ట్రోలర్స్‌పై సల్మాన్ ఖాన్ ఫైర్!
వయసు, లుక్స్, బరువు పేరుతో సెలబ్రిటీలను ట్రోల్ చేసే వారిపై సల్మాన్ ఖాన్ ఘాటుగా స్పందించారు.
బిగ్ బాస్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్
‘బిగ్ బాస్ 20’ వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో సోషల్ మీడియా ట్రోలింగ్‌పై సల్మాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“వయసు పెరగడం సహజమే”
తన వయసు, బరువు, హెయిర్, లుక్స్ గురించి వచ్చే కామెంట్లను ప్రస్తావిస్తూ.. వయసు పెరగడం సహజమని సల్మాన్ చెప్పారు.
కెమెరా ముందే షర్ట్ తీసేసిన సల్మాన్
తన శరీరంపై ట్రోలింగ్‌కు కౌంటర్ ఇస్తూ జాకెట్, షర్ట్ తొలగించి కెమెరా ముందే ట్రోలర్స్‌కు సవాల్ విసిరారు.
ప్రసవం తర్వాత బాడీ షేమింగ్‌పై ఆగ్రహం
ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల శరీరంలో మార్పులు రావడం సహజమని.. వాటిని కూడా ట్రోల్ చేయడం సరికాదని సల్మాన్ అన్నారు.
కత్రినా పేరు మాత్రం చెప్పలేదు
Salman khan తన వ్యాఖ్యల్లో కత్రినా కైఫ్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. అయితే సోషల్ మీడియాలో కొందరు ఆయన వ్యాఖ్యలను కత్రినా ఎదుర్కొన్న ట్రోలింగ్‌తో లింక్ చేస్తున్నారు.
పాపరాజీ తీరుపైనా విమర్శలు
మహిళా సెలబ్రిటీలను అసౌకర్యానికి గురిచేసే విధంగా శరీర భాగాలపై ఫోకస్ చేస్తూ ఫొటోలు తీయడాన్ని కూడా Salman khan తప్పుబట్టారు.
సోషల్ మీడియాలో వైరల్
ట్రోలర్స్‌కు Salman khan ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.




