శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః 8వ తేదీ సెప్టెంబర్ నెల 2026వ సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు
Today’s Horoscope: మేషరాశి: మేషరాశి వారికి అనుకున్న పరిస్థితులు అనుకున్నట్టుగా వచ్చేటటువంటి పొజిషన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా అంటే ఏమీ కనబడబోవడం లేదు లాభస్థానంలో రాహువు గారు ఉంటూ ఉన్నప్పటికీ మిగతా విషయాలలో అంతగా శుక్రాచార్యుల వారి యొక్క స్థితి గాని గురువుగారి యొక్క స్థితి గాని అనుకూలత లేకపోవడంతో మేషరాశి వారికి చాలా ఇబ్బందులే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నా. నవగ్రహాలకి దానాలు చేయండి వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి ధన ఆదాయం అయితే బానే ఉంది అంతగా ఇబ్బంది లేని పరిస్థితే. పనే ధ్యేయం ప్రణాళిక కే జయం అన్నట్టుగా ముందరికి వెళ్లేటటువంటి ప్రయత్నాలు చేసుకోండి అని చెప్పి ఏలినాటి శని ప్రభావానికి గాను శని గారికి తైలాభిషేకం కూడా చేయించండి ఇష్టమ దేవత పూజ చేసి అలాగే స్తోత్ర పారాయణాలు చేసుకోండి.
వృషభ రాశి: వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అంటే తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారండి ఇక మిగతా వాళ్ళు ఎవరూ కూడా అనుకూలంగా లేరు సరే శని గారి యొక్క స్థితి సంచారము ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం వారు లాభస్థానంలో ఉన్నారని వారు ఇచ్చేటటువంటి ధనము అనే అనుగ్రహాన్ని మీకు ఇస్తున్నారు కానీ మీరు ఆ పరిస్థితుల్ని యక్సెప్ట్ చేయలేక చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ చెప్పవచ్చేది ఏంటంటే కుటుంబ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి మీ వ్యక్తిత్వ రీచ్య జాగ్రత్తగా ఉండాలి నిందారోపణలు పడకుండా ఉండాలి. అలాగే స్థిరచరాస్తుల వృద్ధికి ఇప్పుడు ఏమి ప్రయత్నాలు చేయకండి. ధనము ఎక్కువగా వెచ్చించకండి ఇది చాలా చాలా చెప్పదగిన సూచనగా తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ పారాయణ చేయండి అలాగే ప్రతినిత్యము లక్ష్మీ పూజ చేసుకోండి రాశ్యాధిపతే శుక్రాచార్యులు అవుతూ వారికి అధిదేవత దుర్గా అమ్మవారు కాబట్టి దుర్గా లలిత చండి కాళి ఇచ్చాది దేవతలు ఎవరివైనా సరే మీరు స్తోత్ర పారాయణాలు చదువుకోవచ్చు.
మిధున రాశి: మిధున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి కుజుడు కాస్త ఉద్రేక స్వభావాన్ని సూచిస్తూ ఉన్నాడు. కానీ ద్వితీయ స్థానంలో గురువుగారు బాగున్నారు తృతీయ స్థానంలో రవి కేతువులు బాగున్నారు చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు వెరసే నాలుగు వరుస రాశుల్లోనూ ఐదు గ్రహాల యొక్క అనుకూలత ఉంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే గ్రహ స్థితులు. కెమెరా ఫీల్డ్ కి సంబంధించినటువంటి వ్యవహారాలలో వీరికన్నా కూడా వీరి కింది వారే వీరిని చాలా బాగా చూసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిధున రాశి వారికి ధనాదాయం ఉంది కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారు చాలా బాగున్నారు. మరి తృతీయంలో బుధుడు బాగున్నారు ఇక వేరే ఇతరత్ర ఏ గ్రహాలైనా బాగున్నాయా అంటే రాశిలో ఉన్నటువంటి చంద్రుడు కూడా బాగున్నారు. ఇక్కడ చాలా బలమైన యోగం ఏర్పడి ఉన్నది. గజకేసరి యోగం రాశిలోనే ఏర్పడి ఉన్నది. విద్య బాగుంది ఉద్యోగం బాగుంది వ్యాపారం బాగుంది భార్యా భర్తల మధ్య అనుకూలత బాగుంది. అననుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నా కూడా వాటిని మీరు సమర్థవంతంగా దాటవేసుక కోగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి ఒకసారి యోగా చేసుకోండి అలాగే ఇష్టదేవత ఆరాధన చేయండి మరిన్ని మంచి ఫలితాలు మీకు ఉన్నాయి.
సింహరాశి: సింహరాశివారికి రాహు కేతువుల యొక్క స్థితి సంచారం గాన శనిగారి సంచారం గాన అలాగే రవి శుక్రుల సంచారం గాన అంతగా అనుకూలించబోవడం లేదు. ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాము గ్రహ స్థితులు బాలేదు ఓర్పుగా ఉండండి సంయమనం పాటించండి ఉద్యోగ జీవితంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార జీవితంలో జాగ్రత్తగా ఉండండి. మీ కోపం తో వ్యాపార భాగస్వాములతో గొడవలు పడకండి. జీవిత భాగస్వాములతో కూడా చాలా చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేని పక్షంలో మీకు చాలా చాలా వరకు అననుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం మీ మీద బాగా పనిచేస్తూ ఉంటుంది. వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి ప్రశాంతమైన జీవితానికి కి నాంది పలకండి రాహు కేతువుల పూజ చేసుకోవాలి శని గారికి తైలాభిషేకం చేసుకోవాలి ప్రతిరోజు ఏమి చెప్తున్నానో అవి తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తున్నానండి.
కన్యరాశి: కన్యారాశి వారికి షష్ట స్థానంలో ఉన్నటువంటి రాహువు చాలా బాగున్నారు అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు మూడు గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు చాలా ఆనందాన్ని తెచ్చిచ్చేటటు వంటి అంశాలే ఉండబోతూ ఉన్నాయి. కీడు చేసేటటువంటి గ్రహాల ఫలితాలు ఎప్పుడైతే చూపిస్తూ ఉన్నాయో ఈ మేలు చేసేటటువంటి గ్రహాల యొక్క దృష్టిలు గాని ఫలితాలు గాని కొంతవరకు మేలు చేస్తుంది ఆ మేలు మీకు ఇక్కడ కాస్త సంతృప్తి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే కన్యారాశి వారికి విజయావకాశాలు బాగా బాగున్నాయి పిత్రార్జితాలు చాలా బాగున్నాయి. కుటుంబ జీవితం చాలా బాగుంది. గురువుగారు ఇస్తున్నటువంటి లాభాలు కూడా చాలా బాగున్నాయి కానీ మిగతా విషయాలలో మటుకు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి ఇది చెప్పదగ్గ సూచన సప్తమ స్థానంలోనే శని గారు ఉండి మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టేస్తున్నారు. పబ్లిక్ రిలేషన్స్ బాగుండట్లేదు. ఇంటి ఇలవెలుపుని పూజించండి. ప్రశాంత చిత్తంతో ఉండండి.
తులా రాశి: తులా రాశి వారికి షష్ట స్థానంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రవి కేతువు బాగున్నారు. ఇక పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి రాశిలో ఉన్నటువంటి సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మీకు అనేక విధాలైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని మృష్టాన్న భోజనాల్ని వినోద కాలక్షేపాల్ని అన్నిటిని ఇస్తోంది. విజయావకాశాలని ఇస్తుంది ఉద్యోగంలో ఉన్నతిని ఇస్తోంది ఇలా ఎన్నో విధాలుగా మీకు ఆనందం చేకూర్చేటటువంటి పనులే జరుగుతున్నాయి. భార్యా భర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా అన్యోన్య త పెరుగుతుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మనశశాంతి పెరుగుతుంది.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారం చాలా బాగుంది దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి సంచారం బాగుంది అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది వెరసి నాలుగు గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చాలా మేలు చేస్తుంది అనే చెప్పాలి. ఇక్కడ మీ జీవితాశయం నెరవేరేటటువంటి పరిస్థితి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యాపార జీవితం బాగుంటుంది ఏ పని అయితే ప్రారంభించి ఉన్నారో ఆ పని సజావుగా జరగడమే కాదు విజయావకాశాలను కూడా అందిస్తుంది. ఏదైనా విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయడము దానిని భద్రం చేయడము చేస్తూ ఉంటారు. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారానికి కుజ శుక్రుల స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మరింతగా అనుకూలం
ధనస్సు రాశి: ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే తృతీయ స్థానంలో లో ఉన్నటువంటి రాహు గారి సంచారం చాలా బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఈ రెండు రాశుల యొక్క సంచారాలు ఈ రెండు గ్రహాలతోనూ చాలా బాగున్నాయి. కానీ రెండు గ్రహాలే బాగుండడం వల్ల మిగతా ఏడు గ్రహాల అననుకూలమైనటువంటి ఫలితాల వల్ల మీరు చాలా వరకు మానసిక శాంతిని పొందలేకపోతూ ఉంటారు. అయితే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. అయితే ఓర్పు కలిగి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పుని విడవకండి సంయమనంతో మీరు ప్రవర్తించేటటువంటి ప్రవర్తన మీకు అనేక విధాలైనటువంటి ఆనందాలను తెచ్చిస్తుంది. కాబట్టి మీరు ప్రశాంత జీవితాన్ని ఎంచుకోండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దక్షిణామూర్తి శ్లోకాలు పటించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
మకర రాశి: మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని గారు బాగున్నారు షష్ట స్థానంలో కుజుడు బాగున్నారు సప్తమ స్థానంలో గురు చంద్రులు బాగున్నారు అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి ఐదు గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగున్న కారణం చేత ఇక్కడ అనేక రకాలుగా మకర రాశి వారికి అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది పైగా యోగమయంగా ఉంది. ఉద్యోగంలో ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. అలాగే భార్యా భర్తల మధ్య అన్యోన్యత చాలా చాలా బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి వ్యాపారాలు బాగున్నాయి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి పెట్టిన పెట్టుబడులకి న్యాయం జరుగుతుంది లాభాలు బాగా ఎక్కువగా వస్తాయి మనోబలం పెరుగుతుంది. ప్రయాణాలు ఏవైనా దగ్గర ప్రయాణాలు బాగా లాభించేటటువంటి పరిస్థితి వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి. మీకు ఖచ్చితంగా విజయవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను.
కుంభరాశి :కుంభరాశి వారికి చాలా వరకు జాగ్రత్తలతో కూడి ఉన్న కాలమే కనిపిస్తుంది. షష్ట స్థానంలో చంద్రుని యొక్క సంచారము మాత్రమే బాగున్న కారణం చేత మిగతా గ్రహాల యొక్క ఉనికి అంత బాగా లేనందువల్ల నవమస్థానంలో శుక్రాచార్యుల వారుగా చాలా బాగున్నారు. అయితే ఇక్కడ గురు బలం లేదు. శనిగారి బలం లేదు రాహు బలం లేదు కేతువు బలం లేదు ఇలా నాలుగు రకాల బలహీనతల మధ్య స్వస్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారు ఏమంత ఎక్కువ ఫలితాలు ఇస్తారు అని చెప్పి మనం ఆశించాలి. అంతగా ఇవ్వకపోవచ్చు ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన ప్రతి అంశంలోనూ సంయమనాన్ని పాటించండి. ఎప్పుడైతే మీరు సంయమనాన్ని పాటించుకుంటూ వెళ్తారో అప్పుడు విజయం మీ వెనక పడుతుంది. శివారాధన చేయండి శనిగారికి తైలాభిషేకం చేయించండి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు అనేక రకాలుగా మానసిక ప్రశాంతత కలుగుతుంది.
మీనరాశి: మీన రాశి వారికి పంచమ స్థానంలోని గురువు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉండగా ఇక్కడ చంద్రుడు స్వస్థానంలో ఉంటూ గురువుగారితో కలిసి ఉన్నారు పంచమ స్థానంలో చంద్రుడు గొప్ప ఫలితాలను ఇవ్వబోరు కానీ ఇక్కడ కోణస్థానంలో గురువుగారితో కలసినటువంటి పంచమ అధిపతి పంచమ స్థానంలోనే ఇది చాలా అద్భుతమైన కలయక దీనివల్ల చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే షష్ట స్థానంలో రవి కేతువులు బాగున్నారు వెరసి మూడు గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పాలి. అయితే అష్టమ స్థానం వల్ల ఏదైనా పూర్వం లాస్ అయినటువంటి డబ్బులు ఇప్పుడు మీకు కొద్దిగా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భార్యా భర్తల అన్యోన్యత కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే షష్టస్థానం కూడా బాగా యోగిస్తున్న కారణం చేత మీకు ధనం అనేది చాలా చాలా సంతృప్తి కరంగా ఉండేటట్టుగా వస్తుంది. ఏలినాటి శని ప్రభావానికి శనిగారికి తైలాభిషేకం చేయించండి అలాగే శని గ్రహ స్తోత్రాలు
పటించండి వీలైనంతవరకు యోగా చేయండి మీకు చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి.




