Skip to content
వార్తలు

Neti Dina phalaalu: నేటి దినఫలాలు 15వ తేదీ సెప్టెంబర్ నెల 2026

Neti Dina phalaalu: శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః 15వ తేదీ సెప్టెంబర్ నెల 2026వ సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు.

మేషరాశి: మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది అంటే ఏలినాటి శని జరుగుతోంది గురు బలం లేదు రాహువు గారి యొక్క స్థితి సంచారం బాగుంది కేతువు గారి యొక్క స్థితి సంచారం బాగాలేదు చంద్రుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తు స్తున్నారు కుజుడు మంచి ఫలితాన్ని ఇస్తున్నారు బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. కానీ ఈ ప్రధాన గ్రహాల బలాలు లేకపోవడం వల్ల ఆరోగ్యం లోపం కనిపిస్తుంది. శారీరక రుగ్మతలు లేదా మానసిక రుగ్మతలు మీ మీద అభియోగాలు ఇలాంటివన్నీ మీరు ఇప్పుడు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే చాలా గట్టివైన ఆలోచనలతో ఉంటారు కాబట్టి ఎదుర్కోగలుగుతారు. సంయమనం పాటిస్తూ ఉండండి. దూరప్రాంత ప్రయాణాలు ఉంటాయి ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి. తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము అన్ని బాగుంటాయని చెప్పడానికి రాదు ఇక్కడ అర్ధాష్టమ గురు సంచారము ఒక్క ఫలితాన్ని మటుకు మంచిగా ఇస్తుంది అది ఏది ఒకటి అనేది తెలియదు కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే జరిగే మంచి జరుగుతుంది. ఉన్నానండి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి నవధాన్యాలు దానం చేయండి వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి.

వృషభ రాశి వృషభ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే షష్ట స్థానంలో చంద్రుని యొక్క స్థితి బాగుందిలాభస్థానంలో శని గారి స్థితి బాగుంది మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేదు అననుకూలత ఉన్నది. ఈ గ్రహాల యొక్క బాధలు అవి ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కూడా సద్గురువుల ఆశ్రమాలకు వెళ్లడము ఆశీస్సులు తీసుకోవడం కుదరలేని వారు ఏం చేస్తారు నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకుంటారు వినడమైనా చేయండి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి అలాగే పాలతో పరవాన్నం తయారు చేయండి పాయసం పరవాన్నం క్షీరాన్నం ఏదైనా సరే పాలతో తయారు చేసేటటువంటి తీపి పదార్థం పరవాన్నాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి భక్తులకి వితరణ చేయండి.

మిధున రాశి: మిధున రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు తృతీయంలో రవి కేతువులు బాగున్నారు చతుర్థంలో బుధుడు బాగున్నారు పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు వెరసి ఐదు గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది వీరికి ఉద్యోగ జీవితం చాలా చాలా చాలా బాగుంది మంచి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. కుటుంబ జీవితం బాగుంది అలాగే మాట బాగుంది పరపతి బాగుంది ధనము వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాస్త ఉద్రేక స్వభావం కనిపిస్తోంది ఇదొకటి మీరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి కష్టం ఏదైనా ఉంటుందా అంటే వాటన్నిటిని మీరు తట్టుకోగలుగుతారు. అనేక విధాలుగా మంచి జరిగేటటువంటి రోజులు కాబట్టి ఒక జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకొని దాని గురించి కృషి చేయండి కచ్చితంగా మీ సంకల్పం నెరవేరుతుంది.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి మూడు గ్రహాల యొక్క ఉనికి కూడా కర్కాటక రాశికి చాలా బాగుంది. అని చెప్పాలి. వీరికి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి చక్కటి మంచి పేరు వస్తుందండి మీరు ఎంత కష్టపడుతూ ఉన్నారో ఆ కష్టానికి తగినటువంటి విజయం లభిస్తుంది ధనము లభిస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి పరపతి పెరుగుతుంది. ధన ఆదాయం పెరుగుతుంది వాక్కు బాగుంటుంది. మానసికమైనటువంటి ధైర్యం సాహసం దృఢత్వం ఇవన్నీ పెరుగుతున్నాయి అలాగే స్వగృహ నిర్మాణానికి సంబంధించి చాలా వరకు పనులన్నీ ముందరికి వెళ్తున్నాయి. చతుర్ధంలో శుక్రాచార్యుల వారు ఉండడము ఒకరికొకరు కేంద్రంలో రెండు శుభగ్రహాలు ఉన్నాయ అంటే

Kaifiyattulu: కైఫీయత్తులు అంటే ఏమిటి? మీ ఊరి చరిత్ర మొత్తం ఇందులోనే.. అసలు ఈ పుస్తకాల్లో ఏం ఉంటుంది?

సింహరాశి: సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమన్నా ఉన్నాయా అంటే తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు. వ్యయస్థానంలో గురువుగారు బాగున్నారు లాభస్థానంలో కుజుడు బాగున్నారు ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా చాలా బాగుంది అయితే నాలుగు గ్రహాలు బాగున్నాయి. కదండీ మంచి ఫలితాలు ఉంటాయి కదా అంటే అసలైనటువంటిది రాశిలో కేతువు ఉన్నారు రాశిని చూస్తూ రాహువు ఉన్నారు. అష్టమ స్థానంలో శని గారు ఉన్నారు తృతీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు మరి నాలుగు గ్రహాలు కూడా అంత అంత బలకరంగా లేకపోతున్న కారణం చేత ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఏదైనా నవ నవగ్రహాల హోమం చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ గ్రహస్థితులు ఏవి కూడా అంత అనుకూలంగా లేని కారణం చేత అననుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది.

కన్యరాశి: కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయి అంటే ద్వితీయంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు ఇది చక్కటి పరిస్థితి గ్రహాల పరిస్థితి అలాగే లాభస్థానంలో గురువుగారు ఉన్నారు షష్ట స్థానంలో రాహువు ఉన్నారు వెరసి మూడు గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుందని చెప్పాలి. అలాగే ఏదైనా లాభాల బాటలో అంటే లాభం అంటే మీరు పెట్టుబడి పెడితే వచ్చేది లాభము మీరు మంచి ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసి దాని తాలూకు విజయావకాశాలని గ్రహించడం అనేది మరొక లాభం అవుతుండంగా ఇక్కడ రెండు రకాలైన లాభాలు కూడా మీకు ఉన్నాయి. శని గారికి తైలాభిషేకం చేయించండి అలాగే హనుమాన్ చాలీసా చదవండి. ఇంకా 2027వ సంవత్సరం జూన్ నెల వరకు కూడా శని గారి యొక్క స్థితి సంచారము మీన రాశిలో ఉంటున్న కారణం చేత ఈ రాశి వారికి అంటే సప్తమ దృష్టి చేత చూస్తూ ఉంటారు కాబట్టి కన్యారాశి వారికి అంత అనుకూలమైన పరిస్థితి కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి.

తులా రాశి: తులా రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్ర చంద్రులు ఇద్దరు కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. అలాగే లాభస్థానంలో రవి కేతువులు బాగున్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన సంచార ఫలం. షష్ట స్థానంలో శని గారు చాలా బాగున్నారు. ఇన్ని గ్రహాలు ఈ విధంగా అనుకూలిస్తున్నాయి అంటే మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని విధంగా మీకు జరుగుబాటు ఉంటుంది. మనశశాంతి ఉంటుంది అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ధనాదాయం ఉంటుంది. మీరు మనసులో సంకల్పం చేసుకున్నదే ఆలస్యం ఆ పనులన్నీ కూడా విజయావకాశాల వైపు దరితీస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి లాభాల బాటలో ఉన్నారు. మంచిగా లాభాలు పొందుతున్నారు ఆనందం పొందుతున్నారు. మన సంకల్పం అనేది నెరవేరుతోంది ఊహించని విధంగా ధన లాభాలు వస్తున్నాయి కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి అలాగే ఈ పోరాట పటిమ పెరుగుతోంది పోరాటాలలో కూడా విజయం సాధిస్తున్నారు ఎన్నో విధాలుగా బాగుంది.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారండి దశమ స్థానంలో ఉన్నటువంటి రవి బాగున్నారు ఏకాదశంలో బుధుడు బాగున్నారు ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు వెరసి నాలుగు గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. గురువుగారి యొక్క స్థితి సంచారము నవమ స్థానంలో ఉచ్చలో ఉండడం చేత కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఓర్పు కలిగి ఉండండి స్థిర చరాస్తుల వృద్ధికి మరింత పాటుపడాల్సి ఉంటుంది. ఇక సంతాన విషయంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నానండి.

