శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల 2026వ సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు
Today’s Horoscope: నేటి దినఫలాలు
మేషరాశి: మేషరాశి వారికి ఏదైనా అనుకూలమైన కాలము వచ్చిందా అని అడిగితే ఒక్క షష్ట స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం మాత్రమే బాగుంది అని చెప్పొచ్చు అది కూడా శనిగారి యొక్క దృష్టిలో ఉన్నారు కుజుని యొక్క దృష్టిలో ఉన్నారు కాబట్టి అంత ఎక్కువగా ఫలితాలను ఇస్తున్నారు అని చెప్పడానికి రావడం లేదు. శని గారికి తైలాభిషేకం చేయండి. ఇలా చేసినందువల్ల కొంచెం గ్రహస్థితులు అనేవి మనము మార్చేటంతటి వాళ్ళం కాదు గానీ మనని అంతగా బాధించకుండా ఉంటాయి. రాహువు గారి సంచారం మీకు అనుకూలమే అయితూ ఉన్నప్పటికీ అంత ధనాదాయాన్ని ఊహించవద్దు, దానికన్నా మించి ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఈ ఖర్చులు మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నేను చెప్పినట్టుగా పరిహారాలు చేసుకుని ప్రశాంత జీవితంతో ఉండండి.
వృషభ రాశి: వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. శని గారు ప్రతిరోజు బాగున్నారు ఇంకా కొన్నాళ్ళ వరకు చాలా చాలా బాగుంటారు. ఈ అననుకూలత గురించి దిగులు పడకండి ధైర్యంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళండి ఆశ్రమ సేవ చేయండి గురువుగారి యొక్క ఆశీస్సులు తీసుకోండి లేదా ఆలయానికి వెళ్ళండి ఆలయ సేవ చేయండి భగవంతుని దర్శనం చేసుకోండి ఆలయ శుభ్రం చేయడం లాంటి సేవలు ఏవైనా చేయండి చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే రుణభారాలు కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ధన ఆదాయం మటుకు చాలా బాగుంది. భార్యా భర్తల అన్యోన్యత ఉద్యోగ జీవితం అంతంత మాత్ర ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి.
మిధున రాశి: మిధున రాశి వారికి చాలా అద్భుతమైన కాలం కనిపిస్తూ ఉందండి. ఎంతటి అద్భుతమైన కాలం అంటే ద్వితీయంలో గురువుగారి యొక్క సంచారము తృతీయంలో రవి కేతువుల యొక్క సంచారము చతుర్థంలో బుధుడు పంచమంలో శుక్రాచార్యుల వారు వెరసి ఐదు గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు. చాలా చాలా ఉన్నాయి ఉద్యోగ జీవితం బాగుంది వ్యాపార జీవితం బాగుంది తల్లిదండ్రుల ద్వారా బాగుంది. అయితే కొంచెం మానసికమైనటువంటి లేదా శారీరక పరమైనటువంటి రుగ్మతలు కనబడడానికి అవకాశం ఉంది. వాక్కు చాలా బాగుండి మీకు అదిఒక ఉన్నతిని ఇస్తోంది. కీర్తి ప్రతిష్టలు చాలా బాగున్నాయి ధన ఆదాయం అంతకన్నా ఎక్సలెంట్ గా ఉంది.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా బాగుందా అంటే నిజంగా అనేక విధాలుగా బాగుంది. మరి అనేక విధాలుగా ఇబ్బందులు ఉన్నాయా అంటే పరస్పరము శుభకరమైనటువంటి ఫలితాలు అలాగే వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ అంతగా మిగతా గ్రహాల యొక్క పరిస్థితి కనబడదు కానీ రాశిలో గురువుగారు ఒక అద్భుతం తృతీయంలో బుధుడు చాలా బాగున్నారు. ఈ రెండు గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి వీరితో పాటుగా రాశిలో చంద్రుని యొక్క సంచారం కూడా చాలా చాలా బాగుందండి ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన . శారీరక పరమైనటువంటి రుగ్మతలు లేదా మానసిక పరమైనటువంటి రుగ్మతలు మీకు ఉండడానికి అవకాశం ఉంది. శుక్రాచార్యుల వారు స్థిరచరాస్తుల వృద్ధిని సూచిస్తూ ఉన్నారు.
