Skip to content
ఎంటర్‌టైన్‌మెంట్

Kaagitham Padavalu Movie : ‘కాగితం పడవలు’ క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు: డైరెక్టర్ తుకారాం

‘కాగితం పడవలు’ క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు.. ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది: దర్శకుడు ఎంజీఆర్ తుకారాం

వర్ధన్, కృష్ణప్రియ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టి.ఆర్. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని చిత్ర బృందం తెలిపింది. తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

“క్లైమాక్స్ మిమ్మల్ని షాక్‌కు గురిచేస్తుంది”

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు ఎంజీఆర్ తుకారాం మాట్లాడుతూ సినిమా కంటెంట్‌పై పూర్తి నమ్మకం ఉందన్నారు.

“ప్రయత్నం చేసి ఓడిపోయిన వాడు చరిత్రలో ఎవరూ లేరు. మా ప్రయత్నానికి సెప్టెంబర్ 18న ఫలితం రానుంది. ఈ సినిమా కోసం టీమ్ మొత్తం చాలా కష్టపడింది. సినిమా కంటెంట్ చూసి మీకు నచ్చితేనే టికెట్ తీసుకుని థియేటర్‌కు రండి. ప్రేక్షకులను నిరాశపరచను. ముఖ్యంగా క్లైమాక్స్ చూసిన తర్వాత అందరూ షాక్ అవుతారు. సినిమా కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది” అని తుకారాం తెలిపారు.

“ఈ సినిమా జర్నీ ఎప్పటికీ మర్చిపోలేను”

హీరో వర్ధన్ మాట్లాడుతూ ‘కాగితం పడవలు’ కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడిందన్నారు.

Bigg Boss 10: జబర్దస్త్ నరేష్ బిగ్ బాస్ 10 లో కి ఎలా అడుగు పెట్టాడు?

“ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా జర్నీని జీవితంలో మర్చిపోలేను. ‘కాగితం పడవలు’ సినిమా చేస్తూ మేము ఒక బీటెక్ పూర్తి చేసినట్టుగా అనిపించింది. ఇప్పుడు ప్రేక్షకులు మమ్మల్ని పాస్ చేస్తారని ఆశిస్తున్నాను. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను” అన్నారు.

ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా: కృష్ణప్రియ

హీరోయిన్ కృష్ణప్రియ మాట్లాడుతూ సెప్టెంబర్ 18న సినిమా థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు.

“చాలా మంచి కథతో రూపొందిన సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు. ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

కథపై నమ్మకంతో ఎక్కడా రాజీపడలేదు

నిర్మాత అంజనప్ప మాట్లాడుతూ కథపై ఉన్న నమ్మకంతో నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదన్నారు. దర్శకుడు ఎంతో కష్టపడి సినిమాను తెరకెక్కించారని, సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని తెలిపారు.

నిర్మాత కీర్తన మాట్లాడుతూ చిత్ర బృందం మొత్తం ఎంతో డెడికేషన్‌తో పని చేసిందన్నారు. దర్శకుడు తుకారాం కథను తెరపైకి తీసుకొచ్చిన విధానం, హీరో వర్ధన్ కష్టపడ్డ తీరు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయని తెలిపారు.

OTT: Releases This Week: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ‘పంచనామా’ వరకు.. ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, సిరీస్‌లు ఇవే!

సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కాగితం పడవలు’ ఒక ప్రేమకథతో పాటు ఎమోషనల్ అంశాలను కూడా కలిగి ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.

నటీనటులు

వర్ధన్, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

టెక్నికల్ టీమ్

రచన, దర్శకత్వం: ఎంజీఆర్ తుకారాం
నిర్మాతలు: కీర్తన నరేష్, టి.ఆర్. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప
సంగీతం: AIS నౌఫల్ రాజా
డీవోపీ: రుద్రసాయి
ఎడిటర్: జెస్విన్ ప్రభు
కాస్ట్యూమ్స్: కిరణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం. హిమ బిందు
సాహిత్యం: రెహమాన్
పీఆర్వో: తేజస్వి సజ్జా

Studio One Plus

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *