Skip to content
వార్తలు

వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారు?…

Vinayaka nimajjanam
Vinayaka nimajjanam

వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారు?

భాధ్రపద మాసం లో వచ్చే వినాయక చవితి ని చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఆ తరువాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. దీని వెనుక ఏదైనా పురాణ గాధ ఉన్నదా అనేది చూస్తే….మహాభారతాన్ని రచించాలి అని అనుకున్న వేద వ్యాస మహర్షి తాను చెపుతున్న శ్లోకాలను ఆపకుండా రాయగల సమర్ధుడి కోసం వెతికాడు. అప్పుడు గణపతి ఆ శ్లోకాలను తాను వ్రాస్తాను అని చెపుతాడు అయితే దానికి గణపతి ఒక షరతు విధించాడు అదేమిటంటే వ్రాయడం మొదలు పెట్టాక అది అయిపోయేదాకా ఎక్కడా ఆగకూడదు నిరంతరాయంగా శ్లోకాలు చెపుతూనే ఉండాలి అని. దానికి వ్యాస మహర్షి అంగీకరించి తాను కూడా ఒక షరతు విధించాడు నేను చేప్పే శ్లోకాలను పూర్తి గా అర్ధం చేసుకున్నాకే రచించాలి అని అన్నాడు. దీనికి ఇద్దరూ పరస్పర అంగీకారానికి వచ్చి వ్యాస మహర్షి శ్లోకాలు చెప్పటం మొదలు పెట్టాడు. గణపతి కూడా ఆపకుండా రాస్తూనే ఉన్నాడు. ఇలా పగలు రాత్రి తేడా లేకుండా రచనలు కొనసాగాయి దాంతో గణపతి శరీరం లో ఉష్ణం పెరిగింది. దాంతో వ్యాసమహర్షి గణపతి శరీరానికి బంక మట్టి ని రాసారు. దాంతో శరీరం చల్లబడింది. కొంత కాలానికి ఆ బంక మట్టి పూర్తిగా ఎండి పోయింది మహాభారతం రచించడం పూర్తి అయ్యాక గణపతిని ఒక నదిలోకి తీసుకువెళ్ళి ఆ బంక మట్టిని మొత్తం శుభ్రం గా కడిగి స్నానం చేయినాడు. ఇదే కధను సంప్రదాయం గా తీసుకుని గణపతి పూజ అనంతరం స్వామి వారిని నిమజ్జనం చేస్తారు. అంటే నిమజ్జనం అంటే గణపతిని మన నుంచి దూరం చేయడం కాదు. మట్టి తో చేసిన ప్రతిమ కు ప్రణ ప్రతిష్ట చేసినప్పుడు ఆ శక్తి నిర్ధిష్ట కాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆ దేవ దేవుడిని తన శాశ్వత నివాసానికి కైలాసానికి సాగనంపుతూ ఆ భౌతిక మట్టిని ప్రకృతి లో కలపడమే నిమజ్జనం. మనం గతం లో అనేక సార్లు చెప్పుకున్నట్లు మన హిందూ పురాణాలు చెప్పే నీతి ఏమిటంటే మనం ఎంత సంపాదించినా, ఎంత ఎత్తు ఎదిగినా చివరకు మట్టి లోనే కలవాలి….ప్రకృతి లో కలవాలి. అందుకే ఆ దేవదేవుడు ఎన్నో పూజలు అందుకుని ఆ మట్టిని ప్రకృతి లో కలిపి తన శక్తి ని ఆ పరమాత్మ దగ్గరకు వెళ్ళిపోతాడు.

ఈ వార్త కూడా చదవండి

సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది? Singeetam-Chiranjeevi
Singeetam-Chiranjeevi: సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది?.. రెండు షెడ్యూల్స్ తర్వాత ఆగిపోయిన ‘భూలోకవీరుడు’ వెనుక షాకింగ్ కథ

https://studioonenews.com/bhakti/vinayakudu-garika-importance-anasura/

AC మధ్యలో ఆగిపోతుందా? అసలు సమస్య ఇదే కావచ్చు! CAR AC Problem
CAR AC Problem: కారు AC మధ్యలో ఆగిపోతుందా?.. 10 నిమిషాల తర్వాత మళ్లీ పనిచేస్తే కారణాలు ఇవే
Ravinuthala Bhakti

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.