సింహరాశి: సింహరాశి వారికి ప్రతిరోజు మనము చెప్పుకుంటూ ఉన్నటువంటి గ్రహ స్థితులే ఈరోజు రోజు కూడా ఉంటూ ఉన్నాయి అయితే బుధుని యొక్క సంచారము ద్వితీయ స్థానంలోకి మారి ఉంది. ఇది ఒక శుభ పరిణామమే అయినప్పటికీ శని గారి యొక్క దృష్టిలో ఉన్న కారణం చేత వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం విషయంలో కూడా ఐకమత్యం అనేది తగ్గే విధంగా ఉంది. మీ వ్యక్తిత్వం మీద నిందలు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే పేరు ప్రఖ్యాతులు కొంచెం తగ్గే విధంగా కనిపిస్తుంది. దీనికి కారణం మీ మాట తీరు, గురువు లాంటి వారిని దూషించడం కూడా ఇందులో భాగమే. పబ్లిక్ రిలేషన్స్ అంత బాగా లేని విధంగా అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి అవాంతరాలకి మీరు కాస్త జంకేటటువంటి విధం కనిపిస్తోంది. ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నప్పటికీ అదే వ్యయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కొంచెం మీకు మానసికమైనటువంటి వ్యధని కలిగించే విధంగా ఉంది.
కన్యారాశి: కన్యారాశి వారికి రాశిలోనే బుధుని ఉచ్చస్థాన సంచారం జరుగుతుంది. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి, షష్టస్థానంలో రాహు గారి స్థితి, లాభస్థానంలో గురువుగారి యొక్క స్థితి, విరసి ఈ నాలుగు గ్రహాల యొక్క ఉనికి కూడా బాగుంది. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే నిజానికి రాశిలో ఉన్నటువంటి బుధుడు అద్భుతమైన ఫలితాలను ఏమి ఇవ్వరు. కానీ ఆయన ఉచ్చలో ఉన్నారు. తన రాశిని తాను ఎట్టి పరిస్థితుల్లో చెడగొట్టుకోరు అలాగే శని గారి దృష్టిలో ఉన్నారు కొంచెం ఈ శారీరక పరమైనటువంటి రుగ్మతలని ఆయన సూచన చేస్తూ ఉంటారు దీనికి మీరు ఔషధ సేవ చేయవలసి ఉంది. కుటుంబ జీవితం బాగుంటుంది. వాక్కు బాగుంటుంది. లాభస్థానము గజకేసరి యోగము రెండు గ్రహాల సంయోగం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధన లాభాలు కూడా పెరుగుతాయి. ఈ శని గారికి కూడా
తులా రాశి: తులా రాశి వారికి అనుకూలమైనటువంటి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యులవారు చాలా వరకు అద్భుతమైన ఫలితాలు అలాగే శని గారు షష్టంలో చాలా మంచి మంచి ఫలితాలు ఇక లాభస్థానంలో రవి కేతువులు ఇద్దరూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారండి. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే రాశిలో ఉన్నటువంటి శుక్రుడు శుక్రాచార్యుల వారు కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నారు. మీరు తక్కువ అభ్యాసం చేసినా మీకు ఎక్కువ ఫలితాలు వచ్చేటటువంటి రోజు ఈ రోజు అని చెప్పి తెలియజేస్తున్నానండి అలాగే ఊహించని విధంగా ధన లాభాలు కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటు వంటి గురువుగారి యొక్క సంచారము తన యొక్క ఉచ్చరాశిలో ఉంటూ ఐదవ దృష్టి చేత రాశిని పునీతం చేస్తూ వృశ్చిక రాశి వారికి అనేక రకాల వరాలను ఇస్తూ ఉన్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. దశమ స్థానంలో ఉన్నటువంటి రవి బుద్ధులు చాలా బాగున్నారు. రవిగారు దశమంలో అద్భుతమైనటువంటి ఉద్యోగ స్థితిని ఇస్తారండి. బుధదిత్య యోగం దశమంలో ఏర్పడడం వల్ల ఖచ్చితమైన ఉన్నతిని ఇక్కడ ప్రసాదిస్తున్నారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా అనేక రకాలుగా శుభాలను ఇస్తూ ఉన్నారు విలువైన వస్తువులని ఇస్తూ ఉన్నారు ఇక్కడ గురువుగారు బాగున్నారు శుక్రాచార్యులు బాగున్నారు. ఈ రెండు శుభగ్రహాల యొక్క శుభ ఫలితాలు కూడా వృశ్చిక రాశికి చాలా బాగున్నాయి.