ధనస్సు రాశి: ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు తృతీయంలో రాహువు మాత్రమే బాగున్నారు అలాగే లాభ స్థానంలో చంద్ర శుక్రులు బాగున్నారు రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి అనుకోకుండా ధనము ఖర్చుఅయ్యేటటువంటి పరిస్థితి అయితే మీకు అన్నదమ్మల సహాయ సహకారాలు బాగుంటాయి. ధన లాభాలు గాని వస్త్ర లాభాలు గాని వస్తు లాభాలు గాని కీర్తి ప్రతిష్టలు గాని వీటిలలో కొంత లాభాల బాటలో ఉంటారు మీకు మీరు అలాగే అనుకోని విధంగా ఏదైనా ఇంకా ఇబ్బందులు ఏమనా వస్తున్నాయా అంటే గురు బలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి. గురు బలం ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి బాగాలేదు గురువుగారు రాశిలో ఉచ్చలో ఉన్నారు కాబట్టి బాగుంది కొన్ని అయినా మేలైన ప్రయోజనాలు కనిపిస్తాయి.

Vinayakudiki Garika enduku ishtam: వినాయకుడికి గరిక ఎందుకు అంత ఇష్టం? దీని వెనుక ఉన్న పురాణ కథ ఇదే!

మకర రాశి: మకర రాశి వారికి అనుకూలమైనటువంటి వంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే అన్ని అనుకూలంగానే ఉన్నాయి తృతీయ స్థానంలో శని గారు బాగున్నారు షష్టంలో కుజుడు బాగున్నారు సప్తమంలో గురువుగారు బాగున్నారు అలాగే దశమ స్థానంలో శుక్ర చంద్రులు బాగున్నారు ఎప్పుడైతే ఐదు గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందో ఉద్యోగ జీవితం బాగుంటుంది. ధన లాభాలు ఉన్నాయి వస్త్ర లాభాలు ఉన్నాయి వస్తు లాభాలు ఉన్నాయి.

కుంభరాశి: కుంభరాశి వారికి మనము ప్రతి రోజు చెప్పుకుంటూ ఉన్నాము. అనేక రకాలుగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి ద్వితీయంలో రాహువు బాలేదు సప్తమంలో కేతువు బాలేదు అలాగే సప్తమంలో రవి గారు బాలేదు. షష్టంలో గురువు బాలేదు పంచమ స్థానంలో కుజుడు బాలేదు ద్వితీయంలో శని గారు బాలేదు ఏలినాటి శని జరుగుతూ ఉండగా ఇలా గ్రహ స్థితులు రాహు కేతువులు గాని శని గారు గాని గురువుగారు గాని బలము లేకపో పోవడం చేత ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి నవగ్రహ హోమం చేసుకోండి ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా ఉండండి కుటుంబ జీవితం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. అలాగే పరుల యొక్క సహాయ సహకారాలు అందుకునే ముందర వీరి నుంచి మనము ఈ సహకారం సహాయం తీసుకోవచ్చునా అని ఆలోచించండి.

మీనరాశి: మీనరాశి వారికి షష్ట స్థానం యోగిస్తోంది అష్టమ స్థానం యోగిస్తుంది అలాగే పంచమ స్థానం యోగిస్తూ ఉన్నది చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాము. గురువుగారి యొక్క ఫలితాలు బాగున్నాయి. రవి కేతువుల యొక్క ఫలితాలు బాగున్నాయి శుక్రాచార్యుల వారి యొక్క ఫలితాలు కూడా చాలా చాలా బాగున్నాయి. అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ప్రత్యేకంగా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము అంతగా బాగుండదు కానీ ఇక్కడ శుక్రాచార్యుల వారితో కలసి ఉన్నందువల్ల కళ్ళలలో చక్కటి ప్రతిభ కనిపిస్తుంది. విజయవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి బలాన్ని దృఢత్వాన్ని కలుగజేస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి.

Ravinuthala Bhakti

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *