Skip to content
వార్తలు

‘Yeshanagula’ రాకముందే సోషల్ మీడియాలో ఊపు.

The Paradise Yeshanagula: సినిమా పాట రిలీజ్ అవ్వాలంటే ఒకప్పుడు పోస్టర్ వచ్చేది.. తర్వాత టీజర్ వచ్చేది.. ఆ తర్వాత పాట వచ్చేది. ఇప్పుడు మాత్రం కథ మారిపోయింది. పాట ఇంకా పూర్తిగా బయటకు రాకముందే సోషల్ మీడియా దాన్ని పట్టుకుని తన స్టైల్లో ఊపేస్తోంది.

నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ నుంచి రెండో పాటగా ‘యెషనాగుల’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పాటను ఆగస్టు 29న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అనిరుధ్ సంగీతం అందించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.

పాట రాలేదు.. కానీ ‘వైబ్’ వచ్చేసింది

సోషల్ మీడియాలో తిరుగుతున్న చిన్న క్లిప్స్ చూస్తుంటే ఒక విషయం మాత్రం అర్థమవుతోంది.

“పాట ఎలా ఉంది?” అని అడిగే స్టేజ్ దాటిపోయి.. “వైబ్ వచ్చిందా లేదా?” అనే స్టేజ్‌కు వచ్చేశాం.

ఎక్కడ చూసినా #YESHANAGULA హ్యాష్‌ట్యాగ్, రియాక్షన్స్, ఎడిట్స్, చిన్న వీడియోలు.

కొంతమంది క్లిప్ చూసి మాస్ అంటున్నారు. ఇంకొందరు “ఇది థియేటర్‌లో అయితే స్పీకర్లు బతుకుతాయా?” అనే రేంజ్‌లో హైప్ చేస్తున్నారు.

మరి నిజంగా పాట అంత మాస్‌గా ఉందా? లేక సోషల్ మీడియానే ముందుగా మాస్ సర్టిఫికెట్ ఇచ్చేసిందా? అది పూర్తి పాట వచ్చిన తర్వాతే తెలుస్తుంది.

Bigg Boss 10: జబర్దస్త్ నరేష్ బిగ్ బాస్ 10 లో కి ఎలా అడుగు పెట్టాడు?

అనిరుధ్ పేరు ఉంటే హైప్ ఫ్రీగా వస్తుందా?

ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది.

అనిరుధ్ పేరు పోస్టర్ మీద కనిపించగానే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేక అంచనా మొదలవుతుంది. బీట్ ఎలా ఉంటుంది? థియేటర్‌లో ఎలా పేలుతుంది? రీల్స్‌లో ఎంత వైరల్ అవుతుంది? అన్నది ముందే చర్చ మొదలవుతుంది.

‘యెషనాగుల’ విషయంలో కూడా అదే జరుగుతోంది.

అంటే సాంగ్ రిలీజ్‌కు ముందు ప్రమోషన్ టీమ్ పని సగం సోషల్ మీడియానే చేసేస్తోందన్న మాట.

నాని–శ్రీకాంత్ ఓదెల కాంబోపై అంచనాలు

‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఫోక్ టచ్ ఉన్న ‘యెషనాగుల’ పాటను తీసుకురావడం ఆ హైప్‌ను ఇంకాస్త పెంచుతోంది.

తాజా నివేదికల ప్రకారం ఈ పాటలో కీర్తి సురేష్ ప్రత్యేకంగా కనిపించనున్నట్లు సమాచారం రావడంతో ఆసక్తి మరింత పెరిగింది.

అసలు పరీక్ష మాత్రం పాట వచ్చిన తర్వాతే

ఇప్పటివరకు ఉన్న క్లిప్స్, పోస్టులు, ఎడిట్స్ అన్నీ ఒకటి చెబుతున్నాయి — హైప్ ఉంది.

DSC: పై లోకేష్ వీడియో వైరల్

కానీ హైప్ ఒకటి, పూర్తి పాట హిట్ అవ్వడం ఇంకొకటి.

సోషల్ మీడియాలో 10 సెకన్ల క్లిప్ వైరల్ కావచ్చు. కానీ పూర్తి పాటను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ వింటారా? థియేటర్‌లో అదే ఎనర్జీ వస్తుందా? రీల్స్ దాటి పాట నిలబడుతుందా? అన్నదే అసలు పరీక్ష.

అప్పటివరకు మాత్రం…

పాట రాలేదు బాస్.. కానీ సోషల్ మీడియా మాత్రం ఇప్పటికే “సూపర్ హిట్” బోర్డు పెట్టేసింది!

Studio One Plus

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *