Botsa: మాజీ మంత్రి, MLC బొత్స సత్యనారాయణ భోరున విలపించారు. బొత్స కు కుడి భుజం, మేనల్లుడు అయిన మజ్జి శ్రీను (Chinna Srinu), పార్టీ కి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరటం తో బొత్స కంట తడి పెట్టారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వైసీపీ కార్యకర్తల ఆత్మీయ కలయిక సమావేశంలో ఈ ఘటన జరిగింది. గతం లో కూడా లైవ్ లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణం గురించి అచ్చెం నాయుడు చేసిన కామెంట్స్ పై కూడా ఇదే విధం గా కన్నీటి పర్యంతం అయ్యారు. సమావేశంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు చిన్న శ్రీనుతో తమకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏ చిన్న పని ఉన్నా బొత్స గారే తమను చిన్న శ్రీను వద్దకు పంపించేవారని, తమ మధ్య అంతటి బంధాన్ని ఏర్పరిచింది బొత్స సత్యనారాయణేనని గుర్తుచేసుకున్నారు. గతం లో కూడా అనేక సార్లు కంటతడి పెట్టిన బొత్స. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా మేనల్లుడుని తలుచుకుని కంటతడి పెట్టారు. రాజకీయాలు శాశ్వతం కాదని, ఇది వ్యాపారం కాదని. ఎవరు ఉన్నా లేకున్నా ముందుకు వెళతామని చెప్పారు. అంతేకాదు చిన్న శ్రీను వెళ్ళిపోతారని ఓ 8 నెలల ముందే ఊహించా అని చెప్పారు. అనంతరం కార్యకర్తలు, కుమార్తె బొత్స సత్యనారాయణను ఓదార్చారు. జై బొత్సా అని ఉత్సాహపరిచారు.
Botsa: మళ్ళీ ఏడ్చిన బొత్స సత్యనారాయణ

Studio One News
Follow our WhatsApp Channel for Latest News


