Skip to content
ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్: Vijaya Sai Reddy Comments ఒరిజినల్ రెడ్ల పార్టీ మాదే

ఆంధ్ర ప్రదేశ్: గతం లో అందరూ సమానమే అని పార్టీలు పెట్టేవారు. మనసు లో ఏమి ఉన్నా బయటకు మాత్రం మా బి.సి. లు, మా ఎస్.సి. లు మా ఎస్.టి.లు అని అనటం మొదలు పెట్టారు. మాజీ ఎంపీ Vijay sai reddy విజయసాయిరెడ్డి కొత్త పార్టీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను ఏర్పాటు చేయబోయే పార్టీ రాయలసీమ ప్రాంత అభివృద్ధి, ఆత్మగౌరవాన్ని ప్రధానంగా తీసుకుంటుందని చెప్పారు.

తన పార్టీ రాయలసీమలోని “ఒరిజినల్ రెడ్ల” పౌరుషం, ఆత్మగౌరవాన్ని కాపాడుతుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అదే సమయంలో తమ పార్టీ అన్ని కులాలు, మతాలను గౌరవిస్తుందని స్పష్టం చేశారు.

తాను ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో పార్టీ ఏర్పాటు చేయడం లేదని మరోసారి చెప్పారు. సమాజానికి ఉపయోగపడే యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది? Singeetam-Chiranjeevi
Singeetam-Chiranjeevi: సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది?.. రెండు షెడ్యూల్స్ తర్వాత ఆగిపోయిన ‘భూలోకవీరుడు’ వెనుక షాకింగ్ కథ

రాయలసీమ అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత రాజకీయ నాయకత్వాన్ని కూడా vijay Sai reddy విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతానికి ఎన్ని నీటి ప్రాజెక్టులు వచ్చాయి, ఎంత అభివృద్ధి జరిగింది అనే అంశాలను ప్రస్తావించారు.

రెడ్డి కార్పొరేషన్‌కు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం త్వరగా భర్తీ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమలో వలసలు, నీటి సమస్యలు, సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రత్యేకంగా మాట్లాడారు.

టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా తన కొత్త పార్టీ నిలుస్తుందని విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో మూడో రాజకీయ వేదిక అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

AC మధ్యలో ఆగిపోతుందా? అసలు సమస్య ఇదే కావచ్చు! CAR AC Problem
CAR AC Problem: కారు AC మధ్యలో ఆగిపోతుందా?.. 10 నిమిషాల తర్వాత మళ్లీ పనిచేస్తే కారణాలు ఇవే

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.