Skip to content
వార్తలు

waist thread: మొలతాడు ఎందుకు కట్టుకుంటారు?ఈ ఆచారం వెనుక అసలు కారణం ఏంటి?

waist thread: మొలతాడు ఎందుకు కట్టుకుంటారు? ఈ ఆచారం వెనుక అసలు కారణం ఏంటి?

భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో చిన్నపిల్లలకు, ముఖ్యంగా నడుము చుట్టూ మొలతాడు కట్టే ఆచారం చాలా కాలంగా ఉంది. ప్రాంతానికో పేరు, కుటుంబానికో విధానం ఉన్నా భావం మాత్రం దాదాపు ఒకటే. నల్ల దారం లేదా మొలతాడు కట్టడం వల్ల పిల్లలకు దృష్టి తగలకుండా ఉంటుందని పెద్దలు నమ్ముతారు. పాతకాలంలో మొలతాడుకు చిన్న తాయెత్తులు, రక్షా చిహ్నాలు లేదా దేవతలకు సంబంధించిన గుర్తులు కట్టేవారు. అందుకే దీనిని రక్షణకు సంబంధించిన ఆచారంగా కూడా భావించేవారు.

నడుము పెరుగుదల తెలుసుకోవడానికి?

సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది? Singeetam-Chiranjeevi
Singeetam-Chiranjeevi: సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది?.. రెండు షెడ్యూల్స్ తర్వాత ఆగిపోయిన ‘భూలోకవీరుడు’ వెనుక షాకింగ్ కథ

కొన్ని కుటుంబాల్లో పిల్లల నడుము పరిమాణం, శరీర పెరుగుదలలో మార్పులు గమనించడానికి కూడా మొలతాడు ఉపయోగపడేదని చెబుతారు. పాతకాలంలో పిల్లల దుస్తులు, చిన్న వస్త్రాలు నడుము దగ్గర సరిగా ఉండేందుకు దారం ఉపయోగపడేది. తర్వాత అదే ఆచారం సంప్రదాయ రూపం తీసుకుంది. మొలతాడు కట్టుకోవడం వల్ల వ్యాధులు తగ్గుతాయి, శరీరానికి ప్రత్యేక శక్తి వస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక దారం కాదు. చాలా కుటుంబాల్లో ఇది సంప్రదాయం, రక్షణ భావన, పెద్దల నమ్మకం, కుటుంబ ఆచారం కలిసిన గుర్తుగా కొనసాగుతోంది. దీని వెనుక కొన్ని practical కారణాలు ఉన్నా, నేటి రోజుల్లో మొలతాడు ప్రధానంగా ఒక సాంస్కృతిక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇక్కడ మొలతాడు మన పూర్వికులు చెప్పినట్లు గా చూస్తే మన బొడ్డు కింద భాగాన కొంత ఉష్ణం విడుదల అవుతుంది. దాన్ని అరికట్టడానికి మొలతాడును ఉపయోగించేవారు. దీని వలన ఒక వయసు వచ్చాక ఆ ఉష్ణాన్ని సమపాళ్ళలో నియంత్రిస్తుంది. దాని వలన శ్రుంగారం లో పాల్గొనేటప్పుడు శాస్త్రీయంగా ఎక్కువ సేపు పాల్గొనే అవకాశం ఉంటుంది అని మన పెద్దలు అనుభవ పూర్వకం గా మనకు ఇచ్చిన సందేశం. పూర్వం మనకు ఇంత టెక్నాలజి లేక పోయినా మన ఋషులు, పెద్దలు అనేక శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రపంచం కు అందిచారు. ఇప్పుడు మనం సైన్స్ అంటున్నం కాని, కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకు ఇవన్నీ చెప్పారు. మొలతాడు కట్టడం వలన సమశీతోష్ణ స్థితి జరుగుతుంది. పైగా పూర్వం బొడ్డును కోసి దానికి సంబంధించిన ప్రేగును ఒక చిన్న తాయెత్తులో కట్టి మొలతాడు కు కట్టేవారు. ఆ ప్రేగులో మన పూర్వికుల జీన్స్ ఉండేవి. దాంతో ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆ తాయిత్తులోని ప్రేగును తీసి ఆ కణాలను ఎక్కించే వారు. దాంతో మన శరీరంలో ని పాడైన కణాలను అది రిపేరు చేస్తుంది అని చెప్పేవారు.

ఆడ పిల్లలకు మొలతాడు కట్టి సిగ్గు బిళ్ళను కడతారు. ఇంట్లో వాళ్ళకు కూడా తప్పుడు ఆలోచనలు రాకుండా ఉండటానికి, అలాగే సిగ్గు బిళ్ళ కట్టినపుడు దృష్టి వారి ప్రైవేట్ పార్ట్స్ మీద పడకుండా ఉంటుంది. ఎందుకంటే పూర్వం ఇప్పటి లాగా డైపర్ లు లేవు.

AC మధ్యలో ఆగిపోతుందా? అసలు సమస్య ఇదే కావచ్చు! CAR AC Problem
CAR AC Problem: కారు AC మధ్యలో ఆగిపోతుందా?.. 10 నిమిషాల తర్వాత మళ్లీ పనిచేస్తే కారణాలు ఇవే

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.