Rashmika రష్మిక విజయ దేవరకొండ Vijay Devarakonda ల పెళ్ళి దేస వ్యాప్తం గా సంచలం రేపిన సంగతి తెలిసిందే….అయితే ఆ తర్వాత రష్మిక గాయం నుంచి కోలుకుని తిరిగి తన పనిలో నిమగ్నమయ్యెందుకు సిద్ధమైంది. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా రష్మిక తన గాయం, విశ్రాంతి సమయంలో విజయ్ దేవరకొండతో గడిపిన సమయం గురించి సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
‘‘పెళ్లయిన తర్వాత మూడు నెలల పాటు మేమిద్దరం ఒకరినొకరు చూసుకోలేదు. కేవలం ఫోన్‌లోనే మాట్లాడుకునేవాళ్లం. ‘కాస్త విశ్రాంతి ఇద్దాం. నిన్ను ఇంట్లోనే ఉంచుతా’ అని విశ్వమే ఇలా నాకు గాయం అయ్యేలా ప్లాన్ చేసిందేమో అనిపించింది. విజయ్‌కు సీరియస్ డ్రామాలు, షోలు చూడటం ఎక్కువగా ఇష్టమని.. తనకు మాత్రం కొరియన్ డ్రామాలు అంటే చాలా ఇష్టమని రష్మిక వెల్లడించారు. ఈ క్రమంలో విజయ్‌కు కూడా కే-డ్రామాలు అలవాటు చేశానని సరదాగా చెప్పారు.
పెళ్లయ్యాక మేమిద్దరం కలిసి ఎక్కువ సమయం గడపడం ఇదే తొలిసారి. ఇది వినడానికి వింతగా అనిపించినా.. నాకు ఈ సమయం చాలా నచ్చింది. ఇద్దరం కలిసి ఇంట్లో ఆనందంగా గడిపాం. విజయ్‌కు ఎక్కువగా సీరియస్ డ్రామాలు, షోలు ఇష్టం. నాకేమో కే-డ్రామాలు అంటే పిచ్చి. మేమిద్దరం రెండూ చూశాం. ఆయనకు కూడా కే-డ్రామాలు అలవాటు చేసేశా” అని రష్మిక సరదాగా చెప్పారు. విజయ్ తనను ఎప్పుడూ ఆటపట్టించేవాడని రష్మిక గుర్తుచేసుకున్నారు. ‘మనం ఇలా ఎన్నో రోజులు గడపాలి. కానీ, ఎలాంటి గాయాలు లేకుండా’ అంటూ జోక్స్ వేసేవాడని చెప్పారు. విశ్రాంతి తీసుకున్న రోజులు ఎప్పటికీ మంచి జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయని తెలిపారు.
‘మైసా’ చిత్రీకరణ సమయంలో రష్మిక గాయపడ్డారు. షూటింగ్‌లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా తుంటి భాగంలో బలమైన గాయమైంది. దీంతో కొన్ని వారాలు విశ్రాంతి తీసుకున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని నవంబరు 27న పాన్ ఇండియా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఇక పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటిస్తోన్న ‘రణబాలి’ అక్టోబర్ 16న విడుదల కానుంది.




