Chandrababu Naidu: IT Man నుంచి Water Man వరకు – ఒక రాజకీయ, అభివృద్ధి వ్యూహం ఎలా మారింది?
ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అంటే వెంటనే గుర్తొచ్చేది IT, Cyberabad, HITEC City, Microsoft, e-Governance, global investments. 1990ల చివర్లో హైదరాబాద్‌ను technology destinationగా position చేయడంలో ఆయన ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. అప్పట్లో కూడా ఎలినినో ప్రభావం తో కరువు వచ్చినప్పుడు ఇప్పుడు వ్యవసాయం దండగ, వరి కాకుండా వర్షాధార పంటలు వేసుకోండి అని చెప్పారు. కాని ప్రతి పక్షం వాళ్ళు మాటర్ అంతా కట్ చేసి, బాబు వ్యవసాయం దందగ అన్నారు అని ఆడిపోసుకున్నారు. ఇక ఐటి సెక్టార్ విషయానికి వస్తే…..
HITEC City 1998లో ప్రారంభమైంది తర్వాత సైబరాబాద్, ఐ.టి. పార్క్ లు, గ్లోబల్ టెక్నాలజి కంపెనీలు, infrastructure-led urban growth అనే model ఆయన political brand లో భాగమైంది.
కానీ 2026 నాటికి అదే చంద్రబాబు మరో ఇమేజ్ ను సృష్టిస్తున్నారు. అదే “Water Man”. ఈ మార్పు కేవలం branding change కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ-ఆర్థిక అవసరాలు మారిన దానికి ప్రతిబింబం.
మొదటి దశ: IT ఎందుకు ఆయనకు political identity అయింది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో చంద్రబాబు దూర దృష్టి లో పట్టణాల ఎదుగుదల చాలా ముఖ్యమైనది .ఐ.టి. సెక్టార్ ద్వారా ఉద్యోగాలు, విదేశీ పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ ద్వారా ప్రపంచం దృష్టి పడవచ్చు అన్నది బాబు ఆలోచన. హైదరాబాద్‌కు రోడ్లు, టెలికం ఇంఫ్రా స్ట్రక్చర్, బిజినెస్ పార్క్ లు, convention facilities, technology clusters build చేయడం ద్వారా ఒక “state as a corporate destination” model తీసుకువచ్చారు. ఆ ఇమేజ్ వల్ల ఆయనను “CEO CM”గా కూడా పిలిచారు. కానీ ఇక్కడే ఒక limitation కూడా ఉంది. IT growth ప్రధానంగా పట్టణాల ఆదాయాన్ని పెంచుతుంది. కానీ రైతు, నీటి ఆధారిత గ్రామాలకు, అలాగే కరువు ప్రాంతాలకు నీటి ద్వారానే వస్తుంది. అందుకే ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత చంద్రబాబు ముందున్న చాలెంజ్ పూర్తి గా డిఫరెంట్.
రాష్ట్ర విభజన తర్వాత ఈక్వేషన్ మారింది.
2014 తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ లేదు. భారీ సర్వీస్ సెక్టార్ టాక్స్ బేస్ లేదు. కొత్త రాజధాని అవసరం ఉంది. అదే సమయంలో పెద్ద ఎత్తున వ్యవసాయం మీద ఆధార పడ్డ రైతులు, కరువు ప్రాంతం అయిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తా నీటి వనరులు ఇన్ బాలన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నీరు ఇంఫ్రస్త్రుచ్తురె మాత్రమే కాదు — political capital కూడా అయింది. రోడ్, ఐ.టి.పార్క్, డేటా సెంటర్ కన్నా గ్రామీణ ఓటర్ కి కాలువ లో నీరు కనిపిస్తే ఆ ఇంపాక్ట్ వెంటనే ఉంటుంది.
ఇక్కడినుంచే “IT Man” imageకి parallelగా “water delivery leader” ఇమేజ్ బిల్డ్ అవుతుంది.
పోలవరం ఎందుకు సెంట్రల్ పిల్లర్ అయింది?
పోలవరంను ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ గా చూడటం కష్టం. Polavaram Project Authority ప్రకారం, ప్రాజెక్ట్ సాగు, తగు నీటి కెపాసిటి సుమారు 4.37 లక్షల హెక్టార్ లు, 960 మెగా వాట్ల హైడ్రో పవర్, 611 గ్రామాల లో సుమారు 28.5 లక్షల మంది కి త్రాగు నీరు , 80 TMC ల గోదావరి జలాలని కృష్ణ బేసిన్ కి దివెర్త్ చేయడం వంటి అనేక మార్గాలు కలిగి ఉంది.
అంటే పోలవరం లో లో మూడు విభాగాలు ఉన్నాయి: Agriculture + Drinking Water + River Redistribution. రాజకీయ లబ్ది లో ఇది చాలా కీలక పరిణామం. ఒక ప్రాజెక్ట్ ద్వారా కోస్టల్ ఇరిగేషన్, కృష్ణా బేసిన్ stabilization, విశాఖ త్రాగునీటి అవసరాలు, పరిశ్రమల విద్యుత్ — అన్నిటినీ లింక్ చేయవచ్చు. అందుకే చంద్రబాబు దృష్టి లో పోలవరం జీవనాడి.
పోలవరం లాంటి భారీ ప్రాజెక్ట్ ల విషయం లో పునరావాసం, భూసేకరణ, ఆనకట్ట భద్రత, కాలువ పూర్తి చేయడం, వ్యయ పెరుగుదల, అంతర్రాష్ట్ర సమస్యలు అన్నీ సమపాళ్ళ లో చేయాలి. అప్పుడే ఫలితం వస్తుంది. అంటే “Water Man” image sustainable కావాలంటే water release visible కావాలి, దీనిలో భాగమే వెలిగొండ ప్రాజెక్ట్: symbolism ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్ వెలిగొండ.
చంద్రబాబు 1996లో శిలాఫలకం వేసిన ప్రాజెక్ట్ తొలిదశ ని 2026 ఆగస్టు 31న ఆయన స్వయంగా ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అధికారిక/పబ్లిక్ నివేదికలు ప్రకారం తొలి దశ లో జంట సొరంగాలు, ఫీడర్ కాలువ పనులు పూర్తయ్యాయి; కృష్ణా జలాల ను నల్లమల సాగర్ కు తీసుకెళ్లే సామర్ధ్యం వచ్చింది. 30 సంవత్సరాల క్రితం శిలాఫలకం వేసి అదే ప్రాజెక్ట్ మొదటి దశ పూర్తి చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకే Veligonda చంద్రబాబు కి భావోద్వేగ రుజువు.
వెలిగొండ వలన ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లా ప్రజల దాహార్తిని తీరుస్తుంది. వెలిగొండ ద్వారా శ్రీ శైలం జలాలను మళ్ళించి సాగు త్రాగు నీటి అవసరాలను తీర్చవచ్చు. ఇలాంటి ప్రాంతాల్లో నీరు రావటం అంటే వ్యవసాయ భద్రత, భూగర్భ జలాల పెంపు, త్రాగునీటి అవసరాలు తీరతాయి. దీంతో భూమి విలువ పెరుగుతుంది. వలసలు తగ్గుతాయి. గ్రామాలలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంటే నీటిపారుదల ప్రాజెక్ట్ ఆర్థిక వ్యవస్థ పై అనేక రకాల లాభాలను ఇవ్వగలదు.
హంద్రి నీవ:
Handri–Neeva సుజల స్రవంతి లాంటి ప్రాజెక్ట్ లు కృష్ణా జలాలను రాయల సీమ లాంటి కరువు ప్రాంతాలకు తీసుకు వెళ్ళే భాగమే. 2026లో చంద్రబాబు నీటి పారుదలా శాఖ రివ్యూ లలో హంద్రి–నీవ, పొలవరం, వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ లు, భూగర్భ జలాల పెరుగుదల అన్నిటినీ ఒక సమీకృత ఎజెండా గా review చేశారు. ఇది project-by-project approach నుంచి రాష్ట్ర వాటర్ గ్రిడ్ ఆలోచన కి దారితీస్తుంది.
2026లో ప్రభుత్వం వంశధార–నాగవళి, నాగవళి–చంపావతి అనుసంధానానికి డెడ్లైన్ పెట్టింది. పోలవరం పూర్తయ్యాక గోదావరి జలాలను క్రింది స్థాయి వరకు తీసుకు వెళ్ళటానికి అధికారులకు టార్గెట్లు ఇచ్చారు. ఆ ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందంటే….
