఉండగా.. నాగార్జునకు క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. దీంతో ఇద్దరు హీరోలకు తమదైన బలాలు ఉన్నాయి. ఇక ఇదే సీజన్‌ను బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కూడా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు తమిళ ఇండస్ట్రీ కూడా ఈ 24 న పోటీ పడనున్నది. దీంతో క్రిస్మస్ బాక్సాఫీస్ మరింత ఆసక్తికరంగా మారనుంది. అయితే హైప్లో ఎవరు ముందున్నారు అనేది కంటే.. మొదటి షో తర్వాత ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందన్నదే అసలు గేమ్‌ను మార్చే అంశం. కంటెంట్ క్లిక్ అయితే స్టార్ ఇమేజ్‌కు మరింత బలం చేకూరుతుంది. లేదంటే భారీ అంచనాలు కూడా కలెక్షన్లను కాపాడలేకపోవచ్చు. ఒకవైపు ‘దాదా’గా బాలయ్య మాస్ పవర్ చూపించబోతుంటే.. మరోవైపు ‘కింగ్ 100’తో నాగార్జున సెంటిమెంట్‌తో వస్తున్నారు. 22 ఏళ్ల క్రితం క్రిస్మస్ పోటీలో నాగ్ పైచేయి సాధించగా.. ఈసారి ఆ లెక్కను బాలయ్య మారుస్తారా? లేక నాగార్జున మరోసారి అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లేదంటే పిల్లి పిల్లి రొట్టె సామెత లాగా బాలీవుడ్, లేక తమిళ్ ఇండస్ట్రీ లాక్కపోతుందా చూడాలి…



