Skip to content
భక్తి

Sri Mahalakshmi:శ్రీ మహా లక్ష్మి అష్టోత్తర శతనామావళి భాష్యం

Sri Mahalakshmi: మహా లక్ష్మి అష్టొత్తర శతనామావళి భాష్యం. ఈ అష్టోత్తర శతనామావళి భాష్యాన్ని మొట్టమొదటి గా రచించిన వారు భార్గవి బూదరాజు (M.A.Telugu, M.A.,Astrology, B.Ed).ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మిక వేత్త, అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొంది అనేక రచనలు చేస్తూ ఆధ్యత్మిక వెలుగును పంచుతూ ఉన్నారు. అనేక మంది మహాను భావులు అనేక భాష్యాలు రచించారు, కాని మహా లక్ష్మి అష్టొత్తర శతనామావళి భాష్యాన్ని సామాన్యులకు సైతం అర్ధం అయ్యే రీతిలో రచించి బ్రహ్మశ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ గారి చే ఈ పుస్తకం ఆవిష్కరింపచేసారు. ఆ కార్యక్రమంలో తాడూరి విశ్వేశ్వర రావు గారు భగవద్గీత ట్రస్ట్, జి.హరనాధ్ గారు, తి.తి.దే.ధర్మప్రచార పరిషత్, రవణం స్వామినాయుడు గారు, దర్శకులు వి.ఎన్.ఆదిత్య గారు లాంటి ప్రముఖల సమక్షంలో పుస్తకావిష్కరణ చెందినది. వెంకటదుర్గా మ్యూజిక్ యూట్యూబ్ చానల్ ద్వారా తన స్వీయ గానాన్ని ప్రజలకు చేరవేస్తూ, తమ జ్యోతిష్య ఫలాలాను స్టూడియో వన్ చానల్ ద్వారా అలాగే రావినూతల భక్తి ద్వారా ప్రతి రోజూ అందిస్తూ ప్రశంశలు పొందుతున్నారు. భర్త లక్ష్మి నరసింహం గారి ప్రోత్సాహంతో ముందుకు వెళుతున్నారు.

శ్రీ లక్ష్మీ శతనామావళి

శ్రీ ఓం  ప్రకృత్యై నమః

ఓం వికృత్యై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూతహిత ప్రదాయై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురభ్యై నమః

ఓం పరమాత్మికాయై నమః

ఓం వాచే నమః

ఓం పద్మాలయాయై నమః

ఓం పద్మాయై నమః

ఓం శుచ్చ్యై నమః

ఓం స్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓం హిరణ్మయై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం నిత్య పుష్ఠాయై నమః

ఓం విభావర్యై నమః

ఓం ఆదిత్యై నమః

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం వసుదాయై నమః

ఓం వసుధారిణ్యై నమః

ఓం కమలాయై నమః

ఓం కాంతాయై నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం క్రోధసముద్బావాయై నమః

ఓం అనుగ్రహప్రదాయై నమః

ఓం బుధ్ధ్యై నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓం అమృతాయై నమః

ఓం దీప్తాతయై నమః

ఓం లోకశోకవినాశిన్యై నమః

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓం లోకమాత్రే నమః

ఓం పద్మ ప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓం పద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓం పద్మముఖ్యై నమః

ఓం పద్మనాభ ప్రియాయై నమః

ఓం రమాయై నమః

ఓం పద్మమాలాధరాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం పద్మిన్యై నమః

ఓం పద్మగంధన్యై నమః

ఓం పుణ్యగంధాయై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం ప్రసాధాభిముఖై నమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓం చంద్రసహోదర్యై నమః

ఓం చతుర్ఖుజాయై నమః

ఓం చంద్రరూపాయై నమః

ఓం ఇందిరాయై నమః

ఓం ఇందుశీతలాయై నమః

ఓం ఆహ్లాదజనన్యై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం దారిద్య్రనాశిన్యై నమః

ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః

ఓం శాంతాయై నమః

ఓం శుక్లమాల్యాంబరాయై నమః

ఓం శ్రియై నమః

ఓం భాస్కర్యై నమః

ఓం బిల్వనిలయాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం యశశ్విన్యై నమః

ఓం వసుంధరాయై నమః

ఓం ఉదారాంగాయై నమః

ఓం హేమమాలిన్యై నమః

ఓం హరిణ్యై నమః

ఓం ధనధాన్యకర్యై నమః

ఓం సిద్ధై నమః

ఓం సైణసౌమ్యాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశ్మగతా నందాయై నమః

ఓం వరలక్ష్మ్యై నమః

ఓం వసుప్రధాయై నమః

ఓం శుభాయై నమః

ఓం హిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్ర తనయాయై నమః

ఓం జయాయై నమః

ఓం మంగళాయై నమః

ఓం దేవ దేవ్యై నమః

ఓం విష్ణు వక్షస్థల స్థితాయై నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓం ప్రసనాక్ష్యై నమః

ఓం నారాయణ సమాశ్రితాయై నమః

ఓం దారిద్య్రద్వంసిన్యై నమః

ఓం దేవ్యై నమః

ఓం సర్వోపద్రవవారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః

ఓం భువనేశ్వర్యై నమః

1. ప్రకృత్యై నమః

          ప్రకృతి స్వరూపమైన అమ్మకు నమస్కరిస్తూ ఈ చరాచర జగత్తు అంతా ఆవరించి వున్న త్రిగుణాత్మక స్వరూపమైన అమ్మ కనుసన్నలలో చలించు చున్న ఈ ప్రకృతి అమ్మ రూపముతో అమ్మనామముతో నిబిడీకృతమై యుండగా ఈ ప్రకృతి అమ్మగానే గోచరించు చున్నది కావున ప్రకృతి స్వరూపిణియైన అమ్మకు నమస్కారములు. సూర్యచంద్రుల గమనము, వర్షాలు, ఎండలు, శీతలము, భూమి, ఆకాశము, సృష్ఠిలో అనంతమైన జీవరాశుల జీవన విధానాలు వీటన్నిటిపట్ల నిబిడకృతమై ఉన్న అమ్మ ప్రకృత్యై నమఃగా పూజలందు కొనుచున్నది.

2. వికృత్యై నమః

Todays Horoscope: నేటి దిన ఫలాలు

          ప్రకృతి రూపానికి అమ్మ ప్రతీక అటుýనే వికృతి రూపానికి కూడా అమ్మయే ప్రతికగా అలరారుచున్నది. దుష్ఠ శిక్షణ చేయుటలో ఉగ్రస్వరూపిణిగా దుష్ఠులను దునుమాడే అమ్మ వికృత్యై నమః అని కొనియాడబడుతూ వున్న అమ్మకు నమస్కారములు. ఉన్నది అమ్మయే లేనిదే అమ్మయే, కదిలిపోయేది, స్థిరంగా నిలచేది, ప్రతీకదలికా, అమ్మయే, కానీ స్థిరం అన్నమాట ఈ ప్రకృతిలో లేనే లేదు ప్రతీది చంచలమైనది నశించేది అందువల్లనే అమ్మ వికృత్యై నమః అలాగే పెరుగుదల, ఎదుగుదల, జీవము ఇవన్నీ కూడా అమ్మయే తిరిగి వాటిని నశింపజేయు శక్తికూడా అమ్మదే. అమ్మా నమస్కారములమ్మ.

3. విద్యాయై నమః

          సకల విద్యలకు అధిదేవతగా అలరారుతూ సమస్తమైన విద్యలను ఈ భూమిపైన జీవించియున్న మానవులకు అనుగ్రహిస్తూ ప్రతి విషయాన్ని గురించి జ్ఞానాన్ని కల్గిస్తున్న అమ్మ విద్యారూపిణిగా పూజలందు కొనుచూ భక్తులచే విద్యాయైనమః అనుచూ నమస్కారాలందుకొనుచున్నది. ప్రతిజీవికి జ్ఞానం అవసరం… లేనిచో పిచ్చివానివలె చరించును…. కాబట్టి విద్యల తల్లియై అలరారుచున్నది అనుటలో ఎటువంటి సందేహము లేదు. అమ్మా విద్యా జ్ఞాన బిక్ష నివ్వమ్మ ! నీ పాదములకు వేల నమస్కారములు సమర్పిస్తున్నామమ్మ.

4. సర్వభూతహిత ప్రదాయై నమః

          ఈ చరాచర జగత్తులోని సర్వప్రాణులు పంచమహా భూతములూ కూడా అమ్మ వాక్కుకై ఎదురు చూచు చూంటారు. అమ్మమాటను వేద వాక్కుగా పాటిస్తూవుంటారు. అందరికీ, అన్నివేళలా హితమును చేకూర్చే అమ్మగా అలరారుతూ భక్తుల హృదయం నిండా నిండి వుండి పూజలందుకొనుచున్న అమ్మకు నమస్కారములు. సమస్త భూతములయందు దయని చూపించగా తల్లివలె ఒడిి చేర్చుకుని తన శక్తిని ప్రసరింపజేస్తుంది. తనయొక్క చల్లని చూపుతో పునరుజ్జీవితులుగా జేస్తుంది. అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. సర్వజీవులచేత కొనియాడబడుతూ నమస్కారములు అందుకొనుచున్నది. అమ్మా ఈ సృష్ఠిని పరిపాలిస్తూన్న శ్రీమహావిష్ణువుకు ఇల్లాలై, భక్తులకు శుభాలను అనుగ్రహిస్తున్న శ్రీమహాలక్క్ష్మీ అజ్ఞానంతో కూడిన మా నడవడికను మార్చి మమ్ము నీదరికి చేర్చుకోవమ్మా.

5. శ్రద్ధాయై నమః

          శ్రద్ధ కలిగివున్నటు వంటిది, శ్రద్ధాసక్తులు కూడి అనంతమైన సృష్ఠిని అత్యంత నిపుణతతో నడిపిస్తూ తన చిద్విలాసము చేతనే జీవుల మనోరధాలపై ముద్రవేసుకుని కూర్చునియున్న పరమపావని, శ్రద్ధాయై నమః అనే నామముతో నమస్కారములు అందుకొనుచున్నది. కొండలు కోనలు, అడవులు, సరస్సులు, జనారణ్యము పశుపక్ష్యాదులు, రాళ్ళురప్పలు ఒకటేమిటి అనేక రకాల జీవకోటి ముక్తి చెందాలని కోరుకుంటూ అమ్మను అనేక రకాలుగా పూజించు చున్నారు. ఈ సృష్ఠికి మÖలము అమ్మయే అమ్మకున్నటువంటి శ్రద్ధ భక్తులపై, అనన్యము అమ్మా! నీ అనంత కల్యాణ గుణములలో ముఖ్యముగా మమ్ము ఆకట్టుకునేది, నీ శ్రద్ధయే తల్లీ దయాసాగరివై శ్రద్ధాయై నమః అని పూజలందు కొనుమమ్ము.

6. విభూతై్యౖ నమః

          విశ్వములోని రక రకాల విభూతులతో అలరారుతూ ప్రతి విభూతిలోనూ వాటి అంతరార్ధాలను తెలియ జెబుతూ అనేక రూపాలలోని విభూతిని ప్రస్తుతిస్తూన్న మంగళ రూపిణియైన అమ్మ విభూత్యై నమఃగా విలసిల్లుతూ భక్తులచే నమస్సులు అందుకుంటూ వున్నది.

7. సురభ్యై నమః

          సురభి, నందిని, కామధేనువు అను వివిధ నామాలతో అలరారుతూ గోవులలో శ్రేష్ఠమైన గోవుగా గోమాతగా విరాజిల్లుతున్న శ్రీమహాలక్ష్మి ఆవుపాలు, ఆవుపేడ, ఆవుమÖత్రం, ఆవుపేడ పిడకలు, ఆవునెయ్యిలలో నివసించుచు సురభ్యై నమః అనే నామంతో భక్తుల ప్రార్ధనలను స్వీకరించున్నది. గోమాతా నమోనమః భక్తులపై తమ బిడ్డలవలె అవ్యాజమైన ప్రేమను వర్షిస్తూ దయమృతమును కురిపిస్తూవున్న శ్రీహరి శ్రీదేవిల పాదపద్మములకు నమస్కారాలను అర్పిస్తూ వున్నాను. ఈ భూమిపై ప్రత్యక్షముగా కనబడుచున్న గోమాతను సేవించి తరించాలి. శ్రీమహాలక్ష్మి గోవు పృష్ఠభాగములో నివశిస్తూ, ఇలలో పూజలందు కొనుచున్నది పాల సముద్ర మధనంలో కామధేనువు పేర జనియించిన గోమాత శ్రీదేవికి సహోదరియై ఒప్పారు చున్నది. సకల పూజలలో గోపూజ శ్రేష్ఠమైనదిగా అలరారు చున్నది. గోవుయొక్క గిట్టలలో డెక్కలలో, చెవులలో, మÖపులో కనులలో ముఖములో, తోకభాగములో, ప్రక్కలలో సకల దేవతలు నివశిస్తారు. అనేక శుభాలతో కూడిన గోమాతను పూజించుట ద్వారా భక్తులు శ్రీమహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుచున్నారు.

8. పరమాత్మికాయై నమః

          ఈ జగత్తులోని అణువణువు పరమాత్మయే…ఈప్రకృతి నంతా ఆవరించి వున్నటువంటి పరమాత్మయొక్క ఇల్లాలైనటువంటి శ్రీలక్క్ష్మి పరమాత్మికగా పరమాత్ముని హృదయ పీఠమందు ఆశీసురాలై భక్తులందరికీ తమ తమ యోగ్యత ననుసరించి అదృష్టమును అందిస్తున్నది. అటువంటి పరమాత్మికకు వేల నమస్కారాలు.

9. వాచే నమః

          మాట్లాడే ప్రతి మాటలోనూ పదాలలోనూ ప్రతిబీజం లోను అలరారుతూ అక్షరము నకు అధిదేవతగా విలసిల్లుతున్న, సుందరమైన సుసంపన్నమైన వాగ్దేవతా, వాచేనమః అను ప్రార్ధనలతో పూజింప బడుతూ నమస్కారాలందు కొనుచున్నది. వాచికమునకు లోకములో విపరీతమైన విలువవున్నది. భాషకి ఉన్న గౌరవము, అర్ధము, వాడే పదజాలమును బట్టి మనిషి విలువ పెరుగుచున్నది. అలాగే శబ్దానికి ప్రత్యేక విలువలు, అర్థాలు వున్నాయి. వీటికి అధిదేవతయై ఒప్పారుచున్న అమ్మ ఈ జీవకోటికి శబ్దాన్ని పదాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము.

10. పద్మాలయాయై నమః

          కొలనిలోని పద్మాలు అనేక దళాలతోనూ రంగులతోనూ, కేసరాలతోనూ, పుప్పొడితోనూ సువాసనలీనుతూ భక్తులను ఆకర్షిస్తూ వుంటాయి. పద్మానికి అంతటి సొగసు ఎలా వచ్చిందంటే శ్రీ లక్ష్మీ నివాస స్థానమై ఒప్పారింది. కనుకనే అమ్మను పద్మాలయాయై నమః అని స్తోత్రాలతో స్థుతిస్తూ వుంటాము. ఇంతటి అదృష్టం గొన్న పద్మము ఎంతటి అదృష్టవంతురాలో కదా! ఎంతటి బురదలో జన్మించిననూ ఆ మాలిన్యము పద్మములకు తాకదు. వాటి పవిత్రతా తగ్గదు. జ్ఞానమునకు ఆలవాలమై ఒప్పారుతున్నది. అమ్మ పద్మాలయా మమ్ము దీవించు తల్లి !

11. పద్మాయై నమః

పద్మంవంటి ముఖ మండలము రేకులవంటి కనుదోయి సువాసనలీనే పద్మము యొక్క సుకుమారము లాటి సుకుమారము కల్గిన తనువు…పద్మమును చూడగానే భక్తుల హృదయములో కలిగే భావనాతరంగాలు అమ్మకూడా ఈ విధంగానే వుంటుంది కదా, అనే ఆలోచనలే, అంతేకాదు పద్మాల సోయగము అమ్మ అందు నివసించుట చేతనే అంతటి సోయగం అని పద్మాలు గర్వడుతున్నట్లుగానూ, పద్మాలు కూడా అమ్మ సౌందర్యానికి పాదాక్రాంతమోతుండగా అమ్మ పద్మాయై నమఃగా పూజింపబడుచున్నది. పద్మము ఒక ఆకర్షణ, పద్మము ` జ్ఞానము.

12. శుచ్యై నమః

          మలినం లేని మాలిన్యంకాని పదార్ధము ఈ సృష్టిలో ఏమైనా వుందా అంటే అది పరమాత్మ ఒక్కటే నిష్కల్మషముగా స్వచ్చమైన, సుందరమైన పరమాత్మిక శుచ్ఛై నమః అనే నామముతో అలరారుచున్నది. కల్మషములేని స్వచ్ఛమైన, సుందరమైన, పసిపిల్లల బోసినవ్వులను బోలిన అమలినముయైనది శుచి ఐనటువంటి, శుభత్వము అమ్మకు కాక మరి ఎవరికి వుంటుంది శుచ్చ్యై నమః అని భక్తులచే నీరాజనము లందుకుంటున్న శ్రీదేవికి వేల నమస్కారాలు తెల్పుచున్నాను.

13. స్వాహాయై నమః

          సృష్ఠించేది తానే, స్థితినొందించేది తానే చివరకు లయం చేసేది కూడా తానే అవుతూ, ఈ చరాచర జగత్తును తనలోనే కలిపేసుకుంటూ తిరిగి జీవుల పునరుత్పత్తిని గావిస్తూన్న అమ్మను స్వాహాయై నమః అంటూ భక్తులు పూజించుచున్నారు. అగ్ని దేవుని భార్య స్వాహాదేవి గొప్ప పతివ్రతామ తల్లి శ్రీ మహాలక్ష్మి కళలను సంతరించుకున్న సాద్వి, యజ్ఞయాగాలలో శ్రీదేవిని స్వాహాయైనమఃగా భక్తులు పూజిస్తారు ఋత్విక్కులు కొలుస్తారు.

14. స్వధాయై నమః

          అద్భుతమైన అనన్యమై గొప్పదైన, లీలా విలాసమైన ఈ బ్రహ్మండ మండలమంతా నిండి వుండిన అపూర్వ శక్తిగల్గిన అమ్మ చక్కని తేజస్సుతోనూ, వర్ఛస్సుతోనూ స్వధాయై నమః అని నమస్కారములు అందుకుంటున్నది. బ్రహ్మ మహేశ్వర, అగ్ని, వరుణ యమ, వాయు ఇంద్రాదుల చేతను, సమస్త ఋషుల చేతనూ ప్రతినిత్యమÖ స్తుతించబడే అమ్మ, సమస్తమైన సంపదలను, ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చి ఆశీర్వదించుచున్నది. స్వచ్ఛమైన అమ్మ చిరునవ్వు, చల్లని చూపు, చక్కని రూపము, కళలకు నిలయము, విద్యలకు కాణాచి సంతానమును ప్రసాదించగల్గిన అమ్మ, అనేక గొప్పవైన గుణాలతో అలరారుచూ, భక్తుల వేల కోట్ల నమస్కారములు అందుకొనుచూ, అశీర్వదించుచున్నది.

15. సుధాయై నమః

          క్షీరసాగరమును దేవతలు దానవులు కలిసి మధించినపుడు ఆసాగరమునించి ఆవిర్భవించిన, అమృతములో నిబిడీకృతమైన శక్తి ఏదైతేవుందో ఆశక్తే అమ్మగా, అమ్మే ఆ శక్తిగా ఒక్కటై సుధాయై నమఃగా ప్రార్థనలు అందుకుంటున్నది. జీవకోటికి ప్రాణప్రదాత అగుచూ అమృతత్వాన్ని అనుగ్రహిస్తున్నది. అమ్మా మమ్ము శక్తిహీనులను చేయకమ్మా.

16. ధన్యాయై నమః

          సిరులనిచ్చు తల్లి శ్రీమహాలక్ష్మి సంపదలిచ్చు తల్లి వరమహాలక్ష్మి కోరిన కోరికలెల్ల తీర్చే కనక మహాలక్ష్మి ధన్య అనే నామముతో కీర్తింపబడుతూ భక్తుల హృదయాలయాలలో నెలకొని ప్రార్థనలు స్వీకరిస్తూ నమస్కారాలందు కొనుచున్నది. ఓ! శ్రీమహాలక్క్ష్మీ నిలువెత్తు నీ రూపమునకు, చేతులు ముకుళించి ప్రార్థిస్తున్నామమ్మా.

17. హిరణ్మయాయై నమః

          సువర్ణమయమై మణిమయశోభితయై ఇరుప్రక్కలా గజములతో అభిషేకింప బడుచున్న చంద్ర సహోదరి, అమృతమయ అహ్లాదప్రియా ఓ! గజలక్క్ష్మీ క్షీరధారలతో అభిషేక జలముతో కీర్తిస్తున్న ప్రార్థిస్తున్న భక్తుల హృదయాలను బంగారంలాటి గుణములతో తీర్చిదిద్దుతూ హిరణ్మయాయై నమః అని పూజింపబడు శ్రీ మహాలక్ష్మికి ఇవే మా నమస్కారములు.

18. లక్ష్మై నమః

          క్షీర సాగర మధనంలో ఉద్భవించిన ఉచ్ఛై శ్రవము, ఐరావతము, అమృతము, చంద్రుడు ఇత్యాది వన్ని లక్ష్మిదేవికి తోడుగా జన్మించినవి. అవి వున్న ప్రదేశాలూ లక్ష్మికి స్థానాలే. వైకుంఠనాధుని సహధర్మచారిణిగా వెలసిన లక్ష్మి సకల సంపదలకు సకల సద్గుణాలకు కాణాచిగా అలరారు చున్నది. ఆశ్ర్రీమహాలక్ష్మిని లక్ష్మైనమః అని ప్రార్థిస్తూ పూజిస్తూ సంపదలు ఐశ్వర్యం, సౌభాగ్యం ఇవ్వమని కోరుకుందాం నమస్కారాలు అందుకోమ్మా శ్రీ మహాలక్క్ష్మీ.

19. నిత్యపుష్ఠాయై నమః

          సర్వశుభంకరి తనని పూజించు భక్తుల మనో భీష్టాలను నెరవేరుస్తూ వారికి అంత్యములో సద్గతులను కలిగిస్తున్న ఓ శ్రీదేవి లోకములో నిందలేని విధంగా నిత్య సంతుష్టులను గావిస్తూ ప్రతిరోజూ ఒకనూతనోత్సహంతో పరిఢవిల్లేటట్లుగా ఈ భక్తులను ఆశీర్వదించు తల్లీ నిత్యపుష్టాయై నమః అని కీర్తింపబడుచున్నావు నీ గుణాలను భక్తులకు ప్రసాదించుతూ ధైర్యాన్ని ఇస్తూ భయాన్ని లేకుండా చేస్తూ నమస్కారలందు కుంటున్నావమ్మా నిత్యపుష్టా! నీకివే వేల నమస్కారాలు.

20. విభావర్యై నమః

          ఈ చరాచర సృష్ఠిలోని సంపదలను, అందాలను, ఎంతో వైభవోపేతముగా సృష్ఠించి అవి అందుకునే అర్హత వున్నవారికే వాటిని అనుభవింపగలిగే ప్రాప్తంను ఇస్తూ వైకుంఠంలో వైభవముతో తులతూగే అమ్మ ఎక్కడ వుంటే అక్కడే సౌందర్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించగలదని భక్తులు మనసారా విభావర్యైనమః అని ప్రార్థిస్తున్నాము. రాత్రి… అనగా చీకటి పగలూ అమ్మయే… (చీకటి) రాత్రీ అమ్మయే… అంటే అమ్మ కాల రూపిణి. ఈ రోజు సూర్యోదయం నుంచి మరు రోజు సూర్యోదయం వరకు గల ఆరు కాలాలు ప్రాతః కాలం, ఉషోదయ కాలం, మధ్యాహ్న కాలం, అపరాహ్ణకాలం, సాయం కాలం, నిశి కాలం, వేళలు ఇలా సాగే రోజుకు అమ్మయే ప్రతినిధి… ఈ విధంగా అమ్మ కాల రూపిణి… భక్తులచే నిరంతరం పూజలందుకునే అమ్మ విభావర్త్యై నమః అని ప్రార్థనలు స్వీకరిస్తున్నది.

21. ఆదిత్యై నమః

          అనంతమైన, ప్రేమని కురిపించుటలో అమ్మకు అమ్మయే సాటి ఈ జీవులపైన అపారదయా దృష్ఠి కురిపించుచూ అమ్మవెల లేని ప్రేమని అందించుచూ దయా సాగరి, కృపా సాగరీగా విలసిల్లుతూ వున్నది. ఈ భూమిపైన నివసిస్తున్న బిడ్డలకు తల్లిగా అనిర్వచనీయమైన ప్రేమని కురిపిస్తున్న శ్రీ మహాలక్ష్మి ఆదిత్యై నమః అంటూ పూజలందు కొనుచున్నది. సృష్ఠికి మÖలం అమ్మ అంటూ దేవతలనించి జీవుల వరకు ఈ చరాచర సృష్ఠికి అలంబనగా అమ్మ అలరారు చున్నది.

22. దిత్యై నమః

          కాశ్యప ప్రజాపతి భార్యదితి.. సాక్షాత్తు లక్క్ష్మీస్వరూపము అందువల్లనే… దిత్యై నమః దిచేయనమః అనే భక్తులు పూజిస్తున్నారు భక్తులు అనేక రకాల నామాలతో అనేక రూపాలలో అనేక విధములైన అలంకరణలు చేసి శ్రీమహాలక్ష్మిని పూజిస్తారు భక్తుల మనసులో ఒక భావన ఉంటుంది మనం అమ్మని పూజిస్తున్నాం కదా ఈ పూజ అమ్మకి చేరుతుందా అమ్మ మనని కరుణిస్తుందా అనే ప్రశ్నలు వస్తాయి, అమ్మ తప్పక కరుణిస్తుంది, మన సమస్యలకు సమాధానం వస్తుంది, మన కష్టాలు తీరుతాయి అని వారు భావిస్తారు, అందువల్లనే దిత్యై నమః అని మహాలక్ష్మిని కొలుస్తారు. అమ్మ నమస్కారాలు అందుకో తల్లి.

23. దీప్తాయై నమః

          దేదీప్యమానమైన దీపకాంతుల ప్రకాశంతో వెలుగులు విరజిమ్ముచున్నట్లుగా, అజ్ఞానాంధ కారములను పారద్రోలి మానసిక వికాసాన్ని కలిగిస్తున్నట్లుగా దీపం యొక్క గుణము ఎలా వెలుగు చున్నదో అమ్మ యొక్క గుణాలు అంతే అద్వితీయత పొందుచున్నవి. భక్తులు దీప్తాయైనమః అంటూ శ్రీమహాలక్ష్మిని స్తుతిస్తూ ఆదీపాల ప్రజ్వలనలోనే అమ్మ నివసిస్తున్నదని నమ్ముచూ స్తుతించు చున్నారు. అమ్మా మమ్ము జ్ఞానవంతులను చేయమ్మా.

24. వసుధాయై నమః

          ఈ సమస్త భూమండలాన్ని తన తలపై మ్రోయగల, మోయుచున్న భూదేవికి గల ఓర్పు, బలము శ్రీమహాలక్ష్మికి కూడా ఉన్నాయనుటలో సందేహము లేదు ఆతల్లికి  తనయగా జన్మించి తన నామములలో ఒకటిగా వసుధాయై నమః అనే నామముతో గూడా బాసించుచున్నటువంటి శ్రీమహాలక్ష్మికి వేల వేల నమస్కారములు తెలియ జేయుచున్నాను. ఓర్పు సహనం మనిషికి ఉండవలసిన ముఖ్య లక్షణాలుగా చెప్పవచ్చు అటువంటి ఓర్పుగానీ సహనంగాని భూదేవికి ప్రధమంగా ఉన్నాయనుట భూజాత కూడా ఈ లక్షణాలతో ఒప్పారుచున్నదని తెలియజేయుచున్నాను.

25. వసుధారిణ్యై నమః

          భూదేవి రూపములో శ్రీమహాలక్ష్మిని కొలుచుచున్నాము. ఈ చరాచర జగత్తు అంతటికీ మÖలకారణంబైన అమ్మ ఈ భూమిని జగత్తును తన తలపై పెట్టుకుంది అనుటలో లేశమాత్రమైననూ సందేహం లేదు ఈ భూమిని ధరించి, ఓర్పుగా నేర్పుగా వుంటూ భక్తులచేత వసుధారిణ్యై నమః అని పూజలందుకుంటున్న ఆ మహాలక్ష్మికి వేనవేల నమస్కారాలు చేస్తూ వున్నాము.

26. కమలాయై నమః

          నీళ్ళలో బురదలో పూచే పద్మము (తామరపూలు) కమాలాలు అనే పేరుతో ఒప్పారుచున్నవి. తీర్చిదిద్దినటువంటి కనులు కలిగిన అమ్మ ముఖార విందమును ఎంతచూచినను బిడ్డలమైన మనకు ఆభక్తి సౌందర్యములో నుంచి బయటకు రాలేము కమలములవంటి కోమలమైన సుందరమైన ముఖ పద్మము కమలామై నమః అని పూజింపబడుచు అనేక నమస్కారములు అందుకుంటున్న అమ్మకు వేల వేల వందనాలు. బురదలో పుట్టినప్పటికీ ఎటువంటి మలినములూ లేని, కేసరాలు, రేకులు, సుగంధమయమై పరిమళ భరితమైయున్న కమలాలు వాటి మధ్యన స్థితమైయున్న పీఠంపై అమ్మ కొలువై యుంటుంది. భక్తుల హృదయంలో స్థిర నివాసమేర్పరుచుకుని అమ్మ పూజలందుకొనుచున్నది. అనంతమైన విభూతులు కలిగిన అమ్మ కమలము యొక్క రేకులవలే సుకుమారమైన గుణాలతో ఒప్పారుచున్నది.

27. కాంతాయై నమః

          సుందరమైన వదనముతో, నల్లని ముంగురులతో ఒయ్యారముగా తన పతి ముందు తన అందచందాలను ఒలకపోస్తూవున్న ఈ కాంతామణి ఈ లోకాలకు ఆదర్శపత్నిగా, ఆదర్శ గృహిణిగా పూజింపబడుచున్నది. ఈ కాంత ఆ శ్రీకాంతుని కాంత మణిమయ రత్నరాసులు పొదగబడిన హారము ఎంత దేదీప్యమానముగా వెలుగులు చిందుతూవుంటుందో ఆ గుణాలను అలా పుణికి పుచ్చుకొని లక్ష్మిదేవి, మేరు  గంభీరము వలె కాంతాయై నమః అని ప్రజలచేత అత్యంతభక్తి ప్రవత్తులతో పూజలందు కొనుచూవున్న అమ్మకు వేల వేల నమస్కారములు.

28. కామాక్షై నమః

          ఆది మÖల రూపమైన కామాక్షీ అమ్మవారి నామముతో పూజించుట, ఆ జగదేక ధీరమాతయైన కామాక్షీని సేవించుట ఎన్నో జన్మల అదృష్టముగా భావించుచున్నాము. అమ్మా కాంతగా, కామాక్షిగా దేవదేవిగా ఏఏ రూపాలలో అలరారు చున్నా భక్తుల హృదయాలయలలో నీవు శ్రీమహాలక్ష్మివమ్మా !

29. క్రోధ సముద్భవాయై నమః

                    ఎక్కడ తన భక్తులు దారిధ్య్ర బాధ అనుభవిస్తారోనని వేయి కళ్ళతో కాపుకాసుకుని తన క్రోధత్వాన్ని ఆ భక్తుల దరిద్ర బాధ తీర్చుటకు వినియోగించే తల్లికి, చిరునవ్వుల సామ్రాజ్యమే తప్ప మరియొకటి లేదని భక్తులు గ్రహించి, క్రోధ సముద్భవాయై నమః అని నమస్కరిస్తూ మహాలక్ష్మికి వేల వేల నమస్కారములు చేయుచున్నారు. పంటలు పండాలని అలాగే తమ బ్రతుకులూ పండాలనీ, తమ తమ దారిద్య్రభాదలు తీరాలని, తమ సంతతి వృద్ధి చెందాలని, నాలుగు కాలాలపాటు తమ సౌభాగ్యాలు తరగని నిధి అవ్వాలని కోరుకునే భక్తులకు తుదిదాకా శుభములు చేకూరే విధంగా వుంచెడి మా తల్లి కరుణా కటాక్ష వీక్షణాలకు వేల నమస్కారాలతో ప్రార్థన చేయుచున్నాము.

          దేవేంద్రుని నుంచి వెళ్ళిపోయిన మహాలక్క్ష్మి వలన దేవేంద్రుడు తన వైభవాన్ని కోల్పోయాడు. శ్రీ మహాలక్క్ష్మి క్రోధంతో వెళ్ళిపోయి, తిరిగి పాల సముద్రం నించి ఉద్భవించినది. అమ్మ చల్లని చూపు లేకపోతే దేవతలకు సైతం వైభవం తరిగిపోతుంది. అమ్మ మా నమస్కారములు అందుకుని మాపై కరుణ చూపించుము.

30. అనుగ్రహ ప్రదాయై నమః

          ఈ చరాచర జగత్తు అంతా అమ్మదయ మీదనే ఆధారపడి వుంటుంది. అమ్మ కనుసన్నలలోనే నిలువబడి వుంటుంది. ప్రతి జీవికి కావల్సినది అమ్మదయనే అందుకొరకు ప్రతిక్షణం ప్రతి నిత్యం అమ్మని స్మరించుకుంటూ, పూజించు కుంటూ వుంటూ ఆ అమ్మ ఎప్ప్పుడెప్ప్పుడు అను గ్రహిస్తుందా? అని ఎదురు చూస్తాము, మన (భక్తుల) హృదయం నిండా అమ్మ రూపం, కన్నులనిండా అమ్మనిగాంచి నోరారా అమ్మనామాన్ని పలుకుచూ గానాన్ని చేస్తూ అమ్మ అను గ్రహాన్ని పొందుదాము. తన భక్తుల యొక్క భక్తిని చూసి అనుగ్రహాన్ని చూపించే అమ్మకు, సౌభాగ్యవృద్ధిని, ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్దిని అనుగ్రహించే అమ్మకు జన్మ జన్మలా ఋణపడుచూ వేల వేల నమస్కారములు చేయుచున్నాను.

          ఆర్తితో ఒక్కసారి అమ్మా అని పిలుస్తేచాలు తన బిడ్డయొక్క కష్టాలను తృటిలో తీసివేసి తనయొక్క కృపా కటాక్షవీక్షణాల ద్వారా భక్తులను బ్రోచేటి శ్రీమహాలక్ష్మి అనుగ్రహప్రదాయై నమః అని పూజలందు కొనుచున్నది.

31. బుద్దై నమః

          ఈ సృష్ఠిలో జీవుల మనుగడకు బుద్ది చాలా తోడ్పడుతుంది. అటువంటిబుద్ది అమ్మయైన శ్రీమహాలక్ష్మి అధీనములో వుంటుంది. సరస్వతిదేవి రూపములో బుద్ధిని అనుగ్రహిస్తూ వుంటుంది. అజ్ఞానుల మైన మేము, మాకు మంచి బుద్దిని ప్రసాదించమని అమ్మని వేడుతూ అమ్మని వేనోళ్ళ స్తుతిస్తున్నాము. బుద్ధై నమః అని పూజ లందుకుంటున్న శ్రీమహలక్ష్మీకి వేనవేల నమస్కారములు సమర్పిస్తున్నాను.

32. అనఘాయై నమః

          అనఘా అనగా పాపములను పోగొట్టినది. ఈజన్మలో చేసుకున్న పాపాలను జీవులకు ముందు జన్మలో అనుభవించవల్సి వుంటుంది. అట్లే కొన్ని పాపములు అప్పటికప్ప్పుడే అదే జన్మలో అనుభవించడము జరుగుతూ వుంటుంది. శ్రీమహాలక్ష్మిని కొలిచిన భక్తులకు అమ్మ అనఘాదేవిగా వారి వారి పాపములను సమÖలముగా తీసివేయుచు అనఘాయై నమః అను భక్తుల స్మరణను తీసుకొనుచూ వారిని ఆశీర్వ దించుచున్నది.

33. హరివల్లభాయై  నమః

          విష్ణుప్రియ, హరిప్రియ హరికి ప్రియరాణియైన శ్రీమహాలక్ష్మి ఉత్తమోత్తమమైన ఇల్లాలు, నిత్య సుమంగళి, పెద్దముతైదువ అమ్మలగన్నయమ్మ.. ప్రజలను కన్నబిడ్డలుగా కాపాడుచూ ఈ ప్రపంచానికి అమ్మయై సదా బిడ్డలను చల్లగాగాచే అమ్మ, హరికి ప్రియురాలిగా, విష్ణుమÖర్తి యొక్క మనసెరిగిన ప్రియధర్మపత్నిగా హరివల్లభాయై నమః అనే నామములతో కీర్తింపబడుచున్న శ్రీమాతకు వేనవేల నమస్కారాలు.

34. అశోకాయై నమః

          శోకాన్ని బాపుచుండే అమ్మ తనభక్తులకు అనేక విధాలుగా శుభాలు ఇచ్చు చున్నది. అమ్మని కొలిచిన భక్తులకు శోకము అనగా ధుఃఖము లేదు అని చెప్పటానికే అమ్మని అశోకాయై నమః అని కీర్తించు చున్నాము అమ్మకి వేనవేల నమస్కారములు.

35. అమృతాయై నమః

          మరణించిన వారిని తిరిగి బ్రతికించగలిగే ఔషదం సంజీవిని ఔషదమÖలికలైతే అసలు మరణం లేకుండా నిత్యయవ్వనంతో నిత్యనూతనంగా ఉంచగల ఔషదం అమృతం. అటువంటి అమృతం క్షీరసాగర మధనంలో లక్ష్మీదేవితో పాటే పాలసముద్రంలో జన్మించింది. అమ్మలాగే అవికూడ ప్రాణదానాలు చేసే ఔషదాలు కాబట్టి అమృతాయై నమః అని, అమ్మయైన శ్రీమహాలక్ష్మిని భక్తులందరూ అమృత హృదయం గల తల్లియని పూజిస్తూ, తనని నమ్మి కొలిచే భక్తులు కొంగు బంగారుగా బావిస్తూన్న శ్రీమహాలక్ష్మి అమృతాయై నమః అనే నామంతో అలరారు చున్నది.

36. దీప్తాయై నమః

          వేయికోట్ల సూర్యుల కన్నామిన్నగా కాంతులు వెదజల్లగలిగే దీప్తిమంతమైన అమ్మ ముఖార విందము అనేక విధములా అనేక రూపములతో అలరారుచుండగా, ఆ దివ్యకాంతుల వెలుగులలో అమ్మ రూపమును స్మరిస్తూ, పూజిస్తూ దీప్తాయై నమః అనే నామముతో అజ్ఞానమును పారద్రోలి జ్ఞానమును ప్రసాదించే వెలుగు…దీప్తి…. అని కొలుచుకుంటున్నాము శ్రీమహాలక్ష్మికి వేల వేల నమస్కారాలు.

37. లోకశోక వినాశిన్యై నమః

          అమ్మలగన్నయమ్మ అని, పెద్దముత్తైదువ అని, సౌభాగ్యాలను వృద్ధిచేయుతల్లి అని సిరిసంపద లిచ్చే తల్లి అని అనేక గుణాలతో అలరారు అమ్మ ఈలోకాలన్నీ పాలించే అమ్మగా పూజలందుకునే అమ్మ ఈలోకాలకి శోకాన్ని బాపడానికి, అమ్మ నిరంతరం భక్తులను రక్షిస్తూ లోకశోక వినాశిన్యై నమః అని పూజలందుకుంటూ ఉన్నది. అని చెబ్తూ అమ్మకు వేనవేల నమస్కారలర్పిస్తూ ఉన్నాము. ఈ జగమంతా సుఖ శాంతులతో వర్ధిల్లాలని కోరుతూ ఉన్నాము.

38. ధర్మ నిలయాయై  నమః

          ఎక్కడైతే, అది గృహమవనీ, కార్యాలయం అవనీ, ఏదైనాకాని, నీతి నిజాయితీ సత్పవర్తన, సత్యము, ధర్మము అచరించబడుచూ వుంటాయో వారి యందు శ్రీమహాలక్ష్మి నివశిస్తూ వుంటుంది. సకల సంపదలను భోగభాగ్యాలనూ ప్రసాదిస్తూవుంటుంది అనుటలో సందేహము లేదు. సత్య, ధర్మములు రెండూ సూర్యచంద్రులవలె ప్రకాశిస్తూ మనజీవితములను నిరంతరం ధర్మమార్గాన నడిపిస్తూవుంటాయి. అందుకు ఆధారభూతమైన శ్రీమహాలక్ష్మి ధర్మ నిలయాయై నమః అనే నామముతో అలరారుచూ భక్తుల నమస్కారాలను అందుకొనుచున్నది.

39. కరుణాయై నమః

          కరుణ రసాత్మకమైన నామముతో ఒప్పారుచూ అనంత దయారూపిణిగా అలరారుచూ, కరుణాయై నమః అని అనేక భక్తజనులతో కీర్తింపబడుతూ ఈ చరాచర భూమండల మునంతాను కరుణను ప్రసరింపజేస్తున్న శ్రీమహాలక్ష్మికి, కరుణాయై నమః అని నమస్కారాలర్పిస్తున్నాము. తెలిసి తెలియక భక్తులు చేసే తప్పులను సరిదిద్ది వారిపై కరుణను చూపిస్తున్న అమ్మా మమ్ము దీవించు.

40. లోకమాతై నమః

          ఈలోకాలన్ని సృష్ఠించినటువంటి తల్లి అమ్మలగన్నయమ్మ కరుణ రసాత్మకమైన హృదయముతో తన బిడ్డలను పాలించునది, కంటిని రెప్ప ఎలా కాపాడుతుందో భక్తులైన తన బిడ్డలను అమ్మకూడా అలానే నిరంతరం రక్షిస్తూ లోకమాతగా భక్తులచే పూజలందు కొనుచూ తన సృష్ఠిని కంటి కొసలవెంట చూపులతో కాచుచూ ఈ లోకాన అమ్మ అన్న, అమ్మలని గన్న అమ్మ అన్న, తనేగా లోక మాతైనమః గా కొలువబడుచున్నది.

          ఈ సృష్ఠిని సృష్ఠిచేసినది బ్రహ్మ దేవుడే అయినప్పటికీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని సృష్ఠించి వారికి సృష్ఠి స్థితిలయములనే విధులను ఏర్పరచి లోకాలకే మాతగా విరాజిల్లుచూ వేల నమస్కారాలు అందుకొనుచున్నది.

41. పద్మప్రియాయై నమః

          తామర కొలనులోని పద్మాలను అమ్మ ముఖము వలె ఉన్నాయని కవులు ఒక పోలిక చెప్తుంటారు. సువాసనలీనే పద్మాలు తాము అమ్మకి ఆసనముగా వుంటామని అనుకుంటూ తమకే ఆ ప్రత్యేకత వుందని అమ్మకి ప్రియమైన పుష్పాలము మేమేమని తమని తామే అభినందించు కొనుచూ ఆ సరస్సులలో ఒకదానికి మించి ఒకటి అనగా ఒకపద్మానికి మించి మరొక పద్మము భాసించుచూ ఉన్నవట నిజానికి శ్రీమహాలక్ష్మి కన్నులను కమలములతోనూ లేదా మీనములతోనూ కూడా పోల్చుతారు. శ్రీమాతకు పద్మములు ప్రియమైనవి అగుట చేత శ్రీమహాలక్ష్మి పద్మ ప్రియాయై నమః అనే నామముతో పూజలందు కొనుచు మురిసిపోవుచున్నది. తన భక్తుల హృదయాలలో సుందరమైన సువాసనలీనే ఎర్రనైనటువంటి పద్మముల మధ్య స్థిర నివాసినిగా వుండి సుస్థిరస్థానమును పొందియున్నది.

42. పద్మహస్తాయై నమః

          చేత పద్మాలను ధరించిన తల్లితో ఆపద్మములు కూడా పోటీ పడుచున్నాయట. అమ్మ అరచేతుల లాలిత్యంతో పూరేకుల లాలిత్యం వున్నదా ? అమ్మ అరచేతుల రంగులేత ఎరుపు రంగు వలె భాసించు చుండగా మా రేకుల వర్ణం కూడా సరిపడుచున్నదా ? అలాగే అమ్మ ముఖకమలము నుండి వెలుగు చిమ్ము కాంతులు, అమ్మచెంతన వున్న పద్మాలపైబడి అవి మరింతగా ప్రకాశిస్తున్నాయి తప్ప తమ సౌందర్యము అమ్మ సౌందర్యము ముందర ఎందుకు పనికి రాదను కొనుచూ, అమ్మయైన శ్రీ మహాలక్ష్మి హస్తమున అమరినటువంటి పద్మములు, అమ్మ భక్తులచే పద్మహస్తాయై నమః అనే నామముతో కీర్తింపబడుటను జూచి అమ్మచేతి నమరుటవల్ల మా జన్మలు ధన్యత చెందాయని తలపోయుచున్నవట. అమ్మా నమస్కారములు.

43. పద్మాక్షె í్య నమః

          అందమైన కనులు కలిగినటువంటి శ్రీమహాలక్క్ష్మీ…అసలు ఏది అందము కాదు నాసికాసొగసు సంపెంగవలె వుండగా, చెక్కిళ్ళు స్వచ్చమైన అద్దములవలె మెరయు చుండగా నుదుటన భాసించు ఎర్రని కుంకుమ ఉదయించుచున్న బాల సూర్యుని వలె కాంతి ప్రస్పోటనము చెందుచుండగా చేపవంటి చంచలమైన కన్నులు కలది, స్వచ్చమైన మనసుకలిగినది, అయిన అమ్మను పద్మాలవంటి, కనులు కలిగిన అమ్మగా స్థుతించుచున్నాము, నమస్కరించుచున్నాము.

44. పద్మసుందర్యై  నమః

          పద్మమువంటి అందమైన, అంతకు వెయ్యింతలుగా ఆకర్షనీయమైన ముఖ సౌందర్యముకు ఈ అశేష భక్తకోటి యంతయును దాసాను దాసులగుచున్నారు. పద్మసుందర్యై నమః అనే నామముతో ఒప్పారు చున్న శ్రీమహాలక్ష్మికి వేనవేల నమస్కారములు పద్మము వలే కోమలమైన ముఖమండలమును బ్రోలిన అమ్మ అద్భుత సౌందర్యము ఏ కవికీ చెప్పనలవి కాదు..అటువంటి అమ్మను భక్తులు ప్రేమతో ఈవిధముగా ఆరాదించుచున్నారు.

45. పద్మోద్భవాయై నమః

          పాలసముద్రాన్ని దేవ దానవులు చిలుకుచున్నప్ప్పుడు మందరగిరి పర్వతాన్ని కూర్మ రూపుడైన శ్రీమహావిష్ణువు తన మÖపులపై మోయచుండగా వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకుని దేవదానవులు పాలసముద్రాన్ని చిలుకుచుండగా, ఆసముద్రమునించి అమృతము, కామధేనువు, కల్పతరువు, ఇంద్రుని ఐరావతము, చంద్రుడు ఇత్యాదివన్నీ ఉద్భవించాయి. ఇక సముద్ర మధ్యభాగము నుండి శ్రీమహాలక్ష్మి ఎర్రని పట్టుచీరతో మెడనహారాలతో చెవులకు వజ్రాల దిద్దులు మెరయు చుండగా బంగారు గాజులు చేతులను అమరియుండగా కట్టెవంకీలు చేతిన ధరించి సమస్త వజ్రములు పొదగబడిన వడ్డాణముతో, చతుర్భుజములతో శరీరము నిండా దివ్యా భరణములు ప్రకాశిస్తూ వుండగా పద్మమునందు ఆశీనురాలై ఇరు ప్రక్కలా గజములు సేవించుచుండగా పాలసముద్రము నుండి ఉద్భవించిన అమ్మను భక్తులు పద్మోద్భవాయై నమః అని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుచున్నారు వేల నమస్కారములు చేయుచున్నారు. పద్మము అనగా జ్ఞానము, సౌందర్యము, అమలినము.. ఇలా ఎన్నో అర్ధాలు కలిగిన పద్మము నుండి అమ్మ ఆవిర్భావము జరిగినది కనుకనే ఆమె పద్మోద్భవా.

46. పద్మముఖై నమః

          ఎర్రని పద్మములవంటి ముఖమును పోలినదిగా వున్నటువంటి ఆ కమల దళాక్షిణి ముఖము కెంపుల రంగుతో అలరారు చుండగా, పద్మములు అమ్మముఖ కమలమును జూస్తు సిగ్గుపడుచున్నాయిట. అద్భుతమైన ఆముఖ వర్చస్సు తమకు లేకపోయినా అమ్మ ముఖమును పోలిన తమ ముఖములు చక్కగా వికసించుచుండ ఆ ముఖార విందమును అమ్మదయగా పద్మములు ప్రార్థిస్తూవుండగా శ్రీమహాలక్ష్మిని పద్మముఖై నమః అని భక్తులు పూజిస్తారని అమ్మ విశదపరచి, పద్మములకు ఈ వరము ఇచ్చినదై యున్నదని పద్మముఖై నమః అని భక్తులు పూజిస్తూ అమ్మకి వేనవేల నమస్కారములు చేయుచున్నారు.

47. పద్మనాభప్రియాయై నమః

          శ్రీ మహాలక్ష్మికి భర్తయైనటువంటి ఆ పద్మనాభుడు, అనంతమైన గంభీర వదనముతో, ఈ జగత్తునంతా స్థితి చేయుచుండగా, ఆ చిద్విలాసమైన మోమును గాంచుతూ పద్మావతి ముసిముసి నవ్వులను చిందుస్తూ వుండగా పద్మము నాభియందు కలిగిన పద్మనాభ ప్రియ విష్ణువుకు ప్రియ సఖి అయిన పద్మావతి, శ్రీమహాలక్ష్మి తన పతి హృదయములో కొలువై వున్నది, సృష్ఠి స్థితిలయములను చేసే త్రిమÖర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ భార్యలైన సరస్వతిని బ్రహ్మగారు తన నాలుకపై వుంచగా మహేశ్వరుడు అర్ధ శరీరం ఇచ్చివున్నాడు. ఇక శ్రీమహాలక్ష్మిని ఆ పద్మనాధుడు తన హృదయమందే కొలువు చేసి వుంచడం వల్ల భక్తులు అమ్మని పద్మనాభ ప్రియాయై నమః అని పూజించుచు వేల నమస్కారములు చేయు చున్నారు.

48. రమాయై నమః

          తన భర్తయైన శ్రీమహావిష్ణువుతో పరమ సంతోషముగా కాలము గడుపుచున్న సుకుమార, సౌశీల్య, లావణ్యవతియైన శ్రీమహాలక్ష్మిని అనుక్షణము తన హృదయములో పెట్టుకున్న శ్రీమహావిష్ణువుని రమితో తలుచుకుంటువున్న శ్రీమహాలక్ష్మిని రమాయైనమః అని భక్తులు భక్తితో పూజిస్తున్నారు. సత్యదేవుని రూపముగా భాసించుచున్న శ్రీమన్నారాయణుని అర్ధాంగి రమగా ఆ స్వామితో కల్సి పూజలందుకొనుచూ కోరిన కోరికలెల్ల తీరిచే సత్యదేవునితో కల్సి అన్నవరక్షేత్రాన భాసించుచూ భక్తులను బ్రోచుచున్న ఆ ఆది దంపతులకు వేన వేల నమస్కారములు

49. పద్మమాలా ధరాయై నమః

          పద్మమువంటి కోమలమైన ముఖముతోనూ, ఎర్రనైన కాంతులతోనూ పద్మముల వంటి గుండ్రనియైన కన్నులతోనూ, పద్మములను కుడిచేతనూ, ఎడమచేతనూ ధరించినదైయుండగా ఘలు ఘల్లంటు పాదమంజీరాల గజ్జెలు మ్రోగుచుండగా, ఎర్రని దేహకాంతితో, పసిమిని బొలిన ముఖకాంతితో తేజము విలసిల్లుతుండగా, పద్మాసనే పద్మాకÂరే ! సర్వలోకైక పూజితే పద్మాసన స్థితిదేవి పరఃబ్రహ్మ స్వరూపిణీ అని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. యజుర్వేదము అధర్వణవేదము ఋగ్వేదము, సామవేదము అను నాలుగు వేదములు లక్ష్మిదేవి యొక్క కళను స్తుతించుచున్నవి. పద్మమును బోలినవీ పద్మాక్షి పద్మముల మాలను ధరించినదైయుండి తన భక్తుల చేత నీరాజనములు అందుచుండగా పద్మమాలా ధరాయైనమః అని పూజలందుకొనుచున్నది.

50. దేవ్యై నమః

          ఏడేడు పద్మాలుగు లోకాలవారు కూడా అమ్మని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూన్నారు ఎవరికి ఏమి ఇవ్వాలో ఏ భక్తునికి ఏమి ఆవసరమో అమ్మకి తెల్సినంతగా బహుశ భక్తునికి కూడా తెలియవు, తన బిడ్డకి హాని చేసేది ఏవీ అమ్మ ఇవ్వదు ఓకవేళ ఇచ్చినా ఇచ్చినట్టే ఇచ్చి మురిపించి, మురిపించి ఆవస్తువులను దూరం చేసి, వాటివల్ల వచ్చే హానిని తెలియజేస్తుంది. మరి జగన్మాత అయిన అమ్మ భక్తుడు తనకు హాని చేసే వస్తువు/పదార్థంని కోరుకుంటే అమ్మ తన బిడ్డడికి ఆ వస్తువు/పదార్థంపై కోరిక లేకుండా చేస్తుంది అనడంలో సందేహం లేదు అందుకే ఆమె దేవ్యై నమః అని పూజలందు కొనుచున్నది. అమ్మకి వేనవేల నమస్కారములు.

51. పద్మిన్యై నమః

52. పద్మగంధిన్యై నమః

          చల్లని సుగంధాల పరిమళాలు వెదజల్లె అమ్మ వైకుంఠపురాణి సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి, శ్రీహరి హృదయ నివాసి శ్రీమహావిష్ణు యొక్క ప్రియదేవదేవి. పద్మాక్షి, సుకుమార దేహంతో రంగులీను కాంతులతో జగజ్జగాయమానముగా వెలుగొందుతూ తన మేని నుంచి వచ్చు సుగంధాలు ఆ ప్రదేశముల నిండా విరజిమ్ముచుండగా ముసి ముసి నవ్వులు నవ్వుచూ తన విభుని ఓర కంటితో చూచుచుండ భక్తులు తమ భక్తి పారవశ్యం చేత శ్రీమహాలక్ష్మిని పద్మిన్యై నమః పద్మ గంధాయై నమః అని పూజించుచూ తమ నివాసములు, తమ తమ జీవితములు అమ్మ మేని పరిమళాల మాదిరి సుగంధాలు విరియాలని (కీర్తి ప్రతిష్ఠలు) కోరుచూ వేలవేల నమస్కారములు తెల్పుచున్నారు ఓ జగదంబా! నీకీర్తిని వేనోళ్ళ ధ్యానించాలని, నిన్ను చేతులనిండుగా పూజించు కోవాలనీ నీరూపము మా కనులనిండా నిండి వుండాలని కోరుతూ మనః స్పూర్తిగా నిన్ను కొలుచుచున్నామమ్మా.

53. పుణ్య గంధాయై నమః

          అజరా మరమైనటు వంటి కీర్తి ప్రతిష్ఠలు కల్గిన అమ్మ, మనము ఎన్నివేల కోట్ల పూజలు వ్రతాలు చేసుకుంటేనోగానీ, అమ్మకు నిజమైన భక్తులం కాలేము ఈ చరాచర సృష్ఠినంతటిని తనకంటి కోసలచేత పరిపాలంచగలిగిన అమ్మ, భర్తృ ప్రియా, పరమ పురుషుడైన శ్రీమహావిష్ణుకు ప్రియ నేస్తం హృదయవాసి అయినదంటేనే ఆమె పుణ్యగంధ అటువంటి అనురాగమÖర్తి ప్రియసఖి అయినటువంటి చల్లనిదైన ఉత్తమమైన, కమలప్రియను భక్తులు వేనోళ్ళ కీర్తించు చున్నారు పుణ్యగంధాయై నమఃఅని పూజించు చున్నారు శ్రీమహాలక్ష్మిని స్తుతించుచున్నారు. చక్కని కీర్తి ప్రతిష్ఠలతో ఒప్పారుచూ భక్తులు అమ్మకు వేల వందనాల అర్పించు చున్నారు.

54. సుప్రసన్నాయై నమః

          శ్రీమహాలక్ష్మి హృదయము దయగల హృదయము దయ అనగానే ఏదో క్షమించే గుణం అని అనుకోరాదు అమితదయ, దయా వర్షం కురిపించే అమ్మ అటువంటి అమ్మ ఎల్లప్ప్పుడు ప్రసన్నురాలిగా అత్యంత ఆత్మీయురాలిగా శ్రీమహావిష్ణుమÖర్తి సరసన విరాజిల్లుచూ వుంటుంది. అద్భుతమైన అందమైన ఆకర్షణీయమైన ముఖముతో భక్తులచే కీర్తింపబడుచు వుంటుంది. రాగము, ద్వేషము లేని స్థితిలో ప్రసున్నురాలై తన భక్తులచేత సుప్రసన్నాయైనమః అని స్తుతించబడుచూ వేల నమస్కారములు అందుకొనుచున్నది.

          సుప్రసన్న సుందర వదనము మా మహాలక్ష్మి

ఇందిరా ప్రకాశ………………..మా మహాలక్ష్మి

మహావిష్ణు ఇల్లాలా…………..మా మహాలక్ష్మి

వందనముల నందుకో……..మా మహాలక్ష్మి

నవనీత హృదయ…………….మా మహాలక్ష్మి

నవమన్మధ అతివా…………..మా మహాలక్ష్మి

చేతన పద్మమా………………..మా మహాలక్ష్మి

Suta Maharshi: ప్రతి పురాణంలో ‘సూత మహర్షి చెప్పెను’ అంటారు.. అసలు ఆయన ఎవరు?

పద్మ…జ…………జన్మయట మా మహాలక్ష్మి

55. ప్రసాదాభి ముఖై నమః

          క్షీరాన్న ప్రియ అయిన శ్రీమహాలక్ష్మి భక్తులు నివేదించిన ప్రసాదాన్ని తీసుకొని ఆభక్తజనులను ఆశీర్వదించునట అంత తృప్తిగా ఆరాధించు భక్తులను అనేక విధములా కాపాడుతుంది. క్షీరాన్నమేగాదు, చిత్రాన్నము, పులిహోర, దద్ధ్యోజనము, తీపి పదార్థములు (పాలకోవా, మైసూర్‌పాక్, లడ్డు ఇత్యాది మధురములు స్వీకరించి) భక్తుల మనోబీష్ఠాలను నెరవేరుస్తుందని అత్యంత భక్తి విశ్వాసాలతో భక్తులు ప్రసాదాభిముఖై నమః అని ప్రార్థించుచున్నారు. తన చల్లనైన ప్రసన్నమైన ధృక్కులతో భక్తులను రక్షిస్తూ, నిరంతరం భక్తులను కాపుకాస్తున్న శ్రీ మహాలక్క్ష్మి తన భక్తజన రక్షణ కోసం ఎల్లవేళలా సంసిద్ధముగా వుండునట.

56. ప్రభాయై నమః

          తేజస్సు కలగలిసిన ప్రకాశము ఎంతో విభవము వేయి సూర్య చంద్రుల కాంతితో కూడా సరిపోలని ప్రకాశము సూర్య చంద్రులవలే విరాజిల్లే అమ్మ చుట్టూ దశ దిశలా వ్యాపించిన ఆకాంతి రేఖలు ఈ భూమండలమునంతా వ్యాపించి అమ్మయొక్క ప్రతిభను చాటుచున్నాయి.

          ఆ కాంతిరేఖలలో జన్మిస్తూ, మరణిస్తూ మరల జన్మిస్తూ మరణిస్తు జీవి అనేక జన్మలను ఎత్తుచున్నాడు. జీవికి ఏ రకమైన హింస లేకుండా అమ్మయొక్క కాంతిలో ఒక కాంతిరేఖగా నిలచిపోవాలని ఆశతో (అమ్మని) ఆశ్రీమహాలక్ష్మిని ప్రభాయై నమః అని పూజ చేస్తున్నారు,  అద్భుతమైన అమ్మ ముఖకాంతిలో తానూ మెరవాలని ఉవ్విళ్ళూరు చున్నాడు. ఎన్ని జన్మల అదృష్టము ఉంటేనేగానీ ఈ జన్మలో అమ్మపై ధ్యాసరాదు. వచ్చింది ఇక ఆకాంతిలో జీవుని గమనము సాగుతూ వుంటుంది. నిశ్చింతని ప్రతి మనిషి కోరుకుంటాడు. వేలవేల నమస్కారములు తెలియజేస్తున్నాము.

57. చంద్రవదనాయై నమః

          పాల సముద్రములో క్షీరసాగర మధనం జరుగుచుండగా దేవతలు దానవులు వాసుకికి చెరోపక్కా తలభాగం ఒకరు తోకభాగం ఒకరు పట్టుకుని ఇరువర్గాల వారు క్షీరసాగరాన్ని మధిస్తుండగా… అశ్వినీ దేవతులు కామదేనువు కల్పవృక్షము ఉచ్ఛైశ్రవము ఐరావతము, చంద్రుడు ఉద్భవించారు శ్రీమహాలక్ష్మి ఉద్భవించగనే శ్రీమహావిష్ణు మÖర్తికి ఇల్లాలు అన్నారు శ్రీహరి శ్రీలక్ష్మీని స్వీకరించాడు. శ్రీమహాలక్ష్మి తో పాటుగా జన్మించిన అమృతము ఆదిగా గలిగిన వాటిని దేవతలు తీసుకున్నారు. చంద్రుడు గుండ్రని ముఖముతోను పదహారు కళలతోనూ వృద్ధి చంద్రుడు, క్షీణ చంద్రునిగా ఒప్పారు చున్నాడు. చంద్రుని గుండ్రని మొఖము కలిగినటువంటి ముఖముగల చంద్ర సహోదరిని చంద్ర వదనాయై నమః అని భక్తులు పూజించు చున్నారు.

58. చంద్రాయై నమః

          అమృతముతోడ పుట్టినటువంటి చంద్రుడు చల్లని దేముడు చంద్రుడు శివుని శిరస్సుపైకి అమిరిపోయాడు సోముడు అనేటటువంటి పేరును పొందాడు. శ్రీమహాలక్ష్మితో కల్సి జన్మించి లక్ష్మికి అనుజుడై అమృతము చుట్టమై సోమ రసాన్ని స్రవించి, రాత్రికి రాజై పరిపాలనచేస్తూ ఈ ప్రపంచాన్ని తనయొక్క సోమరసాన్ని ప్రసరింపజేసి జీవుల్ని పునః బ్రతికింపజేయగల చంద్రుడుకి తోడబుట్టిన శ్రీమహాలక్ష్మి చంద్రసహోదరిగా, ముగ్ధుమనోహర రూపం, కళలకు కాణాచి అమ్మ, ఇన్ని రకాలుగా, భక్తులు పరవశంతో అమ్మని పూజిస్తున్నారు. పాల సముద్రము అమృత భాండము సోమ రసము…ఇత్యాది వన్నీ జీవుల బ్రతుకును శుభకరం చేసేవి కాబట్టి.. భక్తజనులు ఈ విధంగా అమ్మని పూజిస్తూవున్నారు.

59. చంద్రసహోదర్యై నమః

          చంద్రుడు చల్లని దేముడు, అంతేకాదు జీవులకు ప్రాణవాయువు ఎంత ముఖ్యమో నీరు, ఆహారము గూడా అంతే ముఖ్యం. అటువంటి నీరుకి మరోపేరు చంద్రమ. సోమరసాన్ని నీటి బిందువుల వలె వర్షింపజేసి ప్రాణరక్షణ కలుగచేస్తున్న చంద్రుడు, అటువంటి వాడు శ్రీ మహాలక్క్ష్మికి సహోదరుడు కాబట్టే, అమ్మ చంద్రసహోదర్యై నమః అని కీర్తింపబడుచున్నది.

60. చతుర్భుజాయై నమః

          ఒకచేత కలశపాత్ర ధరించి ఇరుచేతులా తామర పుష్పాలను ధరించి ఎర్రని అపూలకాంతికి చెక్కిళ్ళు ఆరూపుతో ఆరంగుతో అలరారుచుండగా మరోచేత ధనరాశులను భక్తులకు అను గ్రహిస్తూ పద్మములో కోటిరేకులు విచ్చుకొనునుండగా ఆసీనురాలైన అమ్మ శ్రీదేవి చతుర్భుజాలతోనూ ఒప్పారుచుండగా, ఆతల్లి కనులు కరుణా కటాక్ష వీక్షణాలతో ఈ జగత్తునంతా నింపుచుండగా తనని నమ్మిన భక్తులను  కాపాడుచూ అపార ధన సంపదలిచ్చి, అవ్యాజమైన ప్రేమని వర్షించుచూ, అమ్మ తన మృదువైన చూపులుతో భక్తులను రక్షిస్తూవుండగా, భక్తులు ఆ చూపుల అమృతమును గ్రోలుచూ, చతుర్భుజాయై నమః అని అమ్మని పూజిస్తూ స్తోత్రాలు చేయుచున్నారు.

 61. చంద్రరూపాయై నమః

          చంద్రుని ముగ్దమోహన రూపాన్ని చూసి ఎంత సంతోషిస్తామో చంద్ర సహోదరి అయిన శ్రీ మహాలక్ష్మి మోమును చూసి అంతే సంతోషిస్తాము. నాలుగు భుజాలతో ముగ్ధమోహన రూపముతో విలసిల్లుచున్న శ్రీమహాలక్ష్మికి వేల నమస్కారములు చేయుచున్నాము. చతుర్ధశ భువనాలలోను అమ్మని మించిన సౌందర్యం లేదు కదా.

62. ఇందిరాయై నమః

          ప్రసన్నమైన వదనముతో చతుర్భుజములతో పద్మాసనమున ఆశీసురాలై భక్తులను బ్రోచుచున్నటువంటి శ్రీమహాలక్ష్మి సువిశాలమైన హృదయముగలదిగా భక్తులు భావించుచూ అమ్మని ఇందిరాయై నమః అని స్తుతించుచున్నారు.

63. ఇందు శీతలాయై నమః

          చల్లని తల్లి శ్రీమహాలక్ష్మి సుప్రసన్న, కరుణ కల్గిన కరుణాంతరంగ, భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, చతుర్ధశ భువనాలలోనూ ఐశ్వర్యం కలగాలన్నా, సౌభాగ్యం కావాలన్నా, దేవతలకైననూ, మానవులకైననూ వరాల నిచ్చే చల్లని దేవత మా శ్రీమహాలక్ష్మి ఇందు శీతలాయై నమః అని చల్లని నామముతో భక్తులచే పూజలందు కొనుచున్నది. వేల వేల నమస్కారములు చేయుచున్నాము. చల్లని తల్లి అనగా హృదయం చల్లన, రూపు చల్లన, చూపు చల్లన, ప్రేమ చల్లన, ఆశీర్వాదము చేయుటలోకూడా భక్తుల అభీష్టములు నెరవేర్చు ఈ శీతలాంబ శ్రీమహాలక్ష్మిగా ఒప్పారుచుచున్నది.

64. ఆహ్లాదజనన్యై నమః

          జీవరాశి ఎన్నో పాపాలు పుణ్యాలు చేసుకుని ఈ జీవితాన్ని ముగించుకుని మరొక శరీరాన్ని ధరించి తిరిగి ఈ భూమి మీదకు వస్తారు శిశు పరిణామ క్రమంలో ఎన్నో బాధలను చూస్తారు. పెరిగి పెద్దవుతూ తగినంత జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ ఉత్తమమైన, ఉన్నతమైన జీవితాన్ని కోరుకుంటారు అలా కోరుకున్న జీవికి వాళ్ళ వాళ్ళ పాపపుణ్యాల ఆధారంగా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి అమ్మయై భక్తులకు ఎవరికి ఎంత ఇవ్వాలో వారికి అంత ఇచ్చేటువంటి శ్రీమహాలక్ష్మి ఘనతను కొనియాడుతు భక్తులు ఆహ్లాద జనన్యై నమః అని స్తుతించుచున్నారు. శ్రీ మహాలక్క్ష్మిని పూజించే భక్తుల హృదయాలు కూడా ఆహ్లాదంగానే వుంటాయి అనుటలో సందేహం లేదు.

65. పుష్టై నమః

          నిండు ముతైదువగా శ్రీమహాలక్ష్మి కళ కళ లాడుతూ ప్రతి ఇంటా శోభిస్తూ వున్నది. పుష్టై నమః అని భక్తులచే పూజలందుకొనుచూ వేల కోట్ల నమస్కారములు అందుకొనుచున్నది. శరీరమునకు కావలసిన శక్తి, చైతన్యము జీవులకు కలిగించుటకు అమ్మ అనుగ్రహించు శక్తియే ఆధారము, అందుకనే పుష్టై నమః. ఆరోగ్యాన్ని ప్రసాదించి అమ్మ భక్తుల హృదయాలలో చిరస్థాయిగా వున్నది.

66. శివాయై నమః

67. శివకర్యై నమః

          శివతత్వము, విష్ణుతత్వము వేరువేరు కానేకాదు శివరూపాయ విష్ణవే! విష్ణురూపాయ శివాయ నమః అని శివకేశవులకి అబేధం చెప్పబడింది. శివునిచెల్లెలు అయి, విష్ణువుకి అర్ధాంగి అయి ఏడేడు పద్నాలుగు లోకాలకు లోకమాత అయినటువంటి శ్రీమహాలక్ష్మి శివుని ఆరాధిస్తూ, భర్తపాదసేవ చేస్తూ భక్తులచే పూజలందు కొనుచూ, కోటికోట్ల నమస్కారములు అందుకొనుచున్నది. శివా అనగా మంగళము మంగళప్రదమైన అమ్మ, సంపదలొసగే అమ్మ, శివాయై నమః అనే నామముతో భక్తుల పూజలు అందుకొనుచున్నది. అలాగే శివాయనగా శుభము, మంగళము, పరమపవిత్రము అనికూడా చెప్పుకోవాలి. మంగళకరమైన శివ నామమందే ఐశ్వర్యము నిండియున్నది. కనుకనే భక్తులు శ్రీ మహాలక్క్ష్మిని సంపదలు అనుగ్రహించమని కోరుతూ శివాయై నమః అని శివకర్యై నమః అని పూజించు చున్నారు.

68. సత్యై నమః

          ఈ లోకాలన్ని (చ్రతుర్ధశ – 14) దేనిపై ఆధారపడి వున్నాయి అంటే కేవలం సత్యం పైనే అని జవాబు చెప్పవచ్చు. సత్యం, ధర్మం, ఈ ప్రపంచానికి రెండూ కళ్ళలాంటివి. ధర్మం అయినా కాలన్ని బట్టి కాస్త అటుఇటు మారుతుందేమో గానీ సత్యం ఎల్లప్ప్పుడు సత్యమే. జీవి ఈ సత్యం పైననే నిలబడాలి అదే రక్షిస్తుంది. ఈ లోకాలను రక్షించినా సత్యమే జీవులను రక్షించినా అది సÔŸ్యమే. అటువంటి సత్యమును ఆచరించే జీవులు సత్యైనమః అని అమ్మను కొలుచుచున్నారు.

69. విమలాయై నమః

70. విశ్వజనన్యై నమః

          ఎక్కడా మలినము లేని స్వచ్ఛమైన కోమలమైన సుందరమైన అందమైన ఆకర్షణీయమైన అద్భుతమైన విమల హృదయ శ్రీమహాలక్ష్మి ఈ జగత్తును ప్రేమిస్తుంది ప్రేమను పంచుతుంది. ఆప్రేమలో జీవులను తరింపజేస్తుంది. ఈ లోకాలన్నిటికి మాతగా విరాజిల్లుతూ అద్భుతమైన తన మాతృఒడిలో బిడ్డలను సేదదీరుస్తున్నది. బిడ్డలచే పూజలందు కొనుచున్నది. అమ్మావేల వందనాలమ్మ.

71. పుష్టై నమః

          నిండు ముత్తయిదువుగా శ్రీ మహాలక్ష్మి కళకళలాడుతూ ప్రతి ఇంటా శోభిస్తూ శరీరమునకు కావలసిన శక్తి చైతన్యము జీవులకు కలిగించుటకు అమ్మ అనుగ్రహించు శక్తియే ఆధారము పుష్టై నమః  అని భక్తుల పూజలు అందుకొనుచు వేలకోట్ల నమస్కారములు స్వీకరించుచున్నది కనుకనే పుష్టై నమః.

72. దారిద్య్ర నాశిన్యై నమః

          భక్తులకు ఈతిబాధలను నెరవేర్చడంలో, అమ్మ చూపించే దయ ఇంత అంతా కాదు దారిద్య్రము అనుభవించేవారు అమ్మని అత్యంత భక్తితో పూజించి నట్లైతే వారివారి దారిద్య్రబాధలను తీసేసి వారికి భోగ భాగ్యాలను, సిరిసంపదలను కటాక్షించడంలో అమ్మ ముందుగానే వుంటారు. ఈ భూమిపై నివశిస్తున్న ప్రజలకు ధనము కావాలి. ధనమÖలం ఇదంజగత్ అన్నారు పెద్దలు. ఏపని కావాల్న ధనం కావాలి. కాబట్టి సంపాదించిన ఒనగూరిన ధనం నిలబడాలి, అవసరాలకు ఉన్న ధనం జీవికి తృప్తినిస్తుంది. ధనం లేకపోతే మరి దారిద్య్రం భాదేకదా! పేదరికం నించి విముక్తి కావాలని శ్రీ మహాలక్ష్మిని పూజ చేస్తాము. దరిద్రాన్ని నాశనం చేయడంలో అమ్మ చూపించే దయ అద్భుతమైనది. అందువల్ల భక్తులు వారివారి మనస్సులు ఆనంద డోలికలలో ఓలలాడుతూ దారిద్య్ర నాశిన్యై నమః అని పూజలు చేస్తూ వేలవేల నమస్కారాలు అర్పిస్తారు.

73. ప్రీతి పుష్కరిణ్యై నమః

          వైకుంఠములో శ్రీమహావిష్ణువుకి పాదసేవచేయచు అత్యంత భక్తితో సేవిస్తూవుంటుంది. ఎంతో ప్రీతితో కమలంలో ఆశీసురాలై వుంటుంది. అటువంటి మహా ఇల్లాలుకి ప్రీతి అయినటువంటి పద్మంతోను భక్తులు అనేక రకాలుగా పూజించుచూ ప్రీతి పుష్కరిణ్యై నమః అని కీర్తిస్తూ వేలవేల నమస్కారాలు చేయుచున్నారు. సరస్సులో లక్ష్మీ ప్రవేశమే అత్యంత శుభ ప్రదము పుష్కరుడు అనగా శ్రీమన్నారాయణుడు, ఇల్లాలైన పుష్కరి అత్యంత శుభప్రద వేల వందనాలమ్మా.

74. శాంతాయై నమః

          ప్రశాంత వదనముతో చల్లని కరుణా దృష్టులతో, అమృతమయయై మధురమైన వాక్కులతో ఒప్పారుచున్న శ్రీమహాలక్ష్మిని భక్తులు శాంతాయై నమః అని కొలుచుచున్నారు. ఎటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నా ప్రసన్న వదనమైన అమ్మ ముఖాన్ని ఒక్కసారి చూసినట్లైతే భక్తులు తమ బాధలను మరచి శాంతిని పొందుతారు.  లోకాలన్నిటిని శాంతపరచే గొప్ప తత్వమే శ్రీమహాలక్ష్మి అమ్మయై అనురాగం చిందించి భక్తులను తన ప్రేమలో ఓలలాడించగలదు శ్రీమహాలక్ష్మికి వేనవేల నమస్కారములు. ఎదుటివారిలో ఎంతటి క్రోధాగ్నినైనా చల్లార్చగలిగే శీతలాంబ.

75. శుక్లమాల్యాంబ రాయై నమః

          తెల్లనివి స్వచ్ఛమైన పూలవలె సుకుమారమైనవి అయినటువంటి పరమ పవిత్రమైన వస్త్రాలను ధరించిన ఓ శ్రీమహాలక్ష్మి అంతే స్వచ్ఛమైన సుందరమైన మనసు కలిగిన నీవు నీ భక్తుల హృదయాలలో జన్మజన్మలకు నిలచిపోతున్నావు అమ్మ శ్వేత గజముల చేత సేవింపబడుచు స్వచ్ఛమైనటువంటి పాల కడలిలో ప్రభవించి ఆ రూపముతోనే భక్తులను అనుగ్రహిస్తూ ఉన్న శ్రీ మహాలక్ష్మికి వేలవేల నమస్కారములు తెలుపుచున్నాను

76. శ్రియై నమః

          శుభకరమైన సంపన్నమైన సౌందర్యమైన రూపమును, గుణాలను ప్రకాశమును సంతరించుకుని అత్యంత శోభతో అలరారు అమ్మ శ్రీమహాలక్ష్మి భక్తులచే శ్రియై నమః అని పూజలందుకొనుచున్నది. ఆ తల్లికి, ఆ ప్రేమమయికి ఆసుందరమైన సుశోభితయైన శ్రీ మహాలక్ష్మికి వేల నమస్కారములు తెలియజేయుచున్నాను. శ్రీకరమైన అమ్మ చూపు, అమ్మదయ అమ్మ తన భక్తులపట్ల చూపే కరుణ, భక్తుల హృదయాలలో చెరగని ముద్రని వేసుకున్నాయి. అమ్మా నీ పాదాలకు మంజీరములకు నమస్కారములు.

77. భాస్కర్యై నమః

          ప్రచండ భానుడి కిరణాల తేజస్సును పోలిన కాంతివంతమైన వదనముతో ఒప్పారు శ్రీమహాలక్ష్మి ద్వాదశాదిత్యులలో ఒకరైన శ్రీమన్నారాయణుడి భార్యయై భాస్కర్యై నమః అని భక్తులచే పూజలందుకొనబడుచున్నది. ఆరోగ్యం భాస్కరా దిత్యాత్ అను సూక్తి లోకోక్తి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చే అమ్మ ఈ లోకాలనన్నిటినీ పాలించే అమ్మ కరుణా సముద్ర తన కిరణాలను భూమిపై ప్రసరింపజేసే దినకరునకు, దయను వర్షముగా కురిపించు అమ్మకు భక్తులు వేల నమస్కారములు చేయుచున్నారు.

78. బిల్వ నిలయాయై నమః

          శివునికి ఇష్టమైన బిల్వ దళాలలో (ఆకులలో) శ్రీమహాలక్ష్మి నివాసము ఉంటుంది పరమ మంగళ కరుడు అయిన శివుడు ఒక్క బిల్వదళ పూజతోనే భోళాశంకరుడు అయి భక్తుల అభీష్టమును నెరవేర్చుచున్నాడు సదా సంపదలను అనుగ్రహించుటలో బిల్వదళాలలో నివసించు చున్న తన సోదరియైన శ్రీమహాలక్ష్మి సంపదలకు అధిదేవతగా ఒప్పారుచుండుట చేత శంకరుడు సంపదలను అనుగ్రహించుచున్నాడు. బిల్వ నిలయాయై నమః అని భక్తులచేత పూజలందుకొనుచున్న అమ్మకు వేనవేల నమస్కారములు.

79. వరారోహాయై నమః

          అమ్మవారి శత సహస్ర నామాలలో వారాహి ఒకనామం ఒక దేవతా రూపం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి సదా శుభాలనొసగే అమృత హృదయ, ఎటువంటి చిక్కు సమస్యలేర్పడినా వారాహి రూపమున ఉన్న అమ్మను కొలిచినట్లైతే ఆతల్లి ఆ సమస్యలను చిటికెలో తీర్చి సంసారమున సుఖము ప్రసాదించును కాబట్టే వరారోహాయై నమః అనే నామముతో పూజలందు కొనుచున్నది. వారాహి దేవతా శతకోటినమస్సుమాంజలులు తల్లీ! వారాహి రూపములో భూమిని రక్షించాడు శ్రీ మహావిష్ణువు. ఆ వరాహ రూపమునుంచే ఏర్పడిన అంశ వారాహితల్లి అమ్మా చల్లగా చూడమ్మ!

80. యశశ్విన్యై నమః

          ఈలోకంలో జీవరాశులు తాము ఎంత కష్టపడి జీవనం చేస్తున్నా వ్యాపార వ్యవ హారాలు చేస్తున్నా, సంసారసాగరమును ఈదుచున్నా, ఏమి చేస్తున్నాకూడా పేరు ప్రఖ్యాతులను, తమ ఉనికిని, ఇతరులు గుర్తించాలని కోరుతుంటారు. ధర్మబద్ధమైన తమ ప్రవర్తనని, ఆలోచనని, ఆచరణని దైవం పాదాల వద్ద పెట్టి హృదయ పూర్వకముగా శ్రీమహాలక్ష్మిని పూజించినట్లైతే, అమ్మవారు కీర్తిప్రతిష్ఠలు ఇస్తుంది అనుటలో ఇసుమంత సందేహమైన లేదు ఈలోకాలనేలే తల్లి గొప్ప యశస్సుతో యశశ్విన్యై నమః అనే పేరుతో పూజలందుకొనుచూ భక్తులను అనుగ్రహించుచున్నది.

81. వసుంధరాయై నమః

          బ్రహ్మదేవుడు సృష్ఠిని ఆరంభం చేయునప్ప్పుడు భూమిని ముందుగా సృష్ఠించాడు ఈ సృష్ఠిని వీవే భరించాలి భూదేవిగా వుండుమని చెప్పాడు అనేక రకాల జీవులను తన తలపైన పెట్టుకుని అత్యంత ఓరిమితో ప్రతియుగము నందును శ్రీమహాలక్ష్మి ఒప్పారుచుండగా వసుంధరాయై నమః అనే నామంతో భక్తులచేత కీర్తించబడుచూ, భక్తులను అనుగ్రహిస్తున్న అమ్మకు వేల వేల నమస్కారములు భరతభూమికి వందనము కర్మభూమికి వందనము. ఓర్పుకు ప్రతీక వసుధ.

82. ఉదారాంగాయై  నమః

          విశాల హృదయ, అమృతవల్లి, అత్యంత కరుణాంతరంగ, విరివిగా, ధారాళంగా, ఉదారంగా ఇలా ఎన్ని పర్యాయ పదాలు చెప్ప్పుకున్నా తక్కువే. వీటన్నింటి కన్నా ఎక్కువైన అమ్మ హృదయం అత్యంత కరుణ కల్గినది. ఇటువంటి అధ్బుతమైన గుణాలు కల్గిన అమ్మ భక్తులు, అమ్మా అని ఆర్తితో పిలిస్తే పూజిస్తే తన భక్తుల యొక్క కష్టములను కడగంటి చూపుచే రూపుమాపి, భక్తులను అనుగ్రహిస్తూ వున్నటువంటి చల్లని తల్లియైన శ్రీమహాలక్ష్మిని ఉదారాంగాయై నమః అని భక్తులు పూజిస్తూ వేల నమస్కారములు చేయుచున్నారు.

83. హేమ మాలిన్యై నమః

          బంగారు నగలను ధరించి బంగారు రంగు వస్తాలను ధరించి, చెక్కిళ్ళు ఎరుపు రంగును సంతరించు కొనుచుండగా, కనులు కలువరేకులను పోలి అత్యంత ప్రేమతో నిండి వుండగా కనుబొమలు విల్లునుపోలిన ఆకృతిని కలిగియుండగా, జుత్తు నల్లని రంగుతో నిగనిగ లాడుచూ, కొప్ప్పున మల్లెలు గుభాళించుచూ, గులాబులతో కల్సి అమ్మ జడను అలంకరించామని ఎంతో తృప్తి పడుచుండగా అనేక రకాల ఆభరణాలను ధరించినదైన అమ్మ సౌందర్యానికే సౌందర్యముగా అలరారుచూ భక్తులను అనుగ్రహించుచున్నది. హేమ మాలిన్యై నమః అని పూజలందు కొనుచున్నది. అమ్మకి సాష్ఠాంగ నమస్కారములు.

84. హరిణ్యై నమః

          సున్నితమైన జంతువు హరిణి, వివిధ నామాలలో వుంటూ, అందమైన, ఆకర్షణీయమైన రూపంతో బంగారు రంగుమేనితో చూపరులను ఆనందపరిచే హరిణము లేలేత చివురులను కొరుకుచూ ఛెంగు ఛెంగున ఎగురుచూ పూపొదల మాటున తిరుగుచూ, కౄరజంతువుల, అలికిడి తెలియగానే నక్కి నక్కి దాగుతూ..బెదురు చూపులతో గెంతుతూ.. పదుగురినీ ఆకర్షిస్తున్న హరిణిములో లక్ష్మిదేవి నివసిస్తుందట.. అందువలన అమ్మని పూజించు నామములలో హరిణ్యై నమః అని పూజిస్తూ వేల నమస్కారములు చేయచున్నాము.

83. ధన ధాన్య కర్యై నమః

          శ్రీ మహావిష్ణువుకు గొప్ప ఇల్లాలై ఆదేవదేవుని హృదయ మందిరములో కొలువైయున్న శ్రీమహాలక్ష్మి సముద్రరాజునికి ప్రియపుత్రికయైన ఆ దయామయి సంపదలను ప్రసాదించడములోనూ, భక్తుల కళలను రూపు దిద్దుటలోనూ అత్యంత దయను ప్రదర్శించి వారికి సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తూ వున్నది. ధనము ధాన్యము అనేక సిరిసంపదలను అనుగ్రహించే తల్లిని ధన ధాన్య కర్యై నమః అని వేల నమస్కారలతో పూజించుచున్నాము. అమ్మ దారిధ్య్ర బాధ లేకుండా ప్రతి ఇల్లు, సుభిక్షముగా పాడిపంటలతో. పశపక్ష్యాదులతో, పిల్లాపాపలతో కళకళలాడేటట్లుగా ఆశీర్వదించుమమ్మా

86. సిద్దయే  నమః

          భక్తుల అంతరంగాలకు అనుగుణముగా వారి వారి కోర్కెలను ఈడేర్చడము, భక్తుల తపస్సును మెచ్చి వారిని సిద్ధింప జేయడంలోనూ శ్రీమహాలక్ష్మి దయా మృతమును వర్షించి భక్తుల ఈతి బాధలను కడతేర్చుచున్నది. భక్తులు కోరుకున్న కోరికలను నెరవేర్చడంలో వారికి కార్యసిద్ధికల్గించడంలోనూ భక్తులను భక్తి జ్ఞాన మార్గంలో నడిపించడంలోనూ అందువారి మనస్సును లగ్నం చేయుటలో అమ్మ ఇచ్చే దీవెనలు చాలా చాలా ముఖ్యమని తెలుసుకొనుచూ అమ్మను సిద్ధయే నమః అని పూజించుచున్న భక్తులను ఆశీర్వదించు తల్లీ. అమ్మకు వేల నమస్కారములు తెల్పుచున్నాము.

87. స్త్రైణ సౌమ్యాయ నమః

          అమ్మవారి అనేక నామాలలో ఇది ఒక నామం స్త్రీ జాతి గర్వించదగిన పూజింపదగిన దేవత శ్రీ మహాలక్ష్మి సౌందర్యమా వినయమా విధేయత బాధ్యతల ఓర్పున లేక సిరి సంపద భోగము భాగ్యము ఇలా అన్నీ కలగలిసిన మాణిక్యాలు స్త్రీలు అటువంటి స్త్రీలు పూజించే అధి దేవత శ్రీమహాలక్ష్మి అమ్మ వేల వందనాలు అందుకో తల్లి.

88. శుభప్రదాయై నమః

          శుభకరమైన, మంగళప్రదమైన నామముతోనూ, రూపముతోనూ దృష్టులతోనూ ఒప్పారుచున్నటువంటి అమ్మ అమృత హృదయ, చల్లని తల్లి ఎవరికి ఏ శుభాలు జరగాలన్నా శ్రీమహాలక్ష్మి అనుగ్రహం పైననే ఆధారపడి వుంటుంది. వైకుంఠవాసుని ఇల్లాలై ఐశ్వర్యమునకు రాణిగా, భోగభాగ్యాలను సిరి సంపదలను అనుభవింపజేయడానికి భక్తుల హృదయాలలో ముద్రింపబడినది. శుభ ప్రదాయై నమః అని పూజలందు కొనుచున్నది. అమ్మకి కోటి కోట్ల నమస్కారములు.

89. నృపవేస్మగతానందాయ నమః

          ప్రతి జీవికి జీవితం ఒక ఆశ అతి చిన్నక్రిమి కీటకాల నుంచి ఏ జీవి ఏజన్మను ఎత్తి ఏమి అనుభవిస్తాడో తెలియదు. పుణ్యము, పాపము ఈ రెంటినీ అనుభవించేందుకే ఏ జీవి అయిన ఈ భూమిమీద కొచ్చేది మనిషి జన్మలోని గొప్పదనాన్ని మానవుడిగా జన్మించినపుడు మాత్రమే గుర్తించగలడు కాబట్టే ఏ మానవుడైనా / స్తీయైనా ధర్మబద్ధమైన నడవడికను ఇవ్వమని కోరుతాడు. ఆ జ్ఞానాన్ని ప్రకాశింపజేయమని వేడుకుంటాడు.

          జీవుల మనుగడ ధర్మబద్దము, నీతి బద్దము, న్యాయ బద్దముగా ఉండాలని, ఆ ప్రకారముగా జీవించి తరించాలని భక్తులు శ్రీమహాలక్ష్మిని పూజించుకొనుచూ నృపనేస్మగతానందాయ నమః అని స్తుతించుచు వేల నమస్కారములు చేయుచున్నారు.

90. వరలక్ష్యై నమః

          పాలసముద్రంలో జనియించిన శ్రీమహాలక్ష్మి జన్మిస్తూనే పెద్దపిల్లగా మారి శ్రీమహావిష్ణువుని వరించింది. లోకమాతగా ఆవిర్భవించినది ఈలోకాలను స్థితిని చేసే శ్రీమహావిష్ణువు ఇల్లాలై భక్తుల చేత పూజలంద బడుచుండగా దారిద్య్రాన్ని నిర్మూలించే దేవతగా, ఐశ్వర్యాన్ని అందించే ఐశ్వర్య లక్ష్మిగా, శుభాలను ఇచ్చే శుభలక్ష్మిగా, ధైర్యసాహసాలనందించే ధైర్యలక్ష్మిగా, సంతానాన్ని ఇచ్చే సంతానలక్ష్మిగా ఇలా అనేక రూపాలలో భక్తులకి వరాలనిస్తూ, ప్రతి పనిలోనూ ధర్మాన్ని ఆచరించే ప్రతివారి హృదయంలోనూ వుంటూ వరలక్ష్మిదేవిగా వరాలనిస్తున్నది ఓ వరలక్ష్మి సౌభాగ్యాన్ని పెంచమ్మా అని కోరుకుంటూ శుభాలను ఒసగమమ్మా అని భక్తితో ప్రార్థిస్తూ వేల నమస్కారాలను చేయచున్నాము.

          సిరులనిచ్చే శ్రీలక్ష్మి….    మరువలేము మహలక్ష్మి….

          శుభము నిమ్మ శ్రీలక్ష్మి…. కొలిచెద మే మహాలక్ష్మి….

91. వసుప్రధాయై నమః

          ఈ భూమిని భరిస్తూ భూమిపై చరిస్తున్న ఈ జీవ, సజీవ, నిర్జీవ, భారాన్నంతా ఎంతో ఓర్పుగా మ్రోయుచున్నటువంటి శ్రీమహాలక్ష్మిని వసుప్రధాయై నమః అని భక్తులు కీర్తిస్తూ వేల స్తోత్రాలు పాడుచున్నారు. అటువంటి భక్తులను శ్రీలక్ష్మీ చల్లగా గాచునుకాక అని ప్రార్థిస్తూ కోరుతూ వున్నాను.

92. శుభాయై నమః

          సమస్త శుభములకు కాణాచి అయిన శ్రీమహాలక్ష్మి దయవల్లనే ప్రతి కుటుంబము ఈ భూమిపైన అనేక శుభములను పొందుచున్నారు సకల శుభముల రాశి అయిన శ్రీమహాలక్ష్మి ఏడేడు లోకాలలోనూ శుభాలను ఇస్తూ ప్రజలచేత శుభాయై నమః అనేటటువంటి నామముతో పూజలందు కొనూచూ భక్తులను ఆశీర్వదిస్తున్నది. దయగల తల్లికి వేనవేల నమస్కారలనిస్తున్నామమ్మా.

93. హిరణ్య ప్రాకారాయై నమః

          బంగారు రంగు గోడలుకల్గి సువర్ణమయమైన ప్రాకారాలు గల్గి హంసలుకల్గిన కొలనులు, పక్షుల కిలకిలా రావాలుగల్గిన లతలతో కూడిన వనాలు వన్యప్రాణుల మధ్య బేధాలు లేని విధంగా చరించుచున్న పశుపక్ష్యాదులు ఋతువులతో సంబంధమే లేకుండా ఫలిస్తున్న ఫలపుష్పాదులు.. వీటన్నిటి మధ్యమణిమయ భరితమైన అంతఃపురాలు, వజ్రవైడుర్యాలతో కూడిన హంసతూలికా పాన్పులు..ఒక్కటేమిటి రంగులమయమై శోభతో కూడిన బంగారుమయా, హిరణ్య ప్రాకారాయై నమః అని పూజలందు కొనుచున్నావమ్మా… నీకు వేల నమస్కారాలు తల్లీ.

94. సముద్ర తనయాయై నమః

          లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం ఎంత కనికరించావమ్మా సముద్రరాజుని. మనస్సులో నువ్వు కుమార్తెగా జన్మిస్తేచాలు జన్మ ధన్యమౌతుందని, భావించి సంకల్పం చేసుకున్న సముద్ర రాజుకి సంకల్ప సిద్ధిరస్తుయని దీవించి, కుమార్తెగా జన్మించావు తల్లి. ముగ్దమోహన రూపిణిగా, జన్మిస్తూనే పరిణతి చెంది, బంగారుమేనుతో, నల్లని జడతో, సువర్ణమయమైన సుగంధకుసుమాలు నీ తలను చేరగా దగద్ధగాయ మానమైన, సువర్ణా భరణాలు నీమేని అందాలను చూచుచూ నవయవ్వన శోభను ద్విగుణీకృతము చేయుచుండగా ఎర్రని పట్టుచీర బంగారు రంగు రవికెతో మరింతగా నీ శోభలు నలుదిశలా ప్రసరించు చుండగా నాకుమార్తెకు తగిన వరుడు ఎవరా అని నీ జనుకుడు అన్వేషణాంతరంగు డైయుండ, నీభక్తులు నిన్ను సముద్ర తనయాయై నమః అని (పూజా ధ్రవ్యాలు) పూలు, పసుపు కుంకుమలతో పూజిస్తూవుండగా దేవతందరూ తరగని సంపదలనివ్వమ్మా నీ అనుగ్రహం వల్లనే ఇంద్రుని వైభవం పెరిగింది అని నిన్ను కొలుచుచుండగా, వేలవేల నమస్కారములు నీవు అందుకొనుచుండగా నీ యొక్క మాతృత్వ ప్రేమలో మేము ఓలలాడుచూ, నిన్ను అంజలి ముకుళించి ప్రార్థించు చున్నాము.

95. జయాయై నమః

          నిత్యము జయము కలిగిస్తూ నమ్మిన భక్తుల హృదయాలలో నిండివున్న శ్రీమహాలక్ష్మి జయ జయ ధ్వానాలు చెవులకింపుగా వైకుంఠమునందు మార్మోగుతూ వుండగా అపజయ మనేది లేని తల్లిగా భక్తులచే కీర్తింపబడుతూ జయాయై నమః అని పూజలందు కొనుచున్నావమ్మా నీకివే మా నమస్సుమాంజలులు.

96. మంగళాయై నమః

          మంగళప్రదమైన వస్తువులు పసుపు కుంకుమ గాజులు, పూవులు, నల్లపూసలు, బంగారము, అద్దము, శుచి శుభ్రత, స్వచ్ఛత, నిస్వార్థపరత సత్ప్రవర్తన, సౌశీల్యము, సుకుమారము ఇత్యాది అంశాలలో కొలువై యున్న మంగళప్రదాయివైన ఓ శ్రీమహాలక్ష్మి కొలువైపుంటావుట నీవు శుభం కలిగించే గోవు, ఆవుపాలు, పతిభక్తి, ఇత్యాది అంశాలు, శుభాన్ని ఒసగే నీ నామము మంగళ ప్రదమైయుండగా నీవందు లేవనే సంశయమే లేదు తల్లి నీవేఅవి! అవియే నీవు కాబట్టి మంగళాయ నమః అని నిన్ను పూజించు కుంటున్నాము వేల నమస్కారములు తెలియజేస్తున్నాము.

97. దేవ్యై నమః

          శ్రీమతా! శ్రీమహాలక్ష్మి దేవతలకు ప్రభువైన శ్రీమహావిష్ణువు, తండ్రియై ఈ సమస్త జగములను ఉద్దరించ ఉపక్రమించిన తరుణంలో అయ్యకు చేదోడై అమ్మగా దేవతలను, మానవులను రక్షించే రీతిలో వారిని కన్నబిడ్డలుగా కాపాడుచున్న లక్ష్మీ నారాయణులు భక్తులచేత దేవ్యై నమః అని కీర్తిస్తూ మీ దంపతుల గుణ, రూప, లావణ్యాదులను కీర్తించుచున్నారు. తల్లీదండ్రులారా మీకివే మా శతకోటి కోట్ల వందనాలు. లోకంలో క్షామం కలుగకుండా, స్త్రీల సౌభాగ్యం తరిగిపోకుండా చేయగలిగిన శక్తి మీకు మాత్రమే ఉన్నాయని నమ్మే మాకు సౌభాగ్య సిద్ధిని కలిగించండి.

98. విష్ణు వక్షస్థల స్థితాయై నమః

          బంగారు వర్ణమేనితో ధగదగలాడుతూ అద్భుత రూప, గుణ లావణ్యాలతో జగజ్జగాయమానముగా ఒప్పారుచున్న శ్రీమహాలక్ష్మి, నవమన్మధుడు నీలివర్ణ రంగుదేహముతో మిలామిలా మెరిశిపోతూ మన్మధుడి యొక్క బాణాల తాకిడికి లోనై, తన ఇల్లాలు ఐనటువంటి శ్రీదేవి యొక్క కంటి కొసలలో చిక్కుకుని ఏమి వరం కావాలని అడుగగా, మీ వక్షస్థలమే నానివాసముగ అవ్వాలి స్వామీనే ఎల్లప్ప్పుుడు మీ హృదయ నివాసినిగానే వుండాలనే వరాన్ని ప్రసాదించండి. అని చూపుతోనే అడుగుచున్న శ్రీమహాలక్ష్మికి తదాస్తు అని చెప్ప్పుతున్న ఆ కల్యాణహరిని చూచుచూ తాదాత్యం చెందుతున్న శ్రీమహాలక్ష్మిని భక్తులు విష్ణు వక్షస్థల స్థితాయై నమః అని పూజించుకుంటున్నారు వేనవేల నమస్కారములు.

99. విష్ణు పత్న్యై నమః

          శ్రీదేవి ఒక్క క్రీగంటి చూపుకే పరవశించి పోయిన శ్రీమహావిష్ణువు, అన్నుల మిన్న అయిన, అపరంజి బొమ్మ అయిన శ్రీమహాలక్ష్మిని బ్రహ్మ, మహేశ్వర, ఇంద్ర, వరుణ, వాయు, అగ్ని, యములాదిగా, యోగులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, గంధర్వులు, మునులు ఇంకను అనేక దేవతల నడుమ వేదమంత్రోచ్చరణల మధ్య పత్నిగా శ్రీదేవిని చిటికెన వేలుపట్టుకుని ఏడడుగులు నడచి పాణీగ్రహణమును చేసినాడు. అంత భక్తులు మురిసి పోవుచూ మా తండ్రి అయిన విష్ణువు యొక్క ఇల్లాలా! మా అమ్మా విష్ణుపత్ని, చల్లని మా దేవత అనుచూ అమ్మని స్తుతించి శ్రీహరీ శ్రీదేవీల కల్యాణఘట్టాన్ని మనసార స్మరించుకుంటూ ఈ భూమిపై జీవించిన పర్యంకము సకల సౌభాగ్యాలను సిద్ధింప జేయమ్మా అని మనః స్పూర్తిగా అర్ధిస్తూ వేల వేల నమస్కారాలు చేయుచున్నారు. అవిధంగా పూజలందు కొనుచున్న ఆ దేవదేవిని ఆ శ్రీహరి దేవేరిని చూచుచూ మురిసి పోవుచున్నాము.

100. ప్రసనాక్షై నమః

          కోమలమైన దేహము, సుందరమైన ఆకర్షణీయమైన ముఖారవిందము, మీనముల వంటి కనుదోయి సువర్ణ తేజమై వెలుగు ఆభరణములను దరించిన అమ్మ దయా హృదయ ఆ విచ్చినటువంటి మీనముల వంటి అక్షులు ప్రసన్నమైన చూపులతో అలరారు చుండగా అమ్మ కరుణ రసాన్ని ఆ అక్షములతో ప్రసాదించుచుండగా భక్తులు ఆ ప్రసన్న వదనను ప్రసన్నాక్షిని భక్తితో పూజించుచూ తమ అంజలిని ముకుళించి ఆ కరుణరసాన్ని గ్రోలుతూ ప్రసన్నాక్షై నమః ప్రార్థించుచున్నారు.

101. నారాయణ సమాశ్రితాయై  నమః

          శ్రీమన్నారాయణుని అర్ధాంగి, ఆయనలో సగం అయిన ఇల్లాలు శ్రీహరి హృదయ నివాసి అయిన, శ్రీదేవి పరమభక్తురాలై నారాయణుని నామమే తపస్సు చేసి ఆ శ్రీహరిని పొందడానికి ఘోర తపస్సును నిర్వహించుకుంటున్నది. నారాయణునికి పరమ ప్రీతిని కలిగించే ఆ శ్రీహరి నామ పారాయణ వల్న, ఆ శ్రీహరిని ఆశ్రయించి శ్రీహరిలో సగమై భక్తులచే నారాయణ సమాశ్రితాయై నమః అని భక్తుల చేత పిలువబడుతూ పూజలందుకొను శ్రీమహాలక్ష్మికి వేల నమస్కారములు తెలియజేయుచున్నాము.

102. దారిద్ర్య ధ్వంసిన్యై నమః

          కళగలిగిన, అతిలోక సౌందర్యవతియైన, సుగుణాల రాశియైన ముగ్ధమనోహరి అయిన, విష్ణుప్రియ అయిన, పద్మప్రియ అయిన, సకల సంపదలకు ఆలవాలమైన శ్రీమహాలక్ష్మి భక్తులయొక్క మనోభావాలను గ్రహించి, భక్తులకు అనేక సంపదలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తూ దారిద్య్రాన్ని పారద్రొలి శుభాలను ఒసగే లక్ష్మిగా పూజలందు కొనుచున్నది ఆ అమృతమయ చల్లని మా దేవతకి వేన వేల నమస్కారాలర్పించు కొనుచున్నాము. ఓ! జననీ! కారుణ్యమర్తి! కనకధారను ఇచ్చి పేదవాని ఇంట దరిద్య్రాన్ని మాపు చేసావు. అపార ధన సంపదలను మాపై కూడా కురిపించి మా దారిద్య్రాలను తీసివేయితల్లి! లేదు అనే శబ్దం మా ఇంట లేకుండా చేయి తల్లీ! దరిద్య్రాన్ని ద్వంసం చేయగల ఓ! చైతన్యమÖర్తి నీకివే వేల నమస్కారాలు తెలియజేయుచున్నాము.

103. సర్వోపద్రవ వారిణ్యై నమః

          భక్తులు కోరుకునే మనః సంకల్పాలు ఎలావుంటాయి అంటే తమ ఇంటసిరులు తులతూగాలి అని, పిల్లాపాపలతో తమ ఇల్లు కళకళలాడాలి అని,తమ భర్తలు ఆరోగ్యంతో వుండాలని తమ సౌభాగ్యం నిత్యనూతనంగా వెలుగొందాలని కోరుకుంటూ ఏ ఉపద్రవాలు ఎదురైనా తమజీవితాలు చిన్నాభిన్నం కాకూడదని సర్వోపద్రవ వారిణ్యై నమః అని భక్తులు తమ అంతరంగాలలో అమ్మని ప్రగాఢంగా ధ్యానిస్తూ పూజిస్తున్నారు. వేలవేల నమస్కారాలు చేయుచూ ఉన్నారు. ఏ ఆటంకాలనైనా తొలగింపగలదు ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా సరళీకృతం చేయగల్గిన అమ్మ దీశాలి, ధీర వనిత.

104. నవదుర్గాయై నమః

          ఉత్తమోత్తమమైన ఇల్లాలు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మÖలపుటమ్మగా కొలుచుకునే మహాలక్ష్మి, మహాసరస్వతి మహాకాళిగా పూజలందుకొనుచున్న దుర్గను, నవదుర్గాయై నమః అని కీర్తిస్తూ పూజించుకొనుచున్నాము. వేల నమస్కారాలను తెలియ జేయుచున్నాము. ముగ్గురమ్మల స్వరూపము అయిన నవదుర్గ రూపమును, నామమును కొలుచుచూ స్మరించుచున్నాము. దుర్గ అను నామమునకే అత్యంత శక్తి వున్నది. ఆఅమ్మ నామమునకు మించిన నామము లేదు రూపమునకు మించిన రూపము లేదు. శక్తిని మించిన శక్తిలేదు, దుష్ఠుల దునుమాడే శక్తి, శాంత స్వరూపిణిగా నవదుర్గ.

105. మహాకాళ్యై నమః

          త్రిమూర్తిణీ స్వరూపిణియైన అమ్మ త్రిమూర్తుల నామాలతోటియే గాకుండా వివిధ నామాలతో సకల జనులను చల్లగా కాపాడుతూ మహాసరస్వతిగా జ్ఞాన సంపదతోనూ, మహాలక్ష్మిగా సౌభాగ్యాలతోనూ, మహాకాళిగా దీర, ధైర్య సాహసాలతోనూ ఒప్పారుతూ భక్తులకు అనేక మంగళకరమైన శుభకరమైన అంశాలను ప్రసాదించుచున్నది. అందువల్లనే భక్తజనులు అమ్మ శక్తిరూపాన్ని మహాకాళ్యై నమః అనే నామముతో పూజించుచున్నారు. నీరాజనాలను అందించుచున్నారు. అమ్మ ఉగ్రరూపంతో శక్తిని ప్రసాదిస్తుంది. దుష్ఠశిక్షణ చేస్తుంది.

106. బ్రహ్మ విష్ణు శివాత్మికాయై  నమః

          మంగళ స్వరూపిణి అయిన అమ్మశ్రీమహాలక్ష్మి ఈ జగత్తును పరిపాలించెడి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆత్మగా ఒప్పారు చున్నది. ఒకప్ప్పుడు జగదంబయై బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్ఠించి ఈ సృష్ఠి నిర్వహణా భాద్యతలను అనగా సృష్ఠించుట, స్థితి పాలన, లయమును చేయుటకు త్రిమÖర్తులను సృష్ఠింపజేసి. వారి హృదయములో చెరగని స్థానమును సంపాందించుకున్నది. తదుపరి జగదంబ మేను నుంచి లక్ష్మి సరస్వతులను ఆవిర్భవింపజేసి త్రిమÖర్తులకు భార్యలుగా స్థిరపడినారు. త్రిమÖర్తులకు రాణులై వారివారి అంతరంగములయందు ఒప్పారుచూ మహాలక్ష్మి మహా సరస్వతి, మహాకాళిగా త్రిమÖర్త్యాత్మక స్వరూపముతో పూజలందుకొనుచున్న ఆదేవేరుల ఏకాత్మ స్వరూపమునకు వేలవేల నమస్కారములు చేయుచున్నాము.

107. త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః

          ఈలోకములో ప్రతిక్షణము కర్మని చేయుచూ, కర్మని అనుభవిస్తూన్న జీవులకు ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తూ వారివారి కర్మ ప్రభావం చేత మరు జన్మలను ప్రసాదిస్తూ జరిగిపోయిన కాలాలకు సంబంధించి, జరుగుచున్న కాలానికి సంబందించి, జరగబోవు కాలానికి సంబందించిన జ్ఞానము అమ్మకి గాక మరి ఎవరికి వుంటాయి? అని తలపోయుచూ త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః అని పూజించుచూ వేనవేల నమస్కారములు తెలియ జేయుచున్నాము.

108. భువనేశ్వర్యై నమః

          మణీ ద్వీపములో నివసించుచున్న లలితాపరాభట్టారికకి మంత్రిణులతోనూ, రాణులతోనూ, శ్రీమాతా, శ్రీమహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరిగా ఒప్పారుతూ భక్తుల హృదయాలలో నివసిస్తూ వారి మదిలో జ్ఞాన జ్యోతులు వెలిగించుచున్నది అమ్మల గన్నయమ్మగా ముగురమ్మల మÖలపుటమ్మగా అనేక విధాలుగా దయమయిగా, అమృతవర్షిగా ఆనంద దాయినిగా, ఈ చరాచర బ్రహ్మాండమునందు నిండియుండిన అఖండ తేజోమÖర్తిగా. మణిమయకాంతి పుంజముగా దయర్ధ హృదయనిగా దుష్ఠుల దునుమాడే కాళిగా అనేక రూపాలలో ఒప్పారుచున్న భగవతి సౌమ్యదేవత శ్రీమహాలక్ష్మిగా పూజలందు కొనుచూ శ్రీభవనేశ్వరి అను నామముతో కొనియాడ బడుచున్నది. అమ్మకు వేల శతకోట్ల నమస్కారాలర్పించుకొనుచూ ఈ సమస్త జగత్తును చల్లగా కాపాడమని కోరుకుంటూ ప్రార్థించుచున్నాను.

Ravinuthala Bhakti

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *