Skip to content
వార్తలు

హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు బీభత్సం.. పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన బస్సు

హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని బాటసింగారం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన సమయంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు నేరుగా సమీపంలోని పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది.

DSC: పై లోకేష్ వీడియో వైరల్

ఈ క్రమంలో పెట్రోల్ బంక్‌లో ఉన్న కారు, ఆటోతో పాటు డీజిల్ పంపును కూడా బస్సు ఢీకొట్టింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *