Today Rasi Phalalu: సెప్టెంబర్ నెల 10 వ తేదీ 2026 వ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం….
మేష రాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు బ్యాంకు లాభాదేవీలన్నీ కూడా కొంచెం చికాగగా కనబడుతున్నాయి. అశాంతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం ఒత్తిడికి గురవ్వడం కోపం రావడం లాంటివి కనపడుతున్నాయి. స్ట్రెస్ ఎక్కువగా కనబడుతుంది. చాలా విషయాల్లో గొడవలకు దూరంగా ఉండండి మౌనంగా ఉండండి. ఎవరిని రెచ్చకొట్టకండి ఎవరు మిమ్మల్ని రెచ్చకొట్టిన రెచ్చిపోకండి మాట పెరిగితే లేనిపోని గొడవలు వస్తాయి. ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి బండి నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ నడపకండి హడావిడిగా ప్రయాణాలు చేయకండి కొంచెం ముందుగానే బయలుదేరండి.
వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చతుర్ధ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు చాలా మంది ఏంటంటే తీయని మాటలతోటి మోసం చేసేటటువంటి వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతారు. కాబట్టి తీయగా మాట్లాడేవాడు ఎప్పుడు మంచివాడు కాదు. అతిగా పొగడ్తలు అతిగా పొగిడేవాడు లాంటి వాడిని వాడి మాటలు నమ్మకండి జాగ్రత్తగా ఉండండి. అలాగే జీవిత భాగస్వామితోటి గొడవలు అహంకారం పెరగడం చిన్న మాట కూడా పెద్ద గొడవ కింద మారడం అలాగే మాట జారడం వల్ల నోరులు జారడం వల్ల ఉద్యోగాలు చేసే చోట వ్యాపారాలు చేసే చోట అవకాశాలు పోగొట్టుకోవడం చేసే అవకాశాలు ఉన్నాయి. అనుకోని ప్రమాదాలు తొందరపాటు నిర్ణయాలు అలక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల వాహన ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని మానసికంగా వేధించడానికి ప్రయత్నం చేస్తూంటారు జాగ్రత్త కుటుంబ సభ్యులతోటి చిన్న చిన్న వివాదాలు కనబడుతున్నాయి.
మిధున రాశి వారి యొక్క ఫలితాలు తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు పాజిటివ్ గా ఆలోచించడం వల్ల మీకు ఏ పనిైనా సరే చాలా సులువుగా జరుగుతుంది. కాబట్టి పాజిటివ్ థింకింగ్ చేయండి. ఈ రోజు కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చూడతారు. అలాగే మనసులో ఏదో తెలియనటువంటి ఉత్సాహము మీ జీవితాన్ని మార్చుకోవాలన్న తపన పట్టుదల బాగా పెరుగుతాయి అలాగే బాగా అద్భుతమైనటువంటి నిద్ర పట్టడం కానీ ఆహారం ఆకలి వేయడం కానీ ఉత్సాహం రావడం కానీ శారీరక పరమైనటువంటి మార్పులు రావడం కానీ ఎనర్జీ లెవెల్ ఎక్కువగా ఉండడం కానీ జరుగుతుంది ఈరోజు తినే ఆహారంలో మార్పులు తీసుకురావడం వల్ల వ్యాయామం చేయడం వల్ల మెడిటేషన్ చేయడం వల్ల చక్కటి ఆరోగ్యం కుదురుపడుతుంది. ఆరోగ్య మార్పులు కూడా కనబడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి శుభవాభర్త వింటారు.
కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏంటంటే భార్య భర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఒకరి మాట ఒకరు వినకపోవడం వల్ల చిన్న గొడవలే పెద్దవైపోయి అనవసరంగా ఇబ్బందులు పడతారు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వస్తువులు కొనడం ఆన్లైన్ షాపింగ్‌లు చేయడం వల్ల ఈరోజు ఎక్కువగా ధన నష్టం కనపడుతుంది. అలాగే చేసే పని యందు ఏకాగ్రత శ్రద్ధ తగ్గడము ఏ పని మీద దృష్టి పెట్టలేకపోవడము నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయంలో తడబాటు రావడము జ్ఞాపక శక్తి తగ్గడం కనపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే నరదృష్టి ఎక్కువగా కనపడుతుంది. వ్యాపారాలలో కొంచెం అకస్మాత్తుగ్గ వ్యాపార నష్టాలు మందగించే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రేమించిన వ్యక్తికి మీరు ఏదో మీకు మీరు నచ్చినట్టే మిగతా వాళ్ళు ఉండాలనుకోండి.
సింహ రాశి వారి యొక్క ఫలితాలు జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి అప్పుడు మీకు చదువు కూడా బ్రహ్మాండంగా వస్తుంది మంచి అలవాట్లు వస్తాయి ఉత్తీర్ణత శాతం వస్తుంది. ఎదగడానికి మీకు మంచి అవకాశాలుయితే ఈరోజు రాబోతున్నాయి టైం మాత్రం వేస్ట్ చేయకండి, అయితే అనారోగ్య సమస్యల గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జీవన శైలిలో మార్పు తెచ్చుకురావడం మాత్రం చాలా అవసరం. మీకు ప్రతి క్షణం ముఖ్యమే…ఒక్క సెకన్ వేస్ట్ చేసుకున్న మీరు అనేకం కోల్పోవాల్సి వస్తుంది. మీ అప్పులను ఎలా తీర్చాలి అనేటటువంటి ఆలోచన చేయడంలో మంచి ఆలోచనలు మంచి మార్గాలు దొరుకుతాయి కాబట్టి చక్కగా ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు ప్రస్తుతం ఆనందం కన్నా రాబోయే రోజుల్లో ఒక ఐదేళ్ళు 10 ఏళ్ళ తర్వాత మనం ఎలా సుఖంగా ఉండాలి ఆర్థికంగా ఎలా ఎదగాలి నిలదొక్కుకోవాలి అనేటటువంటి లక్ష్యాల మీద ఈరోజు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పెట్టుబడలు పెడతారుని చెప్పొచ్చు.
కన్యారాశి వారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు చాలా అనవసరమైనటువంటి తప్పుడు పనులన్నీ తగ్గించుకోగలుగుతారు మొబైల్ ఫోన్ వాడకాలు లేదా మొబైల్ ఫోన్ వాడడం వల్ల నిద్ర పట్టకపోవడం లాంటి వాటిని గమనించుకోగలుగుతారు. నీరసము, నిస్సత్వం తగ్గుతుంది, బలం పెరుగుతుంది, శారీరక దృఢత్వం పెరుగుతుంది. అయితే ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడడం వల్ల ఇతరుల దృష్టిలో చులకన అవుతారు జాగ్రత్తగా ఉండాలి. వేరేవాళ్ళు మంచి సలహా ఇచ్చినా కూడా వినకుండా మీ పంతానికి పోవడం వల్ల డబ్బు నష్టపోతారు జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోకపోతే చాలా ఇబ్బందులు పడిపోతారు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు మిమ్మల్ని రోడ్డుని పాడేస్తాయి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య అనుమానాలు దురుసుగా మాట్లాడి ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకోవడం ఇలాంటివి కనపడుతున్నాయి. అయితే నోరు మంచిదయితే ఊరు మంచిది అవుతుందంటారు అది గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులు ముఖ్యంగా చదువు మీద దృష్టి పెట్టలేకపోవడం ఫోన్లు ఆటలు లేదా పరీక్షలో మార్కులు తగ్గే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి.
తులా రాశి వారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థాలలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు రావలసినటువంటి గవర్నమెంట్ జాబ్‌లు లేదా ఎగ్జామినేషన్స్ లో ఏదైనా అవకాశాలు ఖచ్చితంగా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం కనపడుతుంది. కుటుంబంలోనో సమాజంలోనో మీ మాటకు విలువ పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తఅవుతాయి. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పనులు ముందుకు వెళ్తాయి. ఉద్యోగస్తులకి ఆఫీసులో మీరు పడుతున్నటువంటి కష్టాన్ని మీ పై అధికారులు బాసులు గమనిస్తారు.
వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు మీ కష్టాన్ని తగ్గా ప్రతిఫలం అయితే ఖచ్చితంగా దక్కుతుంది. మీ ఆఫీసులో చేసినటువంటి పాత ప్రాజెక్టులకి ఇప్పుడు గుర్తింపు రావడం కానీ లేదా అవార్డులు రివార్డులు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సభలు సమావేశాల్లో పాల్గొంటారు నలుగురిలోకి వెళ్లి మాట్లాడగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది. మధ్యమ కానీ ధోమపానం కానీ ఇలాంటి అలవాట్లకి దూరంగా ఉంటే మీ ఆరోగ్యం మెరుగుపడడమే కాదు సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది అనే విషయం గుర్తు పెట్టుకోండి. ధనలాభ సూచన కనపడుతుంది. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది.
ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్కప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కష్టపడకుండా డబ్బులు రావాలనుకని కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే త్వరగా డబ్బులు సంపాదించాలని, ట్రేడింగ్ లో డబ్బులు పెట్టిన నష్టపోతారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిత్ర ద్రోహం అంటే మీకు బాగా సన్నిహితంగా ఉండేవారే వెన్ను పోటి పడిచే అవకాశం ఉంది. జాగ్రత్త మీ వ్యక్తిగత విషయాలు ఎవరితోటి పంచుకోకండి. చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాల అలవాట్ల అవకాశం కనపడుతుంది జాగ్రత్త అకారణంగా కోపము చిన్న చిన్న విషయాలకి చికాకుపడి ఇంట్లో వాళ్ళ మీద ఆఫీసులోని వారి పైన అరవడం కానీ దీనివల్ల ప్రశాంతత కోల్పోతారు జాగ్రత్తగా ఉండాలి. పరస్త్రీ పరపురుష వ్యామోహము కఠినంగా మాట్లాడడం వల్ల నష్టం కనపడుతుంది. అలాగే మీ మాట కఠినంగా ఉన్నా కూడా ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకుంటారు కాబట్టి మాట కఠినత్వాన్ని తగ్గించుకోవాలి. రాత్రి వేళలో లేదా కొత్త ప్రాంతాలు ఒంటరిగా ప్రయాణం చేయడం మాత్రం మంచిది కాదు. అలాగే మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వారిపైన అకారణంగా కోపం చూపిస్తారు.
మకర రాశి వారి యొక్క ఫలితాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఆఫీసుల్లో లేదా సమాజంలో మీరు గతంలో చేసినటువంటి తప్పులు లేదా గతంలో చేసినటువంటి పొరపాట్లకి నిందారూపాలు కనబడతాయి. ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. మీ వెనక గోతులు తీసేటటువంటి చేతులు పెరిగిపోతుంటారు జాగ్రత్త వాళ్ళకి ఏంటంటే మీ వ్యక్తిగత విషయాలు విషయాలు మాత్రం ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు మీ రహస్యాన్ని బయట పెట్టి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూఉంటారు. మీరు ఎంత కష్టపడినా సరే మీరు అనుకున్న ప్రాజెక్ట్ పనులన్నీ ఆలస్యంగా జరగడం మీకు రావలసిన క్రెడిట్ వేరే వాళ్ళకి సహ ఉద్యోగులకి వెళ్ళడం కానీ దాని వల్ల నిరాశ కనపడుతుంది.
కుంభ రాశి వారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఆగిపోయినటువంటి ఇంటి పొలలు కానీ స్లాబులు కానీ లేదా వ్యవహారాలు కానీ కొత్తగా ఇల్లు కడుతూ ఉంటే ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతాయి అని చెప్పొచ్చు. బ్యాంకు లోన్లు రావడం కానీ లేదా చిరవార నిమిషాల్లో ఆగిపోయిన పనులు ఎదరికి వెళ్ళడం కానీ వాహనాలు ఇంటికి తెచ్చుకోవడం కానీ వాహనాలు కొనడం కానీ కలిసి వస్తుంది. అలాగే ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి వస్తుంది ఈరోజు పెట్టుబడలు పెట్టిన షేర్ల నుంచి లాభాలు పొందగలుగుతారు ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి లేదా పర్సనల్ లోన్లు క్రెడిట్ కార్డు బాకీలు ఇవన్నీ తీర్చగలుగుతారు . ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి అత్యవసర పని కోసం లోన్ అడిగితే తొందరగా మంజూర అయ్యే అవకాశం కనపడుతుంది.
మీన రాశి వారి యొక్క ఫలితాలు షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఉద్యోగస్తులు ముఖ్యంగా ఆఫీసులో అందరూ చాలా కష్టం అనుకొని వదిలేసినటువంటి పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త డాక్టర్లని కొత్త చికిత్సలని కొత్త ఆహారపు అలవాట్లని మార్చుకోవడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. పిల్లల చదువులో కెరీర్ లో ఏదైనా కొత్త కొత్త కోర్సులు నేర్పించడంలో మీరు చాలా ఎక్కువగా వాళ్ళకి శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. చాలా కాలంగా ఎప్పటి నుంచో ఇల్లు కొందాం అనుకున్న పొలం కొద్దామ అనుకున్న ఇళ్లస్థలం కొందాం అనుకున్న అవ్వని వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా అవకాశాలు కనపడుతాయి. మీ వ్యాపారంలో లాభాలు రావడానికి కుటుంబంలో సమస్యలు పోవడానికి కారణం అవుతుంది. అలసట నీరసము తగ్గుతుందని చెప్పొచ్చు అలాగే కష్టపడి చదివినటువంటి చదువుకి మీకు తగ్గ అద్భుతమైనటువంటి యూనివర్సిటీలో సీట్లు రావడం కానీ లేదా మంచి ర్యాంకులు రావడం కానీ క్రెడిట్ తగ్గడం కానీ జరుగుతుంది.
మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. వ్యక్తిగత జాతకం పరిశీలిస్తే ఫలితాలు పూర్తి గా తెలుస్తాయి. గోచార ఫలితాలు, అందునా దిన ఫలాలు అంటే అవి కేవలం 60 శాతం మాత్రమే పని చేస్తాయి.




