Skip to content
భక్తి

Vinayaka Patri vs Science: వినాయక పత్రి vs సైన్స్

Vinayaka Patri vs Science: వినాయక పూజలో ఉపయోగించే ఏకవింశతి పత్రి (మాచపత్రి, గరిక, జిల్లేడు, ఉమ్మెత్త మొదలైనవి) సాధారణ ఆకులు కావు, అన్నీ శక్తివంతమైన ఆయుర్వేద ఔషధ గుణాలున్న మొక్కలే. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, క్రిమికీటకాలను తరిమికొట్టే శక్తి ఈ ఆకుల సుగంధం మరియు వాటి నుంచి వెలువడే వాయువులకు ఉంటుంది. పత్రిని సేకరించేటప్పుడు, పూజ సమయంలో వాటిని తాకడం వల్ల ఆకులలోని తైల గుణాలు చర్మం ద్వారా శరీరానికి అంది ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పత్రిని పూజా తరువాత నీటిలో నిమజ్జనం చేయడం వల్ల, ఆ నీటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది, నీరు శుభ్రపడటంతో పాటు ప్రాణవాయువు (ఓక్ష్య్గెన్) శాతం పెరుగుతుంది.

Suta Maharshi: ప్రతి పురాణంలో ‘సూత మహర్షి చెప్పెను’ అంటారు.. అసలు ఆయన ఎవరు?
  1. మాచిపత్రి Artemisia vulgaris – ఇది చామంతి జాతికి చెందినది. సువాసన గల ఆకులు; మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే తిమ్మిర్లు, నొప్పులను తగ్గించడానికి మరియు రుతుస్రావాన్ని క్రమబద్ధం చేయడానికి ఇది సహాయపడుతుంది. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పిల్లల్లో వచ్చే మూర్ఛ, ఫిట్స్ మరియు హిస్టీరియా వంటి సమస్యల నివారణలో దీనిని సాంప్రదాయ వైద్యంలో వాడతారు. కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో దీనిని ఒక సంభావ్య క్యాన్సర్ నిరోధక మూలికగా పరిశీలిస్తున్నారు.
  2. బృహతీ పత్రం Solanum indicum – కంటకారి లేదా వాకుడు దగ్గు, జలుబు, ఆస్తమా (ఉబ్బసం) మరియు గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచి, ఆకలిని పెంచుతుంది. కడుపులో గ్యాస్ మరియు మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది.
    కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, సాధారణ జ్వరాల నుండి ఉపశమనం ఇస్తుంది
  3. బిల్వ పత్రం Aegle marmelos – శివారాధనలో ప్రసిద్ధి; జీర్ణక్రియకు సంబంధించిన సంప్రదాయ వినియోగాలు ఉన్నాయి. అంతే కాదు బిల్వ పత్రాన్ని నీరెండలో పెట్టి పొడి చేసి రోజూ మనం త్రాగే నీటితో తీసుకుంటే షుగర్ వ్యాధి తగ్గుతుంది. దీని ఆకులు మరియు పండ్లలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి, ఇవి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి.
  4. దూర్వా / గరిక Cynodont dactyl on – గణపతికి అత్యంత ప్రీతికరమని నమ్మకం; గరిక రసం తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు మరియు వ్యర్థాలు బయటకు పోతాయి. ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి, ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది శరీరంలో వాపులు మరియు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో దీనిని సైనోడాన్ డాక్టిలాన్ (ధుర్వ) రక్తస్రావాన్ని అరికట్టేందుకు ఉపయోగిస్తారు.
  5. దత్తూర పత్రం Datura metel – ఉమ్మెత్త వీటి కాయలు ముళ్ళ ముళ్ళ గా ఉంటాయి. పూజలో ఉపయోగిస్తారు; ఇది విషపూరిత మొక్క కావడంతో ఔషధంగా స్వయంగా వాడకూడదు. ఉమ్మెత్త ఆకులకు నువ్వుల నూనె రాసి, కొద్దిగా వేడి చేసి నొప్పులు ఉన్న చోట కట్టుకుంటే కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు మరియు వాపులు వెంటనే తగ్గుతాయి. దీని ఆకులను లేదా బాహ్య ప్రయోగాలను ఆయుర్వేదంలో తలనొప్పి ఉపశమనం కోసం సూచిస్తారు. చర్మ సమస్యలు మరియు జ్వరం వంటి వాటి నివారణకు శుద్ధి చేసిన తర్వాత దీనిని బాహ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఉమ్మెత్త ఆకులను మరుగుతున్న కొబ్బరి నూనెలో వేసి కాచి, ఆ నూనెను తలకు రాస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది
  6. బదరీ పత్రం / రేగు ఆకులు Ziziphus jujuba – రేగు పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. రేగు పండ్లకు మెదడును, నాడీ వ్యవస్థను శాంతపరిచే గుణం ఉంది. ఇది ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మంచి నిద్ర పట్టేలా సహాయపడుతుంది. వీటిలో ఐరన్, పాస్ఫరస్ మరియు కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత (Anemia) సమస్యను దూరం చేస్తాయి. రేగు పండ్లలో డైటరీ ఫైబర్ (పీచు పదార్థం) అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గించి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. వీటిలో ఉండే పొటాషియం మరియు రక్త ప్రసరణను మెరుగుపరిచే గుణాలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించి, రక్తపోటును (Blood Pressure) నియంత్రణలో ఉంచుతాయి. రేగు పండ్లలో కాల్షియం, పాస్ఫరస్, ఐరన్ ఉండటం వల్ల ఎముకలు బలంగా మారడానికి సహాయపడతాయి. రేగు పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో మరియు ముడతలు రాకుండా నివారించడంలో సహాయపడతాయి
  7. అపామార్గ పత్రం / ఉత్తరేణి Achyranthes aspera – ఉత్తరేణి కాడలతో పళ్ళు తోముకోవడం వల్ల పంటి నొప్పి, చిగుళ్ల వాపు మరియు నోటి దుర్వాసన తగ్గుతాయి. దీని ఆకులు లేదా వేర్ల పేస్ట్‌ను కీళ్ల నొప్పులు మరియు వాపులు ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది. ఉత్తరేణి ఆకుల రసం కడుపు నొప్పి, అజీర్తి మరియు మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగించి, మూత్రపిండాల (Kidneys) పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చిన్నపాటి గాయాలు, పుండ్లు త్వరగా మానడానికి ఉత్తరేణి ఆకుల రసం ఉపయోగపడుతుంది.
  8. తులసి Ocimum Sanctum –తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఇది ఒక సహజమైన అడాప్టోజెన్. మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. దగ్గు, జలుబు, ఆస్తమా మరియు గొంతు నొప్పి వంటి సమస్యలకు తులసి ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమలడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది మరియు పొత్తికడపు సమస్యలు తగ్గుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అజమాయిషీ చేయడంలో తులసి సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
  9. చూత పత్రం / మామిడి ఆకులు Mangifera Indica – పూజల్లో శుభప్రదంగా భావిస్తారు; ఇంటి ద్వారాలకు తోరణాలుగా వాడే సంప్రదాయం ఉంది. ఇది ఆక్సిజన్ ఇస్తుంది. అందుకే గుమ్మలకు కడతారు.మామిడి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.ఇవి రక్తపోటును (High BP) తగ్గించడంలో మరియు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి. ఆయుర్వేదంలో మామిడి బెరడు, గింజలు మరియు పూలు వివిధ రకాల అనారోగ్య సమస్యల నివారణకు ఉపయోగిస్తారు. ఇది యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ డయాబెటిక్ గుణాలను కలిగి ఉంది.
  10. కరవీర పత్రం / గన్నేరు Nerium Odorum / Nerium oleander – పూజలో ఉపయోగిస్తారు; మొక్కలోని కొన్ని భాగాలు విషపూరితమైనవి, ఇది వైద్యుని సలహామేరకు మాత్రమే వాడాలి. ఆయుర్వేదంలో ఉపయోగించే ఒక విషపూరితమైన, అయినప్పటికీ ఔషధ గుణాలున్న మూలికా మొక్క. ఇది విషపూరితమైనప్పటికీ, జాగ్రత్తగా మరియు సూచించిన పద్ధతులలో ఉపయోగించినప్పుడు దీనికి చికిత్సా ప్రయోజనాలు ఉన్నాయి. విష కీటకాల కాటు మరియు కొన్ని చర్మ వ్యాధుల చికిత్సలో కరవీరను పైపూతగా వాడమని సూచిస్తారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో, కరవీరను క్రియాత్మక గుండె రుగ్మతలు, గుండె బలహీనత మరియు వివిధ చర్మ వ్యాధుల నిర్వహణలో కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క యొక్క కాండం, ఆకులు మరియు పువ్వులలో కార్డియాక్ గ్లైకోసైడ్లు ఉంటాyi
  11. విష్ణుక్రాంత పత్రం Evolvulus alsinoides – సంప్రదాయంగా జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతతకు సంబంధించిన ఆయుర్వేద వినియోగాలు చెప్పబడతాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడానికి, జ్ఞాపకశక్తిని మరియు ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి ప్రశాంతతను చేకూరుస్తుంది. సరిగ్గా నిద్రపట్టని సమస్యను (నిద్రలేమి) నివారిస్తుంది. దీని ఆకులను ఎండబెట్టి మండించి, ఆ పొగను పీల్చడం ద్వారా ఆస్తమా (దగ్గు, ఆయాసం) వ్యాధి లక్షణాలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతుంది. మూత్రంలో మంట (డైసూరియా), దంతాల సమస్యలు (పియోరియా) వంటి వాటికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది
  12. దాడిమ పత్రం / దానిమ్మ ఆకులు Punica granatum – నిద్రలేమి (Insomnia) సమస్యకు నివారణ అజీర్ణం, గ్యాస్, కడుపునొప్పి, మరియు మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి దానిమ్మ ఆకుల రసం మేలు చేస్తుంది. ఇది పొట్టలోని అసౌకర్యాన్ని తొలగించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. విరేచనాలు (Diarrhea) లేదా అజీర్తి ఉన్నప్పుడు రోజుకు రెండు టీస్పూన్ల దానిమ్మ ఆకుల రసం లేదా ఈ ఆకులతో చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. నోటిలో బ్యాక్టీరియాను నశింపజేయడంలో దానిమ్మ ఆకులు బాగా ఉపయోగపడతాయి. దానిమ్మ ఆకుల రసాన్ని కొద్దిగా నీటిలో కలిపి, ఆ నీటితో రోజుకు రెండు మూడు సార్లు పుక్కిలిస్తే (Gargling) నోటి సమస్యలు త్వరగా నయమవుతాయి. ఈ ఆకులలో ఉండే విటమిన్ సి మరియు యాంటీమైక్రోబియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, మరియు గొంతు నొప్పి నివారణకు దానిమ్మ ఆకులను నీటిలో మరిగించి కషాయంలా రోజుకు రెండు సార్లు తాగాలి. చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో మరియు చర్మ రోగాల నివారణలో దానిమ్మ ఆకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. చెవి ఇన్ఫెక్షన్ లేదా చెవి నొప్పితో బాధపడేవారికి కూడా ఆయుర్వేదంలో దీనిని ఒక హోమ్ రెమెడీగా చెబుతారు. దానిమ్మ ఆకుల రసంలో కొద్దిగా నువ్వుల నూనె లేదా ఆవ నూనె కలిపి, ఆ మిశ్రమాన్ని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే నొప్పి తగ్గుతుంది. దానిమ్మ ఆకులను అంతర్గతంగా (రసం లేదా కషాయం రూపంలో) తీసుకునేటప్పుడు పరిమితికి మించి తీసుకోకూడదు.
  13. దేవదారు పత్రం Cedrus deodara – కంటి, మెదడు ఆరోగ్యానికి: దేవదారు ఆకులను ఎండబెట్టి, వాటిని నువ్వుల నూనె, ఆముదం లేదా కొబ్బరినూనెతో కలిపి బాగా కాచాలి. ఈ నూనెను క్రమం తప్పకుండా తలకు రాసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు, మెదడుకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు. ఆకుల నుండి తీసిన నూనె (Deodar oil) చుక్కలను వేడినీటిలో వేసి స్నానం చేయడం లేదా ఆవిరి పట్టడం వల్ల ఉబ్బసం, దగ్గు, సైనసైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (వాపు నిరోధక), అనాల్జేసిక్ (నొప్పి నివారిణి) గుణాల వల్ల, దీని నూనెను ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఉన్న చోట రాస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. దేవదారు ఆకులు లేదా చెక్క పొడితో చేసిన పేస్ట్‌ను చర్మంపై రాయడం వల్ల దురద, సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇది గాయాలను త్వరగా మాన్పడానికి కూడా సహాయపడుతుంది.
  14. మరువం Origanum majorana – మరువం ఆకులలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను వేగవంతం చేసి, గ్యాస్, కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. ఈ ఆకులకు నొప్పులను తగ్గించే గుణం ఉంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు (Joint pains) మరియు కండరాల నొప్పులతో బాధపడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు మరువం ఆకుల సువాసనను పీల్చడం (Inhale) వల్ల మానసిక ప్రశాంతత లభించి తలనొప్పి త్వరగా తగ్గుతుంది. చర్మంపై వచ్చే అలర్జీలు, దురదలు మరియు ఇతర చర్మ వ్యాధులను (Skin diseases) తగ్గించడంలో ఈ ఆకు రసం బాగా పనిచేస్తుంది.
