Skip to content
ఎంటర్‌టైన్‌మెంట్

Irumudi నాకు ఎంతో రెస్పెక్ట్ తెచ్చింది.. బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో రవితేజ ఎమోషనల్

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో చిత్ర బృందం తాజాగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.

ఈ వేడుకలో రవితేజతో పాటు దర్శకుడు శివ నిర్వాణ, హీరోయిన్ ప్రియా భవాని శంకర్, సాయి కుమార్, అజయ్ ఘోష్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సహా చిత్ర బృందం పాల్గొంది.

“ఈ సినిమా నాకు విపరీతమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చింది”

ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ‘ఇరుముడి’ తన కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిందన్నారు.

సినిమా తనకు ఎంతో సంతృప్తితో పాటు ప్రేక్షకుల నుంచి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఈ విజయానికి ప్రధాన కారణం దర్శకుడు శివ నిర్వాణ అని రవితేజ పేర్కొన్నారు.

సినిమాలోని ఒక్కో సన్నివేశం గురించి ప్రేక్షకులు తనకు ఫోన్ చేసి వారి స్పందన చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. నటుడిగా ఈ సినిమా ఇచ్చిన ఫలితంపై గర్వంగా ఉందని తెలిపారు.

“ఇరుముడి అంటే శివ.. శివ అంటే శివ నిర్వాణ” అంటూ దర్శకుడిపై రవితేజ ప్రశంసలు కురిపించారు.

శివ నిర్వాణపై బీవీఎస్ రవి ప్రశంసలు

రైటర్, ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ ‘ఇరుముడి’ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని తెలిపారు. శివ నిర్వాణ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ అని ప్రశంసించారు.

దర్శకుడిని నమ్మిన హీరో, కథను నమ్మిన నిర్మాతలు ఉన్నప్పుడు మంచి సినిమాలు వస్తాయని చెప్పారు. రవితేజ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని, ఆయనకు కథను అర్థం చేసుకునే సామర్థ్యం అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు.

Bigg Boss 10: జబర్దస్త్ నరేష్ బిగ్ బాస్ 10 లో కి ఎలా అడుగు పెట్టాడు?

సాయి కుమార్ పోషించిన గురుస్వామి పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. జీవీ ప్రకాష్ సంగీతం కూడా ‘ఇరుముడి’ విజయానికి ప్రధాన బలాల్లో ఒకటని తెలిపారు.

“రవితేజ తప్ప మరో హీరోను ఊహించుకోలేం”

రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ ‘ఇరుముడి’ కథను తొలిసారిగా విన్న వారిలో తానే ఒకడినని చెప్పారు.

కథ విన్నప్పుడే సినిమా భారీ విజయం సాధిస్తుందని భావించినట్లు తెలిపారు. సినిమాలో రవితేజ పోషించిన పాత్రకు ఆయన కాకుండా మరో హీరోను ఊహించుకోవడం కష్టమని పేర్కొన్నారు.

కమర్షియల్ ఫార్ములాలు, ఐటెమ్ సాంగ్స్ లేకపోయినా మంచి కథను నిజాయితీగా తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ‘ఇరుముడి’ మరోసారి నిరూపించిందన్నారు.

“థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనేది నిజం కాదు”

నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని చెప్పారు.

కథలోని బలమైన భావోద్వేగాలు, నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు ‘ఇరుముడి’ విజయానికి కారణమయ్యాయని తెలిపారు. ఈ విజయంతో మంచి కథలకు థియేటర్లలో ఎప్పటికీ ఆదరణ ఉంటుందని మరోసారి నిరూపితమైందన్నారు.

గురుస్వామిగా వచ్చిన గుర్తింపు మర్చిపోలేను: సాయి కుమార్

సాయి కుమార్ మాట్లాడుతూ ‘ఇరుముడి’లో తనకు గురుస్వామి పాత్ర ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణకు కృతజ్ఞతలు తెలిపారు.

తిరుపతికి వెళ్లినప్పుడు కూడా అభిమానులు తనను ‘గురుస్వామి’ అంటూ పలకరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ సినిమాకు ప్రేక్షకులు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.

OTT: Releases This Week: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ‘పంచనామా’ వరకు.. ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, సిరీస్‌లు ఇవే!

వైరల్‌గా మారిన పాటలు

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ ‘ఇరుముడి’కి సంగీతం అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

గీత రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ తాను రాసిన ‘యాలాల’ పాటకు సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చిందన్నారు. హుక్ స్టెప్ లేకపోయినా పాటపై పెద్ద సంఖ్యలో రీల్స్ రావడం ప్రేక్షకుల ఆదరణకు నిదర్శనమని తెలిపారు.

హీరోయిన్ ప్రియా భవాని శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా విజయంలో భాగం కావడం ఆనందంగా ఉందని, తనకు సహకరించిన రవితేజ, శివ నిర్వాణతో పాటు చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

“నిజాయితీగా సినిమా చేస్తే విజయం వస్తుంది”

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ నుంచి అనేక మంది ఫోన్ చేసి ‘ఇరుముడి’ని ప్రశంసిస్తున్నారని తెలిపారు.

రవితేజతో ఇలాంటి సినిమా చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఒక పనిని నిజాయితీగా చేస్తే విజయం తప్పకుండా వస్తుందని తాను నమ్ముతానని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కథలతో సినిమాలు చేస్తానని తెలిపారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవి మాట్లాడుతూ ‘ఇరుముడి’కి ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని, సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Studio One Plus

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *