Skip to content
ఎంటర్‌టైన్‌మెంట్

‘పిఠాపురంలో… అలా మొదలైంది’పై రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సెప్టెంబర్ 18న విడుదల

టాలీవుడ్‌లో మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

సెప్టెంబర్ 18న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు వారందరికీ కనెక్ట్ అయ్యే కథ: రాజేంద్రప్రసాద్

సీనియర్ నటుడు డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’లో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే భావోద్వేగాలు ఉన్నాయని చెప్పారు. తన కెరీర్‌లో మంచి పాత్రలు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని, ఒక నటుడి ప్రతిభ కంటే పాత్రల గొప్పతనం కూడా విజయానికి కారణమవుతుందని పేర్కొన్నారు.

దర్శకుడు మహేష్ చంద్ర తనకు ముందే పరిచయం ఉన్న వ్యక్తి అని, కథ చెప్పినప్పుడే తన పాత్రలోని లోతు అర్థమైందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. సినిమా కోసం దర్శకుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందని రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. కుటుంబాల్లో కనిపించే అనుబంధాలు, భావోద్వేగాలే కథలో ప్రధానంగా ఉంటాయని అన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో బలమైన ఎమోషన్ ఉంటుందని, అదే సమయంలో ప్రస్తుత తరం ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు కూడా సినిమాలో ఉన్నాయని చెప్పారు.

మంచి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి ఆదరించాలని ఆయన కోరారు.

ఫ్రెష్ కంటెంట్‌తో సినిమా: సుమన్

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుమన్ మాట్లాడుతూ దర్శకుడు మహేష్ చంద్రతో తనకు 25 ఏళ్లకు పైగా పరిచయం ఉందని తెలిపారు. ఆయన కథపై స్పష్టతతో పనిచేసే దర్శకుడని ప్రశంసించారు.

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ కొత్త కంటెంట్, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో రూపొందిందని, ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు సుమన్ చెప్పారు.

‘ఎపిక్’ బ్యూటిఫుల్ ఫిలిం.. విజయ్ దేవరకొండ, రష్మిక ప్రశంసలు

దర్శకుడికి మంచి విజయం రావాలి: చదలవాడ శ్రీనివాసరావు

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహేష్ చంద్ర మంచి దర్శకుడే కాకుండా మంచి వ్యక్తి కూడా అని అన్నారు. నిర్మాతల పట్ల బాధ్యతతో పనిచేసే దర్శకుడిగా ఆయనను అభివర్ణించారు.

ఈ సినిమా ద్వారా దర్శకుడితో పాటు నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. చిన్న నిర్మాతలకు, కొత్త ప్రతిభకు అవకాశాలు రావడం పరిశ్రమకు మంచిదని అన్నారు.

కుటుంబ భావోద్వేగాలే ప్రధాన బలం

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సినిమా కోసం దర్శకుడు, నిర్మాతలు ఎంతో కష్టపడ్డారని చెప్పారు. కుటుంబ భావోద్వేగాలతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

దర్శకులు రామ్ ప్రసాద్, సముద్ర, వీర శంకర్ కూడా సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. కుటుంబ సంబంధాలు, ప్రేమ, పెళ్లి, తల్లిదండ్రుల పట్ల గౌరవం వంటి అంశాలను సినిమా ప్రస్తావిస్తుందని వారు తెలిపారు.

తండ్రీకూతుళ్ల బంధం చుట్టూ కథ

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్‌కు చెందిన చైతన్య రెడ్డి మాట్లాడుతూ సినిమాలో తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చూపించారని తెలిపారు. అనుభవం ఉన్న పెద్దలు ఇచ్చే సూచనలను పిల్లలు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా సినిమాలో చూపించినట్లు చెప్పారు.

దర్శక రచయిత బీవీఎస్ రవి మాట్లాడుతూ ప్రేమ, పెళ్లి వంటి అంశాలు ఉన్నంతకాలం ఇలాంటి కథలకు ప్రేక్షకుల్లో ఆదరణ ఉంటుందని అన్నారు. తండ్రి, కూతురు మధ్య జరిగే సంఘర్షణ సినిమాకు కీలకంగా ఉంటుందని తెలిపారు.

ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే సినిమా: నిర్మాతలు

నిర్మాత దుండిగల్ల బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి తల్లి, తండ్రి, కూతురు తప్పక చూడాల్సిన చిత్రంగా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ను అభివర్ణించారు.

మరో నిర్మాత ఆకుల సురేష్ మాట్లాడుతూ తన చుట్టూ ఉన్న కుటుంబాలను గమనించి ఈ కథకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. దర్శకుడు మహేష్ చంద్రకు కథను చెప్పిన తర్వాత సినిమా రూపుదిద్దుకుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం కనెక్ట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Bigg Boss 10 Day 6 Highlights: నాగార్జున ఎంట్రీతో హౌస్‌లో రచ్చ.. త్రిగుణ్‌కు షాక్!

నిర్మాత ఎఫ్.ఎం. మురళీ మాట్లాడుతూ తమ ఊరు, తమ ఇంట్లోనే సినిమా షూటింగ్ జరగడం ప్రత్యేక అనుభూతిగా పేర్కొన్నారు. సినిమా చూసినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని, యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుందని అన్నారు.

మహిళా ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది: పృథ్వీ

నటుడు పృథ్వీ మాట్లాడుతూ తండ్రీకూతుళ్ల బంధాన్ని దర్శకుడు మహేష్ చంద్ర చాలా బాగా తెరకెక్కించారని అన్నారు. ప్రతి కుటుంబంలోనూ జరిగే సంఘటనలను గుర్తు చేసేలా కథ ఉంటుందని చెప్పారు.

సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుందని, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

నటి మణిచందన కూడా సినిమాలో మంచి కథ, భావోద్వేగాలు ఉన్నాయని చెప్పారు. తనకు మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు.

సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళీ (గోదారి కిట్టయ్య) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది.

డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, జూనియర్ పవన్ కళ్యాణ్, జేడీవీ ప్రసాద్, కేఏ పాల్ రాము, జబర్దస్త్ శేషు తదితరులు ఈ చిత్రంలో నటించారు.

టెక్నికల్ టీమ్:
స్టోరీ డెవలప్‌మెంట్ & డైలాగ్స్ – శ్రీరామ్ ఏదోటి
ఎడిటర్ – బి. సత్యనారాయణ
మ్యూజిక్ – జి.సి. క్రిష్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం – మహేష్ చంద్ర
నిర్మాతలు – దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళీ (గోదారి కిట్టయ్య)

Studio One Plus

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *