MARKET UPDATE

SENSEX: 73,067.81, change ▲ +685.34 (+0.95%). Source Yahoo Finance, as of 06 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,776.10, change ▲ +220.35 (+0.98%). Source NSE, as of 06 Oct 2026 3:30 PM IST. GOLD 24K / 999: ₹1,48,473 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,36,001 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. SILVER 999: ₹2,22,820 / kg. Source IBJA, as of 06 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

Skip to content
ఎంటర్‌టైన్‌మెంట్

Aadarsha Kutumbam: “ఆ రోజులు అయిపోయాయి.. ఇది వేరే లెవెల్ కుటుంబం”.. Venkatesh comments వైరల్

Venkatesh Aadarsha Kutumbam Narayanamma song launch comments,
Venkatesh Aadarsha Kutumbam Narayanamma song launch comments

Aadarsha Kutumbam: వెంకటేష్ కామెంట్స్ వైరల్

Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న **‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – AK47’**పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ‘నారాయణమ్మ’ పాట లాంచ్ కార్యక్రమంలో వెంకటేష్ చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో చర్చగా మారాయి. విక్టరి వెంకటేష్ సినిమాలు అంటే నే ఎంటర్టైన్మెంట్, వెంకటేష్ సినిమాలు వస్తున్నాయి అంటే నే ప్రేక్షకులకు పండగే….ఇక సంక్రాంతి కి వస్తుంది అంటే ఇక చెప్పనవసరం లేదు. వెంకటేష్ నిదానంగా సినిమాలు చేసుకుంటూ వస్తూన్నా…మంచి జోనర్ లు ఎన్నుకుని బ్లాక్ బస్టర్ లు కొడుతున్నాడు. అసలు ఇప్పుడున్న హీరో లలో సక్సెస్ రేట్ ఉన్నది విక్టరి వెంకటేష్ అనటం లో సందేహం లేదు. ఎన్ని కధలు మార్చినా, ఎన్ని జోనర్ లు మార్చినా వెంకటేష్ మాత్రం హిట్ కొడుతున్నాడు. అయితే ఇప్పుడు తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ అంటే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

“పెళ్లి కాని ప్రసాద్ రోజులు అయిపోయాయి”

వెంకటేష్ మాట్లాడుతూ గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ తరహా చిత్రాల్లో కనిపించిన పాత్రలను గుర్తు చేసుకున్నారు. అప్పటి తరహా పరిస్థితులు ఇప్పుడు లేవని, ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయని చెప్పారు. కొత్తగా ఏం చేయాలనే ఒత్తిడి తమపై ఉండేదని, అలాంటి సమయంలో త్రివిక్రమ్ ఒక ఫ్రెష్ కథతో ముందుకు వచ్చారని వెంకటేష్ తెలిపారు. సినిమా యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అనూహ్య మలుపులతో సాగుతుందని చెప్పారు.

“ఇది వేరే లెవెల్ ఆదర్శ కుటుంబం”

సినిమాలో తన కుటుంబం గురించి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు కార్యక్రమంలో నవ్వులు పూయించాయి.

తన పాత్ర పేరు చిట్టిబాబు అని, కుటుంబంలో జరిగే సరదా సమస్యల మధ్య నలిగిపోయే వ్యక్తిగా కనిపిస్తానని చెప్పారు. తన భార్య స్వర్ణ అప్పులు చేస్తుంటే, తాను ఇంట్లో వంట చేస్తూ ఉంటానంటూ కథలోని కామెడీ టచ్‌ను వివరించారు.

అనకాపల్లి సినిమా
అనకాపల్లి సినిమా: దసరా ధమాకాగా నిలుస్తుంది – లగడపాటి శ్రీధర్

‘నారాయణమ్మ’తో మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం

‘ఆదర్శ కుటుంబం’ నుంచి విడుదలైన తొలి పాట ‘నారాయణమ్మ’. థమన్ సంగీతం అందించిన ఈ పాటను రామ్ మిరియాల, ప్రభ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటలో డింపుల్ హయాతి ప్రత్యేక ఆకర్షణగా కనిపించగా, వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ కూడా విజువల్స్‌లో కనిపిస్తున్నారు.

Aadarsa Kutumbam ప్రేక్షకులకు వెంకటేష్ సందేశం

సినిమా విషయాలతో పాటు జీవితంపై కూడా వెంకటేష్ మాట్లాడారు. మనిషి ఎంత ప్లాన్ చేసినా చివరికి కొన్ని విషయాలను దేవుడికి వదిలేయాలని, ప్రకృతితో కనెక్ట్ అవుతూ మంచి చేయాలని అభిమానులకు సూచించారు.

Aadarsa Kutumbam అక్టోబర్ 9న విడుదల

‘ఆదర్శ కుటుంబం – AK47’కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

వెంకటేష్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Image accompanying: సరిపోయారు ఇద్దరూ టీజర్: అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదల
సరిపోయారు ఇద్దరూ టీజర్: అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదల

చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. సినిమా ప్రపంచవ్యాప్తంగా 2026 అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.

Read also…https://studioonenews.com/telugu-news/ranabaali-release-date-october-16-2026/

Studio One Plus

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.