Sridevi Chennai property dispute: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఫేం లో ఉన్నప్పుదే డబ్బులు సంపాదించుకోవాలి, ఆ తరం హీరోలు, కధా నాయకలు ఆలోచించేవారు. కాని వాళ్ళు 100 సినిమాలు తీసినా ఒకటే ఇప్పుడు ఒక హీరో, హీరోఇన్ ఒక్క సినిమా తీసినా ఒకటే….ఎంతో కష్టపడి స్థలాలు, పొలాలు కొనుక్కొని వాటిని కాపాడటానికే మిగిలిన సమయం సరిపోతుంది. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ లో ఇవన్నీ చూసుకోలేరు. దివంగత శ్రీదేవి కూడా ఇలా కష్టపడే అప్పట్లో ఓ స్థలం కొన్నది. అది కాస్త పెద్ద ఇష్యూ అయింది. అసలు శ్రీదేవి ఎక్కడ కొన్నది. ఈ వివాదం ఏమిటి అనేది చూద్దాం….
దివంగత నటి శ్రీదేవి (Sridevi) చెన్నై ఆస్తి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఆ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న ఈ స్థలంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణ వరకు అక్కడ యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది.
1980 లలో శ్రీదేవి హింది లో బాగా పాపులర్ అయింది. షెర్ని,వక్త్ కి ఆవాజ్, ఆఖరిపోరాటం లాంటి సినిమాలతో ఓ ఊపు ఊపేసింది. దాంతో చెన్నై లో ఓ స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం. అప్పట్లో శ్రీదేవి 1988లో చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో 4.77 ఎకరాల స్థలాన్ని ముదలియార్ అనే వ్యక్తి కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. దశాబ్దాలుగా ఇది శ్రీదేవి కుటుంబం ఆధీనంలోనే ఉంది. శ్రీదేవి మరణానంతరం 2023లో ఆస్తి మార్పిడి కోసం దరఖాస్తు చేసుకోగా.. ముదలియార్ రెండో భార్య పిల్లలైన ఎం.సి.శివగామి, ఆమె సోదరుడు ఈ ఆస్తిలో తమకూ వాటా ఉందంటూ చెంగల్పట్టు కోర్టులో సివిల్ కేసు వేశారు.
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మొదటి భార్య ప్రాణాలతో ఉండగానే ముదలియార్ రెండో పెళ్లి చేసుకున్నారని, కాబట్టి రెండో భార్య పిల్లలకు చట్టపరంగా వారసత్వ హక్కులు ఉండవని వాదించారు. వారితో ఏకీభవించిన మద్రాస్ హైకోర్టు.. కింది కోర్టు తీర్పులో జోక్యం చేసుకుంటూ శివగామి వేసిన సివిల్ కేసును కొట్టివేసింది.
మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ శివగామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు ప్రాథమిక దశలో ఉండగానే హైకోర్టు లోతుగా విచారణ జరిపిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కపూర్ కుటుంబం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. 1988లో జరిగిన కొనుగోలుపై ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కేసు వేయడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్లు 1995, 1999లోనే మేజర్లు అయ్యారని గుర్తుచేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఇందుకోసం ఓ విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని నియమిస్తామని తెలుపుతూ తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది.




