26 date disasters:: ప్రకృతి విపత్తులు ఏర్పడటం సహజం కాని అవి ఒకే తేదీన లేక ఒకే వరం సంభవిస్తే?….అసలు ప్రళయాలకి 26 వ తేదీకి సంబంధం ఏమిటి? ఇది కాఖతాళీయమా లేక మరేదైనా? అసలు 26 వ తేదీన ఏమేమి సంఘటనలు జరిగాయో చూద్దాం….నవంబర్ 26, 2008 లో ఉగ్రదాడి దీన్ని 26/11 (26/11 mumbai attacks) అని పిలుస్తారు పాకిస్తాన్ ఉగ్ర వాదులు ముంబై నగరం లో జరిపిన ఉగ్ర దాడుల్లో దాదాపు 166 మంది చనిపోయారు. ఇది ఇప్పటికి మర్చిపోలేని సంఘటన, ఇక 26 జుల్య్ 2005 లో ముంబై లో ఒక్క రోజులో నే 944 మి.మి. ల వర్షం కురిసి 1090 మంది కి పైగా చనిపోయారు. అంతెందుకు రీసెంట్ గా నేపాల్ లో వచ్చిన వరదలు తీసుకుంటే 26 ఆగస్ట్ న వచ్చిన వరదలు కొన్ని వేలమంది చనిపోయారు. డిసెంబర్ 26 వతేది 2004 లో వచ్చిన సునామి. ఎక్కడో ఇండోనేషియా లో వచ్చిన సునామి భారత్ తో పాటు అనేక దేశాలను ముంచెత్తింది ఏకంగా 2.28 లక్షల మంది మృతిచెందారు. అలాగే 26 జనవరి 2001 లో గుజరాత్ (Gujarath) భూకంపం. ఈ భూకంపం వలన సుమారు 25 వేల మంది చనిపోయారు. ఇక 26 డెసెంబర్ 2003 లో ఇరాన్ భూకంపం వచ్చింది ఈ భూకంపం ధాటికి సుమారు 30 వేలమంది చనిపోయారు. 26 అక్టోబర్ 2015 లో హిందూకుష్ లో వచ్చిన భూకంపం లో భారత్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ లలో సుమారు 500 మంది చనిపోయారు. ఇక పూర్వం అంటే కొన్ని దశాబ్దాల హిస్టరీ తీసుకుంటే 1986 లో ప్రపంచ చరిత్ర లోనే జరిగిన విపత్తు ఈ విపత్తు 26 ఏప్రిల్ 1986 లో చెరోబిల్ విపత్తు సంభవించింది ఇందులో కూడా అనేకమంది చనిపోయారు. సహజంగానే 13 వతేదీని డెత్ నెంబర్ అని పిలుస్తారు. కాని ఇప్పుడు దాన్ని డబల్ చేస్తే వచ్చే తేదేనే 26 ఇది కూడా ఇక దీన్నే శాపగ్రస్త రోజులుగా అభివర్ణించాలేమో…ఎందుకు 26 నే ఇవి జరుగుతున్నాయి అంటే సంఖ్యా శాస్త్రం ప్రకారం 2 మరుయు 6 ను కూడితే 8 వస్తుంది. ఈ 8 శని గ్రహానికి ప్రతీక. అంటే ఇక్కడ శని దేవుడిని ఏదో విలన్ లా చూడనవసరం లేదు. శని కర్మ కారకుడు మనం చేసిన పనులకు సరైన మార్గం లో పెట్టే ప్రభువు. మనం ప్రకృతి ని పాడు చేస్తున్నం, మరి అలాంటింది భగవంతుడు సృష్టించిన ప్రకృతిని మనం నాశనం చేస్తే ఆ శని దేవుడు ఊరుకుంటాడా ఇలాంటివన్ని సృష్టిస్తాడు. ఇదే 26 వ తేదీ, 13 వ తేదీన అనేక మంచి సంఘటనలు జరిగాయి. అనేక మంది మహాను భావులు జన్మించారు. అంటే ఇది కర్మాను సారం జరిగేదే…మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఇదే కర్మ సిద్ధాంతం. అంతెందుకు పెద్ద పెద్ద స్కాం లు వెంకటేశ్వర స్వామి నిజ రూప దర్శనం రోజునే బయట పడ్డాయి అని అంటారు. ఏది నిజమైనా ఏది అబద్ధమైనా ఇందులో ఉన్న కామన్ పాయింటే ఏమిటంటే మనం మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది అది ప్రకృతికైనా, మనుషులకైనా….ఏది ఏమైనా ఇది నమ్మకానికి సంబంధించినది మాత్రమే…కొంతమంది నమ్మ వచ్చు లేక కొట్టి పారేయవచ్చు.
26 date disasters: 26 వ తేదీనే ప్రళయాలు ఎందుకు వస్తున్నాయి?

Studio One News
Follow our WhatsApp Channel for Latest News



