Skip to content
వార్తలు

Madras Regiment: ఆర్మీ ఆయుధాగారంలో భారీ చోరీ.. ముగ్గురు అధికారులపై అనుమానం

Madras Regiment: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి అత్యాధునిక ఆయుధాలు మాయం కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పుడు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో గార్డు డ్యూటీలో ఉన్న పలువురు సిబ్బంది, అగ్నివీర్లను కూడా అధికారులు ప్రశ్నించారు.

మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆఖ్-203 రైఫిళ్లు, ఈణ్శాశ్ రైఫిల్, పిస్టళ్లు సహా మొత్తం 12 ఆయుధాలు, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి మాయమైనట్లు అధికారిక ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆగస్టు 31న ఆయుధాగారం తెరిచిన సమయంలో తాళాలు పగిలి ఉండటం, ఆయుధాలు కనిపించకపోవడంతో ఈ భారీ చోరీ బయటపడింది. అయితే ఆయుధాలు ఖచ్చితంగా ఎప్పుడు మాయమయ్యాయన్నది ఇంకా దర్యాప్తులోనే ఉంది.

మొదట ఈ ఘటన ఒక్క రాత్రిలో జరిగిన చోరీగా భావించినప్పటికీ, ఆయుధాలను విడతల వారీగా ముందుగానే బయటకు తరలించి ఉండవచ్చనే కోణాన్ని కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.

DSC: పై లోకేష్ వీడియో వైరల్

ఈ కేసులో మరో కీలక అంశం ఛ్ఛ్ట్వ్ కెమెరాల పనితీరు. ఆయుధాగారం వద్ద రాత్రి వేళల్లో ఛ్ఛ్ట్వ్ ఆఫ్‌లో ఉండేదనే సమాచారం వెలుగులోకి రావడంతో భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తాయి.

అత్యంత భద్రత ఉండే ఆర్మీ ప్రాంగణం నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలను బయటకు తీసుకెళ్లడం బయటి వ్యక్తులకు సాధ్యమా? లేక ఇన్‌సైడర్ సహకారం ఉందా? అనే కోణంపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

ఆయుధాగారానికి సంబంధించిన రికార్డులు నెలల తరబడి సక్రమంగా నిర్వహించలేదనే ఆరోపణల నేపథ్యంలో ఒక సీనియర్ ఆర్మీ అధికారిని కూడా ప్రశ్నించినట్లు సమాచారం.

మిలిటరీ ఇంటెలిజెన్స్, ఆర్మీ అధికారులు, తెలంగాణ పోలీసులు వేర్వేరు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఘటన తీవ్రత దృష్ట్యా దీనిని జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా అధికారులు పరిగణిస్తున్నారు.

అయితే దొంగిలించిన ఆయుధాలు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి? వాటి వెనుక మరేదైనా కుట్ర ఉందా? అధికారుల ప్రత్యక్ష పాత్ర ఉందా? అనే అంశాలపై ఇప్పటివరకు తుది నిర్ధారణ వెలువడలేదు.

Botsa: మళ్ళీ ఏడ్చిన బొత్స సత్యనారాయణ

ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు వెనుక ఉన్న అసలు కథ బయటపడనుంది.

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *