Sri Krishnudu: కృష్ణుడు అన్నా,రాముడు నందమూరి తారక రామారావు, ఆ తరువాత వెంకటేశ్వర స్వామి గా హీరో సుమన్. అనేక మంది దేవుళ్ళ గెటప్ వేసారు కాని అవి కొంతమందికే సెట్ అయ్యాయి అని చెప్పవచ్చు. అమ్మవారి గా గెటప్ వేయాలంటే కె.ఆర్.విజయ అలాగే ఈ తరం లో రమ్యకృష్ణ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది అనేక వేషాలు వేసినా చిరకాలం గుర్తుండేది, ఎస్.వి.రంగారావు, రామారావు, సుమన్. ఇక మెగా ఫామిలీ లో చిరంజీవి శివుని పాత్రలో మెప్పించారు. ఇప్పుడు తాజాగా హీరో రాం చరణ్ గురించి సోషల్ మీడియాలో ఓ విషయం వైరల్ అవుతుంది. రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్రను రామ్‌చరణ్‌తో చేయించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. గుజరాత్ సినీ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించిన లాలో కృష్ణ సదా సహాయతే సినిమా ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణ వ్యక్తి జీవితంలో శ్రీకృష్ణుడి Sri krishnudi దైవిక సాన్నిధ్యం, ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ సాగే ఈ కథను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలు జరుగుతున్నాయట. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి భారీ విజయం సాధించిన ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకూ బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారట. అయితే ఈ రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్రను రామ్‌చరణ్ (RamCharan) తో చేయించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. చరణ్‌కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్‌తో పాటు, ఆధ్యాత్మికత, భావోద్వేగం ఉన్న పాత్రలో ఆయన కనిపిస్తే చాలా ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నారట. లాలో కృష్ణ సదా సహాయతే సినిమా రీమేక్..ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా కార్తిక్ సుబ్బరాజ్ పేరు కూడా వినిపిస్తుండటం మరో ఆసక్తికర అంశం. ఒరిజినల్ కథలోని ఆధ్యాత్మిక భావాన్ని అలాగే ఉంచుతూ, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా భారీ స్థాయిలో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రీమేక్ మూవీ కీరోల్ ప్లే చేసేదెవరు.? ఎవరి డైరెక్షన్లో ప్లాన్ జరుగుతోంది.? ఏ ప్రొడక్షన్ హౌస్ రిస్క్ తీసుకునేందుకు ముందుకొస్తుందనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ శ్రీకృష్ణుడిగా రామ్‌చరణ్ అనే టాక్ మాత్రం మెగా అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేస్తోంది. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా…అయితే రాంచరణ్ ప్రేక్షకులని మెప్పించకలడా అనేది చూడాలి.
Sri krishnudu: రామ్ చరణ్ శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారా? వైరల్ అవుతున్న రీమేక్ మూవీ టాక్

Studio One Plus
Follow our WhatsApp Channel for Latest News



