Skip to content
MARKET UPDATE

SENSEX: 74,459.53, change ▲ +308.49 (+0.42%). Source Yahoo Finance, as of 30 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 23,053.10, change ▲ +116.35 (+0.51%). Source NSE, as of 30 Oct 2026 3:30 PM IST. GOLD 24K / 999: ₹1,40,054 / 10g. Source IBJA, as of 30 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,28,289 / 10g. Source IBJA, as of 30 Oct 2026 PM IST. SILVER 999: ₹1,81,344 / kg. Source IBJA, as of 30 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

ఎంటర్‌టైన్‌మెంట్

Aadarsha Kutumbam Review: వెంకటేశ్ కామెడీ అదుర్స్.. కానీ త్రివిక్రమ్ మ్యాజిక్ మిస్సైందా?

చివరిగా నవీకరించబడింది:

Adarsha Kutumbam Review
Adarsha Kutumbam Review

Aadarsha Kutumbam Review:

Aadarsha Kutumbam Review: విక్టరీ వెంకటేశ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. గతంలో రచయితగా వెంకటేశ్‌కు ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి అద్భుతమైన వినోదాత్మక చిత్రాలను అందించిన త్రివిక్రమ్.. దర్శకుడిగా ఆయనతో సినిమా ఎప్పుడు చేస్తారనే ఎదురుచూపులకు ‘ఆదర్శ కుటుంబం’తో తెరదించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్, డార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి రూపొందించిన ఈ సినిమా ఎలా ఉంది? వెంకీ తన కామెడీతో మరోసారి మ్యాజిక్ చేశారా? త్రివిక్రమ్ దర్శకత్వం ఆకట్టుకుందా?

Aadarsha Kutumbam Review: వెంకటేశ్ కామెడీ అదుర్స్.. కానీ త్రివిక్రమ్ మ్యాజిక్ మిస్సైందా?

Aadarsha Kutumbam Review: కథేంటి?

చిట్టిబాబు (వెంకటేశ్) ఓ సాధారణ మధ్యతరగతి బ్యాంకు ఉద్యోగి. భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) చీటీల వ్యాపారంలో నష్టపోవడంతో కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు పిల్లల వల్ల వచ్చే సమస్యలతో చిట్టిబాబు సతమతమవుతుంటాడు.

కొడుకు సర్వ (రాజ్ ప్రజ్వల్) చదువుపై పెద్దగా ఆసక్తి చూపించడు. కూతురు సంపూర్ణ (యువీనా) తన ప్రేమ వ్యవహారంతో ఇంట్లో కొత్త సమస్యలు తీసుకొస్తుంది. ఇలా రోజువారీ కష్టాలతో జీవితం సాగిస్తున్న చిట్టిబాబుకు అనూహ్యంగా రూ.100 కోట్ల లాటరీ తగులుతుంది.

దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా పేదరికం నుంచి విలాసవంతమైన జీవితంలోకి అడుగుపెడుతుంది. అద్దె ఇంటి నుంచి గేటెడ్ కమ్యూనిటీలోని హౌస్ నంబర్ 47కు మారుతుంది. అయితే ఈ ఆనందం ఎక్కువకాలం నిలవదు. బిహార్‌కు చెందిన టార్జన్ దోపిడీ ముఠా కన్ను ఈ కుటుంబంపై పడుతుంది.

అసలు ఈ ముఠా చిట్టిబాబు కుటుంబాన్నే ఎందుకు టార్గెట్ చేసింది? వారి వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? పోలీస్ అధికారి దామోదర్ నాయుడు (నారా రోహిత్) ఈ కుటుంబం గురించి తెలుసుకున్న విషయాలేంటి? కుటుంబాన్ని కాపాడుకునేందుకు చిట్టిబాబు ఎలాంటి పోరాటం చేశాడు? అనేది మిగతా కథ.

Aadarsha Kutumbam Review: ఫస్టాఫ్ ఎలా ఉంది?

సినిమా ప్రారంభంలోనే బిహారీ దోపిడీ ముఠా చేసే అరాచకాలను చూపిస్తూ ఆసక్తి కలిగించారు. ఆ తర్వాత చిట్టిబాబు కుటుంబంలోని సమస్యలు, భార్యాభర్తల మధ్య సన్నివేశాలు, పిల్లల అల్లరి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాయి.

ముఖ్యంగా వెంకటేశ్ తన సహజమైన కామెడీ టైమింగ్‌తో సినిమాను ముందుకు నడిపించారు. మధ్యతరగతి భర్తగా ఆయన చూపించిన అసహనం, కుటుంబ సమస్యలతో పడే ఇబ్బందులు నవ్వులు పూయిస్తాయి.

రూ.100 కోట్ల లాటరీ తగిలిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. అప్పటివరకు సాధారణంగా సాగిన కథ ఒక్కసారిగా క్రైమ్, థ్రిల్లర్ అంశాల వైపు మళ్లుతుంది. దోపిడీ ముఠా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో ఉత్కంఠ మొదలవుతుంది.

ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ సన్నివేశాల్లో సత్య తన హావభావాలతో ప్రేక్షకులను నవ్విస్తారు. మొత్తంగా ఫస్టాఫ్‌లో త్రివిక్రమ్ తనకు అలవాటైన వినోదాన్ని అందించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు.

సెకండాఫ్‌లో తడబాటు!

సినిమా ద్వితీయార్ధంలో దర్శకుడు కథకు మరో కోణాన్ని జోడించారు. చిట్టిబాబు కుటుంబం వెనుక ఉన్న అసలు నేపథ్యాన్ని ఫ్లాష్‌బ్యాక్ రూపంలో పరిచయం చేస్తారు. అయితే ఈ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే స్థాయిలో ప్రభావం చూపించదు.

దోపిడీ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు వేసే వ్యూహాలు కూడా అంతగా ఆకట్టుకోవు. పోలీసులకు ముఠాను పట్టుకునే అవకాశాలు ఉన్నప్పటికీ, చిట్టిబాబు కుటుంబం చుట్టూ కథను తిప్పడం కొంత అసహజంగా అనిపిస్తుంది.

షాపింగ్ మాల్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సాగదీసినట్లుగా ఉంటుంది. ఇక క్లైమాక్స్‌లో రైలు నేపథ్యంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. కుటుంబాన్ని కాపాడుకునేందుకు హీరో చేసే ప్రయత్నాల్లో కొత్తదనం కనిపించదు.

సెకండాఫ్‌లో అక్కడక్కడా సత్య కామెడీ కొంత ఉపశమనం కలిగించినా, కథనంలోని బలహీనతలను పూర్తిగా కప్పిపుచ్చలేకపోయింది.

నటీనటుల ప్రదర్శన ఎలా ఉంది?

చిట్టిబాబు పాత్రలో వెంకటేశ్ మరోసారి తన అనుభవాన్ని చూపించారు. ఫస్టాఫ్‌లో కామెడీతో నవ్విస్తూనే, సెకండాఫ్‌లో కుటుంబం కోసం పోరాడే వ్యక్తిగా కనిపిస్తారు. ఈ రెండు కోణాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు.

స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టి మంచి నటన కనబరిచారు. కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించారు. పిల్లల పాత్రల్లో యువీనా, రాజ్ ప్రజ్వల్ తమ పరిధి మేరకు నటించారు.

పోలీస్ అధికారి దామోదర్ నాయుడుగా నారా రోహిత్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సత్య కనిపించిన ప్రతిసారీ తన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. రావు రమేశ్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. ఆయన చెప్పే కొన్ని డైలాగులు ఆకట్టుకుంటాయి.

నివేదా పేతురాజ్, బ్రహ్మాజీ, రఘుబాబు, నాజర్, షఫీ, నికితిన్ ధీర్, ఉదయ్‌బిర్ సంధు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగాలు

త్రివిక్రమ్ రచనలో ఫస్టాఫ్‌లో వినోదం, కుటుంబ భావోద్వేగాలు బాగానే పండాయి. అయితే ద్వితీయార్ధంలో కథనం బలహీనపడింది. ముఖ్యంగా కీలకమైన సన్నివేశాల్లో ఆయన కలం నుంచి ఆశించే పదునైన సంభాషణలు, కొత్తదనం కనిపించలేదు.

తమన్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండిపోయేలా లేవు. ‘నారాయణమ్మ’ పాట మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు బలాన్ని ఇచ్చింది. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను రిచ్‌గా చూపించింది. నవీన్ నూలి ఎడిటింగ్ మరింత కచ్చితంగా ఉండాల్సింది. నిర్మాత ఎస్. రాధాకృష్ణ నిర్మాణ విలువల్లో రాజీ పడలేదు.

ప్లస్ పాయింట్స్

  • వెంకటేశ్, శ్రీనిధి శెట్టి నటన
  • ఫస్టాఫ్‌లో వినోదాత్మక సన్నివేశాలు
  • ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్
  • సత్య కామెడీ
  • సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

  • కొత్తదనం లేని కథ
  • బలహీనమైన ద్వితీయార్ధం
  • సాగదీసిన యాక్షన్ సన్నివేశాలు
  • నిరాశపరిచే క్లైమాక్స్
  • పాటల్లో ఆకట్టుకునే అంశాలు తక్కువ

Aadarsha Kutumbam Review: చివరిగా..

వెంకటేశ్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌పై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు చాలా ఎక్కువ. అందుకు తగ్గట్టుగా ఫస్టాఫ్‌లో వినోదాన్ని అందించిన ‘ఆదర్శ కుటుంబం’.. సెకండాఫ్‌లో మాత్రం తడబడింది. వెంకటేశ్ కామెడీ, శ్రీనిధి శెట్టి నటన, ఇంటర్వెల్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలాలు. కొత్త కథ, బలమైన క్లైమాక్స్ ఆశించే ప్రేక్షకులకు మాత్రం నిరాశ తప్పదు. కొన్ని నవ్వుల కోసం ఒకసారి చూడదగిన సినిమా.

చివరిగా: ‘ఆదర్శ కుటుంబం’.. వెంకీ కామెడీ కోసం చూడొచ్చు!

also read: స్టూడియో వన్ నెట్‌వర్క్ ఛానల్స్

https://en.wikipedia.org/wiki/Venkatesh_(actor)

Studio One Plus

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.