MARKET UPDATE

SENSEX: 73,067.81, change ▲ +685.34 (+0.95%). Source Yahoo Finance, as of 06 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,776.10, change ▲ +220.35 (+0.98%). Source NSE, as of 06 Oct 2026 3:30 PM IST. GOLD 24K / 999: ₹1,48,473 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,36,001 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. SILVER 999: ₹2,22,820 / kg. Source IBJA, as of 06 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

Skip to content
రాశిఫలాలు

Neti Rasi Phalalu: నేటి రాశి ఫలాలు 16వ తేదీ సెప్టెంబర్ నెల బుధవారం 2026

Dina phalalu

శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః 16వ తేదీ సెప్టెంబర్ నెల బుధవారం 2026 నాటి దినఫలాలు.

మేషరాశి: మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము బాగుంది అని చెప్పొచ్చు అలాగే షష్ట స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారం బాగుంది. సప్తమంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. ఈ వెరసి మూడు గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది. కుటుంబ జీవితంలో శ్రద్ధ తీసుకోండి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువ ఆశించవద్దు. వారి దగ్గర నుంచి ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్న కుజుడు మారిపోబోతున్నారు. అంత చాలా బాగుంది. అని చెప్పడానికి రాబోవడం లేదు ఎక్కువ గ్రహాలు ఏవి అనుకూలంగా లేనప్పుడు ఉన్న గ్రహాలలో ఇక ఇతరత్ర ఇలాంటి దృష్టి భావాలు పడుతూ ఉన్నట్టయితే కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలే ఉంటాయి.

వృషభ రాశి వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. షష్ట స్థానంలో చంద్రుడు బాగున్నారు లాభ స్థానంలో శని గారు బాగున్నారు. రెండు గ్రహాలే బాగున్నాయి అంటే ఇక్కడ అనుకూలత ఎంతవరకు ఉంది అంటే అనుకూలత అంత గొప్పగా లేదు కొంత ప్రతికూలత కనిపిస్తోంది అనుకూలమైనటువంటి స్థితి సంచారములు గ్రహస్థితులు రావడం కోసం ఇంకా కొద్దికాలం వేచి ఉండవలసినటువంటి పరిస్థితి ఉద్రేక స్వభావాన్ని తగ్గించుకోండి ఆలోచన పెంచుకోండి. కుటుంబ జీవిత తంలో ఓర్పు కలిగి ఉండండి. ధన లాభాలు ఉన్నాయా అంటే ఏమీ లేవు ఇంకా చెయ్యర్చుకుంటారేమో విలువైన వస్తువుల్ని కొంచెం భద్రంగా పెట్టుకోవాల్సిందిగా సూచన ఆదాయం మటుకు బాగుంది.

మిధున రాశి: మిధున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటు వంటి గురువుగారు బాగున్నారు తృతీయంలో రవి కేతువు బాగున్నారు చతుర్థంలో బుధుడు బాగున్నారు. పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు వెరసి ఐదు గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో మీరు చాలా వరకు అనేక రకాలుగా మనశశాంతి పొందుతున్నారు. ఉద్యోగ జీవితం బాగుంది వ్యాపార జీవితం బాగుంది. భార్యా భర్తల అనుకూలత వైవాహిక జీవితం బాగుంది. వివాహం కాని వారికి వివాహం జరిగేది అనుకూలమైనటువంటి మంచి సంబంధం వస్తోంది. ఇలా ఎన్నో విధాలుగా మానసిక ప్రశాంతత పెరుగుతోంది. వాక్ స్థానం బ్రహ్మాండంగా ఉండడంతో మీ వాక్కి పరపతి పెరుగుతోంది. సంతానం చాలా బాగున్నారు ఉద్యోగం చాలా బాగుంది ఎన్నో విధాలుగా సంతృప్తిగా ఉన్నారు.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి సంచారం చాలా బాగుంది. తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు చతుర్ధంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు వెరసి మూడు గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తోంది అలాగే గురువుగారి యొక్క సంచారము చాలా అద్భుతమైనటువంటి స్థితి సంచారము రాశిలో ఉచ్చలో ఉన్నారు కాబట్టి వారి యొక్క అనుగ్రహం మీకు కర్కాటక రాశి వారికి పూర్తిగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. ముఖ వర్చస్సు పెరుగుతుంది మాట పరపతి పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం కూడా కొంచెం స్థిమిత పడుతుంది. అలాగే మాతృవర్గ రీచ్య మీకు ఎన్నో రకాల సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి.

సింహరాశిలో గురుడు దేశంలో ఏం మారబోతోంది? guru gocharam 2026
Guru Gocharam 2026: గురువు సింహరాశిలోకి ప్రవేశం ఏ రాశివారికి బాగుంది?దేశ పరిస్తితి ఏమిటి?కీలక మార్పులు

సింహరాశి సింహరాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటున్న విధంగానే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండాల్సిన గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో ఉన్న కేతువు ఇబ్బంది పెడుతూ ఉంటారు. సప్తమంలో ఉన్న రాహువు కూడా చాలా చాలా ఇబ్బంది పెడతారు అలాగే అష్టమ స్థానంలో శని గారి సంచారము కూడా అంత పెద్ద గొప్పగా లేదండి బుధుడు బాగున్నప్పటికీ కూడా చంద్రుడు బాగున్నప్పటికీ కూడా ఇక్కడ రాశిలో ఉన్నటువంటి రాహు కేతువులు చాలా బాధలు ఇచ్చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. దూరప్రాంత ప్రయాణాల పరంగా జాగ్రత్తగా ఉండాలి. భార్యా భర్తల మధ్య అన్యోన్యత కూడా అంత బాగా లేదు జాగ్రత్తగా ఉండాలి. కోర్టుకి వెళ్ళినటువంటి భార్యా భర్తలు ఎవరైనా ఉన్నారా అంటే వారికి విడాకులు అయిపోతాయి అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ధనాన్ని ఖర్చు పెట్టండి అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను.

కన్యారాశి: కన్యారాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు షష్ట స్థానంలో ఉన్నటువంటి రాహువు బాగున్నారు లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు వెరసి మూడు గ్రహాల యొక్క ఉనికి బాగుంది. ఊహ కందని విధంగా లాభాలు ఉంటాయి మాతృవర్గ రీచ బాగుంది అలాగే భార్యా భర్తల అన్యోన్యత రీత్యా కూడా కొంచెం బాగుంది. ఔషధ సేవ చేయండి అతి త్వరగా తగ్గిపోతాయి అని చెప్పి తెలియజేయొచ్చు ఈసరికే విడాకులు తీసుకోవాలి అని నిర్ణయించుకున్నటువంటి భార్యా భర్తలు ఎవరైనా గాని కోర్టుకి వెళ్ళినట్టయితే విడాకులు మంజూర అవుతాయి. ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. చక్కటి సమన్వయంతో ఉండండి ఇంకా ఇంకా బాగుంటుంది.

తులా రాశి: తులా రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు చంద్రుడు బాగున్నారు. షష్ట స్థానంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రవి కేతువులు బాగున్నారు వెరసి ఐదు గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. దైవభక్తి పెరుగుతోంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి ధన ఆదాయం పెరుగుతోంది జీవితాశయం నెరవేరేటటువంటి సమయం వచ్చింది. అనుకోని విధంగా లాభాల బాటలో ఉన్నారు మీరు మృష్టాంద భోజనాలు ఉన్నాయి . శత్రువుల యొక్క బాధలు తగ్గిపోతున్నాయి. ఇలా ఎన్నో రకాలుగా మీకు విజయావకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నానండి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. అలాగే గురుబలం కూడా పెంచుకోవడానికి గురువు గారి స్తోత్ర పారాయణాలు చేసుకోండి ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నానండి.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి నవమస్థాన సంచారంలోని గురువుగారి యొక్క స్థితి సంచారము చాలా బాగుంది.
నాలుగు గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది. సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇవి చాలా మానసిక ఆనందాన్ని తెచ్చిస్తాయి. స్థిర చరాస్తుల రూపకంగా గాని ఓర్పు కలిగి ఉండండి ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను.

ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితులు ఏమైనా ఉన్నాయా అంటే లాభ స్థానంలో శుక్ర చంద్రులు బాగున్నారు అలాగే తృతీయ స్థానంలో రాహువు బాగున్నారు. వెరసి ఈ మూడు గ్రహాల యొక్క ఉనికి మాత్రమే బాగున్నదండి. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే సంయమనం పాటించండి ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. కొంచెం ఉద్రేక స్వభావాన్ని తగ్గించుకోండి సంయమనం పాటించండి. ఉద్యోగ జీవితంలో కాస్త రిలాక్సేషన్ వస్తుంది ఎన్నో రకాలుగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి కావలసినటువంటి గ్రహస్థితులు ఇంకా మీకు పూర్తిగా అనుకూలత రాకపోవడం కారణం చేత ఇక్కడ గురువుగారికి స్తోత్ర పారాయణాలు చేయండి.

Weekly Rasi Phalalu
Weekly Rasiphalalu: అక్టోబర్ 4 నుంచి 10 వరకు వార రాశిఫలాలు.. ఈ రాశులకు ధనలాభం, వారికి కీలక నిర్ణయాలు!

మకర రాశి: మకర రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే తృతీయ స్థానంలో శని గారు బాగున్నారు. షష్ట స్థానంలో కుజుడు బాగున్నారు. సప్తమ స్థానంలో గురువుగారు బాగున్నారు అలాగే దశమ స్థానంలో శుక్ర చంద్రులు ఇద్దరు బాగున్నారు. వీరికి ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తుంది స్థిరచరాస్తుల వృద్ధి కనిపిస్తుంది. మాతృవర్గ రీచ బాగుంటుంది లలిత కళల రీచ్య బాగుంటుంది. ధన యోగాలు బాగున్నాయి. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతోంది. పితృవర్గ రీత్యా బాగుంది వివాహం కాని వారికి వివాహం జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితంలో పూర్తి సంతృప్తితో ఉంటారు. ధనము ఊహించని విధంగా వస్తుంది శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ అదృష్టం వల్ల మీకు చాలా సంతృప్తికర జీవితం ఉంటుంది.

కుంభరాశి: కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే స్పష్టంగా కనిపిస్తుంది. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. అయితే లలిత కళలలో కొంచెం ప్రవేశం ఉన్నవారికి సైతం బాగుంటుంది. కళాకారులకి చాలా బాగుంటుంది. రాశిలో ఉన్నటువంటి రాహువు గాని సప్తమంలో ఉన్నటువంటి కేతువు షష్టంలోఉన్నటువంటి గురువుగారు గాని ద్వితీయంలో ఉన్నటువంటి శని గారు గాని ఏమాత్రం శుభ ఫలితాలని ఇవ్వబోవడం లేదు. ఉండబోయేటటువంటి పరిస్థితి కాదు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి.

మీన రాశి: మీన రాశి వారికి షష్ట స్థానంలో ఉన్నటువంటి రవి కేతువు అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు వెరసి ఈ నాలుగు గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగున్న కారణం చేత వీరికి అనుకోని విధంగా విజయావకాశాలు ఉన్నాయి. విలువైన వస్తువుల్ని చేజిక్కించుకునే పరిస్థితి అది కొనుగోలు ద్వారా అవ్వచ్చు. పోటీ పరీక్షలలో వీరికి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని చెప్పవచ్చు.

Ravinuthala Bhakti

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.