Is 7 hours of sleep enough? రోజుకు 7 గంటలు నిద్రపోతే చాలు అనుకునేవారు చాలామంది. కానీ నిద్ర అవసరం ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండదు. వయస్సు, శారీరక శ్రమ, ఒత్తిడి, ఆరోగ్యం, ఇవి ప్రభావం చూపుతాయి.
పెద్దవారిలో చాలామందికి రోజుకు సుమారు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం అవుతుంది. కాబట్టి 7 గంటలు కొందరికి సరిపోవచ్చు. కానీ ఉదయం లేచిన తర్వాత కూడా అలసటగా ఉంటే, రోజంతా నిద్రమత్తు వస్తే లేదా concentration తగ్గితే మీకు మరింత నిద్ర అవసరం ఉండొచ్చు.
నిద్రలో duration మాత్రమే కాదు, quality కూడా ముఖ్యమే. రాత్రి 7 గంటలు మంచంలో ఉన్నా మధ్య మధ్యలో పలుమార్లు మేల్కొంటే శరీరానికి పూర్తిస్థాయి విశ్రాంతి దొరకకపోవచ్చు.
తగిన నిద్ర లేకపోతే mood మార్పులు, చిరాకు, focus తగ్గడం, daytime sleepiness వంటి సమస్యలు రావచ్చు. దీర్ఘకాలంగా నిద్ర తక్కువగా ఉంటే overall healthపైనా ప్రభావం పడొచ్చు.
Weekendలో ఎక్కువసేపు నిద్రపోయి weekdaysలో sleep loss compensate చేయడం పూర్తిగా సరైన పరిష్కారం కాదు. ప్రతిరోజూ దాదాపు ఒకే సమయానికి పడుకోవడం, లేవడం sleep quality మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
రాత్రి నిద్రకు ముందు mobile, laptop, bright screens ఎక్కువసేపు వాడటం తగ్గించడం, late caffeine తగ్గించడం, roomను darkగా ఉంచడం వంటి habits కూడా మంచి నిద్రకు ఉపయోగపడతాయి.
7 గంటలు నిద్రపోయిన తర్వాత మీరు freshగా లేస్తే, రోజంతా alertగా ఉంటే, excessive sleepiness లేకపోతే ఆ duration మీకు సరిపోవచ్చు. కానీ రోజూ అలసటగా ఉంటే 8 లేదా 9 గంటల వరకు sleep duration పెంచి చూడడం మంచిది. కనీసం కుదిరితే మధ్యాహ్నం ఒక 15 నుంచి 30 నిముషాలు కునుకు వేస్తే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది.
సమయపాలన: ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం మరియు ఉదయం ఒకే సమయానికి మేల్కోవడం అలవాటు చేసుకోండి.
స్క్రీన్ టైమ్ దూరం: పడుకునే ముందు కనీసం గంటపాటు మొబైల్ ఫోన్లు, టీవీలు మరియు ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండండి.
చీకటి వాతావరణం: పడుకునే గదిలో లైట్లు ఆపివేసి, ప్రశాంతమైన మరియు చీకటి వాతావరణం ఉండేలా చూసుకోండి.
కెఫీన్‌కు స్వస్తి: రాత్రి పూట కాఫీ, టీ లేదా సోడాల వంటి కెఫీన్ పదార్థాలకు దూరంగా ఉండండి.
తేలికపాటి ఆహారం: రాత్రి భోజనానికి, నిద్రపోయే సమయానికి మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి.
అంతే కాదు
జ్ఞాన ముద్ర / చిన్ ముద్ర — బొటనవేలు, చూపుడు వేలు చివరలు కలపాలి. 10–15 నిమిషాలు.
ప్రాణ ముద్ర — బొటనవేలు, ఉంగర వేళ్లు, చిటికెన వేళ్లు కలపాలి. 10 నిమిషాలు.
శూన్య ముద్ర — మధ్యవేలిని మడిచి బొటనవేలితో సున్నితంగా ఒత్తాలి. 5–10 నిమిషాలు.
అపాన ముద్ర — బొటనవేలు, మధ్యవేలు, ఉంగర వేళ్లు కలపాలి. 10 నిమిషాలు.
యోగ నిద్రకు ముందు చిన్ ముద్ర — పడుకునే ముందు slow breathingతో 5–10 నిమిషాలు చేస్తే relaxationకు ఉపయోగపడొచ్చు.
మొత్తానికి 7 గంటలు ఒక minimum benchmarkగా తీసుకోవచ్చు కానీ అది అందరికీ perfect number కాదు. మీ body ఎలా respond అవుతుందో అదే ముఖ్యమైన signal.





1 comment