నది → జలాశయం → కాలువ → చెరువు → భూగర్భ జలం → వ్యవసాయ క్షేత్రం → త్రాగునీరు ఈ chain work అయితేనే ప్రతిబొట్టును ఒడిసి పట్టుకోగలం. బాబు ప్లాన్ ప్రకారం భారీ నీటిపారుదల ప్రాజెక్ట్లు వార్తల్లోకెక్కేలా చేస్తాయి. జలధార, జలహారతి వంటి కార్యక్రమాలు “Water Man” కు బ్రాండ్ ఇమేజ్ ని తెస్తాయి. ఇది కూడా రాజకీయాలలో భాగమే…ఎంత అభివృద్ధి చేస్తే అంత ఈజీ అవుతుంది ఆ తరువాత. బాబు వ్యూహం ప్రకారం నీటి పారుదల ప్రాజెక్ట్ ల వలన గ్రామీణ ప్రాంత ఓట్లు, అలగే డేటా సెంటర్, ఐ.టి. జాబ్స్ వలన అర్బన్ లో కూడా వోట్లు కొల్లవచ్చు అనేది వ్యూహం. ఎందుకంటే గ్రామీణ వోటర్లు చంద్రబాబు కంటే జగన్ నే నమ్ముతారు. ఎందుకంటె వాళ్ళలో చాలా మంది కి చదువు రాదు. ఇంత టెక్నాలజి తెలియదు.
IT Man vs Water Man:
IT model లో:
మూలధనం → కంపెనీలు → ఉద్యోగాలు → పట్టణ వృద్ధి
Water modelలో:
ప్రాజెక్ట్ → నీటిపారుదల → పంట దిగుబడి → గ్రామీణ ఆదాయం → స్థానిక ఆర్థిక వ్యవస్థ
1.మొదటిది అధిక వృద్ధి నమూనా.
2. రెండోది విస్తృత ప్రాతిపదిక జీవనోపాధి నమూనా
Chandrababu ప్రస్తుత వ్యూహం ఈ రెండింటినీ కలపాలని చూస్తోంది. ఒకవైపు డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఏఐ, పెట్టుబడులు…మరోవైపు నీటిపారుదల, నదుల అనుసంధానం, భూగర్భ జలం, త్రాగునీరు. ఈ కలయిక విజయవంతం అయితే ఆయన రాజకీయ బ్రాండ్ “సాంకేతికత + వ్యవసాయ మౌలిక సదుపాయాల నాయకుడు”గా ఎదగ వచ్చు. కానీ “Water Man” ఇమేజ్ కి మూడు పెద్ద సవాళ్లు
మొదటిది: పూర్తి విశ్వసనీయత. ప్రాజెక్ట్ ల ప్రారభోత్సవాలతో సరిపోదు తర్వాత ప్రతి ఆయకట్టు వరకు నీరు చేరాలి.
రెండోది: భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు భారీ మూలధన వ్యయం అవసరం. రుణం, నష్టపరిహారం, మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు దీర్ఘకాలిక ఒత్తిడిని సృష్టిస్తాయి.
మూడోది: వాతావరణ వైవిధ్యం. నదుల అనుసంధాన ప్రణాళిక సాంకేతికంగా ఉన్నా, source basin లో సంవత్సరం పొడవునా నీటి లభ్యత మారవచ్చు. అందుకే వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి ప్రణాళిక కీలకం.
నీరు వచ్చిన తర్వాత పంట ప్రణాళిక, మార్కెట్ లభ్యత, నిల్వ, ప్రాసెసింగ్ పరిశ్రమలు, రైతు ఆదాయ వ్యూహం లేకపోతే పూర్తి ఆర్థిక ప్రయోజనం రాదు. ఇక్కడే నిజమైన పాలన పరీక్ష ఉంటుంది.
సైబరాబాద్ ఇప్పటికే చరిత్ర పుటల్లో కి ఎక్కింది.
Hyderabad I.T. ని అభివృద్ధి చేయటం లో ఆయన పేరు శాశ్వతం గా లిఖించబడింది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో శాశ్వతం గా పేరు లిఖించడం కోసం పోలవరం, వెలిగొండ, నదుల అనుసంధానం రాజకీయ అవకాశాలు కల్పిస్తాయి. జాతీయ మీడియా కూడా ఈ మధ్య కాలం లో వెలిగొండ,పోలవరం ప్రాజెక్ట్ ల గురించి ఆయన ప్రయాణాన్ని “టెక్ గురు నుంచి వాటర్ మాన్”గా ఫ్రేం చేసింది. అంటే ఇది అంతర్గత రాజకీయ నినాదం మాత్రమే కాదు; దేశం మొత్తం దృష్టిని మరల్చింది.
Chandra Babu ఇప్పటికే “ఐ.టి.మాన్ గా గుర్తింపు పొందాడు కానీ “వాటర్ మాన్”గా గుర్తింపు పొందాలంటే రాబోయే రెండు సంవత్సరాలలో పూర్తి చేయాలి.
అందుకే ఈ కథ ఇప్పుడే ముగియలేదు.
సైబరాబాద్ ను డెవలప్ చేసిన నాయకుడు… నీటి భద్రత కలిగిన రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మిచగలడా?
ఇదే చంద్రబాబు careerలో next big test.