  15. సింధువార పత్రం / వావిలి Vitex negundo – ఆయుర్వేదంలో “వాతరోగానికి వావిలి” అనే సామెత ఉంది. వాత సంబంధిత నొప్పులను తగ్గించడంలో ఈ ఆకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఆకులను నూరి వేడి చేసి కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, వాతపు వాపులు ఉన్న చోట కడితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. ప్రసవం తర్వాత బాలింతలకు వావిలి ఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించి, ఆ నీటితో స్నానం చేయిస్తారు. దీనివల్ల ప్రసవం తర్వాత వచ్చే ఒంటి నొప్పులు, బాలింత వాతం తగ్గుతాయి. జలుబు, రొంప, మరియు తల భారంగా (శిరోభారం) ఉన్నప్పుడు వావిలి ఆకులను దంచి నుదుటిపై పట్టులా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఈ ఆకుల కషాయాన్ని మిరియాల పొడితో కలిపి తీసుకుంటే జలుబు, జ్వరం తగ్గుముఖం పడతాయి. ఆస్తమా, దగ్గు, బ్రోన్కైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆకుల రసం లేదా కషాయం సేవించడం వల్ల శ్వాసనాళాల్లోని వాపు తగ్గి ఊపిరి పీల్చుకోవడం సులువవుతుంది. యాంటీ-బ్యాక్టీరియల్ గుణాల వల్ల, చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లు, గజ్జి, తామర వంటి సమస్యలకు ఈ ఆకుల రసాన్ని పైపూతగా వాడవచ్చు. ఎండిన వావిలి ఆకులను ఇళ్లలో పొగ వేయడం ద్వారా దోమలు, ఇతర కీటకాలు దరిచేరవు. ఇది సహజసిద్ధమైన కీటక నివారిణిగా పనిచేస్తుంది.
  16. జాజీ పత్రం Jasminum grandiflorum – సువాసన గల ఆకులు, జాజి ఆకులను నమలడం లేదా ఆకుల కషాయంతో నోటిని పుక్కిలించడం వల్ల నోటి అల్సర్లు (పుండ్లు), చిగుళ్ల వాపులు మరియు నోటి దుర్వాసన నశిస్తాయి. జాజి ఆకుల రసాన్ని లేదా పేస్ట్‌ను చర్మంపై రాయడం ద్వారా వివిధ రకాల చర్మ వ్యాధులు, దురదలు, గజ్జి మరియు పుండ్లు త్వరగా నయమవుతాయి. ఇది అజీర్ణం మరియు పొట్టకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. జాజి ఆకులు, పూల నుండి తీసే తైలం (నూనె) తల నొప్పి మరియు చెవి నొప్పి వంటి సమస్యల నివారణలో ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది. దీని సుగంధ గుణాలు ఒత్తిడిని తగ్గించి, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
  17. గండకీ పత్రం Bauhinia variegata – దీనిని మతాక్షి అని అంటారు. కొన్ని ప్రాంతీయ పూజా సంప్రదాయాల్లో వినియోగం ఉంటుంది. గండకీ పత్రం శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, ముఖ్యంగా థైరాయిడ్ (Thyroid) సమస్యల నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, వివిధ రకాల చర్మ వ్యాధులను (Skin diseases) మరియు అలర్జీలను అదుపులో ఉంచుతుంది. దగ్గు, జలుబు, మరియు కఫం వంటి శ్వాసకోశ ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపునొప్పి, గ్యాస్, మరియు పొట్ట సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలోని నులిపురుగులను నివారిస్తుంది. ఇది పైల్స్ (Piles) సమస్యతో బాధపడేవారికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. శరీరంలో పెరిగిన వాతాన్ని తగ్గించి, కీళ్ల నొప్పుల నివారణకు తోడ్పడుతుంది.
  18. శమీ పత్రం / జమ్మి Prosopis cineraria – విజయానికి, శుభానికి ప్రతీకగా భావిస్తారు. జమ్మి ఆకుల నుండి తీసిన పసరును లేదా పేస్ట్‌ను రాయడం వల్ల కుష్టు వ్యాధి (Leprosy), దురదలు, అలర్జీలు వంటి వివిధ రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల కషాయం దగ్గు, జలుబు, బ్రోన్కైటిస్ మరియు ఆస్తమా వంటి శ్వాసకోశ ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది.జమ్మి ఆకుల రసం లేదా పసరును క్రమం తప్పకుండా వాడటం వల్ల శరీరంలో వచ్చే అవాంఛిత రోమాలను (Unwanted hair) నివారించవచ్చు. శరీరంలో వచ్చే వాపులు మరియు నొప్పులను (Anti-inflammatory) తగ్గించడానికి ఈ ఆకుల పేస్ట్ ఉపయోగపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు విరేచనాలు (Dysentery) వంటి పొట్ట సమస్యలను నయం చేస్తుంది. తేలు లేదా ఇతర విష కీటకాలు కుట్టినప్పుడు జమ్మి ఆకుల పసరు లేదా బెరడు పేస్ట్‌ను అప్లై చేయడం వల్ల విష తీవ్రత మరియు నొప్పి తగ్గుతాయి.
  19. అశ్వత్థ పత్రం / రావి Ficus religiosa – రావి ఆకుల రసం లేదా ఆకుల పొడిని తీసుకోవడం వల్ల దగ్గు, ఉబ్బసం (ఆస్తమా) మరియు జలుబు వంటి శ్వాసకోశ ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది.కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం మరియు అసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో రావి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి ప్రేగులలోని వాపును తగ్గిస్తాయి. రావి ఆకుల రసాన్ని చర్మంపై రాయడం వల్ల దురద, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఇది చర్మ ఛాయను (Skin complexion) మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. రావి ఆకుల నుండి వచ్చే పాలు లేదా ఆకుల పేస్ట్‌ను గాయాలపై రాయడం వల్ల రక్తస్రావం తగ్గి, గాయాలు త్వరగా మానిపోతాయి. రావి ఆకులను నీటిలో మరిగించి తయారుచేసిన డికాషన్ (కషాయం) తాగడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని నమ్ముతారు.
  20. అర్జున పత్రం Terminalia arjuna – అర్జున చెట్టు బెరడు ఆయుర్వేదంలో హృదయ ఆరోగ్యానికి ప్రసిద్ధి; ఆకు పూజలో ఉపయోగిస్తారు. అర్జున మొక్క గుండె కండరాలను బలోపేతం చేయడానికి మరియు గుండె పనితీరును మెరుగుపరచడానికి ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ వంటి హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది సహజంగానే రక్తపోటును (బి.పి) నియంత్రణలో ఉంచుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి, రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. అర్జున ఆకులు లేదా బెరడును నూరి పేస్ట్‌లా చేసి గాయాలు, వాపులు లేదా చర్మ వ్రణాలపై అప్లై చేయడం వల్ల అవి త్వరగా నయమవుతాయి. ఇందులో ఉండే యాంటీమైక్రోబియల్ గుణాలు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. రక్తంలో చక్కెర (షుగర్) స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇది దోహదపడుతుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో వచ్చే అల్సర్లు (పుండ్లు) మరియు గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో దీని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు తోడ్పడతాయి.
  21. అర్క పత్రం / జిల్లేడు Calotropis procera – గణపతి పూజలో ముఖ్యమైన పత్రం; అర్క పత్రాలకు నువ్వుల నూనె లేదా ఆముదం రాసి, కొద్దిగా వేడి చేసి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్న చోట కడితే (అర్క పత్ర స్వేదం) నొప్పులు, వాపుల నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకులలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-మైక్రోబియల్ గుణాలు ఉండటం వల్ల గజ్జి, తామర, చర్మంపై వచ్చే కురుపుల నివారణకు వీటిని ఉపయోగిస్తారు. గాయాలు, అల్సర్లను శుభ్రం చేయడానికి మరియు అవి వేగంగా మానడానికి (Wound healing) ఆకు రసాన్ని లేదా ఆకుల పొడిని ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ఉపయోగిస్తారు. ఆస్తమా, దీర్ఘకాలిక దగ్గు మరియు జలుబు వంటి సమస్యల చికిత్సలో దీని ఆకులు, వేర్ల బెరడు సహాయపడతాయి. కండరాల నొప్పులు లేదా ఏదైనా దెబ్బల వల్ల కలిగే నొప్పులను తగ్గించడంలో ఇది అనాల్జేసిక్ (Analgesic)గా పనిచేస్తుంdi.

Polala Amavasya: పోలాల అమావాస్య అంటే ఏమిటి? కందమొక్కనే ఎందుకు పూజిస్తారు?

Ravinuthala Bhakti

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *