Vinayakudu: మరి కొన్ని రోజుల్లో వినాయక చతుర్ధి వస్తున్నది. కళాకారులు రక రకాల వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. మంటపం నిర్వాహకులు కూడా డబ్బులు వెచ్చించి బొమ్మలు కొనటానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఈ సంవత్సరం వినాయకుడికి పత్రి పెట్టటానికి వర్షాలు లేవు. ఎలినినో ప్రభావం తో ఈ సంవత్సరం చినుకు రాలటం లేదు. సాగునీటి సంగతి దేవుడెరుగు, తాగు నీటికి కూడా కటకట లాడుతున్నారు చాలా చోట్ల. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల లో కనీసం 50 శాతం వర్షపాతం కూడా నమోదు అవ్వలేదు. రాయల సీమ పరిస్తితి అయితే ఘోరం. ఎండలు 38 డిగ్రీల తో మండి పోతున్నాయి. సరే ఎదో పత్రి తీసుకు వచ్చి గణపతి పూజ చేసినా ఆ తర్వాత సందడి అంతా నిమజ్జనం రోజున ఉంటుంది. కాని చెరువులలో, కాలువలలో, నదుల్లో నీళ్ళి లేని పరిస్తితి. గణనాధుడి గంగమ్మ (Gangamma) ఒడికి చేరే పరిస్తితి లేదు. అందుకే ఆంధ్రా మినిస్టర్ టి.జి. భరత్ ఈ సారి భారీ భారీ విగ్రహాలు పెట్టవద్దు. నిమజ్జనానికి ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోండి అని చెప్పారు. దీంతో అసలు విగ్రహం కొందామా వొద్దా అని సంకటం లో ఉన్నవారు. ఈ సంవత్సరం వాయిదా వేసుకుంటున్నారు. దీంతో దీని మీద ఆధార పడిన అనేక మంది కార్మికులు భోరున విలపిస్తున్నారు. వారు సంవత్సరం అంతా కష్టపడి ఈ విగ్రహాలు చేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో సంవత్సరం అంతా గడిపేస్తారు. కాని ఈ సంవత్సరం పరిస్తితి చాలాఘోరం గా ఉన్నది. వీరి కన్నీరు చూసి అయినా గణపయ్య కరగకపోయినా తాను గంగమ్మ వొడికి చేరటానికైనా వర్షాలు కురిపించి చెరువులు, కుంటలు, బావులు, కాలువలు, నదులు నిండేలా చేస్తే బాగుండు….
Vinayakudu: వినాయకుడు రెడీ….మరి గంగమ్మ పరిస్తితి?

Studio One News
Follow our WhatsApp Channel for Latest News



