Skip to content
MARKET UPDATE

SENSEX: 72,897.48, change ▼ −701.20 (−0.95%). Source Yahoo Finance, as of 28 Oct 2026 9:35 AM IST. NIFTY 50: 22,644.85, change ▼ −104.90 (−0.46%). Source NSE, as of 28 Oct 2026 9:48 AM IST. GOLD 24K / 999: ₹1,41,431 / 10g. Source IBJA, as of 27 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,29,551 / 10g. Source IBJA, as of 27 Oct 2026 PM IST. SILVER 999: ₹1,92,499 / kg. Source IBJA, as of 27 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

ఎంటర్‌టైన్‌మెంట్

Missing Meghana Movie : సెప్టెంబర్ 18న ‘మిస్సింగ్ మేఘన’.. క్లైమాక్స్ షాక్ ఇస్తుందంటున్న దర్శకుడు

Image accompanying: Missing Meghana Movie : సెప్టెంబర్ 18న ‘మిస్సింగ్ మేఘన’.. క్లైమాక్స్ షాక్ ఇస్తుందంటున్న దర్శకుడు

రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’ సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 150 థియేటర్లలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

‘మిస్సింగ్ మేఘన’లో ప్రధాన పాత్రలు వీరివే

ఈ సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన మూడు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్ర బృందం తెలిపింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ పాటలకు ఆదరణ లభిస్తోందని పేర్కొంది.

ఆర్.ఆర్. ధృవన్ సంగీతం.. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ

‘మిస్సింగ్ మేఘన’ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందించగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు.

సినిమా విజువల్స్‌కు మంచి స్పందన వస్తోందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటివరకు మూడు పాటలతో పాటు టీజర్‌ను విడుదల చేశామని, త్వరలోనే ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు వాచస్పతి తెలిపారు.

Rajinikanth jailer 2
Jailer 2 Box Office: రూ.666 కోట్లతో దూసుకెళ్తున్న రజనీకాంత్‌.. ‘2.ఓ’ రికార్డుకు ఇక రూ.25 కోట్లే దూరం!

సినిమా కంటెంట్ అనుకున్న విధంగా వచ్చిందని, బిజినెస్ పరంగా కూడా సంతృప్తిగా ఉన్నామని నిర్మాత పంచుమర్తి నరేష్ బాబు పేర్కొన్నారు.

వి.వి. వినాయక్ నుంచి దిల్ రాజు వరకు..

‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేశారు.

సినిమాలోని తొలి పాట **‘పిల్ల పిల్ల పిల్ల’**ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేయగా, రెండో పాటను నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. మూడో పాటను రచయిత, నిర్మాత కోన వెంకట్‌తో పాటు మచ్చ రవి విడుదల చేశారు.

“ఇది నార్మల్ థ్రిల్లర్ కాదు”

‘మిస్సింగ్ మేఘన’ సాధారణ థ్రిల్లర్ సినిమా కాదని దర్శకుడు వాచస్పతి చెబుతున్నారు. థ్రిల్లర్ జానర్‌లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులను కొత్తగా సర్‌ప్రైజ్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

“ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేశాం. దాదాపు రెండేళ్ల సమయాన్ని పెట్టాం. వచ్చి వెళ్లిపోయే సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేయలేదు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే హుక్ పాయింట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇది కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు.. ఒక ఎమోషనల్ థ్రిల్లర్” అని వాచస్పతి తెలిపారు.

Adarsha kutumbam vs itlu arjun
AK47:‘ఆదర్శ కుటుంబం’ కోసం ‘ఇట్లు అర్జున’కు ఎన్నిసార్లు అన్యాయం? చిన్న సినిమాలకు థియేటర్లలో చోటేది?

సినిమాపై తమకు ఉన్న నమ్మకంతోనే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మిస్సింగ్ మేఘన’ను విడుదల చేసేందుకు ముందుకు వచ్చిందని చిత్ర బృందం పేర్కొంది.

‘మిస్సింగ్ మేఘన’ క్యాస్ట్

రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు.

టెక్నికల్ టీమ్

నిర్మాత: పంచుమర్తి నరేష్ బాబు
కో-ప్రొడ్యూసర్: దివెళా శ్రీనివాస్ రావు
బ్యానర్లు: ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో
దర్శకత్వం: వాచస్పతి
కథ, స్క్రీన్‌ప్లే: వనరాజ్
సంభాషణలు: వెంకట్ బద్దిగం
సంగీతం: ఆర్.ఆర్. ధృవన్
ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్: బసవా
కొరియోగ్రఫీ: జేడీ, ఈశ్వర్ పెంటి
ఫైట్స్: రామకృష్ణ, స్టంట్ శంకర్
లిరిక్స్: ఆర్.ఆర్. ధృవన్, అలరాజు
అడిషనల్ స్క్రీన్‌ప్లే: శ్రీధర్ పరిగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: మద్దినేని హరికృష్ణ, కిషోర్ తోకల
పీఆర్వో: సోమిశెట్టి నాగేశ్వరరావు (SNR), తిరుమలశెట్టి వెంకటేష్

Studio One Plus

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.