ధనస్సు రాశి: ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు గారి సంచారం చాలా బాగుంది అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు మరి మిగతా గ్రహాల యొక్క కలయక బాగుందా అని అడిగితే అంతగా బాగలేదు ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోండి ముందుగా బాగున్న గ్రహ ఫలితాలు ఏమిటి అంటే అన్నదమ్ములతో సహాయ సహకారాల విషయంలో మీకు చాలా వరకు దృఢమైనటువంటి ఒక ఆలోచన ఉంటుంది. నా అన్నదమ్ములు నాకు కచ్చితంగా సహాయం చేస్తారని మీ ఆలోచన నెరవేరుతుంది. లాభాల బాటలో ఉన్నారు. కుటుంబ జీవితం బాగుంది అన్న మాటే గాని చాలా బాగుంది అని చెప్పడానికి రాదు. కీర్తి ప్రతిష్టల విషయంలో పూర్వం కన్నా కొంచెం తగ్గే విధంగా ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో సాధారణ స్థితికి వచ్చారు మీరు అని చెప్పి తెలియజేస్తున్నానండి. దక్షిణామూర్తి శ్లోకాలని పటించడం ద్వారా మీ ఇష్ట దేవతని పూజించడం ద్వారా మీకు మరింతగా మనశశాంతి కలుగుతుంది.
మకర రాశి: మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు. ఇక షష్ట స్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు సప్తమ స్థానంలో గురు చంద్రులు బాగున్నారు దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. సంఘంలో పరపతి పరువు ప్రతిష్టని ఇస్తుంది ఆదాయ మార్గాన్ని ఇస్తుంది. అనేక విధాల సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తోంది శుభకార్యాల పరంపర ఇంట ఉండడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా మంచి హోదా మీకు పెరిగే గేటటువంటి పరిస్థితి ఉన్నతి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ జీవితాశయం నెరవేరే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి.
కుంభరాశి: కుంభరాశి వారికి షష్టస్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచార కారణం చేత గజకేసరి యోగం ఒకటి ఏర్పడింది. అయితే షష్టస్థానంలో గురువుగారి యొక్క సంచారం అంత మేలైన ఫలితాలను ఇవ్వదు అయినప్పటికీ కూడా ఈ రెంటి గ్రహాల కలయిక చాలా మంచిది. మీకు రుణభారాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కూడా చాలా బాగుంది. అనుకోకుండా వచ్చేటటువంటి అనర్థాలు ఏవైనా ఉన్నాయా అంటే వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతారు. శత్రువుల సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంది. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు పాటించండి.
మీనరాశి: మీన రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా షష్ట స్థానంలో రవి కేతువుల యొక్క స్థితి సంచారము జరుగుతూ ఉన్నది ఇది బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. కర్కాటక రాశిలో గురువుగారితో పాటు చంద్రుడు కూడా ఉన్నారు. చంద్రుని యొక్క రాశి కూడా కర్కాటక రాశి అవ్వడం చేత స్వస్థానంలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి ఈ గజకేసరి యోగము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఇది చాలా చాలా చాలా మేలైనటువంటి శుభప్రదమైనటువంటి శుభ పరిణామం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ధన లాభాలు ఉంటాయి. శత్రువులు తగ్గిపోతారు అనేక విధాలుగా మీకు లాభకరమైనటువంటి ధన లాభాలు గాని వస్త్ర లాభాలు గాని వస్తు లాభాలు గాని ఇలా వచ్చేటటువంటి అవకాశం ఉంది. విలువైన వస్తువుల్ని సేకరించుకోగలుగుతారు. నవధాన్యాలు దానం ఇవ్వండి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ప్రశాంత జీవితంతో ఉండడానికి ప్రయత్నం చేయండి అనేక రకాల అధికమైనటువంటి ఆత్మ సంతృప్తి లభిస్తుంది. శుభం సర్వేజనా సుఖిన భవంతు




