Vinayaka chaviti: వినాయకుడి తొండం ఎటు వైపు ఉంటే ఏం జరుగుతుంది?: వినాయక చవితి వస్తుందంటే రక రకాల ఆకారాలలో వినాయకుళ్ళు తయారైపోతారు, బాహుబలి వినయాకుడు అని, గబ్బర్ సింగ్ వినాయకుడు అని, సోల్జర్ వినాయకుడు అని ఇలా అనేక రకాలు గా తయారు చేసి విగ్రహాలు అమ్ముతారు. అయితే అన్ని వేలు పోసి విగ్రహం కొనే ముందు మనం కొన్ని చూసుకోవాలి. ముఖ్యంగా వినాయకుడిని భక్తి తో కొలవాలి. విగ్రహం చూస్తే భక్తి భావం పెరగాలి. ఎదో స్కూటర్ ఎక్కిన వినాయకుడు, బాహుబలి వినాయకుడు. సీసాలతో వినాయకుడు. ఇలా చేయటం ద్వారా భక్తి భావం పెరగదు, పైగా రాబోయే తరాలకు మనం రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది. ఇక విగ్రహాలు కొనే ముందు, స్వామి వారికి యజ్ఞోపవీతం అంటే జంధ్యం ఉందా లేదా అనేది చూడాలి. ఈ మధ్య కాలంలో జంధ్యం అంటే కేవలం బ్రాహ్మణులు వేసుకుంటారు అని కుల పిచ్చి తో చాలా బొమ్మల్లో యజ్ఞోపవీతం వేయటం లేదు. కావాలంటే మీరు కొన్ని బొమ్మలలో చూడండి. ఇది చాలా తప్పు. మనం పూజ చేసేటప్పుడు, యజ్ఞోపవీతం సమర్పయామి అని చదువుతాం…అంటే అది ఎంత పవిత్రమైనది. గాయత్రి మాత శక్తి అంతా ఆ జంధ్యం లో నే ఉంటుంది. అప్పుడే ఆ శక్తి పెరుగుతుంది. ఇక కొన్ని విగ్రహాల తొండాలు కుడి వైపుకు తిరిగి ఉంటాయి. కొన్ని ఎడమవైపుకు తిరిగి ఉంటాయి.
ఎడమ వైపు తొండం తిరిగి ఉంటే దానిని వామ ముఖ గణపతి అంటారు. ఇలా ఉంటే శాంత స్వరూపుడు, సాధారణ పూజకు ప్రసన్నుడు అవుతాడు, చంద్ర నాడికి సంకేతం, గృహంలో పెట్టుకోడానికి సరైనది. సుఖశాంతులు, అభివృద్ధి కలుగుతాయి.
కుడివైపు తొండం తిరిగి ఉంటే దానిని దక్షిణాభిముఖి గణపతి అంటారు. ఈయన ఉగ్ర స్వరూపుడు, అత్యంత కఠినమైన నియమ నిష్టలతో పూజలు చేయాలి, కాబట్టి సాధారణంగా ఈ విగ్రహాలు ఇళ్లలో కాకుండా దేవాలయాలలో లేదా ఆశ్రమాలలో మాత్రమే ప్రతిష్టిస్తారు.
కాబట్టి ఈ వినాయక చవితి కి ఇంట్లోకి స్వచ్చమైన మట్టితో చేసిన, ఎడమ వైపు తొండం ఉన్న వినాయకుడిని తెచ్చుకుని మనసారా భక్తి తో పూజిద్దాం….




