Skip to content
MARKET UPDATE

SENSEX: 73,598.67, change ▼ −8.08 (−0.01%). Source Yahoo Finance, as of 27 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,678.00, change ▼ −71.75 (−0.32%). Source NSE, as of 28 Oct 2026 9:14 AM IST. GOLD 24K / 999: ₹1,41,431 / 10g. Source IBJA, as of 27 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,29,551 / 10g. Source IBJA, as of 27 Oct 2026 PM IST. SILVER 999: ₹1,92,499 / kg. Source IBJA, as of 27 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

ఎంటర్‌టైన్‌మెంట్

‘డొరోతి’గా కార్తీక్ సుబ్బరాజ్ కొత్త సినిమా.. కీర్తి సురేష్‌తో ఆసక్తికర టైటిల్ టీజర్

కార్తీక్ సుబ్బరాజ్ కొత్త చిత్రం ‘డొరోతి’ టైటిల్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కీర్తి సురేష్ కీలక పాత్రలో కనిపించనుండగా, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

కార్తీక్ సుబ్బరాజ్ డొరోతి సినిమా అధికారిక టీజర్ పోస్టర్
‘డొరోతి’ అధికారిక టీజర్ పోస్టర్ | చిత్రం: Jio Studios, Sikhya Entertainment, Dhammam Films

విభిన్న కథలు, ప్రత్యేకమైన విజువల్ ట్రీట్‌మెంట్‌తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి ‘డొరోతి’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది.

ఈ సినిమాలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సనంత్, రిషికాంత్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. టైటిల్ ప్రకటనతో పాటు విడుదల చేసిన ప్రచార పోస్టర్‌లో ఎరుపు, నలుపు రంగులతో రూపొందించిన ఆర్ట్‌వర్క్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కథ ఏ నేపథ్యంలో సాగుతుందనే విషయాన్ని మేకర్స్ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు.

‘డొరోతి’ టైటిల్ టీజర్‌లో ఏముంది?

నిమిషం 28 సెకన్ల నిడివి ఉన్న అధికారిక టైటిల్ టీజర్‌లో కథను నేరుగా చెప్పకుండా పాత్రలు, పరిసరాల ద్వారా ఆసక్తిని పెంచారు. గ్రామీణ వాతావరణం, సైకిళ్లపై ప్రయాణించే పాత్రలు, ధూళి మధ్య సాగే యాక్షన్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. కీర్తి సురేష్ పాత్రకు సంబంధించిన చిన్న చూపును మాత్రమే ఇచ్చారు.

ఇది కథను పూర్తిగా పరిచయం చేసే ట్రైలర్‌లా కాకుండా సినిమా ప్రపంచం, మూడ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసే వీడియోలా ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ సినిమాల్లో కనిపించే విజువల్ శైలి ఈ టీజర్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

Rajinikanth jailer 2
Jailer 2 Box Office: రూ.666 కోట్లతో దూసుకెళ్తున్న రజనీకాంత్‌.. ‘2.ఓ’ రికార్డుకు ఇక రూ.25 కోట్లే దూరం!

‘డొరోతి’ చిత్రానికి సంగీత దిగ్గజం ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు. టీజర్‌లో ఆయన నేపథ్య సంగీతం దృశ్యాల ప్రభావాన్ని పెంచేలా ఉంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. తిరునావుక్కరసు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జియో స్టూడియోస్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్, ధమ్మమ్ ఫిల్మ్స్ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌తో భాగస్వామ్యంగా ఉన్నాయి. జ్యోతి దేశ్‌పాండే, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రచార పోస్టర్‌లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 అధికారిక ఎంపికకు సంబంధించిన గుర్తును కూడా చిత్రబృందం పొందుపరిచింది.

‘డొరోతి’ విడుదల ఎప్పుడు?

‘డొరోతి’ని సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కీర్తి సురేష్ పాత్ర ఎలా ఉండబోతోంది, టైటిల్‌కు కథతో ఉన్న సంబంధం ఏమిటనే వివరాలు రాబోయే ట్రైలర్‌తో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Adarsha kutumbam vs itlu arjun
AK47:‘ఆదర్శ కుటుంబం’ కోసం ‘ఇట్లు అర్జున’కు ఎన్నిసార్లు అన్యాయం? చిన్న సినిమాలకు థియేటర్లలో చోటేది?

Studio One Plus

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.