Skip to content
భక్తి

Funerals: ఆడవాళ్ళకు అంత్యక్రియలు చేసే అర్హత లేదా?

ఆడవాళ్ళు అంత్యక్రియలు ఎందుకు చేయకూడదు?

Suta Maharshi: ప్రతి పురాణంలో ‘సూత మహర్షి చెప్పెను’ అంటారు.. అసలు ఆయన ఎవరు?

Funerals: ఆడవాళ్ళకు అంత్యక్రియలు చేసే అర్హత లేదా? స్త్రీలు పిండ ప్రదానం చేయకూడదా? దీని గురించి మన శాస్త్రాలు ఏమి చెపుతున్నాయి. గరుడ పురాణం ప్రేత కల్పం ప్రకారం ఆ కుటుంబం లో కొడుకు కాని, తండ్రి కాని, మనవడు కాని లేక పోతే స్త్రీ అంత్య క్రియలు నిర్వహించ వచ్చు అని చెపుతున్నది. అసలు ప్రేత కల్పం అంటె ఏమిటంటే మానవుడు మరణించిన తర్వాత ఆత్మ ఏ స్థితిని పొందుతుంది, ఏ కర్మల వల్ల ఏ లోకాలకు వెళ్తుంది, మరియు ప్రేత లోకం (ఆత్మలు తిరిగే స్థితి) నుండి విముక్తి ఎలా లభిస్తుందో వివరించే భాగమే ప్రేత కల్పం. ఒక ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు, ఆ ఆత్మకు సద్గతి కలగడం కోసం మొదటి 10 నుంచి 13 రోజుల పాటు ఈ భాగాన్ని చదవడం లేదా వినడం హిందూ సంప్రదాయంలో ఆచారంగా వస్తోంది. దీని వలన మనకు ఒక సందేహం రావచ్చు, ముందు మగవారి కంటే ఆడవారే పిండ ప్రదానం చేయవచ్చు కదా అని….దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది స్త్రీ హృదయం చాలా బలహీనమైనది, స్మశానం లో జరిగే ఆ హృదయ వికారమైన సంఘటనలు తట్టుకోలేదు. రెందవది గర్భ ధారణ అలాగే నెలసరి. నెలసరి వస్తే దోషం గా భావిస్తారు మన వాళ్ళు. అలాగే ఆ స్త్రీ బిడ్డకు పాలు ఇస్తుంది ఆ స్మశానం లో జరిగే క్రియలు నెగిటివ్ యనర్జీని ప్రేరేపిస్తాయి తద్వారా బిడ్డకు ఆ నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉన్నది. మరోక విషయం ఏమిటంటే వివాహం అయిన కూతురు గోత్రం మారుతుంది. అంటే పుట్టింటి వారి గోత్రం తెగిపోతుంది. ఎందుకంటే స్త్రీ వివాహం అయిన తరువాత భర్త గోత్రం తీసుకుంటుంది. కాని కుమారుడు పుట్టుకతో నే పిత్రు ఋణం తో పుడతాడు. అలాగే ఆ వంశాన్ని, గోత్రాన్ని ముందుకు తీసుకెళ్ళే బాధ్యత ను తీసుకుంటాదు. అంతే కాదు అంత్య క్రియలు అయిన తారువాత పాతించే నియమాలు చాలా ఖటినం గా ఉంటాయి. గుండు గీయించుకోవడం, నిత్య కర్మ లో భాగంగా రోజుకు 4 నుచి 5 సార్లు నదీ స్నానాలు చేయాల్సి వస్తుంది. కాని స్త్రీ కి నెలసరి మధ్యలో వస్తే నిత్య కర్మ కు పనికి రాదు. అలాగే చంటి బిడ్డల పోషణ కూడా కష్టం గా మారుతుంది. అంతే కాని ఇక్కడ ఆడవారిని తక్కువ చేసి చూడమని మన సాంప్రదాయం చెప్పటం లేదు. ఆ కుటుంబం లో మగ వారు లేక పోతే, నెలసరులు ఎండిపోతే చిన్న పిల్లలు లేక పోతే ఆమె ఆ క్రతువును నిర్వహించ వచ్చు. అని శాస్త్రం చెపుతుంది. అల్లుడు కూడా ఈ వరసలో చివరి వాడే అని శాస్త్రం చెపుతున్నది.

Polala Amavasya: పోలాల అమావాస్య అంటే ఏమిటి? కందమొక్కనే ఎందుకు పూజిస్తారు?

Ravinuthala Bhakti

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *