Skip to content
వార్తలు

Nepal Floods: నేపాల్ వరదల్లో 9 రోజుల తర్వాత అద్భుతం.. సొరంగం నుంచి ఇద్దరు సజీవంగా బయటకు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు, కొండచరియలు, ఆకస్మిక వరదలతో పరిస్థితి దారుణంగా మారింది. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యల్లో తొమ్మిది రోజుల తర్వాత ఓ ఆశాకిరణం కనిపించింది. రసువా జిల్లాలోని త్రిశూలి-3ఏ జలవిద్యుత్‌ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను భద్రతా బలగాలు సజీవంగా బయటకు తీసుకొచ్చాయి.

తొమ్మిది రోజుల తర్వాత ప్రాణాలతో..

ఆగస్టు 26న సంభవించిన ప్రకృతి విపత్తు తర్వాత త్రిశూలి-3ఏ హైడ్రోపవర్‌ ప్రాజెక్టు వద్ద పలువురు కార్మికులు గల్లంతయ్యారు. సొరంగం పూర్తిగా బురద, శిథిలాలతో నిండిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

ఇదే సమయంలో దెబ్బతిన్న సొరంగం లోపలి నుంచి మనుషుల మాటలు వినిపిస్తున్నట్లు నేపాల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ సభ్యుడు శ్రీరామ్ న్యూపానే సోషల్‌ మీడియాలో వెల్లడించారు. దీంతో రెస్క్యూ సిబ్బంది అప్రమత్తమై సొరంగంలో చిక్కుకున్న వారు సజీవంగా ఉన్నారని నిర్ధారించుకున్నారు.

బురద తొలగించి బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది

సొరంగంలోకి చేరేందుకు భారీ యంత్రాలు, ప్రత్యేక పరికరాలను రంగంలోకి దించారు. అడ్డుగా ఉన్న బురద, శిథిలాలను తొలగిస్తూ రెస్క్యూ సిబ్బంది ముందుకు సాగారు.

చివరకు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారిని మెకానికల్ ఫోర్‌మెన్ సంజయ్ సాహ్, మెకానికల్ సూపర్‌వైజర్ కబీర్ మహర్జన్గా గుర్తించారు.

Chandrababu Naidu: IT Man to Water Man:

ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు

త్రిశూలి-3ఏ ప్రాజెక్టు వద్ద మొత్తం 40 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సొరంగంలోని మిగిలిన ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతినడం, ప్రతికూల వాతావరణం, సొరంగంలో పేరుకుపోయిన బురద, శిథిలాల కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

మరో సొరంగంలో రెండు మృతదేహాలు

ఇదిలా ఉండగా, లాంగ్‌టాంగ్ ఖోలా జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో రెస్క్యూ సిబ్బందికి రెండు మృతదేహాలు లభించాయి. వరదల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టుల పరిధిలో గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలింపు కొనసాగుతోంది.

రెండు జిల్లాల్లో 600 మంది విద్యార్థుల ఆచూకీ గల్లంతు

నేపాల్‌లోని రసువా, నువాకోట్ జిల్లాల్లో వరదల ప్రభావం విద్యా వ్యవస్థపైనా తీవ్రంగా పడింది. వరదల ధాటికి ఈ రెండు జిల్లాల్లో 12 పాఠశాలలు ధ్వంసమయ్యాయి.

దాదాపు 600 మంది విద్యార్థుల ఆచూకీ తెలియడం లేదని స్థానిక అధికారులు వెల్లడించారు. గల్లంతైన విద్యార్థుల సంఖ్యపై స్పష్టత కోసం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

DSC: పై లోకేష్ వీడియో వైరల్

విద్యార్థులతో పాటు 22 మంది ఉపాధ్యాయులు, పలువురు పాఠశాల సిబ్బంది కూడా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు

నేపాల్‌లో ప్రకృతి విపత్తు సృష్టించిన విధ్వంసం నుంచి సాధారణ పరిస్థితులు ఇంకా పూర్తిగా నెలకొనలేదు. ముఖ్యంగా జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాలు, పాఠశాలలు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

సొరంగం నుంచి తొమ్మిది రోజుల తర్వాత ఇద్దరు కార్మికులు సజీవంగా బయటపడటం సహాయక బృందాల్లో కొత్త ఆశలు నింపింది. ఇంకా ఆచూకీ తెలియని వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *