Skip to content
భక్తి

Neti Dinaphalaalu: నేటి దిన ఫలాలు:

11వ తేదీ శుక్రవారం సెప్టెంబర్ నెల 2026వ సంవత్సరం నాటి దినఫలాలు.

Neti Dinaphalaalu: మేషరాశి: మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారం చాలా చాలా బాగుంది. షష్ట స్థానంలో బుధుడు బాగున్నారు. లాభస్థానంలో రాహువు బాగున్నాడు. వెరసి మూడు గ్రహాల యొక్క ఉనికి బాగుంది. మిగతా ఆరు గ్రహాల యొక్క అననుకూలత కూడా కనిపిస్తోంది. ఓర్పు కలిగి ఉండండి. అలాగే రాహువు గారు కూడా లాభస్థానంలో మొండి బాకీలని బాగా వసూలు చేయడంలో దిట్ట అయినా తప్పనిసరిగా మీకు ధనం అనేది వచ్చేస్తుంది. ఇక భార్యా భర్తల అన్యోన్యత విషయంలో గాని ప్రేమ వ్యవహారాల విషయంలో గాని సంతాన విషయంలో గాని ఇలా అన్నిటి విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండండి.

వృషభ రాశి: వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏవైనా ఉన్నాయా అంటే చాలా వరకు కష్టంతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి. లాభస్థానంలో ఒక శనిగారి సంచారము తప్ప మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేదు. మీ ఇంటి దేవత ఆరాధనని తప్పనిసరిగా చేయాలి ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అలాగే చిన్న పిల్లలకి పాలు పాలతో చేసిన పదార్థాలు వీటిని అమ్మవారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఎక్కువగా చిన్న పిల్లలకు పెట్టడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి.

మిధున రాశి: మిధున రాశి వారికి ఎటువంటి గ్రహ స్థితులు ఉన్నాయి అంటే మిధున రాశి వారికి ద్వితీయంలో గురువుగారు ఉన్నారు తృతీయంలో లో రవి గారు ఉన్నారు కేతువు ఉన్నారు చంద్రుడు ఉన్నారు. చతుర్థ స్థానంలో బుధుడు ఉన్నారు పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు వెరసి ఆరు గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత వీరికి ఏది పట్టుకున్నా బంగారమే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి ఉంటున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. పితృవర్గ రీత్యా బాగుంది మాతృవర్గ రీత్యా బాగుంది ఉద్యోగ రీత్యా బాగుంది చాలా వరకు కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి ప్రణాళికలు అన్నీ కూడా అవి ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు కచ్చితంగా ఫలిస్తాయి .

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా తృతీయంలో బుధుడు చతుర్థంలో శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. మూడు గ్రహాలే అనుకూలిస్తున్నాయి. రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు ఈ రెండూ కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాలు రాశిలో గురువుగారు ఉచ్చలో ఉన్నారు కాబట్టి యోగం శుక్రాచార్యుల వారు చతుర్థంలో అంటే కేంద్రంలో స్వస్థానంలో ఉంటున్న కారణం చేత మాలవ్య యోగం చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారానికి స్నేహితుల వల్ల చాలా బాగుంటుంది. అలాగే స్తిరచరాస్తుల వృద్ది కలుగుతుంది. ఇంకా తెలివితేటలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక్కడ చెప్పుకోదగ్గ సూచన ఏమిటి అంటే ద్వితీయ స్థానంలో కేతువు ఉన్నారు అష్టమ స్థానంలో రాహువు ఉన్నారు రాహు కేతువుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి గణపతి ఆరాధన చేయండి.

Suta Maharshi: ప్రతి పురాణంలో ‘సూత మహర్షి చెప్పెను’ అంటారు.. అసలు ఆయన ఎవరు?

సింహరాశి: సింహరాశి వారికి మనము ప్రతి రోజు తెలియచెప్పుకుంటూ ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఇవాల్టి రోజున కూడా చాలా వరకు సంయమనంతో ఉండాలి ఓర్పుతో ఉండాలి. మనశాంతిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయాలి నవధాన్యాలు దానం చేయాలి. అలాగే ఇష్ట దేవత ఆరాధన కూడా చేయండి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు అనేక శుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు చాలా బాగున్నారు మాట తీరు బాగుంటుంది. ఐకమత్యం కొంచెం తగ్గే విధంగా ఉంది లాభస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము బాగుంది అని చెప్పాలి. ఇక భార్యా భర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని దూరప్రాంత ప్రయాణాల విషయంలో గాని ధనము ఖర్చు పెట్టే విషయంలో గాని ఏ అంశాన్ని తీసుకున్నా ఏమాత్రం అనుకూల ఫలితాలు లేవు అని చెప్పి తెలియజేస్తున్నానండి. గణపతి ఆరాధన చేయడము అష్టమ శని సంచార దోషానికి శని గారికి తైలాభిషేకం చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను.

కన్యారాశి: కన్యారాశి వారికి షష్ట స్థానంలో ఉన్నటువంటి రాహువు గారి సంచారము అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము చాలా మేలైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా ఇక్కడ రాశిలో ఉచ్చలో ఉన్నటువంటి బుధిని యొక్క సంచారము చాలా మంచి ఫలితాలనే ఇవ్వబోతుంది. ఉద్యోగ జీవితానికి సంబంధించి మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇక చర్మానికి సంబంధించినటువంటి ఈ రుగ్మతలు ఏవైనా ఉండడానికి అవకాశం ఉందండి వైద్యం తప్పనిసరి ఔషధులు వాడాల్సి ఉంటుంది. పితృ వర్గ రీచ్ఛ బాగుంటుంది అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం అంతంత మాత్రమే ఉంటుంది. మాతృవర్గ రీత్యా చాలా బాగుంది అలాగే స్థిర చరాస్తుల రీత్యా చాలా బాగుంది, సంతాన రీచ్చ చాలా బాగుంది, ధన ఆదాయం రీత్యా కానీ బాగుంటుంది.

తులారాశి: తులా రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు షష్టంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు ఏకాదశంలో రవి చంద్ర కేతువులు ఉన్నారు రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు బెరసి ఐదు గ్రహాల యొక్క ఉనికి ఎంత బాగుంది అంటే కీర్తి ప్రతిష్టలకు లోటు లేకుండా కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయి. ధన ఆదాయం వచ్చేస్తుంది అలాగే మీకన్నా కింది స్థాయి వాళ్ళకి లేదా మీకన్నా వయసులో తక్కువ ఉన్నవా వారికి చాలా వరకు మేలు చేసేటటువంటి పనులు చేస్తారు వారందరూ కూడా చాలా చాలా కృతజ్ఞతగా ఉంటారు. విల్ పవర్ బాగా పెరుగుతుంది ఇది చాలా చెప్పదగినటువంటి సూచన షష్టంలో ఉన్నటువంటి శని గారు మీకు ఇచ్చేటటువంటి లాభాలు మామూలుగా ఉండవు విజయావకాశాలని ఆయనే మనక ఒక ఆలోచన కల్పిస్తారు మళ్ళీ ఆయనే ఆలోచన ఈ విధంగా చేయండి.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి ఏవైనా ఈరోజు మనశశాంతిని ఇచ్చేటటువంటి అంశాలు ఉన్నాయా అనేది ఆలోచించినట్లయితే నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు దశమ స్థానంలో ఉన్నటువంటి రవి చంద్రులు బాగున్నారు ఏకాదశంలో బుధుడు బాగున్నారు ఇక ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు వెరసి ఐదు గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుందండి మీరు వెనక్కి తిరిగి చూడవలసిన పని లేకుండా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. లాభాల బాటలో ఉన్నారు ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది విలువైన వస్తువుల్ని భర్తల మధ్య అనుకూలత కూడా చాలా బాగుంది. మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి అదృష్టాలఅన్నీ కూడా ఇప్పుడు మీకు వెలుగులోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైన కాలం కాబట్టి గురువు యొక్క బలం చాలా చాలా పని చేస్తూ ఆశీర్వచనాలను ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారండి ఉద్యోగ జీవితం బాగుంది వ్యాపార జీవితం బాగుంది ఇక మిగతావన్నీ కూడా చెప్పినవి చెప్పినట్టుగా ఆచరించండి అని చెప్పి తెలియజేస్తూన్నాను.

ధనస్సు రాశి: ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే అంటే తృతీయ స్థానంలో రాహు గారు బాగున్నారు అలాగే లాభ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు రెండు గ్రహాల యొక్క ఉనికి మాత్రమే బాగుంటూ ఉన్నప్పుడు అనేక రకాలుగా మీకు ఆటంకాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆటంకాలని అధిగమించి మీరు ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే కొంచెం శారీరక కష్టము కొంచెం మానసిక కష్టము కూడా తప్పదు అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. ఏదైనా లాభాల బాటలో ఉన్నారు మీరు అని చెప్పవచ్చు కానీ మిగతా అన్ని విషయాలలో మాతృవర్గ రీత్యా గాని స్థిర చిరాస్తుల రీత్యా గాని సంతాన రీయా గాని రుణభారాల రీచ గాని భార్యా భర్తల అన్యోన్యత రీత్యా గాని దూరప్రాంత ప్రయాణాల రీత్యా గాని రాజకీయాల రీత్యా గాని ఏ రకంగా తీసుకున్నా కూడా ఏ అంశాన్ని మీరు పట్టుకున్నా కూడా అందులో ఏదో ఒక ఆటంకాలు కనిపిస్తూ మీకు ఆటంకాలు.

Polala Amavasya: పోలాల అమావాస్య అంటే ఏమిటి? కందమొక్కనే ఎందుకు పూజిస్తారు?

మకర రాశి: మకర రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నవన్నీ అనుకూలమైన ఫలితాలే. తృతీయ స్థానంలో శని గారు బాగున్నారు షష్ట స్థానంలో కుజుడు బాగున్నారు సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉండగా ధన ఆదాయానికి లోటు లేదు కీర్తి ప్రతిష్టలకి లోటు లేదు అన్నదమ్ముల సహాయ సహకారానికి లోటు లేదు మాతృవర్గ రీయా బాగుంది స్థిర చిరాస్తుల రీఛ బాగుంది పోటీ పరీక్షల ద్వారా బాగుంది. చాలా విషయాలలో మీ పోరాటం విజయాన్ని తెచ్చిస్తుంది భార్యా భర్తల మధ్య అనుకూలత ఉంటుంది కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఓర్పు కలిగి ఉండండి.

కుంభరాశి: కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి కాలం ఏదైనా ఉందా అంటే నవమస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము మాత్రమే బాగుంది. మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ద్వితీయంలో శని గారు ఉన్నారండి షష్టంలో గురువుగారు ఉన్నారు రాశిలోనే రాహువు ఉన్నారు సప్తమంలో కేతువు ఉన్నారు నాలుగు ప్రధాన గ్రహాలు కూడా మీకు బలహీనంగా ఉన్నాయి. అలాగే ఏదైనా అవమానాలు అపనిందలు పొందడానికి అవకాశం ఉంది. అన్నదముల సహాయ సహకారం లేదు కుటుంబంలో కూడా మనశశాంతి లేదు ఐకమత్యము లేదు ఇక భార్యా భర్తల అన్యోన్యత విషయంలో గాని ప్రేమ వ్యవహారాల విషయంలో గాని ఉద్యోగ జీవితంలో గాని ఏమాత్రం అనుకూలతలు కనిపించబోవడం లేదు.

మీన రాశి: వారికి ఏదనా ముఖ్యమైన పనులకి శ్రీకారం చుట్టండి తప్పనిసరిగా ఆ పనులు అభివృద్ధి పదంలో ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ధన ఆదాయం విషయంలో పూర్తిగా మీరు నిశ్చింతగా ఉండొచ్చు చక్కటి ఆదాయం మీకు చాలా మనశశాంతిని కలిగించే విధంగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూన్నానండి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఇక శివారాధన చేయడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను శుభం సర్వేజనా సుఖిన భవంతు

Ravinuthala Bhakti

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *